అగ్ని మహా పురాణము

167 - అథ పునరయుతలక్ష కోటిహోమాః

అగ్ని రువాచః-

శ్రీశాంతావిజయాద్యర్థం గ్రహయజ్ఞం పునర్వదే

గ్రహయజ్ఞోయుత హోమలక్ష కోట్యాత్మక స్రాధా.

 వేదై రై హ్యగ్ని కుజ్ఞాహొహానావాహ్య మణలే

సౌమ్యే గురుర్బుధశ్చై శే శుక్రః పూర్వదలే శశీ.

ఆగ్నేయే దక్షిణే భౌమే మధ్యే స్యాద్భాస్కర స్తథా

శరా ప్యేథ నైరృత్య రాహు కేతుశ్చ వాయవ్యే

ఈశశ్చోమా గుహో విష్ణర్ర హ్మీనో యమకాలకౌ

 చిత్రగు ప్రశ్చాధి దేవా ఆగ్ని రాపః క్షితి రరిః.

 ఇన్స్ట ఐస్ట్రీ దేవతా చ ప్రజేతో ఒపార్విధిః క్రమాత్

ఏతే ప్రత్యధిదేవాశ్చ గణేశో దుర్గయానిల.

ఖమశ్వినీ తాన్ సంపూజ్య యజేద్బీజైశ్చ వేదజైః

ఆర్క పలాశః ఖదిరో హ్యపామార్గశ్చ పిప్పలకి.

 ఉదుమ్బరః శశీ దూర్వా కుశాశ్చ సమిధః క్రమాత్

మధ్వాజ్యదధిసంమిశ్రా హోనవ్యాష్టరా శతమ్.

 ఏకాష్టచతురః కుమాన్పూర్య పూర్ణాహుతిం తథా

వసోర్గారాం తదా దద్యాద్దక్షిణాం చ తతో దదేల్.

 యజమానిం చతుర్భినై రభిషిణ్చేత్సమ నకైః

సురాస్వామభిషి ఇ్చను బ్రహ్మవిష్ణుమహేశ్వరాః.

వాసుదేవో జగన్నాథ స్తథా సజ్కరణః ప్రభుః

ప్రద్యుమ్న క్చొనిరుద్దశ్చ భవన్తు విజయాయ తే.

 ఆఖజ్జలాగ్నిర్భగవాన్యమో వై నైరృత స్తథా

వరుణః పవనశ్చైవ ధనాధ్యక్షస్త ఈ శివః.

బ్రహ్మణా సహితః శేషో దిక్పాలాః పొత్తు వః సదా

కీర్తిర్లక్ష్మీర్టృతిర్మేధా పుష్టిః శ్రద్దా క్రియా మతిః.

 బుద్ది క్లజా వపుః శా నిస్తుష్టిః కా నిశ్చ మాతరః

ఏలాస్త్వామభిషి ఇస్తు ధర్మపత్యః సమాగతాః.

“ఆదిత్యశమా భౌమో బుధజీవసితార్కః

గ్రహాస్త్వామభిష్పిన్లు రాహు కేతుళ్ళ తర్పి.

దేవదానవ గనర్వా యక్షరాక్షసపన్నగాః

 ఋషయో మనవో గావో దేవమాతర ఏవ చ.

దేవపత్న్యో ద్రుమా నాగా దైత్యాశ్చాప్సరసాం గణాః

 అస్త్రాణి సర్వశస్త్రాణి రాజ్ఞానో వాహనాని చ.

ఔషధాని చ రత్నాని కాలస్యావయవాశ్చ యే

సరితః సాగరా శైలా స్త్రీని జలదా నదాః.

