అగ్ని మహా పురాణము

258 -  అథ వాక్పారుష్యాదిప్రకరణమ్

అగ్ని రువాచః

సత్యాసత్యాన్యథాస్తోత్రై ర్న్యూనాంగేంద్రియరోగిణామ్

క్షేపం కరోతి చేద్దండ్యః పణానర్దత్రయోదశ.

ఆభిగన్ తాస్మి భగినీం మాతరం వాతవేతి చ

శపన్ తం దాపయేద్రాజా పంచవింశతికం దమమ్.

ఆర్థోఽధమేషుద్విగుణః పర స్త్రీ ఘాత్ర మేషు చ

దండ ప్రణయనం కార్యం వర్ణ జాత్యు త్తరాధ రైః

ప్రాతిలోమ్యాపవాదేషు ద్విగుణ త్రిగుణాదమాః

వర్ణానామానులోమ్యేన తస్మా దేవార్థహానిత.

బాహుగ్రీవానేత్రసక్థి వినాశే వాచి కే దమః

శ క్త స్తతోఽర్థికః పాదనాసాకర్ణక రాదిషు.

అశ క్తస్తు వదన్నే వం దండనీయః పణాన్ దశ

తథాశక్తః ప్రతిభువం దద్యాత్క్షేమాయ తస్యతు.

పతనీయకృతేక్షేపే దండో మధ్యమసాహసః

ఉపపాతక యు క్తేతు దాప్యఃప్రథమ సాహసమ్.

త్రై విద్యనృపదేవానాం క్షేప ఉత్తమ సాహస

మధ్యమోజ్ఞాతి పూగానాం ప్రథమోగ్రామదేశయోః.

ఆగ్ని దేవుడు పలికెను : అవయవలోపము ఇంద్రియలోపము కలవారిని రోగ పీడితులను, సత్యవచనములచేతగాని, అసత్యవచనముల చేతగాని. విపరీత స్తోత్రములచేగాని ఆక్షేపించువారిని పదమూడున్నర పణములచే దండించవలెను. నీ సోదరిని, తల్లిని చేరిచేదను యని తిట్టువానికి ఇరువదియైదు పణముల దండము విధించవలెను. తిట్టబడినవాడు ఆధముడు అయినచో సగము దండము, పర స్త్రీగాని, ఉత్త ములుగాని ఆయినచో రెట్టింపు దండము విధించవలెను. వర్ణజాతుల ఉత్తమత్వ అధమత్వములను పరిశీలించి, దండమును నిర్ణయించవలెను. నిమ్న వర్ణమువాడు ఉచ్చవర్ణము వానిని తిట్టినపుడు రెండు రెట్లు మూడు రెట్లు దండములను, ఉత్త మవర్ణమువాడు విమ్నవర్ణము వానిని తిట్టినపుడు సగము తగ్గించియు దండము విధించవలెను. మాటలతో "నీచేతులను, మెడను, నేత్రములను, తొడలను విడగగొట్టెదను” యని తిట్టినచో నూరు. పణముల దండము విధించవలెను. పొగములు, ముక్కు, చెవులు, చేతులు, విరచెదను. " ఆని తిట్టిన వానికి దానిలో సగము దండము విధించవలెను. ఇట్లు తిట్టిన వాడు అసమర్థుడైనచో పది పణములు దండించవలెను. సమర్థుడైన పాడు దండము చెల్లించి తిట్ట బడినవాని క్షేమము కోరకే (ప్రతిభూ) జామీను ఇవ్వవలెను. "నీవు పతితుడవు" యని తిట్టిన వానికి మధ్యమ సాహస దండము. ఉపపాతకములు చేసినాపు యని తిట్టిన వానికి ప్రథమ సాహసండము. వేదవేత్తలను రాజును దేవతలను తిట్టిన వానికి ఉత్తమ సాహస దండము. జ్ఞాతులను సంఘమును తిట్టినవానికి మధ్య మదండము. గ్రామమును - దేశమును తిట్టినవానికి ప్రథమ సాహసదండము.

ఆసాక్షిక హతే చి హ్నై ర్యుక్తి భిశ్చాగ మేన చ

 ద్రష్టవ్యో వ్యవహారస్తుకూటచిహ్న కృతాదృయమ్.

 ఆ భస్మ పలకరజః స్పర్శే దండో దశపణః స్మృతః

అమేద్యపార్షినిష్యూత స్పర్శ ద్విగుణః స్మృత.

 సమే ష్వేవం పరస్త్రీషు ద్విగుణస్తూ తమేషుచ

హీనేష్వర్ధం దమో మోహమదాదిభిర దండనమ్.

 విప్రపీడాకరం ఛేద్య మం గమ బ్రాహ్మణస్యలు

ఉదూరే ప్రథమోదండ సంస్పర్శేతు తదర్ధికః.

 ఉద్దూర్ణే హస్తపాదేలు దశవింశతిశోదమౌ

 పరస్పరంతు సర్వేషాం శాస్ర మధ్యమసాహస.

 పాద కేశాంశుక క రోల్లుంచ నేషు పణాన్తః

పీడాకరాంశు కావేష్టపాదాధ్యాసేశ తందమః.

