అగ్ని మహా పురాణము

45 - అథపిణ్డికాది లక్షణమ్

భగవానువాచః-

 పిణ్డికాలక్షణం వక్ష్యే దైర్ఘ్యేణ ప్రతిమాసమాః

 ఉచ్ఛాయే ప్రతిమార్ధం తు చతుః షష్టిపుటాంచతామ్.

త్యక్త్వాప జిద్వయం చాధ సదూర్వం యత్తు కోష్టకమ్

సమక్తాదుభయోః పార్శ్వే అ నస్థం పరిమార్జయేత్ .

ఊర్ధ్వం ప ద్వయం త్యక్త్వా ఆధస్తాద్యత్తు కోష్ఠకమ్

అనః సంమార్జయేద్యత్నాత్పార్శ్వయోరుభయోః సమమ్.

తయోర్మధ్యగతా తత్ర చతుష్కామార్జయేత్తతః

చతుర్ధా భాజయిత్వాతు ఊర్ధ్వప జ్కిద్వయంబుధః.

మేఖలా భాగమాత్రాస్యాత్ ఖాతం తస్యార్ధమానతః

భాగం భాగం పరిత్యజ్య పార్శ్వయోరుభయోః సమమ్.

దత్త్వానైకం పదం బా హ్యే ప్రమాణం కారయేద్బుధః

త్రిభాగేన చ భాగస్వాగ్రే స్యాతోయనిర్గమః.

హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా! ఇపుడు నేను పిండిక లక్షణము చెప్పెదను పిండిక పొడవు ప్రతిమతో సమానముగ నుండును. ఎత్తు మాత్రము ప్రతిమలో సగముండును. పిండికకు అరువది నాలుగు కోష్టకము లేర్పరచి, క్రింది రెండు పంక్తులు విడచి, దాని పైన ఉన్న కోష్టము నాలుగు వైపుల, రెండు పార్శ్వములందును. లోపలి నుండి తుడిచి చేయవలెను. అట్లే పై రెండు పంక్తులు విడచి దాని క్రిందనున్న కోమ్లమును లోపలినుండి తుడిచి వేయవలెను. ఈ విధముగ రెండు పార్శ్వములందును చేయవలెను. రెండు పార్శ్వముల మధ్యనున్న రెండు రెండు చతుష్కములనుగూడ తుడిచిశ్రీమదగ్ని మహాపురాణము వేయవలెను. పిమ్మట దానిని నాలుగు భాగములుగా విభజించి పై రెండు పంక్తులను మేఖలగా గ్రహించి, దాని ప్రమాణ ములో సగము ప్రమాణముండునట్లుగ దాని యందు గొయ్యి తవ్వవలేను. రెండు పార్శ్వ భాగములందును సమానముగ ఒక్కొక్క భాగము విడచి జైటపదమును నాలి (తూము) నిర్మించుటకై విడువవలెను. దానియందు తూమునిర్మింపవలెను. మూడు భాగములోని ఒక భాగమునకు ముందు నీరు ముందుకు పోవుట కి మార్గముండవలెను.

నానాప్రకారభేదేన భద్రేయం పిణ్డికా శుభా

 ఆష్టతాలాతుకర్తవ్యా దేవీ లక్ష్మీ స్తథా స్త్రియః.

భ్రువో యవాధికే కార్యేయవహీనాతు నాసికా

గోల కేనాధికం వక్రమూర్ధంతిర్యగ్వివర్జితమ్.

ఆయతే నయనే కార్యే త్రిభాగోనై ర్యవై త్రిభిః

తదధేన తు వైపుల్యం నేత్రయోః పరికల్పయేత్.

కర్ణపాధిక కి కార్యః సృక్విణీ సమసూత్రతః

నమంక లావిహీనం తు కుర్యాదం శద్వయం తథా.

గ్రీవాసార్ధకలా కార్యా తద్విస్తారోపశోభితా

నేత్రం వినాలు విస్తారో ఊరూజానూచ పిజ్జికా.

