అగ్ని మహా పురాణము

61 - అథ ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః

భగవానువాచః

వక్ష్యే చావభృథస్నానం విష్ణోర్న త్వేతి హోమయేత్

ఏకాశీతిపదే కుమ్భాంత్సాప్య సంస్థాపయేద్దరిమ్.

పూజయద్దనపుష్పాద్యైర్బలిం దత్త్వా గురుం

యజేత్ ద్వారే ప్రతిష్ఠాం వశ్యామి ద్వారాథో హేమ వై దదేత్ .

అష్టభిః కల శైః స్టాప్య శాఖోదుమ్బరకే గురుః

గన్గాదిభిః సమభ్యర్చ్య మనెర్వేదాదిభిర్గురుః.

కుక్షేమ హోమయేద్వహ్నిం సమీర్ణాజతిలాదిభిః

దత్త్వా శయ్యాదికం చాదో దద్యాదాధారశక్తి కామ్.

శాఖయోర్విన్య నేన్మూలే దేవౌ చణ్డ ప్రచణ్దకౌ

ఊర్ద్వోదుమ్బర కే దేవీం లక్ష్మీం సురగణార్చితామ్.

న్యస్యాభ్యర్చ్య యథాన్యా యం శ్రీసూ కేన చతుర్ము ఖమ్

హుత్వా తు శ్రీ ఫలాదీని ఆచార్యదేస్తు దక్షిణామ్.

ప్రతిష్ణా సిద్ధద్వారస్య త్వాచార్యః స్థాపయేద్ధతిమ్

 ప్రాసాదస్య ప్రతిష్ఠాం తు హృత్పతిష్ఠేతి తాం శృణు.

సమాప్తౌ శుక నాసాయా వేద్యాః ప్రాగ్గర్భమస్త

కేశ సౌవర్ణం రాజతం కుమ్భమథవా శుక్ల నిర్మితమ్.

అష్టతత్నాషధీధాతుబీజవాహాన్వితం శుభమ్

సవస్త్రం వూరితం చార్చిరణలే చాధివాసయేత్ .

పల్లవం నృసిం హేస హత్వా సంపాతనఞ్చితమ్

నారాయణాఖ్యతత్వేన ప్రాణభూతం న్య సేత్తతు.

హయగ్రీవుడు చేప్పెను : బ్రహ్మదేవా! ఇపుడు నేమ అవభృథస్నా నమును గూర్చి చెప్పేదను. “విష్ణోర్ను కం వీర్యాణి” ఇత్యాదిమంత్రముతో హోమము చేయవలెను. ఎనుబది యొక్క పదముల వాస్తుమండపమునందు కలశస్థాపన చేసి వాటి ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించవలెను. స్నానానంతరము గంధపుష్పాదులతో పూజించి, సమర్పించి, గురువును పూజించవలేను. ఇపుడు ద్వార ప్రతిష్ఠను గూర్చి చెప్పేదను. గురువు ద్వారము క్రింద బంగారము నుంచవలెను. ఎనిమిది కలశ లతో. అచట రెండు ఉదుంబర శాఖలుంచవలెను. వే దికమంత్రములు చదువుచు, గంధాద్యుపచారములతో పూజించి కుండములందు స్థాపింపబడిన అగ్నిలో సమిధలు, ఆజ్యము, తిలలు మొదలగునవి హోమము చేయవలెను. పిమ్మట శయ్యా దిదానము చేసి క్రింద ఆధారశక్తిని స్థాపింపవలెను. ఆ రెండు శాఖల క్రింద చండ ప్రచండు లను దేవతలను స్థాపించవలెను. ఉదుంబర శాఖల పైభాగమున దేవవృందపూజితురా లగు లక్ష్మిని స్థాపించి శ్రీ సూక్తముతో యథోచితముగ పూజింపవలెను. పిమ్మట బ్రహ్మను పూజించి, ఆచార్యునకు శ్రీఫలము (నారికేళ ఫలము) మొదలగు దక్షిణ లీయవలెను. ప్రతిష్టాత మగు ద్వారముపై ఆచార్యుడు శ్రీహరిని స్థాపింపవలెను. దేవాలయ ప్రతిష్టను “హృత్పతిష్టా” ఇత్యాదిమంత్రముతో చేయవలెను. దానిని గూర్చి వినుము. వేదికంటే ముందు, (లేదా వేదికి తూర్పుగా) శుకనాస ఎచట సమాప్త మగునో అచట, గర్భగృహశిరో భాగమునందు బంగారు కలశను గాని, వెండి కలశను గాని స్థాపింపవలెను. దానిలో ఎనిమిది విధము లైన రత్నములు, ఓషధులు, ధాతువులు, బీజములు, సువర్ణము ఉంచవలెను. ఆ కలశము కంఠమునకు వస్త్రము చుట్టి దానిని నీటితో నింపి, దానిని మండలము పై అధివాసితము చేయవలెను. దానిలో చిగుళ్లు వేయవలెను. పిమ్మట నృసింహమంత్రముతో అగ్నియందు ఆజ్యధార పోయుచు హోమము చేసి నారాయణతత్త్వముతోప్రాణన్యాసము చేయవలెను.