 ఏతే త్వామభిషిఞ్చంతు సర్వకామార్థసిద్ధయే

ఆగ్ని పలికేను ఐశ్వర్యము, శాంతి, విజయము మొదలగునవి లభించుటకై గ్రహయజ్ఞమును గూర్చి మరల చేప్పెదను. పదివేల హోమములు, లక్షహోమములు, కోటి హోమములు అని గ్రహయజ్ఞము మూడు విధములు. అగ్ని కుండవేదికి ఈశాన్యమునందు మండలమున గ్రహములను ఆవాహన చేయవలెను. ఉత్తరమున గురువును, ఈశాన్యమునందు బుధుని, పూర్వదళమునందు శుక్రుని, ఆగ్నేయమున చంద్రుని, దక్షిణమున కుజుని. మధ్యభాగమున సూర్యుని, పశ్చిమము నందు శనిని, నైరృతియందు రాహువును, వాయవ్యమునందు కేతువును, ఆవాహన చేయవలెను. శివ-పార్వతీ_కార్తికేయవిష్ణు-బ్రహ్మ-ఇంద్ర.యమ-కాలwచిత్రగుప్తులు అధిదేవతలు. అగ్ని-వరుణ-భూమి–విష్ణు-ఇంద్ర.శచీ-ప్రజాపతి సర్పబ్రహ్మలు ప్రత్యధిదేవతలు. గణే-చుర్గా- వాయు – ఆకాశ - అశ్వినీకుమారులు కర్మసాద్గుణ్యదేవతలు ఈ దేవతల నందరిని వైదిక బీజాక్షరములతో పూజించవలెను. అర్క-పగ ఖదిర ఆపామార్గ - పిప్పల ఉదుంబర శమీ.దూర్వాకుశలు-వరుసగ రవ్యాదులకు సమిధలు. వీటిని మధువు, ఆజ్యము, పెరుగు.వీటితో సూరు చొప్పున ఎనిమిది పర్యాయములు హోమములు చేయ వలెను. నూట ఎనిమిది మరియు నాలుగు పూర్ణకుంభము ఉంచి, పూర్ణాహుతి, వసుధార ఇవ్వవలెను. పిదప బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వవలెను. నాలుగు కలశ బలోని జలముతో యజమానులకు అభిషేకము చేయవలెను. “బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు మీకు అభి షేకము చేయుదురు గాక. వాసుదేపుడు, జగన్నాథు డైన సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు నీకు విజయము నిచ్చుగాక. దేవరాజైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుపు, ధనాధ్యక్షు డైవ కబేరుడు, శివుడు, బ్రహ్మ, ఆది శేషుడు, సకలక్పాలకులు, సర్వదా నిన్ను రక్షింతురుగాక. కీర్తి, లక్ష్మీ, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, మతి, బుద్ధి, లజ్జ, వపుష్, శాంతి, తుష్టి, కాంతి, రోక జనను లైన ఈ ధర్మపత్నులు నీకు అభి షేకము చేయుదురు గాక. ఆదిత్య-చంద్ర-కుజబుధ-గురు శుక్ర-శని, రాహు కేతువులు పుతృప్తు లే నీకు అభిషేకము చేయు దురుగాక దేవత, దానవు , గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సర్పములు, ఋషులు, మునులు, గోవులు, దేవతలు, దేవాం•నలు, వృక్షము, నాగులు, దైత్యులు, ఆప్సర స్సమూహము, అస్త్రశస్త్రములు, రాజులు, వాహనములు, ఓషధులు, రత్నములు, కాలవిభాగములు, నదీనగర ములు, సముద్రములు, పర్వతము, తీర్థములు, మేఘము నీ సకలాభీష్టసిద్ధికై నీకు అభి షేకము చేయుదురు గాక.”

అలజ్కృత స్తతో దద్యాద్దేమగోరు వాదికమ్ .

కపిలే సర్వదేవానాం పూజనీయాసి రోహిణి

తీర్థదేవమయీ యస్మాదతః కాంతిం ప్రయచ్ఛ మే.

 పుణ్య స్త్వం గజపుణ్యానాం మజలానాం చ మఱలమ్

విష్ణునా విధృతో నిత్యమతః శాన్తం ప్రయచ్ఛ మే .

ధర్మ త్వం వృషరూ పేణ జగదానన్ద కారకః

అష్ట మూ ర్తెర ధిష్టానమతః శాన్తం ప్రయచ్చ మే.

 హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః

అనన పుణ్యఫలదమతః శాన్తం ప్రయచ్ఛ మే.

 పీతవస్త్రద్వయం యస్మాద్వాసుదేవస్య వల్లభమ్

ప్రదానాత్ర స్య వై విష్ణురతః శాన్తం ప్రయచ్ఛ మే.

విష్ణుస్త్వం మత్స్యరూపేణ యస్మాదమృతసమృపః

చన్దార వాహనో నిత్యమతః శాస్త్రం ప పచ్చ మే.

యస్మాత్వం పృథివీ సర్వా ధేనుకి కేశవసన్నిధా

సర్వపాపహరా నిత్యమతః శాంతిం పయచ్ఛ పే.

యస్మాదాయసకర్మాణి తవాధీనాని సర్వదా

 లాంగలాద్యాయుధాదీని హ్యతః శాన్తం ప్రయచ్చ మే.

 యస్మాత్వం సర్వయజ్ఞానామజ్ఞత్వేన వ్యవస్థితః

యోనిర్విభావసోర్నిత్యమతః శాంతిం ప్రయచ్ఛ మే.