అజ్ఞోపృపౌసిదౌ కట్యాం యథాయోగం ప్రకల్పయేత్

సప్తాంశోనా స్తథాఱుల్యో దీర్ఘవిషమృనాహతమ్.

నేత్రోకవర్జితా యామాజజోరుశ్చతథాక టిః

మధ్యపార్శ్వం తు యద్వృత్తం ఘనం పినం కుచద్వయమ్.

తాలమాత్రా స్త నౌ కార్యొకటిః సార్ధకలాధికా

లక్ష్మ శేషం పురావల్సాద్ధక్షిణే చామ్బుజంక రే.

వామే బిల్వం స్త్రియా పార్శ్వే శుభేచామరహ స్త్రకే

దీర్ఘకోణస్తు గరుడశ్చక్రాజ్గా ద్యానధోపదే.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే పిణ్డికాది లక్షణం నామ పఞ్చచత్వారింశోధ్యాయః.

వివిధాకారముగల ఈ పిండికకు “భద్ర” అని పేరు. లక్ష్మిదేవి ప్రతిమ ప్రమాణము ఎనిమిది జానలుండవలెను. ఇతర దేవుల ప్రతిమలు కూడ ఇల్లే ఉండవలెను. రెండుకను బొమ్మలును నాసిక కంటే ఒక యవ ఆధికముగా ఉండవలెను. వాసిక వాటి కంటే ఒక యవ తక్కువ ఉండవలెను. ముఖ గోలకమ నేత్ర గోలకముకంటే పెద్దదిగా ఉండవలెను. ఆది ఎత్తుగాను, వంకర టింకరగాను ఉండకూడదు. నేత్రములు పెద్దవిగా మూడును పావుయవన ప్రమాణములో నుండ వలెను. ముఖము పొడవు ఒక కోణము నుండి మరియొక కోణమువరకు ఎంత ఉండునో సూత్రముతో కొలిచి కర్ణ పాశము అంత ఉండునట్లు చేయవలెను. దాని పొడవు పైన చెప్పిన సూత్రము - కంటే కొంచెము ఎక్కువ పొడవే ఉండవలెను. రెండు స్కంధములు కొంచెము వంగి ఒక కల తగ్గినట్లు చేయవలెను. కంఠము పొడవు ఒకటిన్నర కళల పొడవుండవలెను. వెడల్పు కూడ అంతలో ఉండవలెను. రెండు ఊరువుల విస్తారము కంఠము కంటే ఒక నేత్రము తక్కువ ఉండవలెను. మోకాళ్ల చిప్పలు, పిండలి, పాదములు, పీఠము, నితంబము, కటిభాగము మొదలగు వాటిని యథా యోగ్యమగ కల్పింప వలెను.

చేతి వేళ్లు పెద్దవిగా ఉండవలెను. పరస్పరావరుద్ధములు కాకూడదు. పెద్ద వ్రేలి కంటే చిన్న ప్రేళ్ళు ఏడవ వంతు తక్కువ ఉండవలెను. పిక్కలు, తొడలు, కటి-వీటి పొడవు క్రమముగ ఒక్కొక్క నేత్రను తక్కువ ఉండవలెను. శరీర మధ్య ప్రాంతము గుండ్రంగా ఉండవలెను. కుచములు దగ్గరగా బలిసి ఉండవలెను. స్తనములు జానెడు ఉండ వలేను. కటి ప్రదేశము వాటికంటే ఒకటిన్నర కలలు పెద్దదిగా ఉండవలెను. మిగిలిన చిహ్నములన్నియు వెనుకటివలెనే. లక్ష్మికి కుడిచేతిలో కమలము, ఎడమచేతిలో బిల్వఫలము ఉండవలెను. చామరము ధరించిన స్త్రీలు ఆమె పార్శ్వ లందు నిలిచి ఉండవలెను. పెద్ద ముక్కుగల గరుత్మంతుడు ఎదుట నిలిచి ఉండవలెను. ఇపుడు చక్రాంకిత (సాలగ్రామాది) మూర్తులను గూర్చి చెప్పెదను.

ఆగ్నిపురాణమునందు పిండికాది లక్షణమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.