అగ్ని రువాచః
ధ్యై చింతాయాం స్మృతో ధాతుర్విష్ణు చింతాముహుర్ముహుః ।
ఆనాక్షిప్తేమ మనసా ధ్యానమిత్యభి ధీయతే.
ఆత్మనః సమనస్కస్య ముక్తా శేషోపధస్యచ ।
బ్రహ్మ చింతాసమాసక్తిర్ధ్యానం నామతదుద్యతే .
ధ్యేయాలంబన సంస్థస్య సదృశ ప్రత్యయస్యచ ।
ప్రత్యయాన్తర నిర్ముక్తః ప్రత్యయో ధ్యానముచ్యతే.
ధ్యేయావస్థిత చిత్తస్య ప్రదేశేయత్ర కుత్రచిత్ ।
ధ్యానమేతత్స ముద్ధిష్టం ప్రత్యయస్యైక భావనా.
ఏవం ధ్యానసమాయుక్తః స్వదేహం యః పరిత్యజేత్ ।
కుల స్వజన మిత్రాణి నముద్దృత్య హరిర్భవేత్.
ఏవం ముహూర్త మర్ధంవా ధ్యాయేద్య: శ్రద్దయాహరిమ్ ।
సోఽపియాం గతి మాప్నోతి నతాం సర్వైర్మహామఖైః.
అగ్ని దేవుడు పలికెను. “ధ్యై - చింతాయాం” అని ధాతువు చెప్పబడినది. విక్షేపము లేని మనస్సుతో మాటి మాటికి విష్ణువును చింతించుట ధ్యానము. సమస్త ఉపాధి విముక్తమును సమనస్కమను అగు ఆత్మ బ్రహ్మచింతా లగ్నమై వుండుట ధ్యానము. ధ్యేయముపై నిలచి యున్నదియు, సదృశ ప్రత్యయములు మాత్రము కలదియు ఆగు మనస్సు ఇతర ప్రత్యయము లేకుండగ వుండుట కూడ ధ్యానము. ఏ ప్రదేశ్ము వందై వను చిత్తమును ద్యేయము నందు నిలిపి ఏకైక జ్ఞానము కలిగి యుండుట ధ్యానము. ఇట్టి ధ్యానము నందు లగ్నుడై స్వదేహమును త్యజించిన వాడు కులమును, స్వజన మిత్రులను ఉద్దేశించి హరి సారూప్యమును పొందును. ఈ విధముగా ముహూర్తకాలము గాని, ఆర్థ ముహుర్తము గాని శ్రద్ధా పూర్వకముగ హరిని ధ్యానించువాడు. ఏ గతిని పొందునో ఆ గతిని సకల మహా యజ్ఞముల చేత కూడ పొంద శక్యము గాదు.
ధ్యాతా ద్యానం తథాధ్యేయం యచ్చధ్యాన ప్రయోజనమ్ ।
ఏతచ్చతుష్టయం జ్ఞాత్వా యోగం యుంజీత తత్త్వవిత్.
యోగాభ్యాసాద్భవేన్ము క్తిరైశ్వర్యం చాష్టదా మహత్ ।
జ్ఞాన వైరాగ్య సంపన్నః శ్రద్దధానః క్షమాన్వితః.
విష్ణుభ క్తః సదోత్సాహీ ద్యాతేత్థం పురుషః స్మృతః ।
మూర్తామూర్తం పరం బ్రహ్మ హరేర్ద్యానం హి చింతనమ్.
సక లో నిష్కలో జ్ఞేయః సర్వజ్ఞః పరమో హరిః ।
ఆణిమాది గుణైశ్వర్యం ము కిర్ధ్యాన ప్రయోజనమ్.
ఫలేన యోజకో విష్ణురతో ధ్యాయేత్పరేశ్వరమ్ ।
గచ్చం స్లిష్ఠన్స్వపం జాగ్రదున్మిషన్ని మిషన్న పి.
శుచిర్వాప్య శుచిర్వాపి ధ్యాయేత్సతత మీశ్వరమ్ ।
స్వదేహా తనస్యా న్తే మనసిస్థాప్య కేశ వమ్.
హృత్పద్మ పీఠికామధ్యే ధ్యాన యోగేన పూజయేత్ ।
ధ్యానయజ్ఞః పరః శుద్ధః సర్వదోష వివర్జితః.
