నారద ఉవాచః-
భరతేథ గతే రామః పిత్రాదీనభ్యపూజయర్ ।
రాజాదశరథో రామమువాచ శృణు రాఘవ.
భరతుడు మాతుల గృహమునకు వెళ్ళిన పిమ్మట రాముడు తడ్రి మొదలగు వారిని భక్తితో సేవించెను, దశరథమహారాజు రామునితో ఇట్లనెను – “రామా ! వినుము”.
గుణానురాగార్రాజే త్వం ప్రజాభిరభి షేచితః ।
మనస్మాహం ప్రభాతే తే యావరాజ్యం దదామిహ.
రాత్రౌ త్వం సీతయా సార్ధం సంయతః సువ్రతో భవ ।
రాజ్ఞశ్చ మంత్రిణశ్చాష్టా సవరిష్ణాస్తథాబ్రువన్.
సృష్టిర్ణయన్తో విజయః సిద్ధార్థో రాష్ట్రవర్ధనః ।
అశోకో దర్మపాలక సుమన్తః పవసిష్ఠకః.
“నీ గుణములందు ప్రేమచే ప్రజలు నిన్ను ఇంతకు పూర్వమే, మనసా। రాజ్యాభిషిక్తుని, చేసినారు; నేను రేపు ప్రాతఃకాలమున నీకు, యౌవరాజ్యము ఇచ్చుచున్నాను, సీతా సహితుడవై ఈ రాత్రి నీవు వ్రతమును అవలంబింపుము” వసిష్ఠుడు, సృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్ధనుడు, ఆశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, అను ఎనమండుగురు మంత్రులును రామునితో ఆ విధముగనే పలికిరి.
పిత్రాదివచనం శ్రుత్వా తథోత్యుక్త్వా స రాఘవః ।
స్థితో దేవార్చనం కృత్వా కౌసల్యాయై నివేద్య తత్.
రాముడు తండ్రి మొదలైన వారి మాటలు విని, ఆన్లై చేసెదను అని చెప్పి, కౌసల్యకు కూడ తెలిపి, దేవతలను పూజించి, వ్రతము నవలంబించెను.
రాజోవాచ వసిష్ఠాదీన్ రామరాజ్యాభిషేచనే।
సంభారాన్ సంభరను స్మ ఇత్యుక్త్వా కైకయీం గతః.
దశరథుడు “రాముని పట్టాభిషేక మునకు కావలసిన సంభారము లన్నియు నమకూర్చుడు” అని వసిష్టాదులతో చెప్పి కైకేయి వద్దకు వెళ్ళెను.
ఆయోధ్యాలజ్కృతిం దృష్ట్వా జ్ఞాత్వా రామాభి షేచనమ్ ।
భవిష్యతీత్యా చచక్షే కై కేయీం మన్దరా సఖీ.
కైకేయికి సఖురా లగు మంథర ఆయోధ్యానగరమును అలంకరించుటను చూచి, రామునకు పట్టాభి షేకము జరుగనున్నదన్న విషయమును తెలిసికొని, దానిని కైకేయికి చెప్పెను.
పాదౌ గృహీత్వా రామేణ కర్షితా సాపరాధతః ।
తేన వై రేణ సా రామవనవాసం చ కాజ్క్షతి.
ఒకప్పుడు ఆమె ఏదియో అపరాధము చేయగా రాముడు ఆమెను పాదములు పట్టి ఈడ్పించెను. ఆ వైరమును పురస్కరించుకొని ఆమె అతనిని వనమునకు పంపవలె నని అనుకొనెను.
కై కేయి త్వం నము త్తిష్ఠ రామరాజ్యాభి షేచనమ్ ।
మరణం తవ పుత్రస్య మమ తే నాత్ర సంశయః.
ఓ! కై కేయీ ! లెమ్ము. రామునకు రాజ్యాభిషేక మనగా నీకును, నాకును, నీ కుమారునకును మరణమే, ఇందులో సందేహము లేదు.
కుబ్జయోక్తం చ త చ్ఛ్రుత్వా ఏకమాభరణం దదౌ ।
ఉవాచ మే యఖా రామ స్తథా మే భరతః సుతః.
