అగ్ని మహా పురాణము

210 - అథ షోడశమహాదానాద వర్ణనమ్

అగ్ని రువాచః-

సర్వదానాని వక్ష్యామి మహాదానాని షోడశ

తులాపురుష ఆద్యం తు హిరణ్యగర్భదానకమ్.

బ్రహ్మాణం కల్పవృక్షశ్చ సహస్రం చ పశ్చామమ్

హిరణ్యకామధేనుశ్చ హిరణ్యాశ్వశ్చ సప్తమమ్

హిరణ్యాశ్వరథ స్తద్వద్దేమహ స్తిరథ స్తథా

పఇ్చలాజలకం తద్వద్ధరాదానం తథైవ చ.

విశ్వచక్రం కల్పలతా సప్తసాగరకం పరమ్

రత్నధేనుర్మహాభూతఘటః శుభ దినేర్పయేత్.

మణ్డ పే మణ్డలే దానం దేవా నార్చ్యార్పయేద్ద్విజే

మేరుదానాని పుణ్యాని మేర వో దశ తాన్ శృణు.

ధాన్య ద్రోణసహ సేణ హ్యుత్తమోబర్ధార్ధతః పరౌ

ఉత్తమః షోడశ ద్రోణ కర్తవ్యో లవణాచలః.

దశ భారెర్గుడాద్రిః స్యాదుత్తమోర్దార్ధతః పరౌ

ఉత్తమః పలసాహ క్రైః స్వర్ణ మేరు స్తథా పరః.

దశద్రోణై స్త్రీలా దీః స్యాత్ప్చ ఞ్చభిశ్చ త్రిభిః క్ర మాత్

కారాసపర్వతోవింశ భారైశ్చ దళపఞ్చభిః.

వింశత్యా ఘృతడుమానాము త్తమః స్యాద్వృషాచలః

దశభిః పలసాహ సైరు త్తమో రజతాచలః.

అష్టభారైః శర్కరాద్రిర్మధ్యో మశోర్డతోర్ధతః

దశ ధోనూః ప్రవక్ష్యామి యాం దత్వా భుక్తిము క్తి బాక్.

ప్రథమా గుడధేనుః స్యాద్ మృతధేను స్తథా పరా

తిలధేను సృతీయా చ చతుర్థి జలధేనుకా.

క్షీరధేనుర్మధుధేనుః శర్కరాదధిదేను కే

రసధేనుః స్వరూ పేణ దశమీ విధిరుచ్యతే.