తేనేష్ట్వా ముక్తిమాప్నోతి బాహ్య శుద్ధైశ్చ సాధ్వరైః ।
హింసాదోష విముక్తత్వాద్వి శుద్ధిశ్చి త్తసాధనః.
ధ్యాన యజ్ఞః పర స్తస్మా దపవర్గ ఫల ప్రదః ।
తస్మాద శుద్ధం సంత్య జ్య హ్యనిత్యం బాహ్యసాధనమ్.
యజ్ఞాద్యం కర్మ సంత్యజ్య యోగమప్యర్థ మభ్య సేత్ ।
వికారము క్త మవ్య క్తం భోగ్యభోగ సమన్వితమ్.
చింతయేద్ధృదయే పూర్వం క్రమాదాదౌ గుణత్రయమ్ ।
తమః ప్రచ్ఛాద్య రజసా సత్త్వేన ఛాద యేద్రజః.
ధ్యాయేత్త్రి మండలం పూర్వం కృష్ణం రక్తం సితం క్రమాత్ ।
సత్త్వోపాధి గుణాతీతః పురుషః పంచ వింశకః.
ధ్యేయ మేత దశుద్ధంచత్యక్త్వా శుద్దం విచిన్తయేత్ ।
ఐశ్వర్యం పంకజం దివ్యం పురుషోపరి సంస్థితమ్.
ద్వాదశాంగుల విస్తీర్ణం శుద్ధం వికసితం సితమ్ ।
నాలమష్టాంగులం తస్యనాభికంద సముద్భవమ్.
పద్మపత్రాష్టకం జ్ఞేయమణి మాది గుణాష్టకమ్ ।
కర్ణికా కేసరం నాలం జ్ఞానవైరాగ్య ముత్తమమ్.
విష్ణుధర్మశ్చ తత్కందమితి పద్మం విచింతయేత్ ।
తద్దర్మ జ్ఞాన వైరాగ్యం శివై శ్వర్యమయం పరమ్.
జ్ఞాత్వా పద్మాసనం సర్వం సర్వదుఃఖాన్త మాప్నుయాత్ ।
ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ధ్యాన ప్రయోజనము అను ఈ చతుష్టయును తెలుసుకొని తత్త్వవే త్తయై యోగాభ్యా సము చేయవలెను. యోగాభ్యాసము వలన అష్టవిధ ఐశ్వర్యములు, ముక్తి కలుగును. జ్ఞాన వైరాగ్యవంతుడు, శ్రద్ధాళువు, క్షమాశీలుడు, విష్ణు భక్తుడు, సర్వదా ధ్యానము చేయువాడు అగుసాధకుడే ధ్యాత. పర బ్రహ్మ, మూ ర్తము మూ ర్తము అని రెండు విధములు. హరి ధ్యానము చింతనము, సర్వజ్ఞుడైన శ్రీ మహావిష్ణువు సకలుడు నిష్కలుడు అని తెలుసుకొన వలెను. ఆణిమాద్యైశ్వర్య ప్రాప్తియు ముక్తియు ధ్యానమునకు ప్రయోజనము. కర్మఫలము నిచ్చువాడు విష్ణువు. అందుచే ఆ పరమేశ్వ రుని ధ్యానించవలెను. వడచునపుడు, నిలిచినపుడు, నిద్ర పోవుచున్న పుడు, మేల్కొన్నపుడు, కండ్లు తెరచినపుడు, మూసి నపుడు, శుచిగా వున్నను, ఆశుచిగా వున్నను సర్వదా పరమేశ్వరుని ధ్యానించవలెను. తన దేహము ఆనెడు మందిరము మధ్య మనస్సులో హృదయపీఠ మధ్యము నందు కేశవుని స్థాపించి ధ్యాన యోగమతో పూజించవలెను. ధ్యాన యజ్ఞము చాల శ్రేష్టమైనది. సకల దోష రహితమైనది. అట్టి య జ్ఞము చేసి ముక్తి పొందవలెను. బాహ్య శుద్ధి మాత్రము గల యజ్ఞములచే ముక్తి లభింపదు. ధ్యానము హింసాదోష రహితమగుటచే చిత్తశుద్దికి ఉత్తమ సాధనము. అందువలన ధ్యాన యజ్ఞము ఉత్తమమైనది, మోక్ష ఫలము నిచ్చును. అందువలన ఆశుద్దమైనదియు ఆనిత్యము బాహ్య సాధనములు కలదియు ఆగు యజ్ఞాది కర్మను త్యజించి యోగాభ్యాసము