అగ్ని మహా పురాణము

103 - అథ జీర్ణోద్ధారవిధిః.

ఈశ్వర ఉవాచః-

 జీర్జాదీనాం చ లిజ్గానాముద్గారం విధినా వదే

 లక్ష్మో జీతం చ భగ్నం చ స్థూలం వజ్రహతం తథా.

సంపుటం స్ఫుటితం వ్యజ్గం లిజ్గమిత్యేవమాదికమ్

ఇత్యాదిదుష్టలిజ్ఞానాం యోజ్యా పిండి తథా వృషః.

చాలితం చలితం లిజ్ఞమత్యర్థం విషమస్థితమ్

దిక్మూడం పాతితం లిజ్జం మధ్యస్థం పలితం.

ఏవంవిధం చ సంస్థాప్య నిర్వణం చ భవేద్యది

నద్యాదికప్రవా హేణ తదపాక్రియతే యది.

తతోన్యత్రాపి సంస్థాప్య విధిదృషైన కర్మణా

సుస్థితం దుఃస్థితం వాపి శివలిఙం న చాలయేత్.

శతేన స్థాపనం కుర్యాత్సహ సేణ తు చాలనమ్

పూజాదిభిశ్చ సంయుక్తం జీర్ణాడ్యమపి సుస్థితమ్.

 యామ్యే మణ్డకడితే పో ప్రత్యర్టోకరైక తోరణమ్

విధాయ ద్వారపూజాది స్పష్టాలే మనవజనమ్.

మక్రాన్ సంతర్పణ్ణి సంపూజ్య వాస్తుదేవాంస్తు పూర్వవత్

దిగ్బలిం చ బహీర్దత్వా పమాచమ్య స్వయం గిరూ.

బ్రాహ్మణాన్ లోజులుత్వా తు కమ్ళుం విజ్ఞాపయేత్తతః

దుష్టలిమిదం శమ్భోః శాన్తరుద్ధరణన చేత్.

జీర్ణోద్ధార విధికి రుచి గ్రవాదివిధినా అధితిష్ఠస్వ మాం శివ

 ఏవం విజ్ఞాఫ్యదేవేశం శాస్తిహోమం సమాచరేత్.

మధ్వాణ్యక్షర దూర్వాభిర్మూలేనాష్ట్రాధికం శతమ్

తతో లిజ్గం చ సంస్థావ్య పూజయేత్స్థణ్డిలే తథా.

పరమేశ్వరుడు చెప్పెను : స్కందా! జీర్ణాదిలింగము, శాస్త్రీయోద్ధారక్రమమును గూర్చి చెప్పెదను : చిహ్నములు అరిగిపోవుట, బద్ద లగుట, మాలిన్యాదుచే స్థూల మగుట, వజ్రాహతమగుట, సంపుటిత మగుట, విరిగిపోవుట, అంగభంగము ఏర్పడు ఇట్టి దోషము లేర్పడిన లింగము పిడులను, వృషభమును వెంటనే త్యజించ వలెను. శివలింగమును ఎవరైన చలింపచేసినను, స్వయముగా ఆది చలించినను, చాల క్రిందికి దిగిపోయినను, విషమస్థానస్థిత మైనను, దిష్మోహ మున్నను, ఏ కారణముచేతనైన క్రింద పడి చను, లేదా మధ్యనే ఉన్న ను జారిపోయినను దానిని మరల స్థాపించపలెను. అది ప్రణరహిత మైననే ఆట్లు స్థాపించవలెను. నదీజలముచే కొట్టుకొనిపోయిన శివలింగమును గూడ మరల స్థాపన చేయవచ్చును. సుదృఢముగా నున్న శివలింగమును దాని స్థానమునుండి కదల్చగూడదు. అస్థిర మైన శివలింగమును చలింపచేసినచో, శాంతినిమిత్తమై వెయ్యి హోమములను, పునఃస్థాపనార్ధమై నూరు హోమములను చేయవలెను. శివలింగము జీర్ణతానిదోషయుక్త మైనను, దానికి నిత్యపూడ్డాదికము జరుగుచున్న చో దావిని కదల్చకూడదు. జీర్ణోద్గారార్థమే దక్షిణమునగాని ఈశాన్యమున గాని ఒక మండపము ఏర్పరచి, పశ్చిమమున ఒక ద్వార మేర్పరుపవలెను. ద్వారపూజాద్యనంతరము, వేదిక పై శివపూజ చేయవలెను. మంత్రపూజా తర్పణానంతరము అనుకటి వలే వాస్తుపూజ చేయవలెను. పిదప గురువు, బైటకు వెళ్లి, భూతబలి ఇచ్చి, ఆచమనము చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. పిదప శివునితో ఈ విధముగ నివేదించవలేను- “శంభూ! ఈ లింగము దోషయుక్త మైపోయినది. దీనిని ఉద్దరించినచో శాంతికలుగు నని నీవే చెప్పియున్నావు. అందుచే యథావిధిగా ఈ కార్యము చేయబడుచున్నది. శివా! నీవు నాలో ఉండి, ఈ కార్యమును సుసంపన్నము చేయుము.” శివునితో ఈ విధముగా విజ్ఞాపన చేసి, మధుమృతమిశ్ర మగు పాయసముతోను, దూర్వలతోను, మూలమంత్రముతో నూటఎనిమిది హోమములు చేసి, శాంతిహోమము కూడ పూర్తి చేయవలెను. పిదప లింగమునకు స్నానము చేయించి వేదిక పై దానికి పూజ చేయవలెను.

ఓం వ్యాపకేశ్వరాయేతి నాత్యనం శివవాహినా

ఓం వ్యాపకం హృదయేశ్వరాయ నమః.

