అగ్ని మహా పురాణము

79 - పవిత్రారోహణవిధి

మూలం లతా న్తముచ్చార్య దద్యాద్దణ్ణవతారకమ్

 ఆత్మ విద్యా శివః ప్రోక్తంముముక్షణం పవిత్రకమ్.

వినిర్దిష్టం బుభుక్షణాం శివతత్త్వాత్మభిః క్రమాత్

స్వాహా న్తం వా నమో న్తం వా మనమీషాముదీరయేత్,

ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే శివాయ స్వాహా.

ఓం హాం విద్యాతత్త్వాధిపతయే శివాయ స్వాహా.

ఓం హౌం శివతత్త్వాధిపతయే శివాయ స్వాహా.

ఓం హౌం సర్వతత్త్యాధిపతయే శివాయ స్వాహా.

నత్వా గఙ్ఞావతారం తు ప్రార్ధ యే త్తం కృతాజ్ఞలిః.

ఓ పద్మయోనిపాలితాత్మ తత్వ్వేరాయ ప్రకృతిలయాయ ఓం నమః శివాయ” అను మంత్ర ముచ్చరించి పవిత్ర కముతో శివుని పూజించవలెను. “విష్ణుకారణ పాలితవిద్యాత త్వేశ్వరాయ ఓం నమః శివాయ” అను మంత్రముచ్చరించి పవిత్రకమును సమర్పించవలెను. “రుద్రకరణపాలిత శివత త్వేశ్వరాయ ఓం నమః శివాయ” అను మంత్ర ముచ్చరించుచు శివునకు పవిత్రకమును నివేదించవలెను. సువ్రతుడైన ఉపాసకుడు సర్వకారణపొలాయ శివాలయ లయాయ ఓం నమః శివాయ.” అను మంత్రముచ్చరించుచు శివునకు గంగావతార మను సూత్రమును సమర్పింపవలెను, ముముక్షువులు ఆత్మతత్త్వ-విద్యాతత్వ-శివతత్వముల క్రమమున మంత్రోచ్చారణము చేయుచు పవిత్రకములను సమర్పించవలెను. బుభుక్షువులు (భోగేచ్చకలవారు) వరుసగ శివతత్వ-విద్యాతత్త్వ-ఆత్మతత్త్వములకు అధిపతియగు శివునకు మంత్రోచ్ఛారణ పూర్వకముగ పవిత్రకమును సమర్పించవలెను. ముముక్షువు స్వాహాంతమంత్రమును, భోగేచ్చగలవాడు నమోంతమంత్ర మును ఉచ్చరించవలెను. “ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే శివాయ స్వాహా “ఓం హాం, విద్యాతత్త్వాధిపతయే శివాయ స్వాహా” ఓం హోం శివతత్త్వాధిపతయే శివాయస్వాహా” అనునవి స్వాహాంతమంత్రములు (''స్వాహా”కు బదులు “నమః” చేర్చినచో నమోంతమంత్రములు). గంగావతారకమును సమర్పించిన పిదప శివునకు నమస్కరించి ఈ విధముగ ప్రార్థింపవలెను.

త్వం గతిః సర్వభూతానాం సంస్థితి స్త్వం చరాచరే.

అన్తశ్చా రేణభూతానాం ద్రష్టా త్వం పరమేశ్వర

కర్మణా మనసా వాచా త్వతో నాన్యా గతిర్మయ.

మ గ్రహీనం క్రియాహీనం ద్రవ్యహీనం చ యత్కృతమ్

జపహోమార్చనై ర్జీనం కృతం నిత్యం మయా తవ.

ఆకృతం వాక్యహీనం చ తత్పూర్య మహేశ్వర

సుపూత స్వం పరేశాన పవిత్రం పాపనాశనమ్.

త్వయా పవిత్రితం సర్వం జగత్ స్థావర జజ్జిమమ్

ఖణ్డితం యన్మయా దేవ వ్రతం వైకల్యయోగతః.

ఏకీభవతు తత్సర్వం త్వదాజ్ఞసూత్రగుమ్బితమ్

“పరమేశ్వరా! నీవే సమ స్త్రప్రాణులకును గతివి. చరాచర జగత్తునకు ఆశ్రయమైన వాడవు నీవే. నీవు సమస్త ప్రాణులలోపల సంచరించుచు వారికి సాక్షిగా ఉన్నావు. మనోవాక్కాయములచే నీవు తప్ప నాకు వేరొక గతి లేదు. నీకు నేను ప్రతి దినము చేయు పూజలో మంత్ర - ప్రియా - ద్రవ్య - జప - హోమ - ఆర్చనాదులలో ఏ లోపము  జరిగినవో శుద్దము లగు వాక్యములు లేని ఏ కర్మ చేసితినో ఆ లోపముల నన్నింటిని మన్నించి, నే చేసిన కర్మను పరిపూర్ణము చేయుము. పరమేశ్వరా! నీవు పరమ పవిత్రుడవు, నీకు సమర్పించిన ఈ పవిత్రకము సమ స్తపాపములను నశింపచేయు నది. నీవు ఆంతటను వ్యాపించి ఈ సకల చరాచర జగత్తును పవిత్రము చేసితివి. వ్యాకులత్వముచేత గాని, అంగ వైకల్యముచే, గాని నేను ఏ వ్రతమును ఖండితము చేసితినో, ఆది నీ ఆజ్ఞయనెడు సూత్రముచే గ్రుచ్చబడి ఆఖండము గాక.

