అగ్ని మహా పురాణము

272 - అథ దానాదిమాహాత్మ్యమ్

పుష్కర ఉవాచః

బ్రహ్మణా భిహితం పూర్వం యావన్మాత్రం మరీచయే

లక్షార్ధార్ధంతు తద్బ్రాహ్మం లిఖిత్వానంప్రదాయేత్.

వై శాఖ్యాం పౌర్ణమాస్యాంచ స్వర్గార్థీ జలధేనుమత్

పాద్మం ద్వాదశ సాహస్రం జ్యేష్ఠే దద్యాచ్చధేనుమత్.

 వరాహకల్ప వృత్తాన్ త మధికృత్య పరాశరః

త్రయోవింశతి సాహస్రం వైష్ణవం ప్రాహచార్పయేత్.

 జలధేను మథాషాఢ్యం విష్ణోఃపదమవాప్నుయాత్

చతుర్దశ సహస్రాణీ వాయవీయం హరిప్రియమ్.

 శ్వేతకల్పప్రసంగేన ధర్మాన్వాయు రిహాబ్రవీత్

దద్యాల్లిఖిత్వా తద్విప్రే శ్రావణ్యాం గుడధేనుమత్.

 యత్రాధికృత్య గాయత్రీం కీర్త్యతే ధర్మవిస్తరః

 వృత్తాసురవధో పేతం తద్భాగవత ముచ్యతే.

 సారస్వతస్య కల్సస్య ప్రోషపద్యాంతు తద్దదేత్

అష్టాదశ సహస్రాణి హేమసింహ సమన్వితమ్.

 యలోఒహనారదో ధర్మాన్బృహత్కల్పా శ్రితానిహ

పంచవింశ సహస్రాణి సార రీయం తదుచ్యతే. 

సధేనుం చాశ్వినే దద్యాత్సిద్దిమాత్య న్తికీం లభేత్

 యర్రోధికృత్య శత్రూణాం ధర్మాధర్మవిచారణా.

 కార్తిక్యం సవసాహస్రం మార్కండేయ మథార్పయేత్

ఆగ్ని నాయద్వసిష్టాయప్రోక్తం చాగ్నేయమేవతత్.

లిఖిత్వాపుస్తకం దద్యాన్మార్గశిర్ష్యాం ససర్వదః

ద్వాద శైవ సహస్రాణి సర్వవిద్యావబోధనమ్.

 చతుర్దశ సహస్రాణి భవిష్యం సూర్యసంభవమ్

భవస్తుమనవే ప్రాహ దద్యాత్పౌష్యాం గుడాదిమత్.

పుష్కరుడు పలికెను. పూర్వము మరీచికి చేప్పిన ఏబదివేల శ్లోక ములుగల బ్రహ్మపురాణమును వ్రాసి, బ్రాహ్మణం నకు దానము చేయవలెను. స్వర్గకాముడు వైశాఖ పూర్ణిమనాడు జలధేనువుతో కూడ బ్రహ్మ పురాణ దానము చేయవలెను. పన్నెండువేల శ్లోక పాలుగల పద్మపురాణమును ధేనువుతో జ్యేష్ట మాసమున దానము చేయవలయును. పరాశరుడు, వరాహకల్పవృత్తాంతమును, ఇరువదిమూడువేల శ్లోకములుగల విష్ణుపురాణముగ రచించెను. దీనిని ఆషాఢమాసమున జలధేనువుతో దానము చేసినవాడు విష్ణుపదమును పొందును, పదునాలుగువేల శ్లోకములుగల హాయుపురాణము హరికి ప్రియమైనది. దీనిలో వాయుదేవుడు శ్వేత కల్పప్రసంగముచే ధర్మమును చెప్పెను. ఈ పురాణమును వ్రాయించి శ్రావణమాసమున గుడ ధేనువుతో బ్రాహ్మణునకు దానము చేయవలయును. గాయత్రిని ఆధారముగ తీసుకుని విస్తృతముగ భాగవత ధర్మములు బోధించిన సారస్వత కల్ప సంబద్ధమగునదియు, వృత్రా సురవధ కలదియగు భాగవతమున పదునెనిమిదివేల శ్లోకములు వున్నవి. దీనిని బంగారు సింహాసనముతో భాద్రపద మాసమున దానము చేయవలయును. బృహత్కల్పమునకు సంబంధించిన ధర్మములను దేనియందు బోధించెనో ఇరువది ఐదువేల శ్లోకములుగల ఆపురాణము నారదపురాణము. దీనిని ధేను సహితముగ ఆశ్వీయుజ మాసమున దానముచేసిన వాడు పరిపూర్ణసిద్ధిని పొందును, ఏపురాణమున పక్షులు ధర్మాధర్మ విచారణచేసినవో నవసహస్ర శ్లోకములుగల ఆ మార్కండేయ పురాణమును కార్తీకమాసమున దానము చేయవలయును. ఆగ్ని విషిష్ణునకు చెప్పినపురాణము ఆగ్నేయము. దీనిని వ్రాసి మార్గశీర్షమున బ్రాహ్మణునకు దానము చేసినచో సర్వఫలము లభించును. దీనిలో పన్నెండువేల శ్లోకములున్నవి. అన్ని విద్యలును బోధించును. భవిష్యపురాణము సూర్యసంభవము. పదువాలుగువేల శ్లోకములుగలది. శివుడు మనువునకు చెప్పెను. పుష్యమాసమన గుడాదులతో దీనిని దానము చేయవలయును.