చేయవలెను. ప్రారంభమున వికారయుక్తము, ఆవ్య క్తము భోగ్య భోగ సమన్వితము, ఆగు గుణత్రయమును క్రమముగ హృదయము నందు ధ్యానించవలెను. తమో గుణమును రజోగుణముచే ఆచాదించీ రజో గుణముచే సత్వ గుణమును ఆచ్చాదించవలెను. ప్రారంభమున వరుసగా కృష్ణ, ర క్షసిత ముబగు మూడు మండలము లమ ధ్యానించవలెను. సత్వోపాధి గుణాతీతుడగు ఇరువది యైదవ తత్త్వము పురుషుడు. అశుద్ధములగు మొదట చెప్పిన గుణాదులను క్రమముగ త్యజించి శుద్ధ మగు ఈ పురుష తత్వమును ధ్యానించవలెను. పురుషుని పైన నాభి నుండి ఒక దివ్య పంజకము ప్రకటమై యున్నది. ఆది ఐశ్వర్య రూపము. ఆది పండ్రెండు అంగుళముల విస్తారముతో పరిశుద్ధమై వికసించి శ్వేత వర్ణముతో నుండును. నాభి కందము నుండి పుట్టిన దాని మృణాలము ఎనిమిది అంగుళముల పొడవు గలది. దాని ఎని మిది పత్రములే ఎనిమిది అణిమాది గుణములు. దాని కర్ణిక జ్ఞానము. దాని నాళము ఉ త్తదు వైరాగ్యము. విష్ణు ధర్మమే దాని కందము. ఈ విధముగా పద్మమును భావన చేయవలెను. ధర్మ జ్ఞాన వైరాగ్య రూపము శివైశ్వర్యమయము, శ్రేష్ఠము అగు ఆ పద్మాసనమును తెలుసుకొన్న వాడు సర్వ దుఃఖములను దాటును.
తత్పద్మ కర్ణికామధ్యే శుద్ధదీప శిఖాకృతిమ్.
అంగుష్ట మాత్రమమలం ధ్యాయే దోంకార మీశ్వరమ్ ।
కదంబ గోల కాకారం తారం రూపమివస్థితమ్.
ధ్యాయేద్వారశ్మి జాలేన దీప్యమానం సమన్తత: ।
ప్రధానం పురుషోత్తం స్థితం పద్మస్థ మీశ్వరమ్.
ధ్యాయేజ్జపేచ్చ సతతమోంకారం పరమక్షరమ్ ।
మనః స్థిత్యర్థ మిచ్చన్తి స్థూల ధ్యానమనుక్రమాత్.
తద్భూతం నిశ్చలీ భూతం లభేత్సూక్ష్మేఽపి సంస్థితమ్ ।
నాభికందే స్థితం నాలం దశాంగుల సమాయతమ్.
నాలేనాష్టదల పద్మం ద్వాదశాంగుల విస్తృతమ్ ।
సకర్ణి కే కేసరాలే సూర్యసోమాగ్ని మండలమ్.
అగ్ని మండల మధ్యస్థః శంఖచక్ర గదాధరః ।
పద్మీ చతుర్భుజో విష్ణురథ వాష్టభుజోహరిః.
శార్జ్గాక్ష వలయధరః పాశాంకుశధరః పరః ।
స్వర్ణవర్ణః శ్వేత వర్ణః సశ్రీవత్సః సకౌస్తుభః .
వనమాలీ స్వర్ణహారీ స్ఫురన్మకర కుండలః ।
రత్నోజ్జ్వల కిరీటశ్చ పీతాంబరధరో మహాన్.
సర్వాభరణ భూషాడ్యో విత స్తిర్వా యథేచ్చయా ।
అహం బ్రహ్మ జ్యోతిరాత్మా వాసుదేవో విముక్త ఓం.
ధ్యానాచ్ఛాన్తో జపేన్మంత్రం జపాచ్ఛా న్తశ్చ చింతయేత్ ।
జపధ్యానాది యుక్తశ్చ విష్ణుః శీఘ్రం ప్రసీదతి.
జపయజ్ఞస్య వైయజ్ఞాః కలాం నార్హన్తి షోడశీమ్ ।
జపినం నోపసర్పన్తి వ్యాధయశ్చాధయాగ్రహః.
భుక్తిరుక్తిర్మృత్యుజయో జపేన ప్రాప్ను యాత్ఫలమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే ధ్యాన నిరూపణ నామ చతుః సప్తత్యధిక త్రిశతత మోఽధ్యాయః.