వైరాజభూతం తం ధ్యాయేత్రాసాదస్య సురేశ్వర

తతః పురుషవత్సరం ప్రాసాదం చిన యేద్భుధః.

 అ దత్త్వా సువర్ణం తు తద్వద్భూతం ఘటం న్య సేత్

గుర్వాదౌ దక్షిణాం దద్యాద్భాహ్మణాదేశ్చ భోజనమ్.

తతః పశ్చాద్వేదిబన్దం తదూర్ధ్వం కణబన్దనమ్

కణ్ఠోరిష్టాత్ కర్తవ్యం విమలామలసారకమ్.

తదూర్ధ్వం వృకలం కుర్యాచ్చక్రం చాద్యం సుదర్శనమ్

మూర్తి శ్రీవాసుదేవస్య గ్రహగుప్తాం నివేదయేత్.

కలశం వాథ కుర్వీత తదూర్ధ్వం చక్రముత్త మమ్

వేద్యాశ్చ పరితః స్థాప్యాస్త్వష్టా విఘ్నేశ్వరా స్వజ.

చత్వారో వా చతుర్ధిశు స్థాపనీయా గరుత్మతః

ధ్వజారోహం చ వక్ష్యామి యేన భూతాది నశ్యతి.

సురేశ్వరా ఆ ప్రాసాదక లక మును విరాడ్రూపముగ భావింపపలెను. మొత్తము ప్రాసాదమును పురుషునిగా భావన చేయవలెను. క్రింద సువర్ణ ముంచి, సువర్ణకలశను స్థాపింపవలెను. గురువు మొదలైనవారికి దక్షిణ లిచ్చి బ్రాహ్మణులకు భోజనములు పెట్టవలెను. దాని పైన కంఠభాగమునందు దారము గాని మాల గాని చుట్టవలెను. దాని పైన కూడ “విమలామలసార” అను పుష్పమాలను దేవాలయము నాల్గు వై పుల కట్టవలెను. దాని పైన వృకలము, దాని పైన సుదర్శనచక్రము నిర్మింపవలెను. అచటనే వాసుదేవతామూర్తి గ్రహగుప్త యని తెలుపవలెను. లేదా మొదట కలశమును, దాని పైన సుదర్శనచక్రమును ఏర్పాటు చేయవలెను. బ్రహ్మదేవా! వేదికి నలువైపుల ఎనమండు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. లేదా నాలుగు దిక్కులందు నలుగురు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. ఇపుడు భూతాదినినాశ గరుడధ్వజారోపణ విధానము చెప్పెదను,

ప్రాసాదబిమ్బద్రవ్యాణాం యావంతః పరమాణవః

తావద్వర్షసహస్రాణి తత్కర్తా విష్ణులోక భాక్.

