అగ్ని మహా పురాణము

176 - అథ ప్రతిపద్వ్రతాని

ఆగ్ని రువాచః-

వ్య ప్రతిపదాదీని వ్రతాన్యభిలదాని తే

కార్తికాశ్వయుజే చైత్ర ప్రతిద్ర్బహ్మణ స్తిథి.

పఞ్చదశ్యాం నిరాహార ప్రతిపద్యర్చయేదజమ్

ఓంతత్సద్ర్బహ్మణే నమో గాయత్ర్యా వాబ్దమేకకమ్.

అక్షమాలాం సువం దకే వామే సుచం కమజ్ఞలుమ్

లమ్బకూర్చం చ జటిలం ప్రామం బ్రహ్మాణమర్చయేత్.

శక్త్యా క్షీరం ప్రదద్యాత్తు బ్రహ్మా మే ప్రియతామితి

నిర్మలో భోగభుక్ స్వర్గే భూమౌ విప్రో ధనీ భవేత్.

ధన్యం వ్రతం ప్రవక్ష్యామి హ్యధన్యో ధన్యతాం వ్రజేత్

 మార్గశీర్ష ప్రతిపది నక్తం హుత్వా ప్యుపోషిత.

అగ్న యే నమ ఇత్యగ్నిం ప్రార్చ్యాబ్దం సర్వభాగ్భవేత్

ప్రతిపద్యేక భక్తాశీ సమాపై కపిలాపదః.

 వైశ్వానర పదం యాతి శిఖి వ్రతమిదం స్మృతమ్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ప్రతిపద్ర్వతాని నామ షట్సప్తత్యధిక శతతమోధ్యాయః.

ఆగ్ని పలికెను. అన్ని కోరికలను తీర్చు ప్రతి పదారి వతములను గూర్చి నీకు చెప్పెదను. కార్తిక-ఆశ్వ యుజ-చై తమాసములందలి ప్రతిపత్తు బ్రహ్మ ప్రీతికర మగు తిథి. పూర్ణిమయందు ఉపవాసము చేసి ప్రతిపత్తు నందు ఓం తత్సద్ర్బహ్మణే నమః అను మంత్రముతో బ్రహ్మను పూజించవలెను. లేదా ఒక సంవత్సరము పాటు గాయత్రీ మంత్ర ముతో కుడి చేతులలో అక్షమాలను, స్రువమును, ఎడమచేతులలో సుక్కును, కమండలమును ధరించుచున్న వాడును, దీర్ఘమైన గడ్డముగల వాడును, జటాధారియు, సువర్ణవర్ణము గలవాడును అగు బ్రహ్మను పూజించవలెను. నా విషయ మున బ్రహ్మ అనుగ్రహించుగాక! అని పలుకుచు శ క్త్యనుసారముగా క్షీర మును సమర్పించవలెను. ఈ విధముగ చేసిన విపుడు పాపవిముక్తుడై భూమియందు ధనవుతుడై , స్వర్గమునందు భోగములను అనుభవించును. ఇపుడు ధన్యవ్రతమును గూర్చి చెప్పేదను. దానిని చేయుటచే ఆధన్యుడు ధన్యుడగును. మార్గ శీర్ష ప్రతిపత్తునందు రాత్రి హోమము చేసి ఉపవాసమున్న వాడై , అగ్నియే నమః అను మంత్రముచే ఒక సంవత్సరము అగ్ని ని పూజించి, సర్వకామములను పొందును. ప్రతిపత్తు నందు ఒక్క పర్యాయమే భుజించుచు, సమాప్తమైన పిడప కపిల గోవును దానము చేసిన వాడు వైశ్వానరుని స్థానమును చేరును. ఇది శిఖవ్రతము.

ఆగ్నేయ మహాపురాణమునందు ప్రతిపద్వ్రతములను నూటడెబ్బదియారవ అధ్యాయము సమాప్తము.