శోణితేన ఏనాదుఃఖం కుర్వన్కాష్టాదిభిన్నరః

ద్వాత్రింశతం పణాన్గాద్యేద్విగుణం దర్శనేఽసృజః.

 కరపాదదతో భంగే ఛీద నే కర్ణనాసయోః

 మధ్యో డండో వ్రణోద్బే డే మృతకల్పహతే తథా.

 చేష్టాభోజన పోగోధేనేత్రాది ప్రతిభేదవే

కంధరాజాహుసక్థ్నాం చ భరిగే మధ్యమసాహసః.

ఏకం ఘ్నతాం బహూనాంచ యథోక్తాద్విగుణోదమః

కలహాప హృతం దేయం దండిస్తు ద్విగుణః స్మృతః

 దుఃఖ ముత్పాదయేద్యస్తు సముత్థానజం వ్యయమ్

 దాప్యో దండంచ యో యస్మిన్కల హే సముదాహృతః.

తరికః స్థలజం శుల్కం గృహ్ణన్ దండ్యః పణాన్ దశ

బ్రాహ్మణ ప్రాతివేశ్యానా మేత మేవానిమంత్రణే.

 అభిమాతే తథా భేదే ఛేదే కుడ్యావపాతనే

పణాన్గావ్యః పంచదక వింశతిం త త్రయం తథా.

దుఃఖోల్పాది గృహే ద్రవ్యం ఒప నాణహరం తథా

 షోడశాద్యః ప్రణాగ్దాప్యో ద్వితీయోమధ్యమం దమమ్.

దుః ఖేచ శోణితోత్పాదే శాఖాంగచ్ఛేదనే తథా

దండ ముడిపశూనాం స్యాద్విపణ ప్రభృతిః క్రమాత్.

 లింగస్య ఛేదనే మృత్యో మధ్యమో మూల్యమేవచ

మహాపశూనామేతేషు స్థానేషు ద్విగుణాదమా .

 ప్రరోహి శాఖినాం శాఖాస్కంధ సర్వవిదారణే

ఉపజీప్య దుమాణాంతు వింక తేర్ద్విగుణోదమః.

యః సాహసం కారయతి సదాప్యో ద్విగుణం దమమ్

య స్త్వేవ ముక్త్వహం దాతాకారయేత్స చతుర్గుణమ్.

ఎవరినైన కొట్టినపుడు సాక్షులులేనిచో ఆయభియోగమును రాజు చిహ్నము యుక్తి, శాస్త్రము, వీటిని బట్టి పరి శీలించవలెను దెబ్బతగిలినట్లు : అసత్యమగు చిహ్నములు చేసికొనెవా! అని పరిశీలించవలెను. ఇతరుని పై భస్మము పంకము పరాగము చల్లిన వానికి పది పణముల దండము. ఆమేధ్యమున ఉమ్మి తగల్చిన వానికిని మనపతో తన్నిన వానికిని రెట్టింపు దండము. ఇది సమని విషయమనను చెప్పబడినది. పర స్త్రీల విషయమునను ఉత్తమ విషయమునన ఈ అపరాదము చేసినచో రెట్టింపుదండము. తనకంటే హీనుల విషయమున చేసినచో సగము దండము. మోహముచేత గాని మదాదుల చేతగాని చేసినచో దండమలేదు. ఒక విప్రువకు ఏ అంగముచే అబ్రాహ్మణుడు పీడ కల్గించునో ఆ ఆంగమును ఛేదించ వలెను. బ్రాహ్మణుని చంపుటకు ఆయుధ మెత్తినచో ప్రథమ సాహస దండము. ఆయుధమును స్పృశించినచో సగము దండము. కొట్టుటకు హస్తముగానీ పాదముగాని ఎత్తిన వానికి వరుసగా పది ఇరువది పణమాల దండవు. ఒకరినొకరు కొట్టు కొనుటకై ప్రయత్నించినపుడు అందరికిని మధ్యమ సాహనదండము. పాదము, కేశములు, వస్త్రము, హస్తములు, పట్టిలాగినచో. పదిపణము:దండము. పీడించినను లాగినను బట్టతో చుట్టబెట్టినన తన్ని నను నూరు పణము దండము. కాషాదులచే కొట్టినపుడు రక్త మురాకున్నచో ముప్పది రెండు పణముల దండము రక్తము కనబడినచో రెట్టింపు దండము హస్తములను కొని పాదము లను కాని, దంతములను దాని విరుగ గొట్టిన వానికి కర్ణములను నాసికను ఛేదించిన వానికిని గాయము కలుగునట్లు కొట్టిన వానికిన్ని చచ్చెనా యన్నట్లు కొట్టినవానికి మధ్యమదండము. ఇతరుల చేష్టను, భోజనమును, వాక్కును అడ్డుగొనినప్పుడున్ను నేత్రాదులను, పీడించినపుడున్న కంకము బాహువులు తొడలు వి.చినపుడున్ను మధ్యమ సాహస దండము. చాలమంది కలసి ఒక నిని కొట్టినచో వారికి వెనుక చెప్పిన దండమును రెట్టింపు దండము ప్రత్యేకముగా విధించవలెను. కలహములో అపహ రింపబడిన వస్తువును, దాని స్వామికి ఇప్పించి దాని మూల్యమునకు రెట్టింపు దండము విధించవలెను. అన్యునకు దుఃఖము కల్గించు వానిచే చికిత్సాదులకు యెంత వ్యయమగునో ఆంతధనము ఇప్పించవలేను. ఏకలహమునకు ఏదండము విధింప బడినదో ఆదండమును కూడ విధించవలేను నావచే దాటించు వాడు స్థల శుల్కమును తీసుకున్నచో పది పణముల గండము. దేవకార్యాదులు వచ్చినపుడు సమర్థుడై యుండి కూడ చుట్టుప్రక్కలవున్న బ్రాహ్మణులను నియంత్రణము చేయనివానికి పది పణముల దండము. ఇతరుల గోడను కొట్టి నను భేదించినను రంధ్రము చేసినను దానిని పడగొట్టినను వరసగ ఐదు, పది, ఇరువది ముప్పది ఐదు పణము - ఇప్పించవలెను. ఇతరుల గృహమునందు దుఃఖోత్పాదక ములగు వస్తువులను ప్రాణహర ములగు వస్తువులను పడవేయువారికి పదహారు పణము దండము మధ్యమ సాహస దండము విధించవలెను. క్షుద్ర పశువు లకు పీడ కల్గించినను వాటి శరీరమునుండి రక్తము స్రవించినట్లు చేసినను, కొమ్ములు ఛేది చిను, వరసగ రెండు నాలుగు ఎనిమిది పణముల దండము. వాటి లింగమును ఛేదించగ అవి మరణించిన చో మధ్యమ సాహస దండము విధించి వాటి మూల్య మును ఇప్పించవలెను. మహా పశువుల విషయమున ఈ అపరాధము చేసినపుడు రెట్టింపు దండము. ప్రరోహి (కొమ్మ తీసి పాతగ మొలచునది) వృక్షముల శాఖను మానును మొత్తము వృక్షమును చీల్చివేసినపుడు ఇరువది పణముల దండముఉప జీవ వృక్షమును (ఫ, వృక్షములు) ఇట్లు చేసినచో రెట్టింపు చండము. సాహసమును చేయించినవానికి చేసిన కౌనికంటే రెట్టింపు చండము. నేను నీకు ధనము నిచ్చెదను సాహసమును చేయు ము యని చెప్పి చేయించినవానికి నాలుగు రెట్లు దండము.

