అగ్ని మహా పురాణము

69 - అథ స్నానవిధానమ్

అగ్ని రువాచః

బ్రహ్మన్ శృణు ప్రవక్ష్యామి స్నపనోత్సవవిస్తరమ్

ప్రాసాదస్యా గతః కుమ్బాన్ మణ్డ పే మణ్డపే న్య సేత్.

కుర్యాద్ధ్యానార్బనం హోమం హరేరాదౌ చ కర్మసు

సహస్రం వా శతం వాపి హోమయేత్పూర్ణయా సహ.

స్నానద్రవ్యాణ్యశాహృత్య కలశాంశ్చాపి విన్య సేత్

అధివాస్య సూత్రక జ్ఞాన్ చార యన్మణ్డలే ఘటాన్.

అగ్ని దేవుడు పలికెను: ‘బ్రహ్మ దేవా! ఇపుడు నేను స్నానోత్సవమునుగూర్చి సవిస్తరముగ చెప్పెదను. ప్రాసాము ఎదుట మండపము క్రింద మండలముపై కలశములు ఉంచవలెను. ప్రారంభమునందు అన్ని కర్మలు చేయు నపుడును శ్రీహరి ధ్యానము, పూజాహోమములు చేయవలెను. పూర్ణాహుతితో పాటు వెయ్యి లేక సూటఎనిమిది హోమము చేయవలెను. స్నా నద్రవ్యములు తీసికొని వచ్చి కలశ విన్యాసము చేయవలెను. కంఠసూత్రయుక్త కుంభములను ఆధివాసనము చేసి మండ లము పై ఉంచవలేను.

చతురస్రం పురం కృత్వా రుద్రైస్తం ప్రవిభోజయేత్

మధ్యన తు చరుం స్థాప్య పార్శ్వే పజ్క్తిం ప్రమార్జయేత్ .

శాలిచూర్ణాదినా పూర్వ పూర్వాదినవ కేషు

చ కుమ్భము ద్రాం తతో బద్ద్వా ఘటం తత్రానయేద్బుధః.

పుణ్డరీ కాక్షమ శ్రేణ దర్భాంస్తాంస్తు విసర్జయేత్

అద్భిః పూర్ణం సర్వరత్న యుక్తం మధ్యే న్య సేదటమ్.

యవవ్రీహి తిలాం శ్చైవ నీవార శ్యామకాన్ క్రమాత్

కులిత్థ ముద్ధసిద్ధార్థాన్ముక్త్వా న్యానష్టదిక్షు చ.

ఐంద్రే తు నవ కే మధ్యే ఘృతపూర్ణం ఘటం న్య సేత్

పలాశాశ్వత్థన్యగ్రోధ బిల్వోదుమ్బర క్షీరిణామ్.

జమ్బూ శమీ కపిత్థానాం త్వక్కషాయేరటాష్టకమ్

ఆగ్నేయనవ కే మధ్యే మధుపూర్ణం ఘటం న్య సేత్.

గోశృజ్గ నగగజామ్బుగజేంద్ర దశ నేషు చ

తీర్థ క్షేత్రఖలేష్వష్టా మృత్తికాః స్యుర్ఘటాష్ట్ర కే.

చతురస్రమండలము నిర్మించి దానిని పండ్రెండు రేఖలచే విభజించవలను ప్రక్క నున్న రేఖను తుడిచివేయ పలెను. ఈ విధముగ ఆ మండలముపై నాలుగు దిక్కులందును తొమ్మిదేసి కోష్టకములు స్థాపించి వాటిని పూర్వాదీక్రమమున వరిపిండి మొదలైన వాటితో నింపవలెను. పిమ్మట విద్వాంసుడు కుంభముద్రతో పూర్వాది దిక్కులం దున్న నవకమునందు కలశ లుంచవలెను. పుండరీకాక్ష మంత్రముతో వాటిలో దర్భ లుంచవలెను. సర్వరత్నములును ఉంచిన ఉదకపూర్ణకుంభమును మధ్యభాగమునం దుంచి, మిగిలిన ఎనిమిది కుంభములలో క్రమముగ యవ-ద్రోహి తిల. నీహార-శ్యామాక కులత్త- ముద్ద- శ్వేత సర్వపములు వేసి ఎనిమిది దిక్కులందును స్థాపింపవలెను. పూర్వదిక్కునం దున్న నవకమునందు మధ్య మృతపూర్ణకుంభ ముంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో పలాశ అశ్వత్థవట.బిల్వ-ఉదుంబర -ప్లక్ష -జంబూశమీ.కపిత్త వృక్షముల బెరడునుండి తీసిన రసము పోయవలెను. ఆగ్నేయమునం దున్న నవకమునందు మధ్య మధుపూర్ణ ఘటము నుంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో గోశృంగ పర్వత-గంగాజల-గజళాలా- తీర్థ- తేత్ర (పొలము) ఖల (కళ్ళము) ములమట్టి ఉంచవలెను.

యామ్యే తు నవ కే మద్యే తిలతై లఘటం న్య సేత్

నారజమథజమ్బీరం ఖర్జూరం మృద్వికాం క్రమాత్.

నారి కేలం న్య సేత్పూరం దాడిమం పనసం ఫలమ్

నైరృత నవ కే మధ్యే క్షీరపూర్ణం ఘటం న్య సేత్.