కుమ్బాణ్డవేదిబిందూనాం భ్రమణద్వాయునా నవ

 కుణ్డస్యావేష్టనాద్ జ్ఞేయం ఫలం కోటిగుణం ధ్వజాత్.

పతాకం ప్రకృతిం విద్ధి దణ్డం పురుషరూపిణమ్

ప్రాసాదం వాసుదేవస్య మూర్తి భేదం నిబోధమే.

ధారణాద్ధరణీం విద్ధి ఆకాశం సుషిరాత్మకమ్,

తేజస్తత్పావకం విద్ది వాయుం స్పర్శగతం తథా.

దేవాలయమును నిర్మించిన వాడు, ప్రాసాదబింబద్రవ్యములలో ఎన్ని పరమాణువు లున్నవో అన్ని వేల సంవత్సరములు విష్ణులోకములో నుండును. పాపరహితుడ వైన బ్రహ్మదేవా! వాయువుచే కదల్చబడిన ధ్వజపటము కలశమును, వేదిని, ప్రాసాదబింబకంఠమును ఎప్పుడు చుట్టుకొనునో అపుడు ప్రాసాదకర్తకు ధ్వజారోపణముకంటే కోటి రెట్లు అధిక మగు ఫలము లభించు నని తెలిసికొనవలెను. వతాక ప్రకృతి; దండము పురుషుడు; ప్రాసాదము వాసుదేవస్వరూపము. ప్రాసాదము భగవంతుని ధరించుచున్నది గాన ఆదియే దానిలోని ధరణీరత్వము, దేవాలయము నందలి ఏ శూన్యావకాశ మున్నదో అదియే అకాశ తత్త్వము. దానిలోని ప్రకాశమే ఆగ్నితత్వము. దానిలో కలుగు వాయుస్పర్శయే వాయుతత్వము.

పాషాణాది ష్వేవ జలం పార్థివం పృథివీగుణమ్

ప్రతిశబ్దోద్భవం శబ్దం స్పర్శం స్యాత్కర్కశాదికమ్.

శుక్లాదికం భవేదూపం రసమన్నా ది దర్శనమ్

ధూమాదిగన్దం గన్ధం తు వాగేర్యాదిషు సంస్థితా.

శుక నాస్మృతా నాసా బాహూ తద్రథకౌ స్మృతా

శిరస్త్వజ్ఞం నిగదితం కలశో మూర్ధజాః స్మృతాః.

కణ్ఠ కణ్ఠమితి జేయం స్కశో వేదో నిగద్యతే

పాయూపస్థే ప్రణాల్మేతు త్వక్సుదా పరికీర్తి తా.

ముఖం ద్వారం భవేదస్య ప్రతిమగా జీవ ఉచ్యతే

తచ్ఛక్తిం పిణ్డికాం విద్ది ప్రకృతిం చ తదాకృతిమ్.

నిశ్చలత్వం చ గర్భోఒస్యా అధిష్టాతా తు కేశవః

ఏవమేష హరిః సాక్షాత్రాసాదత్వేన సంస్థితః.

జజ్జత్వస్య శివో జ్ఞేయః స్కన్దే ధాతా వ్యవస్థితః

ఊర్ధ్వభాగే స్థితో విష్ణురేవం తస్య స్థితస్య హి.

ప్రాసాదస్య ప్రతిష్ఠాం తు ధ్వజరూ పేణ మే శృణు

 ధ్వజం కృత్వాసురై రౌత్యా జితాః శస్త్రాదిచిహ్ని తమ్.

అణోర్ధ్వం కలశం న్యస్య తదూర్థ్వం విన్య సేద్ధ్వజమ్

బిమార్ధమానం దణ్ణస్య త్రిభా గేనాథ కారయేత్.

అష్టారం ద్వాదశారం వా మధ్యే మూర్తి మతాన్వితమ్

నారసిం హేన తార్జ్యణ ధ్వజదత్థాస్తు నిర్వణః.