ఉపాయం తు న వశ్యామి భరతో యేన రాజ్యభాక్ ।
కై కేయీ మబ్రవీత్కృద్దా హారం త్యక్త్వాథ మంద రా
కైకేయి ఆ కుబ్జ పలికిన మాటలు విని ఒక ఆభరణమును బహూకరించి ఇట్లు పలికెను. నాకు భరత డెంతయో రాముడు కూడ అంతయే. కాని భరతునికి రాజ్యము లభించు ఉపాయ మేదియు కానరాకున్నది. మంథర ఆ మాటలకు కోపించి ఆమె ఇచ్చిన హారమును గ్రహింపక కైకేయితో ఇట్లనెను.
మన్దరోవాచః -
బాలిశే రక్ష భరతమాత్మానం మాం చ రాఘవాత్ ।
భవితా రామవో రాజా రాఘవస్య తతః సుతః.
రాజవంశస్తు కై కేయి భరతాత్పరి హాస్యతే ।
దేవాసురే పురా యుద్దే శమ్బరేణ హతాః సురాః
రాత్రౌ భర్త గత స్తత్ర రక్షితో విద్యయా త్వయా।
వరద్వయం తదా ప్రాదాదాచేదానీం నృపం చ తత్.
రామస్య చ వనే వాసం నవ వర్షిణి వఞ్చ చ ।
యౌవరాజ్యం చ. భరత్ తదిదానీం ప్రధాన్యతి.
మంథర వలికెను - “ఓ తెలివితక్కు వదానా ! భరతుని, నిన్ను, నన్ను కూడ రామునినుండి రక్షించును. “ రాముడు రాజు కాగలడు. అతని పిమ్మట ఆతని కుమారుడు రాజు కాగలడు. ఈ విధముగా భరతుడు రాజవంశమును కోల్పోవును. పూర్వము దేవాసుర యుద్ధమునందు శంబరుడు దేవతలను సంహరించెను. ఆ రాత్రి అవటానున్న నీ భర్తను నీవు విద్యా ప్రభావముచే రక్షించితివి. ఆపు డాతడు రెండు వరముల నిచ్చెను. ఇపుడు ఆ రెండు వరములను కోరుము. ఒక వరముచే, పదునాలుగు సంవత్సరములు రాముడు వనములో నివసింపవలె ననియు, రెండవ వరముచే భరతునికి యావరాజ్యమీయవలె ననియు కోరుము. అతడు దానినీయగలడు.
ప్రోత్సాహితా కుజ్ఞయా సా అనర్థే చార్థదర్శినీ ।
ఉవాచ సదుపాయం మే కచ్చిత్తం కారయిష్యతి.
క్రోధాగారం ప్రవిష్టాథ పతితో భువి మూర్చితా ।
ఈ విధముగ ఆ కుబ్జచే ప్రోత్సహింపబడిన కైకేయి, అనర్గమును లాభకరమని భావించినదై “ఈ మంచి ఉపాయము దశరథుని చేత ఆ పని చేయించునా” అని పలికి కోప గృహమును ప్రవేశించి, మూర్ఛితురాలు వలే భూమి పై పడి యుండెను.
ద్విజోతీనర్చయిత్వాథ రాజా దశరథ స్తదో.
దదర్శ కైకయీం రుష్టామువాచ కథమీదృశీ ।
రోగార్తా కిం భయోద్విగ్నా కిమిచ్చసి కరోమి తత్.
యేన రామేణ హి వినా న జీవామి ముహూర్తకమ్ ।
శమి తేన కుర్యాం వై వాఞ్చితం తవ సున్దరి.
రాజా బ్రాహ్మణులను పూజించి, కోపించి ఉన్న కైకేయిని చూచి ఇట్లు పలికెను. “ఇట్లున్నా వేసి రోగముతో బాధపడుచున్నావా ? భయపడినావా ! నీ కేమి కావలెను. చెప్పుము, ఆది చేసెదను. “ఏ రాముడు లేకున్న చో ముహూర్ర కాల మైనను జీవింపజాలనో ఆ రాముని పై ఒట్టు పెట్టుచున్నాను. ఓ సుందరీ నీ కోరికను నెరవేర్చెదను.”