ఆర్యాక్రో శాతిక్రమకృద్భాతృ జాయా ప్రహారదః

సందిష్టస్యా ప్రదాతాచ సముద్ర గృహ భేదక .

 సామంతకులికాపీనామపకారస్య కారకః

పంచాశతృణికో దండ ఏషామితి వినిశ్చయః.

స్వచ్ఛందవిదవాగామీవిక్రుష్టే నాభిధావకః

ఆకారణే చ విక్రోషా చాండాలశ్చాత్తమాన్స్ప శన్.

 శూద్రః ప్రవజిలానాంచ దైవే వైబ్ర్యేచ భోజకః

ఆయు క్తం శపథం కుర్వన్న యోగ్యోయోగ్య కర్మకృత్.

 వృషముద్ర పశూనాంచ పుంస్త్వస్య ప్రతిఘాతకృత్

సాధారణస్యాపలాపీ దాసీ గర్భవినాశకృత్.

 పిలోపుత్రస్వసృభాతృదమ్పత్యాచార్య శిష్యకాః

 ఏషామపతి తాన్యోన్యత్యాగిచ శతదండభాక్.

 వసానస్రీన్పడాన్దండ్యో నేజకస్తు పరాంకుకమ్

 విక్రయావక్రయాధానయాచితేషు పణాన్తళ.

 తులాశాసన మానానాంకూట కృన్నాణ కస్యచ

ఏభిశ్చ వ్వవహర్తాయః సదాప్యో దండ ముత్తమమ్.

 ఆకూటం కూటకం బ్రూతే కూటం యశ్చాప్యకూటకమ్

సనాణక పరీక్ష తు దావ్యః ప్రథమ సాహసమ్.

 భిషజ్ మిథ్యాచరన్గాప్య స్తిర్యకు ప్రథమం దమమ్

మాను షే మద్యమం రాజమాను షే షూ త్తమం తథా.

ఆబధ్యం యశ్చ బధ్నాతిధ్యం యశ్చ, ప్రముంచతి

అప్రాప్త వ్యవహారంచ సదాప్యో దమముత్తమమ్.

 మానేన తులయా వాపి యోం మష్టమకం హరేత్

ద్వావింశతి పఠాన్ దాప్యోవృద్ధాహానౌచ కల్పితమ్.

 భేషజ స్నేహ లవణ గంధాన్య గుడాదిషు

పణ్యేషు ప్రక్షిప క్లీనం పణాబ్ధాప్యస్తుషోడశ.

