ఈశ్వర ఉవాచః-
ఓం హ్రూం హంస, ఇతిమంత్రేణ మృత్యురోగాది కామ్యతి ।
లక్షా హుతిభిర్దూర్వాభిః శాంతిం పుష్టిం ప్రసాధయేత్.
అథవా ప్రణవేనైవ మాయయావా షడానన ।
దివ్యా న్తరిక్ష భౌమానాంశాంతి రుత్పాత వృక్ష కే.
ఓం నమోభగవతి గంగే కాలికాలి మహా కాలికాలి మాంస
శోణిత భోజనే ర క్తకృష్ణ ముఖి వశమానయ, మానుషాన్ స్వాహా।
ఓ లక్షం జప్త్వాదశాంశే న హుత్వాస్యాత్పర్వ కర్మకృత్ ।
వశంనయతి శక్రాదీన్మా ను షేష్వేషు కాకథా
ఆంతర్ధాన కరీవిద్యా మోహినీ జృంభణీతథా ।
వశంనయతి శత్రూణాం శత్రుబుద్ధి ప్రమోహినీ.
కామధేనురియం విద్యాసప్తధా పరికీర్తితా ।
మంత్రరాజం ప్రవక్ష్యామి శత్రుచౌరాది మోహనమ్.
మహాభయేషు సర్వేషు స్మర్తవ్యం హరపూజితమ్ ।
లక్షం జప్త్వాతిలైర్హోమః సిధ్యదుద్ధారకం శృణు.
ఓం హరేశూలే ఏబ్రహ్మసత్యేన విష్ణుసత్యేన రుద్రసత్యేన రక్షమాంవాచేశ్వరాయ స్వాహా. దుర్గాత్తార యతేయస్మా త్తేన దుర్గాశివామతా ।
ఓంచండ కపాలిని దంతాన్కిటికిటి క్షిటిక్షిటి గుహ్యేఫట్
హ్రీం, అనేన మంత్రరాజేన క్షాలయిత్వాతు తండులాన్.
త్రింశ ద్వారాణి జప్త్వాని తచ్చౌ రేషు ప్రదాపయేత్ ।
దంతై శ్చూర్ణాని శుక్లాని పతితాని హి శుద్ధయే.
ఓం జ్వలల్లోచన కపిల జటాభార భాస్వర విద్రావణ
త్రైలోక్య డామర డామర దరదర భ్రమభ్రమ ఆ
కట్ట ఆకట్ట తోటయ తోటయ మోటయ మోటయ
దహ దహ పచ వచ ఏవం సిద్దరుద్రో జ్ఞాపయతి యదిగ్ర
హోపగతః స్వర్గలోకం దేవలోకంవా ఆరామ విహారాచలం తథాపి
తమార్తయిష్యామి బలింగృహ్ణ గృహ్ణ దదామితే స్వాహేతి ।
క్షేత్రపాల బలిందత్త్వా గ్రహోన్యాసాద్వకం వ్రజేత్ ।
శత్రవో నాశమాయాన్తి రణేవైరి గణక్షయః.
హంసబీజన్తు విన్యస్యవిషన్తు త్రివిధం హరేత్ ।
ఆగురుచందనం కుష్ఠం కుంకుమం నాగ కేసరమ్.
నఖంవై దేవ దారుంచ సమంకృత్వాథ ధూపకః ।
మాక్షి కేణ సమాయుక్తో దేవవస్త్రాది ధూపనాత్.
వివాదే మోహనే స్త్రీణాం మండనే కల హే శుభః ।
క న్యాయా వరణే భాగ్యే మాయామంత్రేణ మంత్రితః.
హ్రీం రోచనా నాగపుష్పాణి కుంకుమంచ మనః శిలా।
లలాటే తిలకం కృత్వాయం పశ్యేత్సవశీ భవేత్.
శతావర్యాస్తు చూర్ణంతు దుగ్ధపీతంచ పుత్రకృత్ ।
నాగ కేసర చూర్ణంతు ఘృత పక్వన్తు పుత్రకృత్.