ఓం వ్యాప కేశ్వరాయ శిరసే నమః ఇత్యాద్యంగమన్రాః

తత స్తతాశ్రితం తత్వం శ్రావయేదశ్రమ వ్రతః.

నత్వః కోపీహ యః కోపి లింగమాశ్రిత్య తిష్ఠతి

లింగం త్యక్త్వా శివాజ్ఞాభిర్యత్రేష్టం తత్ర గచ్ఛతు.

విద్యావిద్యేశ్వరై ర్యుక్తః స భవోఽత్ర భవిష్యతి

సహస్రం ప్రతిభాగే చ తతః పాశుపతాణునా.

హుత్వా శాన్యమ్బునా ప్రోక్ష్య స్పృష్ట్వా కుశైర్ల పేత్తతః

దత్త్వాక్యం చ విలోమేన తత్త్వతత్వాధిపాం స్తథా.

అష్టమూర్తీశ్వరాన్ లింగపిజ్జికానంస్థితాన్ గురుః

వీనృజ్య స్వర్ణపొశన వృషసనస్థయా తథా.

రజ్ఞా బద్ధ్వా తయా నీత్వా శివదనం గృణళ్ఛనైః

తజలే నిక్ష పేన స్త్రీ పుష్ట్యర్థం, జుహూచ్ఛతమ్.

తృప్తయే దిక్పతీనాం చ జాస్తుశధ్యై శతం శతమ్

రక్షాం విధాయ తద్దామ్నీ మహాపాశుపతాస్త్రత.

లిజమన్య త్తత స్తత్ర విధివత్ స్థాపయేద్దురుః

ఆసుడైర్మునిభిక్టోతె స్తననిధిః ప్రతిష్ఠితమ్.

తీర్ణం వా ప్యథవా భగ్నం విధినాఫి న బాలయేత్

ఏష ఏవ విధిః కార్యో జీర్ణదామసముద్రతో.

ఖడ్గే మనగణం న్యస్య కారయేననిరాస్తరమ్

సంకోచే మరణం ప్రోక్తం విస్తారే తు ధనశయః.

తద్ద్రవ్యం షద్రవ్యం వా తత్కార్యం తత్రమణకమ్

ఇత్యాధి మహాపురాణే ఆగ్నేయే జిర్ణో విధిర్నమ త్య్రధికశతతమోధ్యాయః.

 పూజ “వ్యాపకేశ్వరాయ శివాయ నమః” అను మంత్రము ఉచ్చరించుచు చేయవలెను. “ఓం వ్యాపకేశ్వరాయ హృదయాయ నమః” “ఓం వ్యాపకేశ్వరాయ శిరసే నమః” ఇత్యాదులు అంగమంత్రములు. పిదప అస్త్రమంత్రము ఉచ్చ రించుచు శివలింగము ఆశ్రయించి యున్న భూతముతో “ఏదైన భూతము ఈ శివలింగమును ఆశ్రయించి ఉన్నచో, అది శివాజ్ఞ ప్రకారము, ఈ లింగమును విడచి, తన కిష్టము వచ్చిన చోటునకు పోవలెను. విద్యా విద్యేశ్వరులతో భగవంతు డైన శివుడు ఇచట నివసింపనున్నాడు” అని చెప్పవలెను. పాశుపతమంత్రముతో ఒక్కొక్క భాగమునకు వేయి చొప్పున హోమములు చేసి, శాంతిజలముతో ప్రోక్షణము చేయవలెను. కుశలతో స్పృశిచి పై మంత్రమును జపించవలెను. పిదప గురువు, విలోమక్రమముతో ఆర్ఘ్య మిచ్చి లింగముపైనను, 'పిండికయందును, ఉన్న తత్త్వములను, తత్త్వాధిపతులను, ఎనమండుగురు మూర్తీశ్వరులను స్వర్ణపాశమునుండి విస్తరింపచేసి, వృషభము భుజముపై నున్న రజ్జువుచే పట్టి తీసికొని పోయి, జనసముదాయముతో కూడ శివనామసంకీర్తనము చేయుచు, ఆ వృషభమును నీటిలో పడవేయవలెను. మంత్రజు డైన ఆచార్యుడు పుష్టికొరకై నూరు హోమములు చేయవలెను. దిక్పాలకుల తృప్తి కొరకుకు, వాస్తుశుద్ధి కొరకును గూడ నూరేసి హోమములు చేయవలెను.

పిదప మహాపాశుపత మంత్రముతో ఆ దేవాలయమునందు రక్షణము ఏర్పాటు చేసి, అచట విధిపూర్వకముగ మరి యొక లింగమును స్థాపించవలెను. ఆసురులు, మునులు, దేవతలు, తత్త్వవేత్తలు స్థాపించిన లింగము జీర్ణ మైనను, భగ్న మైనను, దానిని యథావిధిగా కూడ కదల్చరాదు. జీర్ణదేవాలయోద్ధార విషయమునందు గూడ ఈ విధినే అవలంబించ వలెను. ముత్రగణములను ఖడ్గమునందు న్యాసము చేసి, మరొక ఆలయము నిర్మించవలెను. దానిని మొదటి దాని కంటే చిన్నది చేసినచో కర్త మరణించును. పెద్దది చేసినచో ధనహాని కలుగును. అందుచే వెనుకటి ఆలయమునందలి వస్తువులతో గాని, మంచివైన ఇతర వస్తువులతో గాని, ఆ స్థానమునందు, మొదటి ఆలయము ఎంత ఉండెడిదో అంత ఆలయమే నిర్మించవలెను.

అగ్ని మహాపురాణమునందు జీర్ణోద్ధార విధి యను నూటమూడవ అధ్యాయము సమాప్తము.