కుమ్భః స్యుర్ద్రధేనూనామిత రాసాం తు రాశయః

అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు వివిధ దానములను గూర్చి చెప్పెదను. తులాపురుషదానము, హిరణ్యగర్భ దానము, బ్రహ్మాండదానము, కల్పవృక్ష దానము, సహస్రగోదానము, స్వర్ణమయకామధేను దానము, స్వర్ణనిర్మిలాశ్వదానము స్వర్ణమయాశ్వ యుక్త రథదానము, స్వర్ణరచిత హస్తిరథదానము, హరపంచకదానము, భూదానము, విశ్వచక్ర దానము, కల్ప లతాదానము, ఉత్తమసప్తసముద్రదానము, రత్నధేనుదానము, జలపూర్ణకుంభదానము–అనునవి పదునారు మహాదానములు. ఒక శుభదినమున మండలాకార మగు మండపమునందు దేవతాపూజ చేసి ఈ దానము బ్రాహ్మణుల కీయవలేను. మేరుదానము కూడ పుణ్యప్రదము. “మేరువులు” పది. ఒక వెయ్యి ద్రోణముల ధాన్యము “ధాన్యమేరువు”. ఇది ఉత్తమము. ఐదు వందల ద్రోణముల ధాన్యము మధ్యమము. రెండు వందల ఏబది ద్రోణముల ధాన్యము ఆధమవం. పదునారు ద్రోణములతో నిర్మించిన ‘లవణాచలము’ ఉత్తమము. పది భారము ‘గుడపర్వతము’ ఉత్తమము. ఐదు భారములు మధ్యమము, రెండున్నర భారములు నికృష్టము. వేయి పలముల ‘స్వర్ణ మేరువు’ ఉత్తమము. ఐదు వందల పలములు మధ్యమము; రెండున్నర పలములు ఆధమము. ఇరువది భారముల ‘కార్వాస (దూది) పర్వతము’ ఉత్తమము. పది భారములు మధ్యమము, ఐదు భార ములు నికృష్టము. ఇరువది మృతపూర్ణకుంభము. ‘ఘృతాచలము’ ఉత్తమము. పది వేల పలముల ‘రజతపర్వతము’ ఉత్తమము. ఎనిమిది భారముల ‘శర్కరాచలము’ ఉత్తమము. నాల్గు భారమలు మధ్యమము- రెండు భారములు మందము. ఇపుడు ‘డశ ధేనువులను’ గూర్చి చెప్పెదను. దీని దానముచే మనుష్యుడు భుక్తిముక్తులను పొందును. గుడధేనువు, మృతదేనువు, తీలధేనువు, జలధేనువు, క్షీరధేనువు, మధుధేనువు, శర్కరాధేనువు, దధిధేనువు, రసధేనువు, కృష్ణాజినధేనువు, అను ఈ దశధేనువుల దానవిధానము చెప్పబడుచున్నది. ద్రవపదార్థరూపధేనువులకు ప్రతినిధిగ ఘటములందు ఆ పదార్థములను నింపి కుంభదానము చేయవలెను. ఇతరధాల్వాదిరూపములలో ఉన్న ధేనువులను ఆ యా ద్రవ్యముల రాశులను చేసి దానము చేయవలెను.

కృష్ణాజినం చతుర్హస్రం ప్రాగ్గ్రీవం విన్య నేద్భువి.

 గోమయేనానులిస్తాయాం దర్భానా స్త్రీర్య సర్వతః

ల స్వైణ కోజినం తద్వద్వత్సస్య పరికల్పయేత్.

ప్రాజ్ముఖిం కల్పయేద్దేనుముదక్పాదాం సవత్సకామ్

ఉత్తమ గుడధేనుః స్యాత్సదా భారచతుష్టయాత్.

వత్సం భా రేణ కుర్వీత భారాభ్యాం మధ్యమా స్మృతా

ఆర్ధ భా రేణ వత్స శ్రీస్యాత్కనిష్ఠ థార కేణ తు.

చతుర్థాం తేన వత్సః స్యాద్ధుడవిత్తానుసారతః

పఞ్చ కృష్ణలకా మాష స్తే సువర్ణస్తు షోడశ.

పలం సువర్ణాశ్చత్వారస్తులా పలశతం స్మృతమ్

స్యాద్భారో వింశతితులా ద్రోణస్తు చతురాడ కః.

గోమయముతో అలికిన భూమి పై దర్భలు పరచి వాటిపై నాలుగు హస్తముల ప్రమాణము గల కృష్ణాజినమును ఉంచవలెను. దాని కంఠము తూర్పువైపు ఉండవలెను. గోవత్సము నిమిత్తము చిన్న కృష్ణాజినము నుంచవలెను. వత్ససహిత మగు ధేనువు ముఖము తూర్పువైపునకును, పాదములు ఉత్తరము వైపునకును ఉన్నట్లు భావింపవలెను. నాలుగు భారముల గుడధోమవు సర్వదా ఉత్తమ మని అంగీకరింపబడినది. ఒక భారము గుడపుతో గోవత్సమును నిర్మింపవలెను. రెండు భారముల గోవు మధ్యమము. దానితో పాటు ఆర్ధభారము లేగదూడ ఉండవలెను. ఒక భారము గోవు కనిష్టము. దాని చతుర్థాంశముతో దూడను నిర్మించి దీనితో పాటు ఈయవలెను. గుడధేనువును తాను సంగ్రహించుకొనిన గుడమును బట్టి నిర్మించవలెను. ఐదు గులివెందలు ఒక మాషము. 16 మాషములు ఒక సువర్ణము. నాలుగు సువర్ణములు ఒక పలము. 100 పలములు ఒక తుల. 20 తులలు ఒక భారము. నాలుగు అఢకములు ఒక ద్రోణము.