 సంభూయ కుర్వతామర్ఘ్యం సబాదం కారుశిల్పినామ్

అర్థ (ర్ఘ)స్య హ్రసం వృద్ధిం వాసహస్రో దండ ఉచ్వలే.

రాజని స్థాప్యతేయోర్థః ప్రత్యహం తేన విక్ర యః

క్రయో వానిసవ స స్మాద్వణిజాం లాభకత్స ృత.

 స్వదేశ పణ్యేతు శతం వణి గ్గృహ్ణీత పంచకమ్

దశకం పారదేశ్యే తు యః సద్యః క్రయవి క్రయీ.

 పణ్యస్యోపరి సంస్ధాప్య వ్యయం పణ్యసముద్భవమ్

ఆర్థోఽనుగ్రహకృత్కార్యః క్రేతుర్విక్రేతు రేవచ.

పూజ్యులను తిట్టికవానికి వారి ఆజ్ఞ అతిక్రమించిన వానికి సోదరుని భార్యను కొట్టినవానికి, ఇచ్చేదనని చెప్పి ఇవ్వనివానికి, భూగృహమును భేదించినవానికి, ఇరుగుపొరుగువారికిని కులీనులకు ఆపకారము చేయువానికిని ఏబది పణముల దండము. స్వేచ్ఛాపూర్వ! ముగ విధవాసంముచేసి దానికి, కష్టములోనున్న వారు ఆరచినపుడు, పరుగెత్తని హనికి అకారణముగా తిట్టు నానికి, ఉత్తములను స్పృశించు చండాలునడు, దేవ పితృ కార్యములందు సన్యాసులకు భోజనము పెట్టు శూద్రునకు, అనుచితముగా ఒట్లు పెట్టు వానికి, తనకు చేయు అధికారములేని పనులు చేయువానికిని వృషభములు ముద్ర పశువుల పుం స్వమును చెడగొట్టినవానికిని, సాధారణ విషయములందు మోసముచేయువానికని, దాసీ గర్భమును నశింప చేసినవానికిని, నూరుపణముల దండము విధించవలెను. తండ్రి, కుమారుడు, సోదరి, సోదరుడు, దంపతులు, ఆచార్యుడు, శిష్యడు, వీరిలో పతితుడుకాని వారినికూడ పరిత్యజించువారికి నూరుపణముల దండము. ఇతరుల వస్త్రములను ధరించిన చాకలివానికి మూడుపణముల దండము. ఆమ్మి వేసినను అద్దెకిచ్చినను కుదువ పెట్టినను పదిపణముల దండము. తుని (తక్కెడ) శాసవములు, కొలతలు, వీటిలో కపటము చేయువానికిని, నాణెములలో మోసముచేయువానికిని, వీటితో వ్యవహ రించువానికీని ఉత్తమ సాహస దండము విధించవలెను. మంచిదానిని చెడ్డదనియు, చెడ్డదానిని మంచిదనియు చెప్పు నాశిక పరీక్షకులకు ప్రథమ సాహస దండము. జంతువుల విషయమున తప్పుడు వైద్యము చేయు వైద్యునకు ప్రథమ సాహస దండము. మనుష్యులకు చేసినచో మధ్యమ దండము. రాజ పురుషులకు చేసినచో ఉత్తమ దండము. బంధించకూడని వానిని బంధించినను, బంధింప తగిన వానిని విడిచి పెట్టినను అట్టి అధికారికి ఉత్తమ దండము. కొలతలో గాని, తూక ములోగాని ఎనిమిదవ వంతుహరించిన వానిచే ఇరువది రెండు పణములు ఇప్పించవలెను ఆన్షమాంశము కన్న అధికము అయినను తక్కువై నను దండమును కూడ మార్చవలెను. మందులు, తైలములు, లవణము, గంధము, ధాన్యము, గడము మొద లైన పణ్య వస్తువులలో తక్కువరకము వస్తువు కల్పిన వానికి పదహారు పణముదండము. కొందరు శిల్పులు కలిసి పని చేయుచు మూల్యములో ప్రసము గాని వృద్దిగాని కల్పించినచో వారికి వేయి పణముల దండమును విధించ వలెను. వ్యాపారులు రోజుచే ప్రతిదినము నిర్ణయింపబడిన మూల్యమునకే క్రయ విక్రయములు చేయవలెను. దానిలో వచ్చు లాభము వర్తకులకు చెందును. వర్తకులు స్వదేశ మునందు లభించు పణ్యముపై (అమ్మే వస్తువు) సూటికి ఐదువంతులు విదేశీయ  వస్తువుల పై, నూటికి పది వంతులు లాభము తీసుకొనవచ్చును. ఇది వెంటనే అమ్ముడుబోవు వస్తువులకు వర్తించును, నర్త కము చేయుటలో కలుగు వ్యయమును పణ్యము పై వేసి ఆమ్మువారికి కొను వారికిని కూడ లాభము కలుగునట్లు మూల్యము విర్ణయించవలెను.

గృహీత మూల్యం యః పణ్యం క్రేతుర్నైవ ప్రయచ్ఛతి

సోదయం తస్య దాప్యోఽ సౌ దిగ్లాభం వాదిగా గతే.