పాలాశ బీజ పానేన లభతే పుత్రకం తథా ।
పరమేశ్వరుడు చెప్పేను. “ఓం హ్రూం హంసః” ఆనుమంత్ర మంత్రముచే మృత్యురోగాదులు శమించును. ఈ మంత్రముతో ఒకలక్షదూర్వా హోమములు చేసి శాంతి పుష్టి లభించును. లేదా కేవల ప్రణవమునుగాని, మాయ బీజమును (హ్రీం) గాని జపించుట చే దివ్యాంతరిక్షభౌమ ఉత్పాతములు శమించును. ఉత్పాత వృక్షము కూడ శమించును. “ఓం నమోభగవతి” మొదలు సాహో వరకును వున్న మూలోక్త మంత్రమును లక్ష జపము చేసి దశాంశ హోమములు చేసిన వాడు సర్వకర్మలను సాధించును. ఇంద్రాదులను కూడ వశము చేసుకొనును. మనమ్యుల విషయము చెప్పవలెనా. ఈ విద్య అంతర్ధానకారిణీ మోహినీజృంభణి, శత్రుబుద్ధిని మోహింపచేయునది. ఈ కామధేను విద్య ఏడు విధములు శత్రుచోరాదులను మోహింపచేయునది. ఈశ్వర పూజితము సర్వ మహాభయముల యందు స్మరింపతగునది యగ మంత్రరాజమును చెప్పెదను. లక్ష జపించి తిల హోమము చేసినచో మంత్రము సిద్ధించును. దీని ఉద్దారములు వినుము. “ఓం హలే” మొదలు “సాహా” వరకును వున్న మూలో క్షమైనది మంత్రము. దుర్గ దుర్గమునుండి తరింప చేయునుగాన ఆమెకా పేరువచ్చినది. ఈమె మంగళ ప్రదురాలు. “ఓం, హ్రీం చండకపాలిని” మొదలు ఫట్ హీం వత కును వున్న మూలోక మంత్రమును జపించి బియ్యము కడిగి వాటిని ఈ మంత్రముతో ముప్పది పర్యాయములు అభి మంత్రించి వాటిని దొంగలకు పంచి పెట్టినచో ఆ బియ్యమునమలగనే వారి తెల్లటి దంతము పడిపోవును. వారు చౌర్య పాప విముక్తులగుదురు. “ఓం జ్వలల్లోచన మొదలు తేస్వాహా” అను మూలోక మంత్రముతో క్షేత్రపాలునకు బలియిచ్చి న్యాసము చేసినచో గ్రహము వశమగును. శత్రువులు నశింతురు రణ భూమియందు శత్రువులు హతులగుదురు. విష బీజ న్యాసముచే మూడు విధము:గు విషమును లేదా విఘ్న ములను హరించవచ్చును. ఆగురు చందన, కుష్ఠ, కుంకుమ, నాగ, కేసర, నఖ దేవదారువులను సమ ప్రమాణమున గ్రహించి నూరి ధూపము వేయవలెను. దీనిలో తేనె కలిపి దాని సుగంధముతో శరీర మును వస్త్రాదులను ధూపితము చేసినచో వివాదము శ్రీ మోహవము శృంగారము కలహము మొదలగు సమయములందు శుభఫలము లభించును. కన్యావరణ, భాగ్యోదయ సంబంధి కార్యము లందు కూడ సాఫల్యము లభించును. మాయా మంత్రము (హ్రీం)చే ఆభి మంత్రించిన రోచన నాగ కేసర కుంకుమ మనక్మిలలతో తిలకము ధరించి ఎవనిని చూచిన వాడు వశమగును. శతావరి చూర్ణమును పాలతో కలిపి తాగినచో పుత్రులు ఉత్పాదింప కలుగును. నాగ కేసర చూర్ణమును నేతిలో కలిపి తిన్నను పలాశ బీజములను నూరి త్రాగినను పుత్రోత్పాదకుడగును.
ఓం ఉత్తిష్ఠ చాముండే జంభయ జంభయ మోహయ మోహయ ఆముకం
వశమానయ వశమానయ స్వాహా.
షడ్ వింతాసిద్ధ విద్యాసా నదీతీరమృదా స్త్రియమ్.
కృత్వోన్న త్తర నేనైవ నామాలిఖ్యార్కపత్ర కే ।
మూత్రోత్సర్గం తతః కృత్వా జపేత్తా మానయేత్త్ర్సియమ్.
ఓం క్షుం సః వషడ్. మహామృత్యుంజయో మంత్రోజఫ్యాద్ధోమాచ్మ పుష్టికృత్ ।
ఓం హంసః, హ్రూం హం, సః, హ్రః, సౌం, స్కైః ।
మృతసంజీవనీ విద్యా అష్టార్ణా జయకృద్రణే.
మంత్రా ఈశాన ముఖ్యాశ్చ ధర్మకామాది దాయకాః ।
ఈశానః సర్వ విద్యానా మీశ్వరః సర్వ భూతానామ్.
బ్రహ్మ ణశ్చాధి పతిర్ర్బహ్మ శివోమేఽస్తు సదాశివోమ్.