ఆ పద్మము యొక్క కర్ణికా మధ్యమున శుద్ధ దీపశిఖా వంటి ఆకారము కలవాడును, అంగుష్ఠ మాత్ర ప్రమాణము కలవాడును నిర్మలుడును ఓంకార స్వరూపుడును, కందపుష్పము వలె గోళాకారముగల తారారూపము కలవాడును ఆగు పర మేశ్వరుని ధ్యానించవలెను. లేదా ఈ కమలము పైన ప్రకృతి పురుషుల కంటే ఆతీతుడగు పరమాత్మవున్నట్లు ధ్యానము చేయుచు ఆ పరమాత్మ కిరణసముదాయముతో నలువైపుల ప్రకాశింప చేయునట్లు భావించుచు ధ్యానించవలెను. పరమాక్షర మగు ఆ ఓంకారమును సర్వదా ధ్యానించవలేను, సాధకుడు మనస్సును స్థిరము చేసుకొనుటకై ముందుగా స్థూలమును ధ్యానించవలెను. మనస్సు స్థిరమైన పిమ్మట దానిని సూక్ష్మము పై నిలుపుట శక్యమగును. నాభికమలమున దశాంగుల దీర్ఘమగు. వాళము వున్నది. దానిపై పండ్రెండు అంగుళముల విస్తారముగల అష్టదళ పద్మము వున్నది. కర్ణికా కేసరములు గల దావీపై సూర్య, సోమ, ఆన్ని మండలము లున్నవి. ఆ అన్ని మండల మధ్యమున శంఖ, చక్ర, గదా, పద్మ మాల ధరించిన చతుర్భుజుడగు విష్ణువుగాని, శార్ణ అక్షవలయ, పాశాంకుశ ములను కూడ ధరించిన అష్ట భుజ విష్ణువుగాని వున్నట్లు భావించవలెను. ఆతని విగ్రహము సువర్ణ వర్ణమై లేదా శ్వేత వర్ణమై వుండును. ఆతడు పీతాంబర ధారియై, తీవత్స, కౌస్తుభ - వనమాలా, సువర్ణహార, మకర కుండల రత్నోజ్వల కిరీటములను ధరించి యుండును. ఈ విధముగ సర్వా భరణ రూషితుడగు ఆతని ఆకారము జానెడు వున్నట్లు గాని, ఇచ్చాను సారము ఆంతకంటే అధిక వరంగా వున్నట్లుగాని భావన చేయవచ్చును. నేనే జ్యోతిరాత్మాయగు బ్రహ్మను ఓంకార రూపమగు దేవుడను, విముక్తుడను, అని ధ్యానము చేయ వలేమ. ధ్యానము చేసి ఆలసినవాడు మంత్రమును జపించవలెను. జపము వలన అలసినవాడు ధ్యానము చేయవలెను. ఈ విధమంగ జపధ్యానాదులు చేయువానికి విష్ణువు ప్రసన్నుడగును. యజ్ఞమున్నియు జపయజ్ఞము యొక్క పదునారవ వంతుకు కూడ సరితూగవు. ఇపము చేయువానిని వ్యాధులు కాని, ఆధులుగాని, గ్రహములు కాని, పీడించవు. జపమువలన భుక్తిని ముక్తి ని మృత్యు జయమును పొందను.
ఆగ్ని మహా పురాణమున ధ్యాననిరూపణమవు మూడు వందల డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 375 of the Agni Purāṇa is as follows:
The fifth aṅga, dhāraṇā (concentration) — the fixing of the mind on a chosen locus for a fixed duration — is described. The relationship between the limbs is stated precisely: twelve āyāmas (units of sustained focus) of dhāraṇā constitute one dhyāna; twelve dhyānas constitute one samādhi. Four elemental dhāraṇās are described, each corresponding to a maṇḍala and region of the body: āgneyī-dhāraṇā (fire visualization — fiery rays flooding the body from the navel and then withdrawn upward), vāruṇī-dhāraṇā (water visualization — streams of amṛta from the brahmarandhra flooding the body), aiśānī-dhāraṇā (earth visualization, associated with the mūlādhāra), and āmṛtātmikā-dhāraṇā (nectar visualization — the full moon (pūrṇacandra) in the head, raining immortal nectar through the body). These dhāraṇās are said to destroy the five kleśas (afflictions) when mastered.