 సావర్ణినా నారదాయ బ్రహ్మ వైవర్తమీరితమ్

 రథ న్ తరస్య వృత్తాంత మష్టాదశ సహస్రకమ్.

 మాఘ్యాం దద్యాద్వరాహస్య చరితం బ్రహ్మలోకభాక్

 యత్రాగ్నిలింగమద్యస్థో ధర్మాన్ ప్రాహ మహేశ్వరః.

ఆగ్నేయకల్పే తల్లింగమేకాదశ సహస్రకమ్

తద్దత్వాశివమాప్నోతి ఫాల్గుణ్యాం తిలధేనుమత్.

చతుర్దశ సహస్రాణి వారాహం విష్ణునేరితమ్

భూమౌ వరాహచరితం మానవస్య ప్రవృత్తిత.

 సహేమగరుడం చైత్ర్యం పదమాప్నోతి వైష్ణవమ్

చతుర శీతి సాహస్రం స్కాందం స్కందేరితం మహత్.

 అధికృత్యసధర్మాంశ్చ కల్పేతత్పురు షేర్పయేత్

వామనం దళసాహస్రం ధౌమకల్పే హరేఃకథామ్.

 దద్యాచ్చరది విషువే ధర్మార్గాదినిబోధనమ్

కూర్మం చాష్ట సహస్రంచ కూర్మో క్రంచ రసాతలే. 

ఇంద్రద్యుమ్నప్రసంగేన దద్యాతగ్గేమ కూర్మవత్

త్రయోదశ సహస్రాణి మాత్సంకల్పాదితోబ్రవీత్.

 మత్స్యోహిమనవే దద్యాద్విషువే హేమమత్స్యవత్

గారుడం చాష్టసాహస్రం విష్ణూక్తం తార్క్ష్యకల్ప కే.

 విశ్వాండాద్గరుడోత్ప త్తిం తద్దద్యాద్దేమ హంసవత్

 బ్రహ్మా బ్రహ్మాండ మాహాత్మ్యమధికృత్యా బ్రవీత్తుయత్.

 తచ్చద్వాదశ సాహస్రం బ్రహ్మాండం తద్ద్విజేఽర్పయేత్

సావర్ణి బ్రహ్మవైవర్త పురాణమును పారదునకు చెప్పెను దీనిలో రథంతర కల్ప వృత్తాంతము వున్నది. పదునెనిమిది వేల శ్లోకములుగల దీనిని మాఘమాసమున దానము చేయవలయును. వరాహచరితము చెప్పు వరాహ పురాణమును కూడి మాఘమాసమన దానము చేసినవాడు బ్రహ్మలోకము పొందును. ఆగ్ని మయమగు లింగము నందున్న మహేశ్వరుడు ఆగ్నేయకల్పము నందలి వృత్తాంతములతో కూడిన ధర్మమును బోధించిన పన్నెండు. వేల శ్లోకములుగల లింగ పురాణమును తిలధేనుసహితవపంగ ఫాల్గుణమాసమున దానము చేసినవాడు శివలోకమును పొందును. విష్ణువు భూదేవికి మానవ ప్రవృత్తిమొదలు వరాహచరితమును, చెప్పిన వరాహపురాణమున ఇరువది నాలుగువేల శ్లోకములు వున్నవి. చైత్రమున సువర్ణముతో గరుడపురాణమును దానము చేసినవాడు విష్ణుపదమును పొందును. స్కంద పురాణమున ఎనుబది నాలుగువేల శ్లోకములున్న వి. కుమారస్వామి తత్పురుష కల్పకథను శైవమతమును ఆధారముగ గొని ఈ పురాణమును చేప్పేను. దీనిని కూడ చేత్రమున దానము చేయవలయును. పది వేల శ్లోకములున్న వామన పురాణమున ధోమక ల్పము నందలి విష్ణు చరిత్రమును బోధించబడినది. దానిని పూర్ణిమనాడు విషవసంక్రాంతి సమయమున దానము చేయవలయును. ఇది ధర్మార్థాదిబోధకము., కూర్మపురాణమున ఎనిమిదివేల శ్లోకములున్నవి. కూర్మమూర్తియగు విష్ణువు ఇంద్రద్యుమ్న కథా ప్రసంగమున దీనిని పాతాలమునందు చెప్పెను. సువర్ణఖచ్చమతో దీనిని దానము చేయవలెను. మత్స్యరూపియగు విష్ణువుకల్పాదియందు పదమూడువేల శ్లోకములుగల మత్స్యపురాణమును మనువుకు చెప్పెను. బంగారముతో నిర్మి ముత్యముతో కలిపి దీనిని దానము చేయవలెను. శ్రీఆర్య కల్పమునందు ఎనిమిదివేల శ్లోక ములుగల గరుడపురాణమును బోధించేను. విశ్వాండమునుండి గరుత్మంతుని పుట్టుకకు సంబధించిన కథ దీనిలో చెప్పబడినది. దీనిని స్వర్ణహంసతో కూడ దానము చేయవలెను, బ్రహ్మ దేవుడు బ్రహ్మాండ మాహాత్మ్యమును గూర్చిచెప్పిన పండ్రెండువేల శ్లోకములుగల బ్రహ్మాండ పురాణమును గూడ బ్రాహ్మణునకు దానము. చేయవలయును.