సత్యం బ్రూహీతి సోవాచ నృప మహ్యం దదాసి చేత్ ।
వర ద్వయం పూర్వదత్తం సత్యాత్వం దేహి మే నృప.
చతుర్దశ సమా రామో వనే వసతు సంమతః।
సంఖారై రేభిర దైవ భరతోఒత్రాభి షేచ్యతామ్
విషం పీత్వా మరిష్యామి దాస్యసి త్వం న చేన్నృపు।
ఆమె పలికెను. “ఓ రాజా ! నత్యము పలుకుము. నీవు ఇచ్చుటకు అంగీకరించేద వేని పూర్వము నా కిచ్చిన రెండు వరములను, సత్యమును పాలించుచు నాకిమ్ము, రాముడు పదునాలుగు సంవత్సరములు నియమవంతుడై వనము నందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంభారములతో, భరతుని రాజ్యాభిషి కుని చేయవలెను. ఈ వరముల నీయకున్న చో విషము త్రాగి మరణించెదము.
తచ్ఛ్రుత్వా మూర్చితో భూమౌ వజ్రాహత ఇవావతత్.
ముహూర్తాచ్చేతనాం ప్రాప్య కై కేయీ మిదమబ్రవీత్.
ఆ మాట విని, మూర్ఛితుడై , వజ్రముచే కొట్టబడినవాడు వలె భూమి పై పడెను. ముహూర్త కాలమున స్మృతి చెంది కై కేయితో ఇట్లనెను.
దశరథ ఉవాచః-
కిం కృతం తవ రామేణ మయా వా పాపనిశ్చయ.
యన్మా మేవం బ్రవీషి త్వం సర్వలోకాప్రియం కరి ।
కేవలం త్వత్రియం కృత్వా భవిష్యామి సునిష్ఠితః
యా త్వం భార్యా కాలరాత్రిర్భరతో నేదృశః సుతః ।
ప్రశాధి విధవా రాజ్యం మృతే మయి గతే సుతే.
ఓ పాపనిశ్చయవంతురాలా ! నీకు రాముడు ఏమి అపకారము చేసినాడు ? నేనేమి చేసినాను నకల ప్రపంచకమునకును, ఆప్రియమును ఆచరించుచు నీవు ఇట్లేల పలుకుచున్నావు ? కాలరాత్రి వంటి భార్య వైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడ నగుదును, భరతుడు. ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యమునకు వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవవై రాజ్యము నేలికొనుము.
సత్యపాశ నిబద్ద స్తు రామమాహూయ చాబ్రవీత్।
కై కేయ్యా వఞ్చితో రామ రాజ్యం కురు నిగృహ్య మామ్.
త్వయా వనే తు వ స్తవ్యం కైకేయీ భరతో నృపః।
సత్యపాశముచే బద్దుడైన ఆతడు రాముని పిలచి ఇట్లు పలికెను. “రామా ! నేను కె కేయిచే వంభింవ బడితిని. నన్ను బంధించి రాజ్య మేలుము. నీవు వనములో నివసింపవలెను. కైకేయీ కుమార డైన భరతుడు రాజు అగును.”
పితరం చైవ కైకేయీం నమస్కృత్య ప్రదక్షిణమ్.
కృత్వా నత్వా చ కౌసల్యాం సమాళ్వాస్య సలక్ష్మణః ।
సీతయా భార్యయా సార్థం సరథః ససుమ నక్క.
దత్త్వా దానాని మి పేభ్యో దీనానాణేభ్య ఏవ సః ।
మాతృభిక్చైవ విప్రాద్యైః శోకార్తైర్నిర్గతః పురాత్.
రాముడు తండ్రికిని, కైకేయికిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, కౌనలలకు నమస్కరించి, ఓదార్చి, సీతాలక్ష్మణసమేతుడై, బ్రాహ్మణులకును, దీనులకును, అనాధులకును దానములు చేసి, సుమంత్రునితో కూడినవాడై, రథము నెక్కి శోకార్తలైన తల్లులతోను, బ్రాహ్మణాదులతోను కూడి పట్టణమునుండి బయలు వెడలేను.
