అగ్ని మహా పురాణము

246 - అథ రత్న పరీక్షా

అగ్నిరువాచః

రత్నానాం లక్షణం వక్ష్యే రత్నం ధార్యమిదం నృపైః

వజ్రం మరకతం రత్నం పద్మరాగంచ మౌక్తికమ్.

ఇంద్రనీలం మహానీలం వైదూర్యం గంధశస్యకమ్

చంద్రకాన్తం సూర్యకాంతం స్ఫటికం పులకం తథా.

కర్కేతనం పుష్యరాగం తథా జ్యోతీరసం ద్విజ

స్పటికం రాజపట్టంచ తథా రాజమయం శుభమ్.

సౌగంధికం తథా గఞ్జం శంఖ బ్రహ్మమయం తథా

గోమేదం రుధిరాక్షంచ తథా భల్లాతకం ద్విజ.

ధూలీం మరకతం చైవ తుత్థకం సీసమేవచ

పీలుం ప్రవాలకం చైవ గిరివజ్రం ద్విజోత్తమ.

భుజంగమమణిం చైవ తథా వజ్రమణిం శుభమ్

టిట్టిభంచ తథా పిండం భ్రామరంచ తథోత్పలమ్.

సువర్ణ ప్రతిబద్దాని రత్నాని శ్రీజయాదికే

ఆంతః ప్రభత్వంవైమ (పు)ల్యం సుసంస్థానత్వమేవచ.

సుధార్యానైవ ధార్యాస్తు నిష్ప్రభా మలినాస్తథా

ఖండాః సశర్కరాయేచ ప్రశస్తం వజ్రధారణమ్.

అమ్బస్తరతి యద్వజ్ర మభేద్యం విమలంచయత్

షట్కోణం శక్ర చాపాభం లఘుచార్కనిభం శుభమ్.

శుకపక్షనిభః స్నిగ్ధః కాంతిమాన్విమల స్తథా

స్వర్ణచూర్ణనిభైః సూక్ష్మైర్మరకతశ్చబిందుభిః.

స్పటికః పద్మరాగాః స్యూరాగవన్తోఽతినిర్మలాః

జాతవంగా భవన్తీహ కురువింద సముద్భవాః.

సౌగంధి కోత్థాః కాషాయ ముక్తాఫలాస్తు శుక్తిజాః

విమలాస్తేభ్య ఉత్కృష్టాయేచ శంఖోద్భవామునే.

నాగదంత భవాశ్చాగ్య్రాః కుంభసూకర మత్స్యజాః

వేణునాగభవాః శ్రేష్ఠా మౌక్తికం మేఘజం వరమ్.

వృత్తత్వం శుక్లతా స్వాచ్ఛ్యం మహత్త్వం మౌక్తికేగుణాః

ఇంద్రనీలం శుభంక్షీరే (రాజతే) భ్రాజతేఽధికమ్.

రంజయేత్స్వ ప్రభావేణ తమమూల్యం వినిర్దిశేత్

నీలరక్తంతు వైదూర్యం శ్రేష్ఠం హారాదికం భజేతే.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రత్న పరీక్షానామ షట్ చత్వారింశ దధిక ద్విశతతమోఽధ్యాయః.

ఆగ్ని దేవుడు పలికెను : ద్విజశ్రేష్ఠా! ఇపుడు రత్నముల లక్షణములు చెప్పెను. రాజు-వజ్ర-మరకత-పద్మరాగ-ముక్తా-మహానీల-ఇంద్రనీల-వేదూర్య-గంధసస్య-చంద్రకాంత-సూర్యకాంత-స్ఫటిక-పులక-కర్కేతన-పుష్పరాగ-జ్యోతీరస-రాజపట్ట-రాజమయ-శుభసౌంధిక-గంజ-శంఖ-బ్రహ్మమయ-గోమేద-రుధిరాక్ష-భల్లాతక-ధూలీ-మరకత-కుష్యసీస-పీలు-ప్రవాళ-గిరివజ్ర-భుజంగమణి-వజ్రమణి-టిట్టిభ-భ్రామర-ఉత్పలములను రత్నములను ధరించవలెను. మధ్య కాంతిగలవి, నిర్మలములు, మంచి ఆకారముగ లవి అగు రత్నములను మాత్రమే ధరించవలెను. ప్రభావిహీనమాలు, మలిన ములు, ఖండితములు, బీడీలు తీసినవి ఆగువాటిని ధరింపరాదు. అన్ని రత్నములందును హీరమును ధరించుట ఉత్తమము నీటిలో తేలునది, అభేద్యము, షట్కోణము, ఇంద్రధనస్సువలె నిర్మల ప్రభాయుక్తము, తేలికయైనది, సూర్యసమానతేజము, లేదా చిలుక రెక్కల రంగు గలదియగు వజ్రము శుభకరము. సువర్ణ చూర్ణసమానమైన సూక్ష్మబిందువులుగల మరకతమణి శ్రేష్ఠము. స్ఫటికము అత్యంత నిర్మలముగనున్న చో శ్రేష్ఠము. ఆరుణమగు పద్మరాగము శ్రేష్ఠవం. ముత్యములు ముత్యపు చిప్పలలో పుట్టును. వాటికంటె శంబమునుండి పుట్టినవి నిర్మలములు, ఉత్కృష్టములు అని చెప్పబడినది. ఋషి ప్రవరా! గజదంతములనుండియు, గజకుంభములనుండియు, సూకర - మత్స్య - వేణునాగములనుండియు, మేఘములనుంచియు ఉత్పన్నములై నవి అత్యంత శ్రేష్ఠములు. ముత్యములలో వృత్తత్వము, తెలుపు, స్వచ్ఛత్వము, మహత్వము అను గుణములుండును. ఉత్తమమైన ఇంద్రనీలమణిని పాలలో ఉంచగా అది చాల ప్రకాశవంతముగ నుండును. తమ కాంతిచే ఆంతను రంజింపజేయు రత్నములు ఆమూల్యములు. నీల - రక్తకాంతిగల వైదూర్యము శ్రేష్ఠము. ఇట్టి దానిని హారములో కూర్చుకొనవచ్చును.

ఆగ్ని మహాపురాణమునందు రత్నపరీక్షా కథనమను రెండువందల నలుబది ఆరవ అధ్యాయము సమాప్తము.