భారతే పర్వసమాప్తౌ వస్త్రగంధసగాదిభిః.

 వాచకం పూజయేదాదౌ భోజయేత్పాయ సైర్ద్వి జాన్

 గోభూగ్రామసువర్ణాది దద్యాత్పర్వణి పర్వణి. 

సమాప్తే భారతే విప్రం సంహితాపు స్తకం యజేత్

 శుబేదే నివేశ్యాథ క్షేమవస్త్రాదినావృతాన్.

 నరనారాయణౌ పూజ్యౌపుస్తకం కుసుమాదిభిః

 గోన్నభూహేమ దత్త్వాథ భోజయిత్వాక్షమాపయేత్.

 మహాదానాని దేయాని రత్నా నివివిధానిచ !

మాషకౌద్వౌతయ శ్చైవ మా సేమా సే పదాపయేత్

 అయనాదెశ్రావక స్య దానమాదౌ విధీయతే

 శ్రాతృభిః సకలైః కార్యం శ్రావకే పూజనంద్విజ.

ఇతిహాశపురాణానాం పుస్తకాని ప్రయచ్ఛతి

 పూజయిత్వాయురారోగ్యం స్వర్గ మోక్ష మవాప్నుయాత్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే దానాదిమాహాత్మ్యం నామద్విసప్తత్యధిక

ద్విశతత మోఽధ్యాయః.

మహాభారత శ్రవణ సమయమున ప్రతి పర్వ సమాప్తి యందును వస్త్రగంధ మాల్యాదులతో ముందుగా పౌరాణికుని పూజించవలయును. పిదప బ్రాహ్మణులకు పాయసముతో భోజనము పెట్టవలెను. ఒక్కొక్క పర్వము పూర్తియే నపుడుగో, భూమి, గ్రామ సువర్ణాదులను దానము చేయవలయును. మహాభారతము పూర్తియైన పిమ్మట బ్రాహ్మణునకును మహాభారత సంహితకును పూజ చేయవలయును. గ్రంథమును పవిత్ర స్థానందుంచి దానికి పట్టు వస్త్రంచుట్టి హజించవలెను. పిదప నరనారాయణులను పుష్పాదులతో పూజించవలయును. గో, అన్న, భూమి, సువర్ణాదుల, దానముచేసి బ్రాహ్మణు లకు భోజనము పెట్టి కమా ప్రార్థన చేయవలయును. పౌరాణికులకు మహాదానములు వివిధ రత్నములు ఇవ్వవలేను ప్రతి మాసమునందును ఆతనికి రెండు లేక మూడు మాషముల సువర్ణమును ఇచ్చి, ఆయన ప్రారంభమున కూడ ముందుగా ఆతనికి సువర్ణ దానము చేయవలయును. ఓద్విజ  శ్రేష్ఠా శ్రోతలందరును కూడ పౌరాణికుని పూజించవలయును. ఇతి హాసములను పురాణములను పూజించి దానము చేయువాడు ఆయురారోగ్య స్వర్గ మోక్షములను పొందును.

అగ్ని మహాపురాణమున పురాణదానాది మాహాత్మ్య కథవమను రెండువందల డెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.