ప్రాసాదస్య తు విస్తారో మానం దణ్ణస్య కీర్తి తమ్

శిఖరాధేన వా కుర్యాతృతీయార్ధన వా పునః.

ద్వారస్య దైర్యాద్విగుణం దణ్ణం వా పరికల్పయేత్

ధ్వజయష్టిర్దేవగ హే ఐశాన్యాం వాయవేథవా.

పాషాణాదులలో నున్న జలము పార్థివజలము. దానిలో పృథివీగుణ మగు గంధముండును. ప్రతిధ్వనిరూప శబ్దమే ఆచటి శబ్దము. స్పృశింపగా కనబడు కఠోర త్వాదిక మే స్పర్శ. శుక్లాడ్వర్ణములు రూపము. ఆహ్లాదమును కలిగించు -సమే రసము. ధూపాదిగంధమే గంధము. భేర్యాదులలో ప్రకట మగు వాదమె వాక్కు. ఆది వాగింద్రియము వంటిది. అందుచే వాగింద్రియము అచటనే ఉన్న దని భావించ వలెను. నాసిక శుక నాసయం దుండును. దాని రథకములు భుజములు. శిఖరముపై అండాకారమున నున్నది. శిరస్సు. కలశ కేశపాశము. ప్రాసాచకంఠభాగ్ ము కంఠము. వేది భుజము. రెండు నాళికలు గుదోపస్థలు. సున్నము త్వక్కు.. ద్వారము ముఖము. ప్రతిమ దేవాలయజీవాత్మ, పిండిక జీవశక్తి. దాని ఆకారము ప్రకృతి. నిశ్చలత దాని గర్బము. నారాయణుడు దాని అధిష్ఠాత. ఈ విధముగ మహావిష్ణులే దేవాలయరూపమున నిలచియున్నాడు. శివుడు కాళ్లు; బ్రహ్మ స్కంధము పై నున్నాడు. ద్వార ప్రతిష్ఠ ధ్వజారోహణాది విధికి ఊర్థ్వభాగమున సాత్తు విష్ణువే ఉండును. ఈ విధముగ నున్న ప్రాసాదమున ప్రతిష్టింపబడు ధ్వజమును గూర్చి వినుము. శస్త్రాదిచిహ్నములతో కూడిన ధ్వజమును నిలబెట్టి దేవతలు దైత్యులను జయించిరి. . అండముపై కలశము నుంచి, దాని పైన ధ్వజమును స్థాపింపవలెను. ధ్వజమానము బింబమానములో సగ ముండ వలెను. ధ్వజదండము పొడవులో మూడవ వంతుతో చక్రము నిర్మింపవలేను. ఆ చక్రమునందు ఎనిమిది కాని పండ్రెండు గాని ఆకులుండవలెను. దాని మధ్య నృసింహుని మూర్తి గాని, గరుడుని మూర్తి గాని ఉండవలెను. ధ్వజదండము విరిగినదిగాని, రంధ్రాదు లున్నది గాని కాకూడదు. దండము పొడవు ప్రాసాదము వేడిల్పుతో సమముగా నుండవలెను. లేదా దాని పొడవు శిఖరముయొక్క సగముభాగము లేదా మూడవవంతు ఎంత ఉండునో అంత ఉండపలేను. లేదా ద్వారము పొడవుకంటే రెట్టింపు పొడవు ఉండవలెను. ఆ ధ్వజదండమును దేవాలయముపై ఈశాన్యమున గాని, వాయవ్యమున గాని స్థాపింపవలెను.

క్షమాద్యైశ్చ ధ్వజం కుర్యాద్విచిత్రం వైకవర్ణకమ్

ఘణ్టా చామర కిక్కిణ్యా భూషితం పాపనాశనమ్.

దణ్డా గ్రాద్ధరణిం యావద్ధ సైకం విస్త రేణ తు

 మహాధ్వజః సర్వదః స్యాత్తుగ్యాంశాధీనతో ఒర్చితః.

