అగ్ని మహా పురాణము

209 - అథ దానపరిభాషాకథనమ్.

ఆగ్ని రువాచః-

దానధర్మాన్ ప్రవక్ష్యామి భుక్తి ముక్తి ప్రదాన్ శృణు

దానమీష్టం తథా పూర్తం ధర్మం కుర్వన్ హి సర్వభాక్ .

వాపీకూపతటాకాది దేవలాయతనాని చ

అన్న ప్రదానమారామా పూర్తం ధర్మం చ ముక్తి దమ్.

అగ్నిహోత్రం తపః సత్యం వేదానాం చనుపాలనమ్

ఆతిథ్యం వైశ్వదేవం చ ప్రాహురిష్టం చ నాక దమ్.

గ్రహోపరాగే యద్దానం సూర్యసంక్రమణేషు చ

ద్యొదళ్యాదౌ చ యద్దానం పూర్తం తదపి నాకదమ్.

దేశే కాలే చ పాత్రే చ దానం కోటిగుణం భవేత్

అయనే విషువే పుణ్యే వ్యతీపాతే దినక్షయే.

యుగాదిషు చ సంకాస్తో చతుర్దశ్యష్టమీషు చ

సీతపహోదశీసర్వద్వాదశీష్వష్టకాసు చ.

యజ్ఞోత్సవవివా హేషు తథా మన్వన్తరాదిషు

వైధృతో దృష్టదుఃస్వప్నే ద్రవ్య బ్రాహ్మణలాభతః.

శ్రద్ధా వా యద్దనే తత్ర సదా దా దానమిష్యతే

అయనే డ్వే విషువే ద్వే చతసః షడశీతయః.

చత సో విష్ణుపద్యశ్చ సం; కాన్త్యో ద్వాదశోత్త మాః

కన్యాం మిథునే మీనే ధనుష్యపి రవేర్గతికి.

 షడశీతిముఖాః ప్రోక్తాః షడశీతిగుణాః ఫలై

ఆతీరానాగతే పుణ్యే చ్వే ఉదగ్గక్షిణాయనే.

త్రింశత్కర్కట కే నాడ్యో మక రే ఏంశతిః స్మృతాః

వర్త మానే తులా మే షే గొడ్యస్తూభయతో దశ.

షడశీత్యాం వ్యతీతాయాం షష్ఠిరుక్తాస్తు నాడి కాః

పుణ్యాఖ్యా విష్ణుపద్యాం చ ప్రాక్పశ్చాదపి షోడశ .

శ్రవణాశ్విధనిష్ఠాసు నాగ దైవతమస్త కే

యదా స్యాద్రవివారేణ వ్యతీపాతః స ఉచ్యతే.