విక్రీతమపి విక్రేయం పూర్వే క్రేతర్యగృహ్ణతి

హాని శ్చేత్క్రేత్రదే షేణ కేతురేవ హిసాభ వేత్.

 రాజదై వోప మాతేన పణ్యే దోషముపాగతేః

హానిర్వి కేతురేబాసౌ యాచి తస్యా ప్రయచ్ఛత.

 ఆన్యహ చ వి క్రితం దుష్టం వాఒదుష్ట పద్యది

విక్రీణితే దమ స్తత్ర తన్మూల్యాద్ద్విగుణో భవేత్.

 క్షయం వృద్దించ వణిజా పణ్యానామవిజానతా

క్రీత్వానానుశయః కార్యః కుర్వన్ షడ్బాగ దండక్.

సమవాయేన వణిజాం లాభార్డం కర్మ కుర్వతామ్

లాభాలాభౌయథా ద్రవ్యం యథావా సంవిదాకృతా.

 ప్రతిషిద్ధమనాదిష్టం ప్రమాదాద్యచ్చ నాశితమ్

స తద్దద్యాద్విప్లవాచ్చ రక్షిలాద్దశ మాంశ భాక్.

 ఆ క్షప్ర చేపణాద్వింశం భాగం శుల్కం నృపో హరేత్

వ్యాసిద్ధం రాజయోగ్యంచ విక్రితం రాజగామితల్.

మిథ్యావదన్పరీ మాణం కులస్థానాదపక్రమన్

దాప్య స్వష్ట గుణం యశ్చ సవ్యాజక్రయ విక్రయీ.

 దేశా న్తరగతే ప్రేతే ద్రవ్యం దాయాద బాంధవాః

జ్ఞాతయా దా హరేయు స్తదాగతా స్తైర్వినా నృపః.

 జిహ్మంత్యజేయుర్ని గ్లోభమ శక్తోఽన్యేన కారయేత్

అనేన విధిరాఖ్యాత ఋత్విక్ కర్షకకర్మిణమ్.

పణ్యము మూల్యము, తీసుకొని పణ్యమును గ్రాహకునకు ఇవ్వని వానిచే వృద్ధి సహితముగ ఇప్పించవలెను. గ్రాహకుడు విదేశము నుండి వచ్చినచో అతనికి ఆ దేశ మునందు ఎంత లాభము వచ్చునో అంతధనముతో ఇప్పించ వలెను. గ్రాహకుడు కొన్న వస్తువును ఏకారణము చేతనై నా, తీసుకొనకున్న చో దానిని మరియొక నికి అమ్మ వచ్చును. కాని దాని పై నష్టము వచ్చినచో అది మొదటి గ్రాహకుని నుండి తీసుకొనవలెను. రాజోపఘాతము చేతగాని, దైవోపఘాతము చేతగాని, పణ్యము పాడై పోయినచో ఆనష్టమును గ్రాహకుడు అడిగినను ఇవ్వని విక్రేతయే భరించవలెను, ఒకరికి ఆమ్మిన దానిని మరియొకనికి అమ్మినను, చెడ్డదానిని మంచిదని చెప్పి అమ్మి నను దాని మూల్యమునకు రెట్టింపు దండము విధించవలెను. పణ్యముల లాభనష్టములు తెలియని వర్తకుడు ఏదైనా వస్తువునుకొన్నపుడు వెనుకాడ కూడదు. ఆట్లు చేసి నచో ఆరవవంతు దండము విధించవలెను. లాభము కోరి కొందరు వర్తకులు కలిసి వ్యాపారము చేయునపుడు వారు లాభా లాభములను, ద్రవ్యమును బట్టి గాని మొదట అనుకొనిన మాటను బట్టిగాని చేసుకొనవలెను. వారిలో ఒకరు మిగిలిన వారి అనుమతి లేకుండగను, వారు నిషేధించినను లేదా తన ప్రమాదమువలనన వస్తువును పాడు చేసినచో అనష్టమును ఆతడే భరించవలేను. వారిలో ఒకడు ఒక వస్తువును ప్రమాదము నుండి రక్షించినచో దానిలో పదవవంతు అతనికి చెందును. వస్తు వుల నిర్ణీత మూల్య ములో ఇరువదవ భాగమును రాజు శుల్కముగా గ్రహించవలేను. రాజ నిషిద్ధమైన వస్తువుగాని, రాజ యోగ్యమైన వస్తువును గాని ఎవరైనా విక్రయించుచున్న చో, దానిని రాజు స్వాధీనము చేసుకొని వచ్చును. ఆసత్య పరిమాణ మును చూపి కాని, పన్ను తీసుకొను స్థానమునుండి తొలగిపోయిగాని, మోసముతో గాని క్రయ విక్రయములు చేయు వానికి ఆ వస్తు మూల్యమనకు ఎనిమిది రెట్లు దండము విధించవలెను. కలిసి వ్యాపారము చేయువారిలో ఒకడు దేశాంత రము వెళ్లి నను మరణించినను ఆకని ద్రవ్యమును ఆతని దాయాదులు బంధులు జ్ఞాతులు గ్రహించవలెను. వారెవ్వరులేనిచో రాజు గ్రహించవలెను. సంఘములోని ఒకడు వక్రముగ ప్రవర్తించినచో ఆతనికి లాభము పంచకుండగ పంపివేయవలెను. స్వయముగ వ్యాపారము చేయలేనివాడు ఇతరులచే చేయించవలెను. ఋత్విక్కులు, కర్షకులు, కర్మచారులు, వారి విష యములో కూడ ఇదే విధానము.

