ఈశ్వర ఉవాచః
శివమర్చ్యాభిషేకం కుర్యాచ్ఛిష్యాదికే శ్రియే ।
కుమ్బానీశాది కాష్ఠాసు క్రమశో నవ విన్యసేత్.
తేమ క్షారోదం క్షీరోదం దధ్యుదం మృతసాగరమ్ ।
ఇక్షుకాదమ్బరీస్వాదుమస్తూదానష్ట సాగరాన్.
నివేశయేద్యథాసంఖ్యమష్టౌ విద్యేశ్వరానథ ।
ఏకం శిఖణ్డినం రుద్రం శ్రీకణ్ఠం తు ద్వితీయకమ్.
త్రిమూ ర్తమేకరుద్రాక్షమేకనేత్రం శివోత్తమమ్ ।
స ప్తమం సూక్ష్మనామానమనన్తం రుద్రమష్టమమ్.
మద్యేశివం సముద్రం చ శివమన్తం చ విన్యసేత్ ।
యాగాలయాన్డిగీశస్య రచితే స్నానమణ్డ పే.
కుర్యాత్కరద్వయాయామాం వేదిమష్టాజ్గులో చ్ఛ్రితామ్ ।
శ్రీపర్ణాద్యాసనే తత్ర విన్యస్యాన స్తమాసనమ్.
శిష్యం నివేశ్య పూర్వస్యాం సకలీకృత్య పూజయేత్ ।
కాక్టికోదనమృద్బన్మ దూర్వాగోమయగోలకై.
సిద్దార్థదధితాయైళ్చ కుర్యాన్నిర్మథనం తతః ।
క్షారోదాను క్రమేణాథ హృదా విద్యేశశమ్బరై.
కలళైః స్నాపయేచ్చిష్యం స్వధాధారణయాన్వితమ్ ।
పరిధాప్య సితే వస్తే నివేశ్య శివదక్షిణే.
పూర్వోదితాసనే శిష్యం పునః పూర్వవదర్చయేత్ ।
ఉష్ణీషం యోగపట్టం చ ముకుటం క ర్తరీం ఘటీమ్.
అక్షమాలాం పుస్తకాది శిబికాద్యధికారకమ్ ।
దీక్షావ్యాఖ్య ప్రతిష్ఠాద్యం జ్ఞాత్వాద్యప్రభృతి త్వయా.
సుపరీక్ష్య విధాతవ్యమాజ్ఞాం సంశ్రావయేదితి ।
అభివాద్య తతః శిష్యం ప్రణిపత్య మహేశ్వరమ్.
విమ్న జ్వాలాపనోదాయ కుర్యాద్విజ్ఞాపనం యథా ।
అభిషేకార్థమావిష్ట స్తయాహం గురుమూ ర్తినా.
సంహితాపారగః సోయమభిషిక్తో మయా శివ ।
తృప్తయే మన్తచక్రస్య పఞ్చపఞ్చా హుతీర్యజేత్.
దద్యాత్పూర్ణాం తతః శిష్యం స్థాపయేన్ని జదక్షిణే ।
శిష్యదక్షిణపాణిస్ఠా ఆజ్గు ష్ఠాద్యజ్గులీః క్రమాత్.
లాఞ్చయేదుపబద్ధాయ దగ్దదర్భాగ్రశమ్బరైః ।
కుసుమాని కరే దత్వా ప్రణామం కారయేదముమ్.
కుమ్భేనలే శివే స్వసిం స్తత స్తత్కృత్య మావి శేత్ ।
అనుగ్రాహ్యా న్వయా శిష్యాః శాస్త్రేణ సుపరీక్షితాః.
భూపవన్మానవాదీనామభి షేకాదభీప్సితమ్ ।
ఓం శ్రాం శ్రౌం పశు హూం పడిత్యస్త్రరాజాభిషేకతః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే నిర్యాణదిక్షాభిషేకాది విధిర్నామ నవతీతమోధ్యాయః.
