శాలిహోత్ర ఉవాచః
గజశాంతిం ప్రవక్ష్యామి గణరోగ విమర్దినీమ్ ।
విష్ణుక్రియంచ పంచమ్యాం నాగమైరావతం యజేత్.
బ్రహ్మాణం శంకరం విష్ణుం శక్రం వైశ్రవణం యమమ్ ।
చంద్రార్కౌ వరుణం వాయుమగ్నిం పృథ్వీం తథాచఖమ్.
శేషం కైలాన్కుంజరాంశ్చ యేతేఽష్టౌ దేవయోనయః ।
విరూపాక్షం మహాపద్మం భద్రం సుమనసం తథా .
కుముదై రావణః పద్మః పుష్పదన్తోఽథ వామనః !
సుప్రతీకోంఽజనో నాగా అష్టౌ హోమోఽథ దక్షిణామ్,
గజాః శాంత్యుదకై : సిక్తావృద్ధౌ నైమి త్తికం శృణు ।
గజానాం మకరాదౌచ ఐశాన్యాం నగరాదృహిః.
స్థండిలే కమలే మధ్యే విష్ణం లక్ష్మీంచ కేసరౌ ।
బ్రహ్మాణం భాస్కరం పృథ్వీం యజేత్స్కంధం హ్యనన్తకమ్.
ఖం శివం సోమ మింద్రా దీం స్తదస్త్రాణి దలేక్రమాత్ ।
వజ్రం శక్తించ దండంచ తోమరం పాశకం గదామ్.
శూలం పద్మం బహిర్వృన్తే చక్రే సూర్యం తథాశ్వినౌ ।
వసూనష్టౌ తథా సాధ్యాన్యామ్యేఽ థ నైరృతేదలే.
దేవా నాంగిరసశ్చాన్యాన్ భృగూంశ్చ మరుతోఽనిలే ।
విశ్వాన్దే వాంస్తథా దక్షే రుద్రా న్రౌద్రేఽథ మండలే.
వృత్తయా రేఖయాతత్ర దేవాన్వై బాహ్యతోయజేత్ ।
సూత్రకారా నృషీన్వాణీం పూర్వాదౌ సరితోగిరీన్.
మహాభూతాని కోణేషు ఐశాన్యా దిషు సంయజేత్ ।
పద్మం చక్రం గదాం శంఖం చతురస్రంతు మండలమ్.
చతుర్ద్వారం తతః కుంభానగ్న్యా దౌచ పతాకికాః ।
చత్వా రస్తోరణాన్ద్వారి నాగానై రావతాదికాన్.
పూర్వాదౌ చౌషధీ భిశ్చ దేవానాం భాజనం పృథక్ ।
పృథక్ఛతా హుతీశ్చాజైర్గ జానర్చ్య ప్రదక్షిణమ్.
నాగం వహ్నిం దేవతా దీన్బా హ్యైర్జగ్ముః స్వకం గృహమ్ ।
ద్విజేభ్యో దక్షిణాం దద్యాద్ధస్తి వైద్యాదికాం స్తథా.
కరిణీంతు సమారుహ్య వదేత్కర్ణేతు కాలవిత్ ।
నాగరాజే మృతే శాంతింకృత్వాఽ(న్యాస్మి) ముష్మిం జ పేన్మనుమ్ .
శ్రీగజస్త్వం కృతో రాజ్ఞా భవనస్య గజాగ్రణీః ।
గంధమాల్యాగ్ర భక్తైస్త్వాం పూజయిష్యతి పార్దివః.
లోక స్తదాజ్ఞయా పూజాం కరిష్యతి తదాతవ ।
పాలనీయ స్త్వయా రాజాయుద్దేఽధ్వని తథాగృహే.
తిర్యగ్భావం సముత్సృజ్య దివ్యం భావమనుస్మర ।
దేవాసురే పురాయుద్దే శ్రీ గజస్త్రీద శైః కృతః.
ఐరావతః సుతః శ్రీమానరిప్టో నామ వారణః ।
శ్రీగజానాంతు తత్తేజః సర్వమేవోప తిష్ఠతే.
