అగ్ని రువాచః-
నవమీవ్రతకం వక్ష్యే భుక్తిముక్త్యాదిసిద్ధిదమ్ ।
దేవీ పూజ్యాశ్వినే శుక్లే గౌర్యాఖ్యా నవమీ వ్రతమ్.
పిష్టకాఖ్యా తు నవమీ పిష్టాతీ దేవపూజనాత్ ।
అష్టమ్యామశ్వినే శుక్లే కన్యార్కే మూలభే యదా.
అఘార్ధనా సర్వదా వై మహతీ నవమీ స్మృతా ।
దుర్గా తు నవగేహస్థా హ్యే కాగారస్థితాథవా.
పూజితాష్టాదశ భుజా శేషాః షోడశ సత్కరాః ।
శేషాః షోడశహస్తాః స్యురజ్ఞనం డమరుం తథా.
రుద్రచడ్డా ప్రచడ్డా చ చణోగ్రా చణ్ణనాయకా ।
చణ్డా చజ్ఞవతీ పూజ్యా చజ్ఞరూపాతిచణ్ణకి.
క్రమాన్మధ్యే చోగ్రచణ్ణ దుర్గా మహిషమర్దినీ ।
ఓం దుర్గే దుర్గరక్షణి స్వాహా దశాక్షరో మన్తః.
దీర్చాకారాది మన్రాదిర్నవనేత్రే నమో నకః ।
షడ్భిః పదై ర్నమః స్వధా వషట్కారహృదాదికమ్.
అజుష్టాది కనిష్ఠ స్తం న్యస్యాజ్ఞాని ఆ పేచ్ఛివామ్ ।
ఏవం జపతి యో గుహ్యం నాసౌ కేనాపి బాధ్యతే.
కపాలం లేటకం మజ్జం దర్పణం తర్జనీం ధనుః ।
ద్వజం డమరుకం పాశం వామహ స్తేషు బిభ్రతీమ్.
శక్తిముద్దరశూలాని వజ్రం ఖడ్గం చ కుస్తకమ్ ।
శబ్దం చక్రం కలాం చ హ్యాయుధాని చ పూజయేత్.
పశుం చ కాలీ కాలీతి జప్త్వా ఖడ్గన మాతయేత్ ।
కాలి కాలి వజ్రేశ్వరి లోహదణాయై నమః.
తదుత్తం రుధిరం మాంసం పూతనాయై చ నైరృతే ।
వాయవ్యాం పాపరాక్షస్యై చరక్యై నమ ఈశ్వరే.
విదారికాయై చాగ్నేయ్యాం మహాకాశికమగ్న యే ।
తస్యాగ్రతో నృపః స్నా యాచ్ఛత్రుం పిష్టమయం హరేత్.
దద్యాత్ స్కనవీశాఖాభ్యాం బ్రాహ్మ్యాద్యా నికితా యజేత్ ।
జయ స్త్రీ మజలా కాలీ భద్రకాలీ కపొలినీ.
దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహాస్వధా నమోస్తుతే ।
దేవీం పక్చామృతైః స్నాప్య పూజయేచ్చార్ఘణాదినా.
ధ్వజాదిరథయాత్రాదిబలిదానవరాదికృత్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే నవమీవ్రతనిరూపణం నామ పఞ్చాశీత్యధిక శతతమోధ్యాయః.