ధ్వజే చార్ధేన విజేయా పతాకా మానవార్జితా

విస్తారేణ ధ్వజః కార్యో వింశ దజ్గులసన్నిభః.

ఆధివాసవిధానేన చక్రం దణ్డం ధ్వజం తథా

దేవవత్సకలం కృత్వా మణ్డపన్న పనాదికమ్.

నేత్రోన్మలనకం త్యక్త్వా పూర్వోత్తం సర్వమాచరేత్

అధివాసయేచ్చ విధినా శయ్యాయాం స్థాప్య దేశికః.

ధ్వజవస్త్రము (పతాక) పట్టుగుడ్డ మొదలైనవాటితో విచిత్రవర్ణముగ నుండునట్లు చేయవలెను. లేదా ఒకే రంగు ఉండు నట్లు చేయవలెను. దానికి ఘంట, దామరములు, చిరుగంటలు కట్టినచో ఆది సర్వపాపవినాశకమగును. దండాగ్రమునుండి నేలవరకు వ్రేలాడు వస్త్రమునకు “మహాధ్వజము” అని పేరు. అది సంపూర్ణమనోరథముల నిచ్చును. దానికంటే నాల్గవ వంతు. చిన్న దే నదానిని పూజించినచో సర్వమనోరథము సిద్ధించును. ధ్వజములో సగము ప్రమాణము గల వస్త్రముతో నిర్మించినదానికి 'పతాక' అని పేరు. లేదా పతాకకు కొలత ఏదియు ఆవసరము లేదు. ధ్వజవిస్తారము ఇదువది అంగుళ ము లుండవలెను. చక్ర-దండ. ధ్వజముల అధిహాసనమును దేవతామూర్తులకు వలె చేసి, సకలీకరణము గూడ కావించి, మండపస్నా నాది కార్యములు కూడ చేయవలెను. నేతోన్మీలనము తప్ప వెనుక చెప్పిన కార్యము లన్నియు చేయవలెను. ఆచార్యుడు వీటి నన్నింటిని శయ్య పై ఉంచి ఆధివాసనము చేయవలెను.

తతః సహస్రశీర్షతి సూక్తం చక్రే న్య సేద్భుధః

 తథా సౌదర్శనం మంత్రం మనస్తత్వం నివేశ యేత్ .

మనోరూ పేణ త స్యైవ సజీవకరణం స్మృతమ్

అరేషు మూర్త యో న్యస్యాః కేశ వాద్యాః సురోత్త మ.

నాభ్యజ్జ ప్రతినేమీషు న్య సేత్త త్వాని దేశికః.

నృసింహం విశ్వరూపం వా అబ్దమధ్యే నివేశ యేత్.

సక లం విన్య సేద్దజే సూతాత్మానం సజీవకమ్

నిష్కలం పరమాత్మానం ధ్వజే ధ్యాయన్న్య సేద్ధరిమ్.

తచ్ఛక్తిం వ్యాపినీం ధ్యాయేద్ద్వజరూపొం బలాబలామ్

మణ పే స్థాప్య చాభ్యర్చ్య హోమం కుణేషు కారయేత్.

కలకే స్వర్ణశకలం న్యస్య రత్నాని పఞ్చ చ 

స్థాపమేచ్చక్రమంత్రేణ స్వర్ణచక్రమధస్త తః.

పార దేన తు సంప్లావ్య నేత్రపట్టేన ఛాదయేత్

తతో నివేశ యేచ్చకం తన్మధ్యే నృహరిం స్మరేత్.