ఆగ్ని దేవుడు పలికెను : మునిశ్రేష్ఠా! ఇపుడు భుక్తి ముక్తిప్రదము లగు దానధర్మములను గూర్చి చెప్పెదను. ఇష్టము పూర్తము అని దానము రెండు విధములు. దానధర్మముల నాచరించువాడు సర్వమును పొందగలడు. దిగుడుబావి, కూపము, చెరువు దేవాలయము, అన్న సత్రము - వీటిని స్థాపించుట. ఉద్యానాది నిర్మాణము. వీటికి పూర్త మని పేరు. ఇది ముక్తి ప్రదము. అగ్ని హోతము, సత్యభాషణము, స్వాధ్యాయము, అతిథిసత్కారము, బలి వైశ్వదేవము - వీటికి ఇష్ట మని పేరు. ఇది స్వర్గపదము. గ్రహణసమయమునందును, సూర్య సంక్రాంతియందును, ద్వాదళ్యాదితిథులందును చేయు దానము ‘పూర్తము’ స్వర్గఫలపదము. దేశ కాల పాత్రలందు చేయబడిన దానము కోట్ల రెట్టింపు ఫలము నిచ్చును. సూర్యుని ఉత్తరాయణ - దక్షిణాయన ప్రవేశ కాలములందును, పుణ్య మగు విషువకాలమునందును, వ్యతీపాత . తిథిక్షయ - యుగా రతిభ - సంక్రాంతి - చతుర్దశీ - అష్టమీ - పూర్ణిమా - ద్వాదశీ - ఆష్టకాశ్రాద్ధ - యజ్ఞ ఉత్సవ - వివాహ - మన్వంతరా రంభ - వైధృతియోగ - దుఃస్వప్వదర్శన - ధనప్రాప్తి - సద్బ్రాహ్మణపాపులందును దానము చేయవలెను. ఏ దినమున శ్రద్ద కలుగునో ఆ దినమునను, లేదా ఎల్లపుడు దానము చేయవలెను. రెండు ఆయనములు, రెండుమవలు అను నాల్గు సంకాంతులందును షడశీతిముఖము లని ప్రసిద్ద మైన నాలుగు సంకాంతులందును ‘విష్ణుపద’ అను నాలుగు సంకాంతు లందును - ఈ పండెండు సంకాంతులందును దానము ఉత్తమము. కన్యా - మిథున - ధనూ రాశులలో సూర్య సంక్రాంతికి ‘షడశీతిముఖ’ అని పేరు. ఇవి ఎనుబదియారు రేట్ల ఫలము నిచ్చును, ఉత్తరాయణ . దక్షిణాయన సంకాంతులందు అతీత - అనాగ తఘటికలు పవిత్రమైనవి. కర్క సంకాంతి ఇరువది ఇరువది ఘడియలు పుణ్యకార్యములు చేయుటకై ఉత్తమ మైనది. తులా - మేషసంకాంతులందు వెనుక ముందు పది పది ఘడియలు పుణ్యకాలము. షడశీతిముఖి నం కాంతి అయిన పిమ్మట అరువది ఘడియలు పుణ్యకాలము. విష్ణుపదాసంకాంతులందు ముందు వెనుక పదునారు ఘడియలు పుణ్యకాలము. శ్రవణ అశ్వనీ ధనిష్టా నక్షతములందును, ఆశ్లేషహాథమచరణమునందును రవివార సంబంధ మున్నపుడు “వ్యతీపాతయోగము”.

నవమ్యాం శుక్లపక్షస్య కార్తి కే నిర గాత్కృతమ్

త్రేతా సితతృతీయాయాం వైశాఖే ద్వాపరం యుగమ్.

దర్శే వై మాఘమాసస్య త్రయోదళ్యాం నభస్య కే

కృషే కలిం విజానీయాద్ ఙ్ఞేయా మన్వన్త రాదయః.

ఆశ్వయుక్ఛుక్లనవమీ ద్వాదశి కార్తి కే తథా

తృతీయా చైవ మాఘస్య తథా భాద్రపదస్య చ.

ఫాల్గునస్యాప్యమావాస్యాపౌష స్యైకాదశీ తథా

ఆషాఢస్యాపి దశమీ మాఘమాసస్య సప్త మీ.

శ్రావణే చాష్టమి కృష్ణా తథాషాఢే చ పూర్ణిమా

కార్తి కే ఫాల్గునే తద్వ జ్ట్యేష్టే పఞ్చదశీ తథా.

కార్తిక శుక్లవవమినాడు కృతయుగ ప్రారంభము. వైశాఖశుక్లతృతీయనాడు త్రేతాయుగప్రారంభము. ఇపుడు ద్వాపరమును గూర్చి వినుము. మాఘపూర్ణిమనాడు ద్వాపరము. భాద్రపదకృష్ణతయోదశినాడు కలియుగ ప్రారంభమగును. మన్వంతరపారంభకాలమును ఈ విధముగా గ్రహించవలెను. ఆశ్వయుజశుక్ల నవమి, కార్తిక ద్వాదశి, మాఘ-భాద్రపదములు తృతీయాతిథులు, ఫాల్గుణ అమావాస్య, పౌష ఏకాదశి, అషాఢదశ మీ, మాఘ సప్తమి, శ్రావణకృష్ణ అష్టమి, ఆషాఢ పూర్ణిమ,  కార్తిక - ఫాల్గుణ - జ్యేష్ఠపూర్ణిమలు.

ఊర్ద్వే చై వాగ్రహాయణ్యా ఆష్టకాస్తిస్ర ఈరితాః

అష్టకాఖ్యా చాష్టమీ స్యాదాసు దానాని చాక్షాయమ్.