ఎవని విషయమున గురువు పూర్తిగా సంతోషించునో ఆతని కాండ మంతయు సఫలమగును అనే పరమేశ్వరుడు చెప్పి యున్నాడు. ఈ విధముగ గురువును పూజించి ఆయనకు హృదయమువరకును వ్రేలాడు పవిత్రక ము సమర్పించి, బ్రాహ్మ ణాదులకు భోజనము పెట్టి, వస్తాదు లిచ్చి “దేవేశ్వరుడైన సదాశివుడు నేను చేసిన ఈ దానాదులచే సంతసించును గాక” అని ప్రార్థించవలెను.

భక్త్యా స్నానాదికం ప్రాతః కృత్వా శమ్బోః సమాహరేత్

పవిత్రాణ్యష్టపు ష్పై స్త పూజయిత్వా విసర్జయేత్.

నిత్యం నైమిత్తికం కృత్వా విస్తరేణ యథా పురా

పవిత్రాణి సమారోప్య ప్రణమ్యాగ్నౌ శివం యజేత్.

ప్రాయశ్చిత్తం తతో శ్రేణ హత్యా పూర్ణాహుతిం యజేత్

భుక్తికామః శివాయాథ కుర్యాత్కర్మ సమర్పణమ్.

త్వత్పసాదేన కర్మేదం మమాస్తు ఫలసాధకమ్

ముక్తికామస్తు కర్మేదం మాస్తు మే నాథ బన్లకమ్.

వహ్ని స్థం నాడి యోగేన శివం సంయోజయేచ్చి వే

హృది న్యస్యాగ్ని సంఘాతం పావకం చ విసర్జయేత్.

సమాచమ్య ప్రవిశ్యా నః కుమ్బానుగతసంవరాన్

శివం సంయోజ్య సాక్షేపం క్షమ స్వేతి విసర్జయేత్.

విసృజ్య లోకపాలాదీనాదాయేతాత్పవిత్రకమ్

సతి చణ్డేశ్వరీ పూజాం కృత్వా దత్త్వా పవిత్రకమ్.

తన్నిర్మాల్యాదికం తస్మై సపవిత్రం సమర్పయేత్

అథవా స్థణిలే చణం విధినా పూర్వవద్యజేత్.

యత్కి ఞ్చిద్వార్షికం కర్మ కృతం న్యూనాధికం మయా

 తదస్తు పరిపూర్ణం మే చణ్డనాథ తవాజ్ఞయా.

ఇతి విజ్ఞప్య దేవేశం నత్యా స్తుత్వా విసర్జయేత్

త్య క్తనిర్మాల్యకః శుద్ధః స్నాపయిత్వా శివం యజేత్ .

పఞ్చయోజన సంస్థాపి పవితం గురుసన్నిధౌ

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే పవిత్రారోహణ విధిర్నా మైకోనాశీతిత మోధ్యాయః.

ప్రాతఃకాలమున భక్తి పూర్వకముగ స్నానాదికము చేసి శివుని విగ్రహమునుండి పవిత్రకములను ప్రోగుచేసి, శివునకు ఆష్టపుష్పపూజ చేసి విసర్జన చేయవలెను. పిదప వెనుకటివలెనే సవిస్తరముగ నిత్యనై మిత్తి క పూజ చేసి పవిత్రక ములు సమర్పిలచి, నమస్కరించి, ఆగ్నిలో శివపూజ చేయవలెను. పిమ్మట అస్త్రమంత్రముతో ప్రాయశ్చిత్త హోమము చేసి పూర్ణాహుతి ఈయవలెను. భోగేచ్చ కలవాడు తాను చేసిన కర్మ నంతను శివునకు సమర్పించి  “ప్రభో! నీ అను గ్రహముచే ఈ కర్మవలన నాకు మనోవాంచిత ఫలములు లభించుగాక” అని ప్రార్ధించవలేను మోక్షకాముడు – “ఓనాధా నా కర్మ బంధ హేతువు కాకుండుగాక” అని పార్ధించవలేను. పిదప అగ్నిలో నున్న శివునకు నాడీయోగముచే అంత రాత్మల నున్న శివునితో ఐక్యమును కల్పింపవలెను, ఆణుసముదాయమును హృదయముగ న్యసించి ఆగ్నిని విసర్జించి, ఆచమనము చేసి, పూజామండపమును ప్రవేశించి, కలశములోని జలమును నలుమూలల చల్లుచు, శివునితో సంయుక్త మగు నట్లు చేసి - ప్రభూ! నా లోపములను క్షమించుము అని ప్రార్ధించి విసర్జించవలెను. పిమ్మట లోకపాలాదులను విసర్జించి, శివుని విగ్రహమునుండి పవిత్రకములను తీసి, చండేశ్వర పూజానంతరము, వాటిని శివనిర్మాల్యాదులతో పాటు ఆయనకు సమర్పించవలెను. లేదా వీరి మీద, వెనుకటి వలే, చండేశ్వరుని పూజ చేసి - “చండనాథా! నేను చేసిన వార్షిక కర్మయందు న్యూనత్వరూప దోషము గాని ఆధిక త్వరూపదోషముగాని ఉన్న చో దానిని తొలగించి, ఆకర్మ సాంగో పాంగముగ సంపూర్ణమగు నట్లు చేయుము” అని ప్రార్ధించవలెను. పిదప చండేశ్వరుని స్తుతించి, నమస్కరించి, విసర్జించ వలేను. నిర్మాల్యమును తొలగించిన పిమ్మట శుద్దుడై, శివునకు స్నానము చేయించి, పూజించవలెను. గురుపు ఐదు యోజనముల దూరమున నున్నను ఆయనవద్దకు వెళ్ళి పవిత్రారోహణకర్మ చేయవలెను.

ఆగ్ని మహాపురాణమునందు పవిత్రారోహణవిధి యను డెబ్బదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.