యజమానుడు పిదప అలంకృతుడై ఈ క్రింది మంత్రములు చదువుచు సువర్ణ-గో-భూదానాదులు చేయవలెను “ఓ కపిలధేనువా! రోహిణీ! నీవు సర్వదేవతలచే పూజించదగినదానవు. నీవు సకలతీర్థ దేవతాస్వరూపిణివి. అందుచే నాకు శాంతి నిమ్ము. ధర్మమా! నీవు వృషభరూపమున జగదానందకారకుడవు. శివునకు వాహన మైనదానవు. అందువలన వాకు శాంతి నిమ్ము.” “హిరణ్యగర్భుని సర్భమునం దున్న సూర్యుని హేమబీజము ఆగంతపుణ్యఫలము. నిచ్చును. అందు వలన నాకు శాంతినిమ్ము.” “పీతవస్త్రద్వయము విష్ణువునకు చాల ఇష్టమైనది. దానిని సమ స్పంచుటచే విష్ణువు సంతసించును. అందుచే నాకు శాంతినిమ్ము” “విష్ణ వైస నీవు మత్స్యరూపముతో ఆమృతమునకు కారణభూతుడవు. చంద్రార్కవాహను డవు. అందుచే నాకు శాంతి నొసగుము.” “పృథివి యైన నీవు ధేనువుగా నుండి కేశవునితో ససూనురాలవు, సర్వపాపములను-వంపచేయడానవు. అందువలన నాకు శాంతి నిమ్ము.” “ఓ, ఆయా వికార మైనదానా ఎల్లపుడును అన్ని పనులు నీ ఆధీనములో నుండును. లాంగ లాదులు ఆయుధాదులు కూడ నీ ఆధీనము. అందుచే నాకు శాంతి నొసగుము.” “నీవు సర్వయజ్ఞములకును అంగముగా నున్నావు. అగ్నికి కారణ మైనదానవు. ఆందుచే నాకు శాంతి నిమ్ము.”

గవామణేషు తిష్టని భువనాని చతుర్ధశ

యస్మాత్త స్మాచ్ఛివం మే స్యాదిహ లోకి పరత్ర చ.

యస్మాళన్యం శయనం కేశవస్య శివస్య చ

శయ్యా మమాప్యశూన్యాస్తు దత్తా జన్మని జన్మని.

 యథా రత్నేషు సర్వేషు సర్వదేవాః ప్రతిష్ఠితాః

 తథా శాస్త్రి - ప్రయచ్ఛన్లు రత్నదానేన మే సురా.

 యథా భూమి ప్రదానస్య కలాం నార్ఘ ని షోడశీమ్

దానానన్యాని మే శాంతిం ర్భూమిదానాద్బవత్విహ.

గహయజ్ఞాయుతహోమో దక్షిణాచ రణే జితి

 వివాహోత్సవయజ్ఞేషు ప్రతిష్ఠాదిషు కర్మసు.

 నర్వకామాప్తయే లక్ష కోటిహోమద్వయం మతమ్

గృహదేశ్ మడ్డ పేథ హ్యయుతే హస్త మాత్రకమ్.

మేఖలాయోని సంయుక్తం కుణ్ణం చత్వార ఋత్విజః

స్వయ మేకో2పి ఐ లక్షే సర్వం దశగుణంహితల్.

 చతుర్ఘ సం ద్విహస్తం పొ లార్జ్యం చాలాధికం యజేత్

సామధ్వనిశరీరస్త్వం పొహనం పర మేష్ఠినః.

వీర్ విషస్యాపహారో నిత్యమతః శాన్తం ప్రయచ్చ మే

పూర్వవత్కుణమామన్య లక్షహోమం సమాచరేత్.

 వసోర్దారాం తతో దద్యా చ్చయ్యాభూషాదికం దదేత్

తత్రాపి దశ చా చ లక్ష హోమే తథర్త్విజ.

 పుత్రాన్న రాజ్యపిజయభుక్తి ముక్త్యాది చాప్నుయాత్

 దక్షిణాభిః ఫలేనాస్మొచ్చత్రుఘ్న కి కోటిహోమక . 

చతుర్ఘ స్తం చాష్టహస్తం కుణం ద్వాదశ చ ద్విజాః

పఇవింశం షోడశం వా పటే ద్వారే చతుష్టయమ్.

కోటిహామీ సర్వకామీ విష్ణులోకం స గచ్ఛతి

హోమస్తు గ్రహమతౌర్వా గాయత్ర్యా వైష్ణవైరపి.

జాతవేదోముఖైః శైవైర్వైది కై ప్రథితై రపి

తిలై ర్యవైర్ఘృతైర్ధాన్యేరశ్వమేధ ఫలాదిఖాక్.

విద్వేషణాభిచా రేషు త్రికోణం కుణ్ణమిష్యతే

సమిధో వామహస్తేన శ్యేనాస్థ్యనలసంయుతా.

రక్త భూషైర్ముక్త కేశైఠ్యాయద్భిర శివం రిపోః

దుర్మిత్రియా స్తస్యైసను యోద్వేష్ఠి హూం ఫడితి.