గయా గజ్జా ప్రయాగాదౌ తీర్థ దేవాలయాదిషు

ఆప్రార్థితాని దానిని విద్యార్థకన్యకాని చ.

దద్యాత్పూర్వముఖో దానం గృష్తియాదుత్త రాముఖ

ఆయుర్వివర్ధతే దాతుహీతుః క్షీయతే న తత్.

నామ గోత్రం సముచ్చొర్య సంప్రదానస్య చాత్మనః

సంప్రదేయం ప్రయచ్ఛని కన్యాదానే పుసస్త్రయమ్.

స్నా త్వాభ్యర్చ్య వ్యాహృతిభిర్దద్యాద్దానం తు గోడకమ్

 కనకాళ్వతిలా నాగా దాసీరథ మహీ గృహాః.

కన్యా చ కపిలా దేనుర్మహాదానాని వై దళ

శ్రుతశౌర్యతపఃక న్యాయాజ్యశిష్యాదుపాగతమ్.

శుల్కం ధనం వా సకలం శుల్కం శిల్పానువృత్తితః

కుసీదకృషి వాణిజ్యప్రాప్తం యదుపకారతః.

పాశక ద్యూతచౌర్యాది ప్రతిరూపకసాహ సైః

వ్యాజేనోపార్జితం కృత్స్నం త్రివిధం త్రివిధం ఫలమ్.

అధ్యగ్న్యర్యావాహనికం దత్తం చ ప్రీతికర్మణి

భాతృమాతృపితృప్రాప్తం షడ్విధం స్త్రీధనం స్మృతమ్.

బ్రహ్మ క్షత్రవిణం ద్రవ్యం శూద్రస్యైషామనుగ్రహాత్

బహుభ్యో న ప్రదేయాని గొర్గృహం శయనం యః

కులానాం తు శతం హన్యాదప్రయచ్చన్ ప్రతి శుతమ్

దేవానాం చ గురూణాం చ మాతాపితోస్తథైవ చ.

పుణ్యం దేయం ప్రయత్నేన యత్పుణ్యం చార్జితం క్వచిత్

ప్రతిలాభేచ్ఛయా దత్తం యద్దనం తదపార్థకమ్.

శ్రద్దయా సాధ్యతే ధర్మో దత్త వాక్యపీ చాక్షయమ్

 జ్ఞానశీలగుతో పేతః పరపీడా బహిష్కృతః.

అజ్ఞానం పాలనాత్రాణాత్త త్పాతం పరమం స్మృతమ్

మాతుః శతగుణం దానం సహస్రం పితురుచ్యతే.

అనన్తం దుహితుర్ధానం సోదర్యే దత్త మక్షయమ్

అమను ష్యే సమం దానం ఫా పే జ్ఞేయం మహాఫలమ్.

వర్ణసంకరే ద్విగుణం శూద్ర దానం చతుర్గుణమ్

వైశ్య చాష్టగుణం క్షత్రే షోడశత్వం ద్విజబ్రువే.

వేదాధ్యాయే శతగుణమన స్తం వేదబోధ కే

పురోహితే యాజకాదౌ దానమక్షయముచ్యతే.

శ్రీవిహీనేషు యద్దత్తం తదన స్తం చ యజ్వని

ఆతపా స్వనధీయానః ప్రతిగ్రహరుచిర్ద్విజః.

అమృస్యశృప్లవేనేవ సహ తేనైవ మజ్జతి

స్నాతః సమ్యగుపస్పృశ్య గృహ్లియాత్ ప్రయతః శుచిః.

ప్రతిగహీతా సావిత్రిం సర్వదైవ ప్రకీర్త యేత్

తతస్తు కీ ర్తయేత్వార్థం ద్రవ్యేణ సహ దైవతమ్.

 ప్రతిగ్రాహీ పఠేదుచ్చైః ప్రతిగృహ్య ద్విజోత్తమాత్

మన్దం పఠేత్ క్షత్రియాత్తు హ్యుపాంశు చ తథా విశః.

