అగ్ని మహా పురాణము

329 -  అథ ఛందః సారః

 ఆగ్ని రువాచః-

 ఛందోఽధికారే గాయత్రీ దేవీ చై కాక్షరీ భవేత్

పంచ దశాక్షరీ సా స్యాత్ప్రాజాపత్యాష్టవర్ణికా.

యజుషాం షడర్ణా గాయత్రీ సామ్నాంస్యా ద్ద్వాదశాక్షరా

ఋ చామష్టా దశార్ణాస్యాత్సామ్నాం వర్ధేత చ ద్వయమ్.

ఋచాం తుర్యంచ వర్ధేత ప్రజాపత్యా చతుష్టయమ్

వర్ధేదే కై కకం శేషే ఆతుర్యాదేక ముత్సృజేత్ .

ఉష్ణిగనుష్టుబ్బృహతీ పంక్తిస్త్రిష్టుమజ్జగత్యపి

తాని జ్ఞేయాని క్రమశోగాయత్ర్యో బ్రహ్మ ఏవతాః.

 తిన్ర స్తిస్రః సనామ్న్యః స్యురేకై కా ఆర్ష్య ఏవచ

ఋగ్యజుషాం సంజ్ఞాః స్యుశ్చతుః షష్టిపదేలిఖేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఛందః సారే ఏకోన త్రింశ దుత్తర త్రిశతతమోఽధ్యాయః.

ఆగ్ని దేవుడు పలికెను. “ఛందస్” యను శబ్దము ఈ ప్రకరణములో అనువృత్తి చెందుచుండును. దైవి గాయత్రి ఏకాక్షరి, ఆసురిపంచదశాక్షరి, ప్రాజాపత్య అష్టాక్షరి, యాజుషి షడక్షరి, సామ్నీ గాయత్రి ద్వాదశాక్షరి, ఆర్చి ఆష్టాదశాక్షరి, సామ్ని గాయత్రిలో క్రమముగా రెండేసి ఆక్షరములు పెంచుచు ఆరుకోమ్లము లో వ్రాయవలెను. ఆర్చి గాయత్రిలో మూడేసి ప్రాజాపత్య గాయత్రిలో నాలుగేసి ఇతర గాయత్రులలో ఒక్కొక్కటి అక్షరము పెంచవలెను ఆసురి గాయత్రి యొక్క ఒక్కొక్క అక్షరము క్రమముగ, ఆరు కోష్ఠములలో తగ్గినచో వాటిని సామ్న్యా ది భేద సహితముగా ఉజ్జిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టప్, జగతీ ఛందస్సులుగా తెలుకొవపలెను. యాజుషి సామ్ని  ఆర్చి గాయత్రుల అక్షరములను వేరువేరు కూర్చుటచే బ్రాహ్మీ గాయత్రి, బ్రాహ్మి ఉషైక్ మొదలగునవి ఏర్పడును యాజుషికి ముందున్న మూడు గాయత్రుల అక్షరములను వేరువేరుగా ఆరుకోషములలో చేర్చుటచే ఎన్ని అక్షరములగునో యవి ఆర్పీ గాయత్రి ఆర్షి ఉషైక్ ఇత్యాది భేదములు ఏర్పడును. వీటిని ఆరువది నాలుకోష్ఠములలో వ్రాయవలెను.

ఆగ్ని మహాపురాణము ఛందస్సారమున మూడు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.