గ్రాహకై ర్గృహ్యతే చౌరో లోప్రేణాథ పదేనవా

పూర్వకర్మాపరాధీవా తథై వా శుద్ధవాసకః.

అన్యేఽపి శంకయా గ్రాహ్యా జాతి నామాది నిహ్నవైః

ద్యూతస్త్రీ పానసక్తాశ్చ శుష్క భిన్న ముఖన్వరా.

పరద్రవ్య గృహాణాంచ పృచ్ఛకా గూఢచారిణః

 నిరాయా వ్యయ వ న్తశ్చవి నష్టద్రవ్య విక్రయా.

 గృహీతః కంకయా చౌర్యే నాత్మానం చేడ్విశోధయేత్

దాపయిత్వా హృతం ద్రవ్యం చొరదండేన దండయల్.

 చౌరం పదాప్యాప హృతం ఘాత యే ద్వివిధైర్వ ధైః

సచిహ్నం బ్రాహ్మణం కృత్వాస్వరాష్ట్రాద్వి ప్రవాసయేత్.

ఘాతితేఽపహృతే దోషో గ్రామ భక్తుర నిర్గతే

 స్వసీమ్ని దద్యాద్దామస్తు పదం వాయత్ర గచ్ఛతి.

 పంచగ్రామీ బహిః క్రోళద్దశ గ్రామ్యథవాపునః

వన్ది గ్రాహాం స్తథా వాజికుంజరాణాంచ హారిణః.

ప్రసహ్య మాతినశ్చైవ శూలమారోప యేన్నరాన్

ఉత్ఖేపకగ్రంథిభేదా కరనందంశ హీనకౌ.

 కార్యౌ ద్వితీయా పరాధే కరపాదైక హీన

భక్తావధాశాగ్న్యుదక మంత్రోపకరణ వ్యయాన్.

దత్వా చౌరస్య హన్ తుర్వా జానతోదమ ఉత్తమః

శస్రావపాతే గర్భస్యపాతనే చోత్తమోదమః.

 ఉత్తమోవాఽధమో వాపి పురుషస్త్రీ ప్రమాపణే

శిలాం బద్ధ్వాక్షి పేదప్సు నరఘ్నీం విశదాం స్త్రియమ్.

చోరుని అపహరించబడి ధనమును బట్టి గాని, ఆతని పద చిహ్నము ను బట్టీగాని, రాజభటుని పట్టుకొని వలెను. పూర్వము ఆపరాధముచేసినవానిని ఆశుద్దమైన నివాసము కలవానిని, తమజాతి నామము, మొదలగువాటిని కప్పి పచ్చువారిని శంకచే బందీలుగా పట్టుకొనవచ్చును. ద్యూతము, స్త్రీ, పానము ఈ వ్యసనములు కలవారును ప్రశ్నించగ ఎండిపోయిన ముఖముగలవారును, కంఠస్వరము మారిపోయిన వారును, ఇతరుల ద్రవ్య గృహాదులనుగూర్చి ప్రశ్నించు వారును, రహస్యముగ సంచరించు వారును, ఆదాయము లేకున్నను వ్యయము చేయు వారును, వష్టమైన ద్రవ్యములను అమ్ము వారును చోరులుగా బంధింపబడవలెను. చౌర్యశంకచే పట్టుకొనబడినవాడు తాను నిరపరాధియని నిరూపించుకౌనజాలనిచో వానిచే అపహృత ద్రవ్యమును ఇప్పించి వానిని చోరచండముచే శిక్షించవలెను. అపహృగ ధనమును ఇప్పించి అనేక విధములు వానిని కొట్టించవలెను. చౌర్యము చేసినవాడు బ్రాహ్మణుడై నచో వానినుదుట గుర్తు వేసి రాజ్యమునుండి బహిష్క రించవలెను. గ్రామములో ఎవరినై న కొట్టినన, ధనము అపహరింపబడినను, ఆపరాధి జాడలు తెలియనపుడు ఆ గ్రామాధి పతి దోషము. ఆతడే చోరునిపట్టి రాజుకు అప్పచెప్పవలేను. చోరుడు ఏ గ్రామ మునకు పారిపోయెనో ఆచ్చట వాని గుర్తు తెలిసి ఆతడు చౌర్యము చేసిన గ్రామము యొక్క అధిపతి ఒప్పచెప్పవలెను. కోకడు దూర మును బయ వున్న పుద గ్రామాధికారిగాని, దశ గ్రామాధికారిగాని, ఆశ్వగజాద్యపహారులకును ఇతరులను చంపినవాని పట్టి కూ ము పై గుచ్చి చంప వలేను. ఏదైన వస్తువును ఎత్తుకొని పోయినవానికిని పెట్టే బద్దలుకొట్టిన వానికిని వరుసగ బొటనవ్రేమ, తర్జని, ఖండించ వలేను. ఆ అపరాధము రెండవసారి చేసి చో ఒక హస్తము, ఒక పానము ఖండించవలేను. చోరునికిగాని, మాతను,నను. గాని తెలిసికూడ భోజనము, అగ్ని, జలము, ఇతర ఉపకరణము 2 ఆలోచన, మార్గవ్యయము ఇచ్చినదానికి ఉత్తమ సాహస దండన విధించవలెను. ఇతరుల శరీరముపై ఆయుధమ ప్రయోగించినను, గర్భపాతనము చేయించినను ఉత్తమ దండము ఎవరినైన పురుషునిగాని, స్త్రీనిగాని చంపినపుడు వానికి ఉత్తమ సాహస దండముగాని, ఆధమ సాహసదండముగాని వాని శీలాచారములనుబట్టి ఇవ్వవలెను. పురుషుని చంపి స్త్రీని, విషమును ఇచ్చిన స్త్రీని మెడలకు రాయికట్టి నీళ్లలో పడవేయవలెను.