 మనసా చ తథా శూద్రాత్ స్వస్తివాచనకం తథా

మార్గశీర్షపూర్ణిమ తరువాత వచ్చు మూడు ఆష్టములకు అష్టకా అని పేరు. అష్టమియే అష్టక. ఈ ఆష్టక లందు చేసిన దానము అక్షయఫలము. గంగా - యమునా - ప్రయాగాది తీర్థములందును దేవాలయమునందును అడుగకుండ ఇచ్చిన దానము ఉత్తమము. కన్యాదానవిషయమున ఇది వర్తించదు. దాత పూర్వాభిముఖుడై దానమీయవలెను. ప్రతిగత ఉత్తరాభి ముఖుడై గ్రహించవలెను. దానము ఇచ్చువాని ఆయుర్దాయమును వృద్ధి పొందించును. అయితే తీసుకొనువాని ఆయుర్దాయము క్షీణించదు. తన పేరును, ప్రతిగ్రహిత పేరును చెప్పుచు దాన మీయవలెను. కన్యాదానమునందు ఈ విధముగ మూడు సార్లు చేయవలెను. స్నానపూజాదులు చేసి, చేతజలము గ్రహించి పై సంకల్పము చేయవలెను. సువర్ణ ఆశ్వ-తిల-గజదాసీ-రథ-భూ- గృహ - కన్యా - కపిలగోవుల దానములు దశమహాదానములు. విద్యా - పరాక్రమ - తపః కవ్యా-యజమాన శిష్యులవలన లభించినది దానము కాదు. శుల్కము, శిల్పకలాచులవలన లభించిన ధనము కూడ శుల్కమే. వడ్డీ, వ్యవసాయము, వాణిజ్యము, ఇతరులకు ఉపకారము చేయుట - వీటివలన లభించిన ధనము సాత్త్వికము. ద్యూతము, దొంగతనము, వేషము వేయుట, సాహసకర్మ - వీటిపలన లభించిన ధనము రాజసము. మోసగించి సంపాదించినది తామసము. వీటివలన వచ్చు ఫలము గూడ సాత్విక - రాజస - తామసరూపమున నుండును. వివాహసమయమున లభించినది, అత్త వారింటికి వెళ్ళు నపుడు ప్రీతితో ఇచ్చినది, భర్త ఇచ్చినది, సోదరుడు ఇచ్చినది, తల్లిదండ్రులు ఇచ్చినది, ఈ ఆరు విధము లైన ధనము స్త్రీధనము. శూద్రునకు బ్రాహ్మణ - క్షత్రియ, వైశ్యుల అనుగ్రహముచే లభించినది ధనము. గోవు, గృహము, శయ్య, స్త్రీ- ఇవి అనేకులకు దానము చేయరానివి. అట్లు ఇచ్చుట పాపహేతువు. మాట ఇచ్చి తరువాత దానము చేయని వాని నూరుకులములు నశించును. ఎక్కడ సంపాదించిన ధనము నైనను పుణ్యదేవతలకు ఆచార్యులకు, తలిదండ్రులకు ప్రయత్నపూర్వకముగా సమర్పించవలెను. ఏదోలాభమును అపేక్షించి ఇచ్చిన దానము నిష్ఫలము. ధర్మము శ్రద్దచేత సిద్దించును. శ్రద్దతో ఉదక మిచ్చినను అది అక్షయమగును. జ్ఞాన - శీల-సద్గుణసంపన్నుడును, ఇతరుల కెన్నడును పీడ కలుగ జేయని వాడును దానము చేయుటకు సత్పాతం. ఆజ్ఞానవంతులైనవారిని పాలించి రక్షించుటచే వారు పాత్రలని చెప్పబడుచున్నారు తల్లి కిచ్చిన దానము నకు నూరు రెట్లు ఫలము, తండ్రి కిచ్చినదానికి వేయి రెట్లు ఉండును. పుత్రికని, సహోదరునకును ఇచ్చిన దానము అనంతము అక్షయ్యము. మనుష్యేతర ప్రాణుల కిచ్చిన దానము న్యూనాధికము కాక సమముగా నుండును. పాపాత్మున కిచ్చినది పూర్తిగ నిష్ఫలము. వర్ణసంకరుని కిచ్చిన దానము రెట్టింపు ఫలమును శూదున కిచ్చినది నాలుగు రెట్లును వైశ్యునకుగాని క్షత్రియునకు గాని ఇచ్చినది ఎనిమిది రెట్లును, నామమాతవాహ్మణున కిచ్చినది పదునారు రెట్లును, వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణున కిచ్చి నది నూరు రెట్లును ఫలము నిచ్చును. వేదార్థ వేత్త యగు ఆచార్యున కిచ్చినది అనంతఫలము. వురోహిత-యాజూదుల కిచ్చినది అక్షయఫలము. దరిదు డైన బ్రాహ్మణునకును, యజ్ఞము చేసిన బ్రాహ్మణునకును ఇచ్చినది అనంతఫలదాయకము. తపోహీను డును, స్వాధ్యాయరహితుడు, ప్రతిగ్రహప్రియుడును అగు బ్రాహ్మణుడు జాతినావమీద కూర్చున్న వానితో సమానుడు. ఆత డా నావతో కూడ మునిగిపోవును. బ్రాహ్మణుడు స్నానాచమనాదులచే శుద్దుడి ప్రతిగహము చేయవలెను. దానము పట్టువాడు గాయత్రీ జపము చేయవలెను. దానితో పాటు ప్రతిగహించిన ద్రవ్యమును దేవత పేరును ఉచ్చరించవలెను. ప్రతిగహము చేయువాడు శ్రేష్టబాహ్మణునుండి ప్రతిగ్రహించి నపుడు ఉచ్చైఃస్వరమునను, క్షత్రియునినుండి గ్రహించినపుడు మందస్వరమునను వైశ్యునినుండి ప్రతిగ్రహించినపుడు ఉపాంశువుగను జపము చేయవలెను శ్రూదునినుండి ప్రతిగ్రహము చేసినపుడు మానసిక జపమును, స్వస్తి వాచనమును చేయవలెను.