కుజ్కుమం నాగపుష్పం చ చమకం మాలతీం క్రమాత్

మల్లికామథ పున్నాగం కరవీరం మహోత్పలమ్.

పుష్పాణి చాన్యే నవ కే మధ్యే వై నారి కేలకమ్

నాదేయమథ సాముద్రం సారసం తాప మేవ చ.

వత్తజం హిమతోయం చ నైర రం గాజమేవ చ

ఉద కాన్యథ వాయవ్యే నవ కే కదలీఫలమ్.

సహ దేవీం కుమారీం చ సింహీం వ్యాఘ్రం తథామృతామ్

విష్ణుపర్ణీం శతశివాం వచాం దివ్యౌషధీర్న్య సేత్.

పూర్వాదో సౌమ్యనవ కే మధ్యే దధిఘటం న్య సేత్

పత మేలాం త్వచం కుష్ఠం బాలకం చన్దనద్వయమ్.

లతాం కస్తూరికాం చైవ కృష్ణాగరుమన క్రమాత్

సిద్ధ ద్రవ్యాణి పూర్వాదో శా నిత్యమథై కతః.

చన్దలారం క్రమాచ్ఛుక్లం గిరిసారం త్రపుం న్య సేత్

 ఘనసారం తథా శీర్షం పూర్వాదౌ రత్న మేవ చ.

మృతేనాభ్యర్చ్య చోద్వర్య స్నపయే న్మూలమ శ్రోతః

గన్టాద్యైః పూజయేంద్వహ్నౌ హుత్వా పూర్ణాహుతిం చరేత్.

బలిం చ సర్వభూతేభ్యో భోజయేద్దత్తదక్షిణః

దేవైశ్చ మునిభిర్భవైర్దేవం సంస్థాప్య చేశ్వరా.

బభూవుః స్నపయిత్వేర్థం స్నపనోత్సవకం చరేత్

అష్టోత్తర సహస్రేణ ఘటానాం సర్వథాగ్భవేత్.

యజ్ఞావభృథస్నానేన పూర్ణ సంస్నాపనం కృతమ్

గౌరీలక్ష్మీవివాహాది చోత్సవం స్నానపూర్వకమ్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే యజ్ఞావభృథస్నానం నామైకోనసప్తతిత మోఽధ్యాయః.

దక్షిణమున నున్న నవకమున మధ్యయందు తైలపూర్ణ ఘటము స్థాపింపవలెను. మిగిలిన ఘటములలో నారంగ జంబీర.నింబ ఖర్జూర మృత్తికా నారికేళ పూగ.దాడిమపన సఫలము యించవలెను. నైరృతిదిక్కున నవకమునందు మధ్య క్షీర పూర్ణకుంభ ముచి మిగిలిన ఎనిమిదిటిలో కుంకుమ-నాగపుష్ప-చంపక మాలతీ-మల్లికా-పున్నాగ.కరవీర కమలకుసుమము లుంచవలెను. పశ్చిమ నవకమధ్యమున నారి కేలజంపూర్ణకలశ ముంచి, మిగిలిన ఎనిమిదింటిలో నదీ-సముద్ర-సరోవర కూప- వర్షా-హిమ,నిర్జర దేవనదుల జలము లుంచవలెను. వాయవ్య నవక మునందు మధ్య కదలీజలపూరితకుంభ ముంచి, మిగిలిన ఎనిమిది కుంభములందును సహదేవీ కుమారీ.సింహీ-వ్యాప్తీఆమృతా-విష్ణుపర్లీ -దుర్వా-వచా అను దివ్యౌషధుల నుంచవలెను. పూర్వాది సౌమ్య నవకమునందు మధ్య దధికలశ నుంచి, మిగిలిన కలశ ములందు పత్ర.ఏలా త్వక్ -కూట బొలక చంచనద్వ యలలో కస్తూరి కృష్ణాగురు.సిద్దరవ్యములను ఉంచవలెను. ఈశాన్యనవకమధ్యమున శాంతిజలపూర్ణ కుంభముంచవలేను. మిగిలిన కలశములలో క్రమముగ చంద్ర.తార.రజత.లోహ-త్రపు-కాంస్య-సీసక-రత్నముల నుంచవలెను. ప్రతిమకు మృతము పూసి, ఉద్వర్తనముచేసి, మూలమంత్రముతో స్నానము చేయించ వలెను. మరల దానికి గంధాదులతో పూజ చేయ వలెను. అగ్నిలో హోమము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను, సకలభూతములకు బలిప్రదానము చేసి, బ్రాహ్మణునకు, దక్షిణా పూర్వకముగ భోజనము చేయించవలెను. దేవతలు, మునులు, అనేకులు రాజులు కూడ భగవద్విగ్రహమునకు అభిషేకము చేయుటచేతనే ఐశ్వర్యాదులను పొందిరి. ఈ విధముగ ఒక వెయ్యి ఎనిమిది కలశములతో స్నాపనోత్సవము చేయవలెను. ఇట్లు చేయుటచే మానవుడు అన్ని కామములను పొందగలడు. యజ్ఞా,వభృథస్నానమునందు కూడ పూర్ణప్నా నసిద్ధి కలుగును. పార్వతీపక్ష్యాదుల వివాహాదులలోకూడ స్నపనోత్సవము చేయబడును.

అగ్ని మహాపురాణమునందు స్నపనోత్సవవిధి యను ఆరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.