పిమ్మట విద్వాంసుడు “సహస్రశీర్షా” ఇత్యాదిస్తూ క్రమును ధ్వజాంకితచక్రముపై న్యాసము చేసి, సుదర్శన మంత్రమును, మనస్తత్వమును గూడ న్యాసము చేయవలెను. అది మనోరూపమున ఆ చక్రమున సజీవీకరణము. సురశ్రేష్ఠా! పండ్రెండు ఆకులపై (ఆదములపై) క్రమముగ కేశ వాదిమూర్తుల న్యాసము చేయళల్లెను. కమలముపై తీవదగ్ని మహాపురాణము నృసింహుని గాని, విశ్వరూపుని గాని ఉంచవలెను. దండముపై జీవసహితు డగు సూతాత్మను న్యాసము చేయవలెను ధ్వజముపై, శ్రీహరిధ్యానము చేయుచు, నిష్కలపరమాత్ముని స్థాపించవలేను. ఆతని బలాబలరూపవ్యాపకశక్తిని ధ్వజరూపమున ధ్యానింపవలెను. మండపము పై దానిని స్థాపించి, పూజించి, ఓ కుండములో హోమము , చేయవలెను. కలశములో బంగారు ఖండము, పంచరత్నములు ఉంచి, అస్త్రమంత్రముతో చక్రమును స్థాపింపవలెను. పిమ్మట సువర్ణచక్రమును, కింద నున్న పాదరసములో ముంచి నేత్రపటముతో కప్పవలెను. పిమ్మట చక్రము నుంచి, దాని మధ్యమున శ్రీహరిని స్మరింపవలెను.

ఓం క్షాం నృసింహాయ నమః పూజయేత్సాపయేద్దరిమ్

తతో ధ్వజం గృహీత్వా తు యజమానః సదానవః.

దధిభక్తయుతే పాత్రే ధ్వజస్యాగ్రం నివేశ యేత్

ధ్రువాద్యేన ఫడనైన ధ్వజం మనేణ పూజయేల్.

శిరస్యాధాయ తత్పాత్రం నారాయణమనుస్మరన్

ప్రదక్షిణం ప్రకుర్వీత తూర్యమజ్ఞలనిఃస్వనై .

తతో నివేశ యేద్ణణ్డం మనేణాష్టాక్ష రేణ తు

ముజామిత్వేతి సూకేన ధ్వజం ముణ్చేద్విచక్షణః.

పాత్రం ధ్వజం గుప్తరాది దద్యాదాచార్య ద్విజః

ఏషసాధారణః ప్రోక్తో ధ్వజస్యారోహణే విధిః.

యస్య దేవస్య యచ్చిహ్నం తన్మశ్రేణ స్థిరం చరేత్

స్వర్గ చ్ఛేధ్వజదానాత్తు భువి రాజా బలీ భవేత్ .

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ద్వారప్రతిష్టాధ్వజారోహణాధివిధి ర్నామైక షష్టిత మోధ్యాయః.

“ఓం క్రైం నృసింహాయ నమః”అను మంత్రముతో హరిని స్థాపించి పూజించవలెను. పిమ్మట యజమానుడు, బంధుసమేతుడై ధ్వజము తీసికొని దాని ఆగ్రభాగమును పెరుగుపాత్రలో ముంచవలెను. 'ఓం ఫట్' అను మంత్రముతో ధ్వజపూజ చేయవలెను. పిమ్మట ఆ పాత్రను తలపై పెట్టుకొని నారాయణస్మరణ చేయుచు వాద్యధ్వనులతో, మంగళ పాఠములతో, పరిక్రమణము చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ధ్వజదండమును స్థాపించవలెను. “ముఞ్చామి త్వా” ఇత్యాదిసూక్తము చదువుచు ధ్వజములు విడువ (ఎగురవేయ) వలెను. ఆచార్యునకు పాత్ర-ధ్వజగజాదులు దానము చేయవలెను. ఇది ధ్వజారోపణసాధారణ విధి. ఏ దేవతకు ఏ చిహ్నమో ఆ చిహ్నమే ఉన్న ధ్వజమును, ఆ దేవతామంత్రముతో స్థిరముగ స్థాపింపవలెను. ధ్వజదానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళును; ఈ లోకమునందు బలవంతు డగు రాజగును.

శ్రీ అగ్నివహావురాణమునందు ద్వార ప్రతిష్టాధ్వజారోహణాదివిధి యను అరువదియొకటవ అధ్యాయము సమాప్తము.