అగ్ని మహా పురాణము

194 - అథ అశోకపూర్ణిమాదివ్రతాని

అగ్ని రువాచః-

ఆశోకపూర్ణిమాం వక్ష్యే భూధరం చ భువం యజేత్

  ఫాల్గున్యాం సితపక్షాయాం వర్షం స్యాద్బు క్తి ముక్తిభాక్.

కార్తిక్యాం తు వృషోత్సర్గం కృత్వా నక్తం నమాచరేత్

 శైవం పతమవాప్నోతి వృషవ్రతమిదం పరమ్.

పిత్ర్యా యామావతి తస్యాం పితృణాం దత్తమశయమ్

ఉపోష్యాజ్ఞం పితృనిష్ట్వా నిష్పాప స్వర్గమాప్నుయాత్.

పఞ్చదశ్యాం చ మామస్య పూజ్యాజం సత్వమాప్నుయాత్

 వక్ష్యే సావిత్వమావాస్యాం భు క్లిము క్రిక రీం శుభమ్.

 పఞ్చదశ్యాం వ్రతీ జ్యేషి వటమూలే మహాసతీమ్

త్రిరాత్రోపోషితా నారీ సప్తధాన్యైః ప్రపూజయేత్.

ప్రరూ డైః  క ణ్డసూ త్రైశ్చ రజన్యాం కుజ్కుమాదిభిః

వటావలమ్బనం కృత్వా నృత్యగీతైః ప్రభాతకే.

నమః సావిత్ర్యై సత్యడమే నైవేద్యం చార్పయేద్ద్విజే

 వేశ్మ గత్వా ద్విజాన్ భోజ్య స్వయం భుక్త్వా విసర్జయేత్.

పావిత్రీ ప్రియతాం దేవీ సౌభాగ్యాదీకమాప్నుయాత్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే తిథి వ్రతాని నామ చతుర్నవత్యధిక శతత మోధ్యాయః.

అగ్ని పలికెను: ఫాల్గుశుక్లపరిమూడు వరాహమూర్తిని, భూదేవిని పూజించవలెను. ఈ విధముగ, ఒక సంవత్సర మాచరించువాడు భుక్తిముక్తులను పొందును. కార్తీక పూర్ణిమనాడు వృషోత్సర్గము చేసి రాత్రి వ్రతమును అనుష్టించవలెను దీనిచే శివలోకము పొందును. దీనికి “వృషోత్సర్గవ్రతము” అని పేరు. ఆశ్వయుజమున పితృపక్షి అమావాస్యయందు ఫితృదేవతల నుద్దేశించి చేసిన దానము అక్షయఫలప్రదము. ఏ సంవత్సరమునం దైవను ఈ అమావాస్యనాడు ఉపవాస మండి పితృహజ చేయువాడు పాపవిముక్తు డై స్వర్గము పొందును. మాఘ అమావాస్యనాడు బ్రహ్మను పూజించినవాడు సకలాభీష్టములను పొందును. ఇపుడుభుక్తిముక్తిప్రద మగు వటసావిత్రీ వ్రతమును గూర్చి చెప్పెదము. వ్రత మాచరించు శ్రీ మూడు దివసములు ఉపవాసము చేసి, జ్యేషఅమావాస్యనాడు వటవృక్షమూలమునందు మహాపతివ్రతయగు సావిత్రిని సప్త ధాన్యములతో పూజించవలెను. కొంచెము రాత్రి కేషించి యుండగా ఆ వటవృక్షమునకు కంఠసూత్రము చుట్టి కుంకుమాదులతో దానిని పూజించవలెను. ప్రభాతసమయమున ఆ వటముదగ్గర నృత్యము చేయుచు గీతములు గానము చేయ వలైన నమః సావితైకి నత్యవతే” అనుచు సావిత్రీసత్యవంతులకు నమస్కారము చేసి, వారికి సమర్పించిన నైవేద్యము బ్రాహ్మణునకు దాన మీయవలెను. పిదప ఇంటికి వచ్చి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తరువాత తాను భుజించవలెను. “సావిత్రీదేవి ప్రీయతామ్” అని ఆనుచు వ్రతసమాప్తి చేయవలెను. ఇట్లు చేసిన స్త్రీ సౌభాగ్యాదులను పొందును.

అగ్ని మహాపురాణమునందు తిథి వ్రతవర్ణన మను నూట తొంబది నాల్గవ అధ్యాయము సమాప్తము.