పుష్కర ఉవాచః
సర్వయాత్రాం ప్రవక్ష్యామి రాజధర్మ సమాశ్రయాత్ ।
ఆ స్తఙ్గతే నీచగతే వికలే రిపురాశిగే.
ప్రతిలోమే చ విధ్వస్తే శుక్రేయాత్రాం విసర్జయేత్ ।
ప్రతిలోమే బుధేయాత్రాం దిక్పతౌచ తథాగృహే.
వైధృతౌ చ వ్యతీపాతే నాగేచ శకునౌ తథా ।
చతుష్పాదేచ కింస్తు ఘ్నే తథా యాత్రాం వివర్జయేత్.
విపత్తా రేనై ధనే చ ప్రత్యరౌ చాథ జన్మని ।
గండే వివర్జయేద్యాత్రాం రిక్తాయాంచ తిథావపి.
పుష్కరుడు పలికెను : ఇపుడు రాజ ధర్మానుసారము ఆందరి యాత్రను గూర్చి చెప్పెదను. శుక్రుడు అస్తంగతుడై నపుడును, నీచస్థావములో నున్న పుడును, వికలాంగుడై నపుడును, శత్రురాశిలో నున్న పుడును, ప్రతికూల స్థానమునందున్నపుడును, యాత్రచేయకూడదు. బుధుడు ప్రతికూల స్థానమునందున్నపుడును, దిక్కు అధిపతి గూడ ప్రతికూల స్థానమునందున్న పుడును యాత్ర చేయగూడదు. వైధృతి - వ్యతీపాత - నాగ - శకుని - చతుష్పాద - కింస్తుఘ్న యోగము లందును, విపత్ - మృత్యు-ప్రత్యరి - జన్మతార లందుచు, గండ యోగమునందును, రిక్త తిథులందును యాత్ర చేయగూడదు.
ఉదీచీ ర తథాప్రాచీ తయారైక్యం ప్రకీర్తితమ్ ।
పశ్చిమ దక్షిణాయా దిక్తయోరైక్యం తథైవచ.
వాయ్వగ్ని దిక్సముద్భూతం పరిమంనతులంఘయేత్ ।
ఆదిత్యచంద్రసౌరాస్తు దివసాశ్చ నశోభనాః.
కృత్తికాద్యాని పూర్వేణ మఘాద్యానిచ యామ్యతః ।
మైత్రాద్యాన్యపరే చాథ వాసవాద్యాని వాప్యుదక్.
సర్వద్వారాణి శస్తానిచ్ఛాయామానం వదామితే ।
ఉత్తర - పూర్వదిక్కులును, పశ్చిమ – దక్షిణ దిక్కులును ఒక్కటేనని చెప్పబడినది. వాయవ్యము నుండి ఆగ్నేయము వరకును ఉండు పరిధి దండమును దాటి యాత్ర చేయగూడదు. భాను - సోమ - శనివారములందు యాత్ర చేయగూడదు. కృత్తిక మొదలు ఏడు నక్షత్ర సమూహములు తూర్పునందును మమ మొదలు ఏడు నక్షత్రములు దక్షిణము నందును, అనూరాధ మొదలగు ఏ నక్షత్రములు పశ్చిమమునందును ఉండును. ధనిష్టాదులగు ఏడు నక్షత్రములు ఉత్తరము నందుండును. పైన చెప్పిన నక్షత్రములు ఆయా దిక్కులకు ద్వారములు. ఆయా దిక్కులకు ఆద్వారము లన్నియు ఉత్తమములు. ఇపుడు ఛాయామానమును గూర్చి చెప్పెదను.
అదిత్యే వింశతిర్జ్ఞేయా చంద్రే షోడశ కీర్తితాః.
భౌమేపంచదశై వోక్తాశ్చతుర్దశ తథాబుధే ।
త్రయోదశ తథా జీవే శుక్రే ద్వాదశ కీర్తితాః.
ఏకాదశ తథాసౌరే సర్వకర్మసుకీర్తితాః ।
జన్మలగ్నే శక్రచాపే సమ్ము ఖేన వ్రజేన్నరః.