ధేనువత్సౌ గుడ స్యోభౌ సీత సూక్ష్మామ్బరావృతౌ

శుక్తికర్ణవిడుపాదౌ శుచిముక్తాఫలేక్షణా.

సితసూత్ర శిరాలౌ చ సీతకమ్బలక మరౌ

తామ్రగడ్డూకపృష్ణా నౌ సీత చామర రోమకౌ.

విద్రుమభుయుగా వేతో నవనీత స్తరాన్వితా

క్షేమపుచ్చా కాంస్యదోహావిన్ద విలక తారకౌ.

సువర్ణశృఙాభరణో రజతముర సంయుతా

నానాఫలమయా నా గశబ్రాణప్రకల్పితా.

రచయిత్వా యజేద్దేను. మైర్మ నౌర్విజోత్తమ

యా లక్ష్మీః సర్వభూతానాం చ చ దేవేష్వవస్థితా.

ధేనురూ పేణ సా దేవీ మమ శాస్త్రాం ప్రయచ్ఛతు

దేహస్థా యా చ రు ద్రాణీ శ జ్కర స్య సదా ప్రియా.

ధేనురూ పేణ సా దేవీ మమ పాపం వ్యపోహతు

విష్ణువక్షసి యా లక్ష్మీః స్వాహా యా చ విభావసోః.

చన్దార్క ఋక్షక కిర్యా ధేనురూపాస్తు సా శ్రీయే

చతుర్ముఖస్య యా లక్ష్మీర్యా లక్ష్మీర్ధనద స్య చ.

లక్ష్మీరా లోక పాలానాం సా ధేనుర్వరదాస్తు మే

స్వధా త్వం పితృముఖ్యానాం స్వాహాయజ్ఞభుజాం యతః.

సర్వపాపహరా ధేను స్తస్మా చ్ఛా నిం ప్రయచ్ఛ మే

ఏవమామ క్రొతాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్.

సమానం సర్వదేనూనాం విధానం చైతదేవ హి

సర్వయజ్ఞఫలం ప్రాప్య నిర్మలో భుక్తిముక్తిభాక్.

గుడ నిర్మిత మగు ధేనువును, వత్సమును సూక్ష్మవస్త్రముతో కప్పవలెను. వాటి చెవుల వద్ద శుక్తులను, చరణ స్థానములందు చెరకు కఱ్రలను, నేత్రస్థానములందు పవిత్రము లగు ముత్యములను, అలకస్థానములందు శ్వేతసూత్రమును, గంగ డోలు దగ్గర శ్వేతకంబలమును పృష్టభాగమున అప్రమును, రోమస్థానమున శ్వేతచర్మమును, కనుబొమ్మల వద్ద విద్రుమములను, స్తనముల వద్ద నవనీతమును, పుచ్చస్థానమునందు పట్టువస్త్రమును, ఆక్షిగోలకస్థానములందు నీలమణులను శృంగశృంగాభరణ స్థానములందు సువర్ణమును, డెక్కల వద్ద వెండిని ఉంచవలెను. దంతస్థానములందు వివిధఫలములను నాపి కాస్థానమున సుగంధద్రవ్యమును ఉంచి కంచుకోహపాత్రను కూడ ఉంచవలెను. ద్విజ శ్రేష్టా! ఈ విధముగ ధేనువును నిర్మించి. ఈ విధముగ ప్రార్థించుచు పూజించవలేను. “సకలప్రాణుల లక్ష్మియు, సకలదేవతలలో నుండునదియు, అగు ధేనురూపిణి యైన దేవి నాకు శాంతిని ప్రసాదించుగాక! తన శరీరమునం దుండి ‘రుద్రాణి’ యను పేరుతో ప్రసిద్ధురాలును, శంకరుని ప్రియతమపత్నియు, ధేనురూపధారిణియు అగు దేవి నా పాపములను నశింపచేయుగాక! విష్ణువక్షఃస్థలమున లక్ష్మీ రూపముతో నుండునదియు, అగ్ని యొక్క స్వాహారూపమునను, చంద్ర-సూర్య-నక్షత్రదేవతాశక్తిరూపమునను ఉన్నదియు ధేనురూపిణియు అగు దేవి నాకు లక్ష్మి నిచ్చుగాక! చతుర్ముఖుని సావిత్రియు, ధనాధీశుడగు కుబేరుని నిధియు లోక పాలలక్ష్మియు నగు ధేను దేవి నాకు అభీష్టవస్తువుల నిచ్చు గాక. దేవీ! నీవు పితృదేవతల స్వధవు. యజ్ఞభోక్తయగు అగ్నికి సంబంధించిన స్వాహాదేవివి నీవు, ధేనురూపమున నుండి సమస్త పాపములను తొలగించుచుందువు. అందుచే నాకు శాంతి నిమ్ము”. ఈ విధముగ (శ్లోకములను చదివి) ఆభిమంత్రింపబడిన ధేనువును బ్రాహ్మణునకు దానము చేయవలెను. దీనిచే మనుష్యుడు సక లయజ్ఞఫలములను పొంది, పాపరహితుడై భుక్తిముక్తులను రెండింటిని పొందును.