తత్తేజ స్తవ నాగేంద్ర దివ్యభావ సమన్వితమ్ ।
ఉపతిష్ఠతు భద్రంతే రక్షరాజాన మాహవే.
ఇత్యేవ మభిషిక్తం తమారో హేత శుభేనృపః ।
తస్యానుగమనం కుర్యుః సశస్త్రా నరపుంగవాః.
శాలస్వసౌస్థండి లేఽబ్జే దిక్పాలాదీన్యజేన్ భహిః ।
కెసరేషు బలం నాగం భువం చైవ సరస్వతీమ్.
మధ్యేతు డిండిమం ప్రార్చ్య గంధమాల్యాను లేపనైః ।
హుత్వా దేయస్తు కలశో రసపూర్ణో ద్విజాయచ.
గజాధ్యక్షం హ స్తిపంచ గణితజ్ఞంచ పూజయేత్ ।
గజాధ్యక్షాయతం దద్యాత్ డిండిమం సోఽపి వాదయేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే గజశాంతి కథనం నామైక నవత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః.
శాలిహోత్రుడు చెప్పెను : గజరోగములను తొలగించు గజశాంతిని చెప్పెదను. పంచమి తిథియందు విష్ణ లక్ష్మీ, ఐరావతములను బ్రహ్మ శంకర ఇంద్ర, కుబేర, యములను, చంద్రసూర్యులను, వరుణుని. వాయు, అగ్ని, పృథివీ, ఆకాశములను. ఆదిశేషుని, శైలములను దేవయోనులగు విరూపాక్షి మహాపద్మ భద్ర సుమనస్ కుమద, ఐరావత పద్మ పుష్పదంత, వామన, ఆంజనములను గజములను అష్టదిగ్గజములను పూజించి హోమములు చేసి దక్షిణలు ఇవ్వవలెను. శాంతికలశ జలముతో గజాభిషేకము చేయించినచో అవివృద్ధి పొందును. ఇపుడు నైమిత్తిక శాంతిని వినుము. మకరాది సంక్రాంతుల యందు నగర బహిర్భాగమున ఈశాన్యమున ఏనుగులను పూజించవలెను. స్థండిలమున పద్మ మధ్యమున విష్ణువును లక్ష్మిని, పిదప అష్ట వశములందు క్రమముగా బ్రహ్మ సూర్య, పృథివీ, స్కంద, ఆనంత, ఆకాశ, శివ, చంద్రులను పూజించవలెను. పూర్వాది క్రమమున ఇంద్రాది దిక్పాలకులను పూజించవలెను. వారి ఆయుధములగు వజ్రశక్తి, దండ తోమర, పాశ, గదా, శూల, పద్మాదులను పూజించవలయును. దళము బాహ్యభాగమున చక్రమునందు సూర్యుని, అశ్వినీ దేవతలను పూజించవలయును. దక్షిణమున అష్టవసువులను సాధ్యదేవతలను నైఋతమున భార్గవాంగిరస దేవతలను వాయు వ్యమున మరుద్గణములను, దక్షిణమున విశ్వేదేవతలను, ఈశాన్యమున రుద్రులను పూజించవలయును. వృత్త రేఖానిర్మిత మగు అష్టదళ కమలమునకు బహిర్భాగమున సూత్రకారులగు ఋషులను, సరస్వతిని, పూర్వభాగమున నదీపర్వతములను ఈశాన్యాదులయందు పంచమహా భూతములను పూజించవలయును. పిమ్మట పద్మచక్రగదా శంఖములతో ప్రకాశించు చతు ష్కోణము చతుర్ద్వారమగు మండలము నిర్మించి, ఆగ్నేయాదులందు కలశ స్థాపనకూడ చేసి నాలుగు ప్రక్కలంమను పతాకా తోరణములను ఏర్పరచవలయును. అన్యద్వారములందు ఐరావతాది నాగ రాజులను పూజించవలెను. పూర్వాడిదిక్కులందు దేవతలకు వేరువేరుగా ఓషధీ యుక్తముగు పాత్రనుంచవలెను. గజములను పూజించి ప్రదక్షిణము చేయపలయును. దేవతలందరికిని, సూరుచొప్పున హోమము చేయవలయును. పిమ్మట గజరాజ. అగ్ని దేవతలతో బయలుదేరి