ఉషిత్వా తమసాతీరే రాత్రౌ పౌరాన్ విహాయ చ ।
ప్రభాతే తమవశ్యన్తయోధ్యాం తే పునరాగతాః.
రాత్రి తమసా తీరమున నివసించి, పౌరులను విడచి వెళ్ళిపోయెను. ఆ పౌరులు ప్రాతఃకాలమున రాముని గానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి.
రుదనాజాపి కౌసల్యాగృహమాగాత్సుదుఃఖితః ।
పౌరా జనాః స్త్రియః సర్వా రురుదూ రాజయోషితః,
మిక్కిలి దుఃఖితు డైన దశరథమహారాజు ఏడ్చుచు కౌనల్యాగృహమునకు వెళ్ళెను. పౌరులును, స్త్రీలును, రాజస్త్రీలును ఏడ్చిరి.
రామో రథస్థశ్చిరాధ్యః శృణబేర పురం యయా ।
గుహేన పూజిత స్తత్ర ఇజ్గుదీమూలమాశ్రితః.
నారచీరలను ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా ఆచ్చట గుహుడు ఆతనిని పూజించెను. అచట రాముడు ఇంగుదీవృక్షమూలమున నివసించెను.
లక్ష్మణః సగుహో రాత్రా చక్రతుర్జాగరం హి తౌ ।
సుమనం సరథం త్యక్త్వా ప్రాతర్నా వాథ జాహ్న వీమ్.
రామలక్ష్మణసీతాశ్చ తీర్జా ఆపుః ప్రయాగకమ్ ।
భరద్వాజం నమస్కృత్య చిత్రకూటం గిరిం యయుః.
లక్ష్మణుడును, గుహుడును ఆ రాత్రి యంతయు మేల్కొనియే యుండిరి. పిదప, సీతారామలక్ష్మణులు ప్రాతః కాలమున నావచే జాహ్న విని దాటి ప్రయాగ చేరిరి. భరద్వాజుని నమస్కరించి చిత్రకూటపర్వతము చేరిరి.
వాస్తుపూజాం తతః కృత్వా స్థితా మన్దాకినీ తటే।
సీతాయై దర్శయామాస చిత్రకూటం ఢ రాఘవః,
పిమ్మట వాస్తుపూజ చేసి, మన్దాకినీ నదీ తీరమున నివసించిరి. రాముడు సీతకు చిత్రకూటవర్వతమును చూపెను.
నఖై ర్విదారయ నం తాం కాకం తచ్చక్షురాక్షిపత్ ।
ఐషీకాస్త్రేణ శరణం ప్రాప్తో దేవాన్విహాయన
గోళ్ళచే సీతను గీరిన కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచినను శరణుజొచినది.
రామే వనం గతే రాజా షష్ఠేఽహ్ని ని చాబ్రవీత్।
కౌసల్యాం స కథాం పౌర్వాం యదజ్ఞానాద్దతః పురా.
కౌమారే సరయూతీరే యజ్ఞదత్తకుమారకః ।
శబ్దభేదాచ్చ కుమ్భేన శబ్దం కుర్వంశ్చ తత్పితా.
శశాప విలవన్మాత్రా శోకం కృత్వా రుదన్ముహుః।
పుత్రం వినామరిష్యావ స్త్వం చ శోకాన్మరిష్యసి.
పుత్రం వినా స్మరన్ శోకాత్ కౌసల్యే మరణం మమ।
తథాముత్త్వాథ హా రామేత్యుక్త్వా రాజా దివం గతః
రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. నేను కౌమారవయస్సులో ఉన్నప్పుడు సరయూ తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము జేయు చున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్దవేధిని ఉపయోగించి చంపితిని. ఆతని తల్లిదండ్రులు చాల విలపించిరి. ఆతని తండ్రి “మే మిరువురము పుత్ర శోకముతో మరణించుచున్నాము. నీవు కూడ పుత్రశోకములో పుత్రుని స్మరేంచుచు మరణించెదవు” అని నన్ను శపించెను. కౌసల్యా ! నాకి విధముగ, మరణము. రానున్నది.” ఈ విధముగ కథను చెప్పి హా రామా! అని అనుచు రాజు స్వర్గము పొందేను. రాజు స్వర్గము పొందెను.