శకునాదౌ శుభేయాయాజ్జయాయ హరిమాన్మరన్।
రవి వరమున ఇరువది, సోమవారమున పదునారు, మంగళవారమున పదు నేను, బుధవారమున పదమూడు, శుక్రవారమున పండ్రెండు, శనివారమున పదకొండు అంగుళముల ఛాయామానము చెప్పబడినది. ఇవి అన్ని కర్మలకును విహితములు. జన్మ లగ్నమునందును ఎదుట ఇంద్రధనుస్సు ఆవిర్భవించినపుడును యాత్రచేయగూడదు. శుభశకునాదులు కనబడిన పిమ్మట శ్రీమహావిష్ణువును స్మరించుచు యాత్ర చేయవలెను.
వక్ష్యే మండల చిన్తాంతే కర్తవ్యం రాజరక్షణమ్.
స్వామ్యమాత్యం తథాదుర్గం కోదండ స్తథైవచ ।
మిత్రం జన పదశ్చైవ రాజ్యంసప్తాఙ్గముచ్యతే.
సప్తాఙ్గస్యతురాజ్యస్య విఘ్నకర్తౄన్వినాశయేత్ ।
మండలేషు చ సర్వేషు వృద్ధిః కార్యామహీక్షితా.
ఆత్మ మండలమేవాత్ర ప్రథమం మండలంభ వేత్ ।
సామంతా స్తస్య విజ్ఞేయారిపవోమండలస్యతు.
ఉపేతస్తు సుహృజ్జ్ఞేయః శత్రుమిత్రమతః పరమ్ ।
మిత్రమితం తతోజ్ఞేయం మిత్రమిత్రరిపు స్తతః.
ఏతత్పురస్తాత్కథితం పశ్చాదపినిబోధమే ।
పార్ష్ణిగ్రాహ స్తతః పశ్చాత్తతస్త్వాక్రన్ ధ ఉచ్యతే.
ఆసారస్తు తతోఽన్యః స్యాదాక్రన్ ధాసార ఉచ్యతే ।
జిగీషోః శత్రుయుక్తస్య విముక్తస్య తథాద్విజ.
నాత్రాపి నిశ్చయః శక్వోవక్తుం మనుజపుఙ్గవ ।
నిగ్రహాను గ్ర హే శక్తః మధ్యస్థ పరికీర్తితః.
నిగ్రహాను గ్ర హే శక్తః సర్వేషామపి యో భవేత్ ।
ఉదాసీనః సకథితో బలవన్పృథివీపతి.
న కస్య చిద్రిపుర్మిత్రం కారణాచ్చ త్రుమిత కే ।
మండలం తవ సంప్రోక్తమేతద్ద్వాదశ రాజకమ్.
పరశురామా! ఇపుడు మండల విచారమును గూర్చి చెప్పెదను. సర్వవిధముల రాజును రక్షించవలేను. రాజు, మంత్రి, దుర్గము, కోశము, దండము, మిత్రులు, జనపదము- ఇవి రాజ్యము యొక్క సప్తాంగములు. ఈ సప్తాంగ రాజ్యమునకు విఘాతము కలిగించు వారిని సంహరించవలేను. రాజు తన మండలములనన్నింటిని వృద్ధిపొందించుకొనవలెను. అన్నింటికంటే తన మండలము మొదటిది. ఆ మండలమునకు సామంతరాజులే శత్రువులు. 'విజిగీషు' వగు రాజునకు తన మండలమునకు ఎడటి సీను (సరిహద్దు) యందున్న సామంతుడు శత్రువు. ఆ శత్రువు రాజ్యముతో ఎవనికి సరిహద్ద ఉన్నదో ఆతడు ఆశత్రువునకు శత్రువగుటచే విజిగీషువు నకు మిత్రుడు. ఈ విధమున విజిగీషుని మండలమునకు ఎదుట శత్రువు, మిత్రుడు, అమిత్రుడు, మిత్రమిత్రుడు, అరిమిత్రమిత్రుడు అని అయిదుగురు ఉందురు. ఇపుడు వెనుక నున్న వారినిగూర్చి వినుము. వెనుక నున్న వారిలో మొదటివాడు "పార్ష్ణిగ్రాహుడు". వాని వెనుక నున్న వాడు "ఆక్రందుడు". ఆ ఇద్దరి వెనుకనున్న వాడు "ఆసారులు వారిని వరుసగా “పా ర్ష్ణిగ్రహాసారుడు" "ఆక్రందాసారుడు" అని చెప్పుదురు. విజిగీషువైన రాజు శత్రువుయొక్క ఆక్రమణము ఉన్నను, లేకపోయినను ఆతని విజయమును గూర్చి నిశ్చితముగ ఏమియు చెప్పవీలు పడదు. విజిగీషవు, శత్రువు వీరిరువురును అసంఘటితులై యున్నపుడు వారి విగ్రహానుగ్రహములందు సమర్థుడగు తటస్థుడైన రోజు “మధ్యస్థుడు". ఈ ముగ్గురి విషయమున నిగ్రహానుగ్రహసమర్థుడగు రోజు ఉదాసీనుడ. ఎవ్వడును ఎవ్వనికిని శత్రువుకాదు; మిత్రుడుకాదు. అందరును కారణవశ ముచే పరస్పరము శత్రువులగుదురు, మిత్రులగుదురు. ఈవిధముగ పండ్రెండు రాజమండలములను గూర్చి చెప్పితిని.