వాద్యము లను మ్రోగించుచు ఇంటికి తిరిగి వెళ్ళవలయును. బ్రాహ్మణులకును గజచికిత్సకాదులకును దక్షిణలివ్వవలెను. పిదప కాలజ్ఞుడగు పురుషుడు గజరాజు నధిరోహించి దాని చెవిలో "ఓ గజరాజమా! మహారాజు నిన్ను తీగజ పదమునందు నియ మించినాడు. నీవు గజ శ్రేష్టుడవు ఈ రాజులు నేటి నుండి గంధమాల్య ఉత్తమా క్షతాదులతో నిన్ను పూజింతురు. అతని ఆజ్ఞచే ప్రజలు కూడ సర్వదా నిన్ను పూజింతురు. నీవు యుద్ధభూమి యందును, మార్గము నందును గృహము నందును సర్వదా మహారాజును రక్షించవలయును. ఓ నాగరాజ! తిర్యగ్భావమును విడిచి నీ దివ్యత్వమును స్మరించుము పూర్వము దేవాసుర సంగ్రామమునందు ఐరావత పుత్రుడగు అరిష్ట నాగమునకు శ్రీగజము అను పదమును దేవతలు ఇచ్చిరి. ఆ శ్రీ గజము తేజస్సంతయు నీ శరీరమున ప్రతిష్ఠితమైయున్నది. ఓ గజేంద్రమా! నీకు కళ్యాణముగుగాక! నీలోపల నున్న దివ్య భావ సంపన్నమగు తేజస్సు ఉద్బుద్దమగుగాక! నీవు రణాంగణమున రాజును రక్షించుచుండుము. ఆ గజరాజము మరల మరణించినచో శాంతి చేసి మరొక గజ కర్ణములో పైమంత్రమును జపించ వలయుకు. అభిషిక్త మగు గజరాజు పై శుక ముహూర్తమున రాజు అధిరోహించ వలయును శస్త్ర ధారులగు వీర శ్రమలు ఆతని ననుసరించ వలెను. రాజు హస్తి శాల యందు నేలపై చిత్రించిన కమలము బయట దిక్పాలకులను పూజించ వలయును. కేసరముల స్థానమున మహా ఐడ్ యగు వాగరాజమును భూదేవి సరస్వతులను, మధ్య భాగమున గంధ పుష్ప చందనములతో డిండిమమును పూజించి, హోమము చేసి రస పూర్ణ మగు కలశను బ్రాహ్మణునకు దానము చేయవలయును, గజాధ్యక్షుని, గబి రక్షకుని, జ్యోతి మ్కని కూడ సత్కరించి ఆ డిండిమమును గజాధ్యక్షునికి ఇవ్వవలెను. ఆతడు దానిని మ్రోగించవలెను. అతడు దాని జఘనముపై కూర్చుండి, శుభ గంభీర స్వరమున డిండిమ వాదనము చేయవలయును.
అగ్ని మహా పురాణమున గజ శాంతి కథన మను రెండు వందల తొంబది ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 291 of the Agni Purāṇa is as follows:
Pacification rituals for elephants are prescribed. The pañcamī-pūjā honors Viṣṇu-Lakṣmī, Airāvaṇa, Brahmā, Śaṅkara, Indra, Kubera, Yama, Candra, Sūrya, Varuṇa, Vāyu, Agni, Pṛthvī, Śeṣa, and the eight deva-yoni elephants (Virūpākṣa, Mahāpadma, Bhadra, Sumanas, Kumuda, Airāvaṇa, Padma, Puṣpadanta, Vāmana, Añjana). The aṣṭa-dikpāla pūjā is performed with pūrṇa-kumbhas. A specific mantra is whispered into the elephant's ear: "Śrī-gaja, the rāja has consecrated you." The diṇḍima (drum) is then presented to the gajādhyakṣa (superintendent of elephants) as the ritual's conclusion.