పరమేశ్వరుడు చెప్పెను:- శివపూజానంతరము గురువు శ్రీప్రాప్తికై శిష్యాదులకు స్నానము చేయించవలెను. ఈశాన్యాది దిక్కులందు ఎనిమిది కలశములను, మధ్య ఒక కలశమును స్థాపించవలెను. ఆ ఎనిమిది కలశములలో వరుసగ క్షారోదక-క్షీరోదక-దధ్యుదక-మృతోదక-ఇక్షుకసోదక-సురోదక-స్వాదూదక- గర్బోదకసముద్రముల ఆవాహనము చేసి, క్రమముగ శిఖండి-శ్రీకంఠ-త్రిమూర్తి-ఏకరుద్ర–ఏకనేత్ర-శివోత్తమ-సూక్ష్మ-ఆనంతరుద్రు లను ఎనమండుగురు విద్వేశ్వ రులను స్థాపించవలెను. మధ్యనున్న కలశములో శివ-సముద్ర-శివముత్రములను స్థాపించవలెను యాగమండప దిక్కునందు స్వామికొరకై ఏర్పరచిన స్నానమండపమునందు రెండు బెత్తుల పొడవు, ఎనిమిది అంగుళముల ఎత్తు గల ఒక వేది నిర్మించవలెను. దానిపై కమలాద్యాసనములు కప్పి, దానిపై ఆసనస్వరూపుడైన ఆవంతుని న్యాసము చేసి శిష్యుని పూర్వాభిముఖముగ కూర్చుండ బెట్టి సకలీకరణపూర్వకముగ పూజ చేయవలెను. అతని శరీరమునకు గంజి, అన్నము, మట్టి, భస్మము, దూర్వలు, గోమయగోళములు, ఆవాలు, పెరుగు, ఉదకము వ్రాసి క్షారోదకాదిక్రమమున, నమస్కార సహితము అగ విద్వేశ్వరనామ మంత్రములతో, కలశ జలములో శిష్యునికి స్నానము చేయించవలెను. శిష్యుడు మనస్సులో తాను అమృతము చే స్నానము చేయించబడుచున్నట్లు భావన చేయవలెను. పిదప ఆతనికి రెండు శ్వేతవస్త్రములు కట్టించి శివుని కుడి వైపున కూర్చుండబెట్టవలెను. పైన చెప్పిన ఆసనమునందు శిష్యునకు, వెనుకటి వలెనే, మరల పూజ చేయవలెను. పిమ్మట ఆతనికి తలబాగ, కిరీటము, యోగపట్టిక, కర్తరి, చిన్న పాత్ర. అక్షమాల, పుస్తకము, పల్లకి మొదలగునవి ఇచ్చి ఆతనికి అధికారము నీయవలెను. నేటినుండి నీవు బాగుగ తెలిసికొని పరీక్షించి, ఎవని కైనను దీక్షా-వ్యాఖ్యా-ప్రతిష్టాదుల ఉపదేశము నిచ్చు చుండుము. అని ఆజ్ఞను వినిపింపవలెను. శిష్యుని అభివాచనము స్వీకరించి, మహేశ్వరునకు ప్రణామము చేసి, విఘ్న సమూహనివారణార్థమై “పరమేశ్వరా! నీవు గురుస్వరూపుడవు. ఈ శిష్యునకు అభిషేకము చేయుటకై నాకు ఆజ్ఞ ఇచ్చితివి. తదనుసారము నేను అభిషేకము చేసితిని. ఇతడు సంహితాపారంగతుడైనాడు” అని పలుకుచు ప్రార్థించవలెను. మంత్రచక్రతృప్తికొరకై ఐదేసి ఆహుతు లిచ్చి మరల పూర్ణాహుతి చేయవలెను. పిమ్మట శిష్యుని తన కుడి ప్రక్క కూర్చుండబెట్టుకొని, ఆతని కుడి చేతి బొటనవ్రేలు మొద లగు వ్రేళ్ల కు, దర్భాగ్రములు కాల్చిన మసి పూయవలెను. వాని చేతిలో పుష్పము లుంచి ఆతనిచే కలశ-అగ్ని - శివులకు - నమస్కరింపచేయవలెను. “నీవు శాస్త్రానుసారముగ బాగుగా పరీ క్షించి శిష్యులను అనుగ్రహించవలెను” అని ఆతనికి ఉపదేశించవలెను. మానవాదులకు అభిషేకము రాజాభిషేకము వలె చేయుటచే అభీష్టసిద్ధి కలుగును. “ ఓం శ్రాం శ్రౌం పళు హూం ఫట్” అనునది ఆస్త్రరాజమైన పాశుపతమంత్రము. దీనితో అస్త్రరాజమును పూజించి, అభిషేకము చేయవలెను.
అగ్ని మహాపురాణమునందు అభిషేకాదివిధివర్ణన మను తొంబదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 90 of the Agni Purāṇa is as follows:
The ninetieth chapter describes the post-dīkṣā abhiṣeka of the śiṣya — the ceremonial bathing that follows the initiation and formally marks the śiṣya's entry into the Śaiva order as a fully initiated devotee. Eight vidyeśvara-kalaśas — named Kṣīroda, Dadhi, and others, associated with the eight Vidyeśvaras (Śikhaṇḍī, Śrīkaṇṭha, Trimūrti, and their companions) — are prepared and used for the bathing. The construction of the snāna-maṇḍapa (bathing pavilion) in which this rite takes place is described. The formal investiture follows the bathing: the newly initiated is given the talabaṭa (ceremonial slippers), the mukuṭa (crown or ritual headwear), the kartarī (small ritual scissors or knife), the akṣamālā (rosary of rudrākṣa beads), and the relevant ritual texts (pustaka-s). The chapter concludes with the newly initiated śiṣya receiving the formal authorization to perform dīkṣā for others — the transmission of the guru-paramparā.