త్రివిధా రిపవో జ్ఞేయాః కుల్యాన న్తర కృత్రిమాః ।
పూర్వపూర్వా గురు స్తేషాం దుశ్చికిత్స్య తమోమతః.
ఆనంతరోఽపి యః శత్రుః సోపిమే కృత్రిమో మతః ।
పార్ష్ణిగ్రాహో భవేచ్ఛత్రోర్మి త్రాణి రిపవ స్తథా.
పార్ష్ణిగ్రాహముపాయైశ్చ శమయేచ్చ తథాస్వకమ్ ।
మిత్రేణ శత్రో రుచ్ఛేదం ప్రశంసన్తి పురాతనాః.
మిత్రం చ శత్రుతా మేతి సామ స్తత్వాదనంతరమ్ ।
శత్రుం జిగీషు రుచ్చిన్ద్యాత్స్వయం శక్నోతి చేద్యది.
ప్రతాప వృద్ధౌ లేనాపి నామిత్రాజ్జాయతే భయమ్ ।
యథాస్య నోద్ద్విజేల్లోకో విశ్వాసశ్చయథాభ వేత్.
జిగీషుర్థర్మవిజయీ తథాలోకం వశం నయేత్ ।
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే యాత్రామండల చిన్తాదికం నామ
త్రయస్ త్రింశదధిక ద్విశతత మోఽధ్యాయః.
కుల్యుడు, అనంతరుడు కృత్రిముడు అని శత్రువులు మూడు విధములు. వీరిలో పూర్వపూర్వుడు అధిక శత్రువు అనగా కృత్రిముని కంటే ఆనంతరుడు, అతని కంటె కుల్యుడు ప్రబలులు. కుల్యుని అణచుట చాల కష్టము. నా అభిప్రాయమున అనంతర శత్రువు కూడ కృత్రిముడే. పార్ష్ణీగ్రాహుడు శత్రువుకు మిత్రుడు. ఆయినను ప్రయత్నించివచో అతడు శత్రువుకు శత్రువు కూడ కావచ్చును. అందుచే వివిధోపాయముంచే పార్ష్ణీ గ్రాహుని తన వశములో నుంచుకొన వలెను. మిత్రునిచే శత్రువును నశింపచేయుట మంచిదని ప్రాచీన నీతిశాస్త్ర వేత్తలయభిప్రాయము. సామంతుడు(సీమానివాసి) అగుటచే మిత్రుడు కూడ మున్ముందు శత్రువు కావచ్చును. అందుచే విజయము కోరు రాజు, శక్తి ఉన్నచో స్వయముగానే శత్రువును నశింపచేయవలెను. ఎందువలన అనగా మిత్రుని ప్రతాపము పెరిగిపోయినచో ఆతని నుండి కూడ భయము కలుగ వచ్చును. ప్రతాపహీనుడై న శత్రువు నుంచి కూడ భయముండదు. విజిగీషువైన రాజు ధర్మ విజయి కావలెను. ప్రజలలో ఎవ్వరికిని ఉద్వేగము కలుగ కుండునట్లు చూచుకౌనుచు విశ్వాసము కలిగించి, తనవకములో నుంచుకొనవలెను.
అగ్ని మహాపురాణమునందు యాత్రా మండల చింతా కథనమను రెండువందల ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 233 of the Agni Purāṇa is as follows:
The six-limbed yoga system is presented: āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna, and samādhi. Agni correlates these six limbs with the six seasons and six rasas, showing the yogic system as a microcosmic reflection of the entire cosmic order. The distinction between samprajñāta samādhi (with a cognitive support) and asamprajñāta samādhi (without any support) is drawn. The chapter teaches that the yogi who attains nirbīja samādhi is liberated from saṃsāra in that very birth.