స్వర్ణశృజ్గౌ శ ఫైరౌవ్యైః సుశీలా రూప్యసంయుతా

కాంస్యోపదోహా దాతవ్యా క్షీరిణీ గౌః సదక్షిణా.

దాతాస్యాః స్వర్గమాప్నోతి వత్సరానోమసంమితాన్

కపిలా చోత్తారయతి భూయశ్చాసప్తమం కులమ్.

 స్వర్ణశృజీం రూప్యఖురాం కాంస్యదోహనకాన్వితామ్

 శ క్తితో దక్షిణాయుక్తాం దత్త్వా స్యాడ్ళు క్రిము క్తిభాక్.

 సవత్సరోమతుల్యాని యుగాన్యుభయతోముఖీమ్

 దత్వా స్వర్గమవాప్నోతి పూర్వేణ విధినా దదేత్.

 సన్నమృత్యునా బేయా సవలా గౌస్తు పూర్వవత్

యమద్వా రే మహా మోరే తపా వైతరిణీ నదీ.

 తాం తర్తుం చ దదామ్యేనాం కృష్ణాం వైతరిణీం చ గామ్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే మహాదానానినామ దశాధిక ద్విశతతమోధ్యాయః.

సువర్ణశృంగములతోను, రజత ఖురములతోను కూడిన పాలనిచ్చు ఆవును, కాంస్యదోహపాత్రను, వస్త్రదక్షిణలతో దానము చేయవలెను. ఇట్టి గోవును దానము చేసినవాడు ఆ గోవుకు ఎన్ని రోమము లున్న వో అన్ని సంవత్సరములు స్వర్గములో నివసించును. కపిలగోవు దానము చేసినవాడు ఏడు తరము వారిని ఉద్దరించును. సువర్ణశృంగములు, రజతమండిత ఖురములు గల కపింగోవును, కాంస్యదోహపాత్రను, యథాశక్తి దక్షిణతో దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. ఉభయతో ముఖి యగు గోవును దానము చేసి వారు ఆవునకును, దాని దూడకును ఎన్ని రోమము లుండునో అన్ని యుగ మలవరకును స్వర్గమున సుఖము లనుభవించను. ఉభయతోముఖగోదానము కూడ పైన చెప్పిన విధముననే చేయవలెను. మరణాసన్ను డగు మానవుడు వత్ససహిత మగు గోవును పూర్వోక్త విధానముతో దానము చేయవగేను “అత్యంతభయంకర మగు యమలోక ప్రవేశ ద్వారమునందు త ప్రజలముతో నిండిన వైతరిణీనది ప్రవహించుచుండును. దానిని తరించుటకై నేను ఈ కృష్ణవర్ణ యగు వైతరిణిగోవును దానము చేయుచున్నాను”.

ఆగ్ని మహాపురాణమునందు మహాదానవర్ణన మను రెండువందలపదవ అధ్యాయము సమాప్తము.