విషాగ్నిదాం నిజగురు నిజాపత్య ప్రమాపణీమ్

 వికర్ణ కరనా సౌష్టిం కృత్వాగోభిః ప్రమాపయేత్.

 క్షేత్ర వేశ్మవనగ్రామ వివీతఖల దాహకాః

రాజపత్న్యభిగామీచ దద్గవ్యాస్తు కటాగ్ని నా.

 పుమాన్సం గ్రహణే గ్రాహ్యః కేశా కేశి పర స్త్రియాః

స్వజాతా వుత్తమో దండ ఆనులో మ్యేతు మధ్యమః.

ప్రాతిలో మ్యేవధః పుంసాం సర్యాః కర్ణావ కర్తనమ్

నీలీ స్తన ప్రావరణ నాభి కేశావమర్థనమ్.

 ఆదేశ కాల సంభాషం సహా వస్థాన మేవచ

 స్త్రీని షేధ శతం దద్యాద్ద్విగతంతు దమంపుమాన్.

 ప్రతి షేధే తయోర్దండో యథాసంగ్రహణే తథా

పశూర్ణచ్ఛంశ్ఛతం దాప్యో హీనాం శ్రీంగాశ్చ మధ్యమమ్.

ఆవరుద్దాసు దాసీషు భుజిష్యాను తథైవచ

గమ్యాన్వపి పుమాన్దాప్యః పంచాశతృణీకందమమ్.

 ప్రసహ్య దాస్యభిగమే దండోదశపణస్మృతః

కుబంధేనాంక్య గమయేదంత్యా ప్రవజిలాగమే.

 న్యూనం వ్యాధికం వాపి లిఖేద్యోరాజశాసనమ్

పారదారిక రం వా మంచతో దండ ఉత్తమః.

 ఆభ క్షెర్దూషయనిప్రం దండముత్తమ సాహసమ్

కూటస్వర్ణ వ్యవహారీ విమాంసస్య చ విక్రయీ.

 అంగహీనశ్చ కర్తవ్యో దాప్యశోత్తమ సాహసమ్

శక్తోహ్యమోక్షయన్ స్వామీ దంష్ట్రిణః శృంగణ స్తథా

ప్రథమం సాహసం దద్యాద్వికృష్ణ ద్విగుణం తథా

అచౌ (జా) రం చౌరేభి వదస్థాప్యః పంచశతందమమ్.

రాజోఽనిష్టప్రవక్తారం తస్యైవాక్రోశకం తథా

మృతాంగ లగ్న విక్రేతుర్గురోస్తాడయితు స్తథా.

 తన్మంత్రస్య చ భేత్తారం చిత్త్వా జిహ్వాం ప్రవాసయేత్

రాజయానాసనా రోడుర్ధండో మధ్యమ సాహసకి.

ద్వినేత్ర భేదినో రాజద్విష్టా దేశ కృత స్తథా

విప్రత్వేన చ శూద్రస్య జీవితో ఽష్ట శతోదము.

 యోమన్యేతా జితోఒస్మీతి న్యాయేనాపి పరాజితః

 తామాయా న్తం పునర్జిత్వా దండయేద్ద్విగుణం దమమ్.

 రాజైన్యాయేన యో దండో గృహీతో వరుణాయతమ్

 నివేద్య దద్యాద్వి ప్రేభ్యః స్వయం త్రింశద్గుణీ కృతమ్.

 ధర్మశ్చార్థశ్చ కీర్తిశ్చ లోకం క్తిరుపగ్రహః

ప్రజాభ్యో బహుమానంచ స్వర్గస్థానం చ శాశ్వతమ్

పశ్యతో వ్యవహారాంశ్చ గుణాఃస్యుః సప్తభూపతేః

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వాక్పారుష్యాది ప్రకరణం నామాష్ట పంచాశ దధిక ద్విశతత మోఽధ్యాయః.