అభయం విష్ణుదై వత్యం భూమిర్వై విష్ణుదేవతా.

కన్యా దాస స్తథా దాసీ ప్రాజాపత్యాః ప్రకీర్తితాః

ప్రాజాపత్యో గజః ప్రో కస్తుర గో యమదై వత.

తథా చైకశ ఫం సర్వం యామ్యశ్చ మహిష స్తథా

ఉషశ్చ నైరృతో ధోనూ రౌద్రీ ఇగోనల స్తథా.

ఆప్యో మేషో హరిః డ ఆరణ్యాః పశ వోనిలాః

జలాశయం వారుణం స్యావ్వారిధానీ ఘటాదయః.

సముద్రజాని రత్నాని హేమలోహాని చానలః

ప్రాజాపత్యాని శస్యాని పక్వాన్న మపి స మ.

గాస్గర్వం గఛమిత్యాహుర్వన్తం బార్హస్పతం స్మృతమ్

వాయవ్యాః పక్షిణః సర్వే విద్యా బ్రాహ్మీ తథాఙ్గకమ్.

సారస్వతం పుస్తకాది విశ్వకర్మా తు శిల్ప కే

వనస్పతిర్ద్రూమాదీనాం ద్రవ్యదేవా హరే స్తనుః.

మునిశ్రేష్ఠా! అభయమునకు దేవత సర్వదేవతాగణము. భూమికి దేవత విష్ణువు. కన్యకును, దాసీదాసులకును గజములకును ప్రజాపతి. అశ్వమునకు యముడు. ఒక డెక్కగల పశువులకు సర్వదేవతాగణము, మహిషమునకు యముడు, ఉష్ట్రమునకు నిరృతి, ధేనువునకు రుదుడు, మేక కు అగ్ని, గొట్టె, సింహము, వరాహము-వీటికి జలదేవత, వన్యపశువులకు వాయువు, జలపాత - కలశాదీజలాశయములకు వరుణుడు, సముద్రమునుండి ఉత్పన్నము లైన రత్నములకు, స్వర్ణ లోహాదిధాతువులకును అగ్ని, పక్వాన్నమునకును, ధాన్యమునకును పజాపతి, సుగంధములకు గంధర్వుడు, వస్త్రములకు బృహస్పతి, అన్ని పక్షుః కును వాయువు, విద్యా విద్యాంగములకు బ్రహ్మ, పుస్త కాదుల  సరస్వతి, శిల్పమునకు విశ్వకర్మ వృక్షములకు వనస్పతి దేవతలు. ఈ సమస్త ద్రవ్యములును దేవతలును శ్రీముహృష్ణువునకు అంగములే