ఛిన్ద్యాత్ శారేణ ప్రతిమాం పిష్టరూపం రిపుం హనేత్

యజేదేకం పిబ్దకం వా యః స కృత్వా దివం వ్రజేత్ .

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే ఆయుతలక్ష కోటిహోమో నామ సప్త షష్ట్యధిక శతత మోధ్యాయః.

“గోవుల అవయవములందు చతుర్దశ భువనములును ఉన్నవి. అందువలన నాకు ఇహపరలోక మందు వంగి మగుగాక.” “కేశవుని శయ్యయు, శివుని శయ్యయు ఎన్నడును శూన్యములు కావు. నేనిచ్చు వలయ్య కూత అన్ని జన్మలందును శూన్యము కాకుండ ఉండుగాక. సర్వదేవతలును సర్వరత్నములందు ప్రతిష్టితులై యున్నారు. అందుచేత ఈ రత్న దానముచే దేవతలు నాకు శాంతి నిత్తురుగాక. ఇతర దానము లేవియు భూదానము పదునారవ అంశమునకు సాటిరావు. అందుచే ఈ భూదానమువలన నాకు శాంతి కలుగుగాక. అయుతహోమములతో సదక్షిణముగా చేసిన గ్రహయజ్ఞము యుద్ధము నందు విజయము నిచ్చును. వివాహములు, ఉత్సవములు, యజ్ఞములు, ప్రతిష్టలు మొదలగు కర్మలలో ఈ గ్రహయజ్ఞము చేయవలెను. లక్ష హోమ-కోటిహోమములను సకల కామావా ప్తి కొరకు చేయవలెను. గృహమునందు మండపము ఏర్పరచి, అయుతహోమముల నిమిత్తము ఒక హస్తము ప్రమాణము గల కుండమును ఏర్పరుపవలెను. దానికి మేఖలలు, యోని ఉండవలెను. నలుగురు ఋత్విక్కులు, లేదా తానొక్కడే చేయవచ్చును. లక్షహోమములందు అన్నియు పది రెట్లు ఉండును. కుండము నాలుగు లేదా రెండు హస్తముల ప్రమాణమున ఉండవలెను. ఇందు అధికముగ కార్డు ని కూడ పూజించవలెను. “ఓ తార్ఘ్యా! నీశ రీరము సామధ్వనిరూపము. నీవు పరమాత్ముని వాహనము. విషమును నశింపచేయుదువు. అందుచే నాకు నిత్యము శాంతినిమ్ము.” వసోర్దారను పిమ్మట శయ్యాభూషణాంకములను దానము చేయవలెను. లక్షహోమమునందు పదిమంది లేదా ఎనమండుగురు ఋత్విక్కు లుందురు. దాని వలన పుత్రులను, అన్నమును, రాజ్యమును, విజయమును, భుక్తిము క్త్యాదు లను పొందును. కోటిహోమయజ్ఞము సదక్షిణాకముగా చేసినచో వెనుక చెప్పిన స్థలములే కాక శత్రు వినాశనమునుగూడ చేయును. నాలుగు లేదా ఎనిమిది హస్తముల కుండము, పన్నెండు ఋత్విక్కులు, పటమునందు ఇరువదియైదులేదపండ్రెండు కలశను ద్వారమునండు నాలుగు కలశంను ఉంచవలెను. కోటి హోమములు చేసినవాడు సర్వకామములను పొంది విష్ణులోకము చేరును. గ్రహమంత్రములతో గాని, గాయత్రితో గాని, వైష్ణవమతములతో గాని, జాతవేదోముఖమంత్రము లతో గాని, శైవమంత్రములతో గాని, ప్రసిద్ధములైన వైదికమంత్రములతో గాని, తిల.యవ.ధాన్య-మృతములతో హోమములు చేయవలెను. ఇట్లు చేసిన వాడు అశ్వమేధాది యాగఫలమును పొందును. ద్వేషముతో అభిచార హోమములు చేయునపుడు కుండము త్రికోణాకార ములో నుండును. డేగ ఎముక లతో అగ్ని తో కూడిన సమిధలను ఎడమచేతితో హోమము చేయవలెను. హోమము చేయువారు శత్రువునకు అమంగళమును కోరుచు, ఎఱ్ఱని అలంకరణములు ధరించి, జుట్టు విరబోసికొని “దుర్మిత్రా సస్మె సంతు యీ ద్వేషి హుం ఫట్” అను మంత్రము చదువుచు హోమము చేయవలెను. క్షరముతో ప్రతిమను ఛేదించవలెను. పిష్టముతో చేసిన శత్రువును చంపవలెను. దానిని అగ్నియందు హోమము చేయవలెను. ఈ విధముగా చేసినవాడు స్వర్గము పొందును.

అగ్నిమహాపురాణమునందు అయుతలక్షకోటిహోమ మను నూట అరువది ఏడవ అధ్యాయము సమాప్తము.