అగ్ని రువాచః-
వారాణసీ పరం తీర్థం గౌర్యై ప్రాహ మహేశ్వరః ।
భుక్తిముక్తిప్రదం పుణ్యం వసతాం గృణతాం హరిమ్.
రుద్ర ఉవాచః
గౌరి క్షేత్రం నముక్తం వై అవిముక్తం తతః స్మృతమ్ ।
జప్తం తప్తం హుతం దత్తమఖము కేకీకిలాశయమ్.
అశ్మనా చరణే హత్వా వసేల్కొశీం న హి త్యజేత్ ।
హరిశ్చన్దం పరం గుహ్యం గుహ్యమావ్రత కేశ్వరమ్.
జ ప్యేశ్వరం పరం గుహ్యం గుహ్యం శ్రీపర్వతం తథా ।
మహాలయం 'పరం గుహ్యం భృగుక్చణేశ్వరం తథా.
కేదారం పరమం గుహ్యమష్టా సన్యవిముక్త కే ।
గుహ్యానాం పరమంగుహ్యమవిముక్తం పరం మమ.
ద్వియోజనం తు పూర్వం స్యాద్యోజనార్ధం తదన్యథా ।
వరణా చ నదీ చాసీన్మధ్యే వారాణసీ తయో.
అత్ర స్నానం జపో హోమో మరణం దేవపూజనమ్ ।
శ్రాద్ధం దానం నివానశ్చ యద్యత్స్యాద్భుక్తిముక్తిదమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వారాణసీమాహాత్మ్యం నామ ద్వాదశాధిక శతతమోధ్యాయః.
అగ్ని దేవుడు చేప్పెను. వారాణసి అత్యుత్తమ మైన తీర్థము. శ్రీహరి నామస్మరణ చేయుచు అచట నివసించువారు భుక్తిముక్తులను పొందుదురు. పరమేశ్వరుడు పార్వతితో వారాణసీమాహాత్మ్యము నీవిధముగ వర్ణించిచేప్పెను? పార్వతీ! నే నీ క్షేత్రమును ఎన్నడును విడువను. కావుననే దీనికి అవిముక్త మని పేరు వచ్చినది. ఈ అవిముక్త క్షేత్రమునందు చేయు జపతపోహోమములు ఆక్షయఫలము నిచ్చును. రాయతో రెండు కాళ్లు విరగగొట్టుకొని యైనను కాశీని విడువకుండ పడియుండ వలెను. హరిశ్చంద్ర.ఆమాతకేశ్వర-జప్యేశ్వర-శ్రీపర్వతమహాలయ-భృగు-చండేశ్వర-కేదార తీర్థములను ఎనిమిదియు ఈ ఆవిముక్త క్షేత్రమున పరమగోపనీయము లగు తీర్థములు. నా ఆవిముక్త క్షేత్రము గోపనీయములలో కెల్ల గోపనీయము. అది రెండు యోజనములు, పొడవు, ఆర్ధయోజనము వెడల్పు ఉన్నది. వరణ అసీ అను నదుల మధ్య ‘వారాణసి' ఉన్నది. ఇచట జరుగు స్నాన–జపహోమ-మృత్యు దేవపూజన-ద్ధ-దాన- నివాసాదులవలన భుక్తిముక్తులు రెండును లభించును.
ఆగ్నిమహాపురాణముందు వారాణసీ మాహాత్మ్య వర్ణన మను నూటపండ్రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 112 of the Agni Purāṇa is as follows:
The second of the garbhādhāna-group saṃskāras, performed in the third month of pregnancy, is detailed. Agni prescribes the preparation of a specific medicinal mixture involving nyagrodha sprouts, dadhi, and ghṛta, administered through the right nostril to invoke a male child. Mantras from the Atharvaveda invoking Prajāpati and Viṣṇu accompany the rite. The chapter notes the proper muhūrta, the role of the husband in the ritual, and the prayer for a son endowed with brahma-tejas.