విషము పెట్టిన దానికిని, దహనము చేసిన స్త్రీ కిని తనకు పూజ్యుడైనవారిని, సంతానమును చంపి స్త్రీ కనీ, హస్తములు ముక్కు చెవులు ఖండించి ఎద్దులచే చంపించవలెను. పొలములను, గృహములను, వనములను, గ్రామములను వినీత ములను, కళ్లములను కాల్చిన వారిని, రాజు భార్య సంగ ముచేసినవారిని ఊక నిప్పతో కాల్చిచంపవలేను. కేశ గ్రహణపూర్వకముగ పర స్త్రీని సంగ్రహించిన వాడు స్వజాతియైనచో ఉత్తమ దండము, అనులోమ్యము అయినచో మధ్యమదండము పొందఅర్హుడు. ప్రాతిలో మ్యము అయినచో పురుషుని చంపవలెను. స్త్రీకి చెవులు కోయవలెను. పర స్త్రీ యొక్క వస్త్రముకట్టుముడి స్తనములు, కంచుకం, నాభికేశములను స్పృశించిన వానిని అనుచిత దేశ కాలములందు సంభాషణము చేయువానిని, ఒకే ఆసనముపై కూర్చున్న వానిని వ్యభిచార దోషమునకై దండించవలెను. వలదన్నను సంభాషణాదులుచేసిన స్త్రీకి నూరు పణములు, అట్టి పురుషునకు రెండువందల పణములు దండమ. నిషేధించినను వారిరువురును సంభాషణాదులు చేసినచో వ్యభిచాగముచేసినచో ఎట్టి దండమో అట్టి దండను. పశుసంగమము చేసినవానికి నూరుపణముల దండము. నీచస్త్రీ సంగమము, గో సంగమము చేసినవానికి మధ్యమ సాహసడండము. కొనబడినస్త్రీలు, దాసీత్రీలు, ఉంచుకొన్న స్త్రీలు, గమ్యంగుస్త్రీలు, వీరితో సంగమము చేసిన పురుషునక ఏబది పణముల దండము. బలాత్కరించి దాసీ సంగమము చేసినవానికి పది పణ వంటి దండము. అంత్యజాతి స్త్రీతోడను, సన్యాసితోడను సంగమముచేసిన వాని లలాటమున భగ చిహ్నమంచి దేశమునుండి పారద్రోలవలెను. రాజ శాసనమును న్యూనముగాగాని, అధికముగా గానీ వ్రాయువానికిని వ్యభిచారిని, చోరుని విడిచి పెట్టిన వానికిని ఉత్తమ సాహసదండము. బ్రాహ్మణునిచే ఆభక్షములు తినుపించు వానికి ఉత్తమ సాహసదండము. కల్తీ బంగారము అమ్మవానికిని చెడ్డ మాంసము అమ్మవానికిని ఆంగములు ఖండించి ఉత్తమ సాహసదఁడము విధించవలెను. సామర్థ్యమున్న ను కోరలు, కొమ్ములు గల తన పశువులచే పీడింపబడుచున్న వానిని విడిపింపని పశుస్వామికి ప్రథమ సాహసడండము. ఆక్రమించిన వాడు ఏడ్చుచున్నను విడిపించనిచో రెట్టింపు దండము. చోరుడుకానివానిని చోరుడని చెప్పినవానికి ఐదువందల పణముల దండము. రాజునకు ఆప్రియముపలుహనికిని రాజనించకులకును మరణించినవాని శరీరమునందలి వస్త్రాదులను అమ్ము వానికిని గురువును కొట్టిన వానికని రాజమంత్రమును ప్రకటించిన వానికిని నాలుక కోసి దేశమునుండి బహిష్క రించవలెను. రాజు యొక్క వాహనమును ఆసనమును కూర్చున్న దానికి మధ్యమ సాహసదండము. రెండు నేత్రములను పీకి వేసిన వానికిని, రాజ శత్రువుల ఆజ్ఞను నిర్వహించు వానికిని బ్రాహ్మణ వేషముతో జీవించు శూద్రునకు ఎనిమిది వందలపణముల దండ ము. న్యాయానుసారము పరాజితుడై నను, పరాజి కుడను కాను అని చెప్పుచు, వచ్చి చో వానిని మరల జయించి రెట్టింపు ధనము దండము విధించవలెను రాజు ఆన్యాయముగ దండము విధించి, ధనము తీసుకొన్నచో దానిని వరుణునకు నివేదించి దానిని ముప్పది రెట్లు చేసి బ్రాహ్మణు నికు ఇవ్వవలెను. ధర్మపూర్వకముగ, లోక వ్యవహార ములు చూచు రాజునకు ధర్మము, ఆర్థ ము, కీర్తి లోక పంక్తి ఆర్థసంగ్రహము ప్రజాగౌరవము శాశ్వత స్వర్గ నివాసము అను ఏడు గుణములు లభించును.

అగ్ని మహాపురాణమునందు “వాక్పారుష్యాది” ప్రకరణమను రెండువందల యేబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.