ఛత్రం కృష్ణాజినం శయ్యా రథ ఆసనమేవ చ

ఉపానహౌ తథా యానముత్తానాజ్గిర ఈరితమ్.

రజోపకరణం శస్త్రం ధ్వజాద్యం సర్వదై వతమ్

గృహం చ సర్వదైవత్యం సర్వేషాం విష్ణుదేవతా.

శివో వా న తతో ద్రవ్యం వ్యతిరిక్తం యతో స్త్రీ పా

ద్రవ్యస్య నామ గృహ్లియాద్దదానీతి తథా వదేల్.

తోయం దద్యాత్తతో హస్తే దానే విధిరయం స్మృతః

విష్ణుర్దాతా విష్ణువ్యం ప్రతిగృహ్లామి వై వదేల్.

స్వస్తి ప్రతిగ్రహం ధర్మం భుక్తిము క్రిఫలద్వయమ్

గురూన్ భృత్యానుజ్జహీర్పరర్చిష్యన్డేవతాః పితృన్.

సర్వతః ప్రతిగృహ్ణీయాన్న తు తృ ప్యేత్స్వయం తతః

శూద్రీయం న తు యజ్ఞార్థం ధనం శూద్రస్య తత్ఫలమ్.

ఛత్రకృష్ణచర్మ - శయ్యా - రథ-ఆసన - పాదుకా - వాహనములకు ఊర్ధ్వాంగిరసులు దేవత - యుద్ధమునకు ఉపయోగించు సామగ్రికిని, శస్త్రములకును, ధ్వజాదులకును సర్వదేవగణములు దేవత - గృహమునకు గూడ వారే దేవత. సకలపదార్థములకు దేవత విష్ణువు లేదా శివుడు. ఏల ననగా, ఏ పదార్థము కూడ ఆ దేవతలకంటే భిన్నముగ లేదు. దానము చేయు సమయమున ముందుగా ద్రవ్యము పేరు చెప్పి, పిదప దదామి అని చెప్పి, సంకల్పజలమును ప్రతిగ్రహీత చేతిలో విడువవలెను. ప్రతిగ్రహీత- విష్ణువే దాత; విష్ణవే ద్రవ్యము; నేను ఈ దానము గ్రహించుచున్నాను. ధర్మానుకూల మగు ఈ ప్రతిగ్రహము కల్యాణప్రద మగు గాక” అని పలుక వలెను. మాతా పితృ-భృత్యాదిపోషణార్థము, దేవతాపితృపూజార్థము అందరినుండియు దానము స్వీకరించవచ్చును. కాని దానిని తనకొరకై వినియోగించరాదు. శూద్రధనమును యజ్ఞకార్యము నందు వినియోగించరాదు; అట్లు చేసినచో ఆ యజ్ఞఫలము ఆతనికి చెందిపోవును.

గుడతక్రరసాద్యాశ్చ శూద్రాద్బాహ్యానివర్తినా

సర్వతః ప్రతిగృహ్ణీయాదవృత్త్యాకర్శితో ద్విజః.

 నాధ్యాపనాద్యాజనాద్వా గరీతాద్వా ప్రతిగ్రహాత్

దోషో భవతి విప్రాణాం జ్వలనారసమా హి తే.

కృతే తు దీయతే గత్వా త్రేతా స్వానీయ దీయతే

ద్వాపరే యాచమానాయ కలౌ త్వనుగమాదృతే.

మనసా పాత్రముద్దిశ్య జలం భూమౌ వినిక్ష పేత్

విద్యతే సాగరస్వాన్తో నాన్తో దానస్య విద్యతే.