ఆగ్నిదేవుడు పలికెను; ఇపుడు భుక్తిముక్తిప్రదములగు నవమీవ్రతములను గూర్చి చెప్పెదను. ఆశ్వయుజ శుక్ల నవమినాడు గౌరీనవమీవ్రతము నాచరించి దేవీపూజ చేయవలెను. ఈ నవమికి ‘పిష్టకనవమి’ అని పేరు. ఈ వ్రతము చేయువాడు దేవీపూజ చేసి పిష్టాన్నమును భుజించవలెను. ఆశ్వయుజశుక్ల నవమినాడు మూలనక్షత్రముండి, సూర్యుడు కన్యారాశిగతు డైనచో ‘మహానవమి’ యని పేరు. ఆది సర్వపాపవినాశకము. ఆనాడు నవదుర్గలను తొమ్మిదిస్థానము అందు గాని, ఒక స్థానమునందు గాని స్థాపించి పూజించవలెను. మధ్యయందు ఆష్టాదశ భుజమహాలక్ష్మిని, రెండు పార్శ్వము లందును మిగిలిన దుర్గలను పూజించవలెను. నవదుర్గలను క్రింద చెప్పిన క్రమమున, అంజన-డమరుసహికలగా స్థాపించవలేను. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, పూజ్య, చండరూప, ఆచండిక-వీరందరి మధ్యయందు అష్టాదశభుజ యగు ఉగ్రచంగా మహిషమర్దనీ దుర్గను పూజించవలెను. “ఓం దుర్గే దుర్గ రక్షణి స్వాహా” అనునది దశాక్షరముతము ఈ విధానము ననుసరించి ఈ దళాక్షరమంత్రజపము చేయువానికి ఎవరినుండియు బాధలు కలుగవు. దుర్గాదేవి వామహస్తములందు కపాల -భేటక-ఘంటా-దర్పణ-తర్జనీముద్రా-ధనుష్-ధ్వజ-డమరు-పాశములను, దక్షిణహస్తములందు శక్తి-ముద్గర -త్రిశూల-వజ్ర –ఖడ్గ-కుంతక-శంఖ-చక్ర-శలాక లను ధరించి యుండును. ఈ ఆయుధ ములను కూడ పూజించవలెను. “కాలి కాలి వజ్రేశ్వరి లోహదడ్డాయై నమః” అను మంత్రము పఠించుచు ఖడ్గముతో బలి పశువును చంపవలెను. ఆ బలిపశువు రక్తమాంసములను “పూతనాయై నమః” అని నైరృతిదిక్కునందును, “పాపరాక్షస్యై నమః” అని వాయవ్యమునందును, “చర క్ర్యై నమః” అని ఈశాన్యమునందును, “విదారికాయై నమః” అని ఆగ్నేయము నందును ఆ దేవతల నుద్దేశించి సమర్పించవలెను. రాజు దాని ఎదుట స్నానము చేసి స్కందవిశాఖుల నిమిత్తమై పిష్ట నిర్మితశత్రుబలి ఇవ్వవలెను. రాత్రియందు బ్రాహ్మి మొదలగు శ క్తుల పూజ చేసి “జయంతి, మంగల, కాలి, భద్రకాలి, కపాలిని, దుర్గ, శివ, క్షమ,ధాత్రి, స్వాహా, స్వధా అను పేర్లు గల ఓ దేవీ; నమస్కారము.” ఇత్యాదిమంత్రములు పఠిం చుచు ప్రార్థించవలెను. దేవికి పంచామృతస్నానము చేయించి వివిధోపచారముతో ఆమెను పూజించవలెను. దేవిని ఉద్దేశించి చేసిన ధ్వజదానము, రథయాత్ర, బలిదానము సకలాభీష్టముల నొసగును.
అగ్ని మహాపురాణమునందు నవమీవ్రతవర్ణన మను నూటఎనుబదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 185 of the Agni Purāṇa is as follows:
Vratas on the ninth tithi, principally associated with Durgā, are described. The Gaurī-navamī on Āśvayuja-śukla-navamī and the Piṣṭaka-navamī involving flour-food offerings are noted. The Mahānavamī occurs when the Mūla-nakṣatra coincides with the ninth tithi while the Sun is in Virgo; on this occasion nine forms of Durgā are installed at the eight directions and centre, with the principal image being the aṣṭādaśabhuja Mahiṣamardinī. The ten-syllable Durgā-mantra "Oṃ durge durga-rakṣaṇi svāhā" is given as the japa-text. Nine Caṇḍā-forms—Rudracaṇḍā, Pracaṇḍā, Caṇḍogrā, and others—receive bali of khaḍga, blood, and flesh, and the four directional śaktis—Jayantī, Maṅgalā, Kālī, Bhadrakālī—are propitiated.