సుప్తం మత్వాథ కౌసల్యా సుప్తా శోకార్తమేవ సా।
సుప్రభాతే శయానం తం సూతమగధబన్దనః.
ప్రబోధకా బోధయంతి న చ బుద్యత్యని మృతః।
కౌసల్యా తం మృతం జ్ఞాత్వా హా హతాస్మీతి చాబ్రవీత్.
అతడు శోకపీడితుడై నిద్రించినా డని తలచి కౌనల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధబందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినాడని గ్రహించి కౌసల్య “అయ్యో! చచ్చితిని” అనుచు ఏడ్చెను.
నరా నార్యోఽథ రురుదురానీతో భరత స్తదా।
వసిష్టాద్యైః నశత్రుఘ్న శీఘ్రం రాజగృహాత్ పురీమ్.
పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి. వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా అయోధ్యకు రప్పించిరి.
దృష్ట్వా సశోకాం కై కేయీం నిన్హయామాన దుఃఖితః ।
అకీర్తిః పతితా మూర్ద్ని కౌసల్యాం స ప్రకస్య చ.
పితరం తైలద్రోణిస్థం సంస్కృత్య సరయూతటే.।
వసిష్టాద్యైర్థనైరుకో రాజ్యం కుర్వతి సోఽబ్రవీత్.
శోకముతో నిండిన ఆ నగరిని చూచి, దుఃఖితుడై, భరతుడు “ఆపకీర్తి వచ్చి నెత్తి మీద పడినది కదా” అని కైకేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె, తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూనదీ తీరమున సంస్కారము చేసెను. “రాజ్యము చేయుము” అని వసిష్టాదులు పలుకగా ఇట్లనెను.
ప్రజామి రామమాశేతు రామో రాజా మతో బలీ ।
శృజీబేరం ప్రయాగం చ భరద్వాజేన భోజితః.
నమస్కృత్య భరద్వాజం రామం లక్ష్మణమాగతః।
పితా స్వర్గం గతో రామ ఆయోధ్యాయాం నృపో భవ.
అహం వనం ప్రయాస్యామి త్వదాదేశప్రతీక ।
రామః శ్రుత్వా ఉలం దత్వా గృహీత్వా పాదుకే ప్రజ.
రాజ్యాయహం న యాస్యామి నత్యాచ్చీరతీటాధర।
రామోక్తోభరతశ్చాయన్నతి గామే స్థితో బలీ.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రామాయణేయోధ్యాకాణ్డ వర్ణనం నామ షష్ఠోధ్యాయః.
రాముని తీసికొని వచ్చుటకు వెళ్లేదను, బలశాలియైన రాముడే అందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు. శృంగి చేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగవేళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరెను. “రామా! మన తండ్రిగారు న్వర్గస్తులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. నేను నీ ఆదేశమును ఎదురు చూచుచు వనమునకు వెళ్లేదను” అని పలికెను. రాముడా మాటలు విని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ఇట్లనెను. “నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. 'సత్యపాలనమున కై జటలను నార చీరలును ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.” రాముడు ఈ విధముగా పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నందిగ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించేను.
ఆగ్ని మహాపురాణములో రామాయణకథలోని అయోధ్యాకాండ వర్ణనమను షష్ఠాధ్యాయము నమాప్తము.
Summary of chapter 6 of the Agni Mahā Purana is as follows:
Bhagavān took birth as Vāmana, the dwarf brahmin, to restore the three worlds that the demon king Bali had wrested from the gods through his immense tapas and generosity. Approaching Bali's great sacrifice, Vāmana begged for three paces of ground. Despite his guru Śukrācārya's warning, Bali — true to his reputation for limitless generosity — granted the boon. Vāmana then expanded to cosmic proportions: with one step he covered the earth, with the second he covered the heavens, and for the third he placed his foot on Bali's own head, sending him to Pātāla. Bhagavān's compassion for Bali is revealed when he grants the demon sovereignty over Pātāla and promises to stand as his doorkeeper. The episode establishes the principle that even a king's highest virtue must yield to Bhagavān's sovereignty.