ఆద్య సోమారగ్రహణసంక్రాక్ష్యాదౌ చ కాలకే

గజ్గాగయాప్రయాగాది తీర్థదేశే మహాగుణే.

తథా దాముక గోలాయ తథా చాముక శర్మణే

వేద వేదాజ్ఞయుక్తాయ పాత్రాయ సుమహాత్మనే.

యథా నామ మహాద్రవ్యం విష్ణురుద్రాడిదైవతమ్

పుత్రపౌత్రగృహైశ్వర్యపత్నీ ధర్మార్థసద్గుణాః.

కీర్తివిద్యామహాకామసౌభాగ్యారోగ్యవృద్దయే

సర్వపాపోపశాన్త్యర్థం స్వర్గార్థం భు క్తిముక్తయే.

ఏతతుభ్యం సంప్రదదే ప్రీయతాం మే హరిః శివః

 దివ్యా నరిక్ష భౌమాదిసముత్పాతౌఘఘాతకృత్.

ధర్మార్థకామమోక్ష్యా బ్రహ్మలోకప్రదోస్తు మే

యథానామ సగోతాయ విప్రాయాముకశర్మణే.

ఏతద్దాన ప్రతిష్ణార్థం సువర్ణం దక్షిణా దదే

అనేన దానవా క్యేన సర్వదానాని వై దదేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే దానపరిభాషా నామ నవాధిక ద్విశతతమోధ్యాయః.

వృత్తి విహీను డైనచో బ్రాహ్మణుడు శూద్రునినుండి గుడము, మజ్జిగ, రసము మొద లగుపదార్థములను గ్రహించ వచ్చును, జీవిక నడవని బ్రాహ్మణు కు అన్నింటిని గ్రహించవచ్చును. ఏలనన బ్రాహ్మణుడు సహజముగ సూర్యాగ్నుల వలె పవితుడు. అందు ఆపత్సమయమునందు నిందితులకు చదువు చెప్పుట, యజ్ఞము చేయించు, దానము గ్రహించుట-వీటివలన ఆతనికి పాపము రాదు. కృతయుగమునందు బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి దాన మిచ్చేడివారు. త్రేతాయుగమున తమ యింటికి పిలచి యిచ్చెడివారు. ద్వాపర యున అతడు ఆడిగినచో  ఇచ్చేడి వారు. కలియుగమున వెంబడించిననే దానము చేయుదురు. సముద్రతీరము పొందవచ్చును గాని దానమునకు అంతము పొంద శక్యము కాదు. దాత తన మనస్సులో ఈ క్రింది విధముగ సత్పాత్రనుద్దేశించి సంకల్పించి, జలము నేల పై విడువవలేను. “నేను ఈ రోజున సూర్యగ్రహణసమయమున లేదా చంద్రగ్రహణసమయమున లేదా సంక్రాంతిసమయము. గంగా-గయా-ప్రయాగాశ్యతంత గుణ సంపన్న మగు తీర్థ దేశమున అముక (ఫలాన) గోత్రము కలవాడు, వేదవేదాంగవేత్త, మహాత్మ, సత్పాత్రము అయి ఆముకశర్మకు విష్ణువునకు లేదా శివునకు లేదా మరొక దేవతకు సంబంధించిన ఆముక ద్రవ్యమును. కీర్తి - విద్యా- మనోరథ - సౌభాగ్య - ఆరోగ్యాదుల ప్రాప్తి కొరకును, సమస్త పాపశాంతి కొరకును, భుక్తిముక్తుల కొరకును దానము చేయుచున్నాను. ద్యు - అంతరిక్ష భూలోకసంబంధ సమస్తోత్పాతములను నశింపచేయు శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై నాకు ధర్మార్థ కామమోక్షములను ప్రసాదించి బ్రహ్మలోకమును ఇచ్చుగాక”. పిదప “అముక గోత్రము గల బ్రాహ్మణుడైన, అముకశర్మకు ఈ దానము సఫల మగుటకై సువర్ణదక్షిణ ఇచ్చుచున్నాను” అని చెప్పి సమ స్తదానములును చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు దానపరిభాషాదివర్ణన మను రెండువందలతొమ్మిదవ అధ్యాయము సమాప్తము.