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ।
తన్నో రుద్రః ప్రచోదయాత్.
ఓం అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోర ఘోర త రేభ్యస్తు సర్వతః.
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూ పేభ్యః ।
ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః ।
రుద్రాయ నమః కాలాయనమః కలవికరణాయ నమో
బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః ।
సర్వభూత దమనాయ నమో మనోస్మనాయ నమః ।
ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమః ।
భవే భవేనాతిభవే భవస్వమాం భవోద్భవాయ నమః.
పంచ బ్రహ్మాంగ షట్కంచ వక్ష్యేఽహం భుక్తిము క్తిదమ్ ।
ఓం నమః పరమాత్మనే పరాయ కామదాయ పరమేశ్వరాయ
యోగాయ యోగసంభవాయ సర్వకరాయ కురు కురు సత్య సత్య భవ భవ
భవోద్భవ వామదేవ నర్వకార్యకర పాపప్రశమన సదాశివ ప్రసన్న నమోఽస్తుతే స్వాహా.
హృదయం సర్వార్థదంతు సప్తత్యక్షర సంయుతమ్ ।
ఓం శివః శివాయ నమః శివః; ఓం హృదయే జ్వాలిని స్వాహా.
శిఖా; ఓం శివాత్మక మహా తేజః సర్వజ్ఞ ప్రభురావర్తయ మహా ఘోర కవచ పింగల నమః. మహాకవచ శివాజ్ఞయా హృదయం బంధ బంధ ఘూర్ణయ ఘూర్ణయ
చూర్ణయ చూర్ణయ సూక్ష్మ వజ్రధర వజ్రపాశ ధనుర్వజ్రా
శనివజ్ర శరీర మమ శరీర మనుప్రవిశ్య సర్వదుష్టాన్
స్తంభయ స్తంభయ హూమ్.
అక్షరాణాన్తు కవచం శతం పంచాక్షరాధికమ్.
ఓం ఓజసే నేత్రం ఓం ప్రస్చుర ప్రస్ఫుర తనురూప చట చట ప్రచట ప్రచట
కట కట వమ వమ ఘాతాయ ఘలాయ హుం హుం ఫట్ ఆ ఘోరాస్త్రమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే షడంగా ఘోరాస్త్రవర్ణనం నామ త్రయో వింశత్యధిక త్రిశతతమోఽధ్యాయః.
“ఓం ఉత్తిష్ఠ” మొదలు “స్వాహా” వరకును వున్న మూలో క్తమగు నది ఇరువది ఆరు అక్షరముల సిద్ధ విద్య. నదీ తీరమునందలి మట్టితో లక్ష్మీమూర్తి చేసి తత్తువులర సముతో మందార పత్రముపై ఇష్ట స్త్రీ నామమును వ్రాయవలెను. పిమ్మట మూత్రోత్సర్గము చేసి ఈ మంత్రమును జపించినచో ఆభిష్ట వశమగుమ. ఓం జూం (“క్షుం సః వషట్”) ఇది మహామృత్యుం జయ మంత్రము. దీని జప హోమములు పుష్టి కార్యములు “ఓం హం సః హ్రూం హూం స హ్రః స్కైః” యీ ఆష్ట వర్ణ మృత సంజీవని విద్య రణమునందు జయము నిచ్చును. ఈశానాదే మంత్రములు కూడ ధర్మకామాది దాయకములు “ఈశానః మొదలు భవోద్భ వాయనమః” యను వరకును మూలో క్షములు ఐదు ఈశానాది మంత్రములు. ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు పంచ బ్రహ్మ యొక్క ఆరు అంగములను చేప్పెదను. “ఓం నమః” పరమాత్మనే మొదలు “తేస్వాహా” వరకును వున్న డెబ్బది ఏడు అక్షరముల హృదయ మంత్రము మనోరథమును ఇచ్చును. ఓం శివ శివాయనమః” ఇది శిరో మంత్రము. ఓం శివ హృదయే జ్వాలినీ స్వాహా శిఖాయై వషట్ ఇది శిథా మం! తము ఓంశివాత్మక మొదలు “స్తంభయ హూం” వరకును వున్నవి ఒక నూరు ఐదు అక్షరముల కవచ మంత్రము ఓం ఓజసే యనునది నేత మంత్రము. ఓం “ప్రస్ఫుర” మొదలు “హుం ఫట్” వరకును వున్నది అఘోరాస్త్ర మంత్రము.
అగ్ని మహాపురాణమున షడంగా ఘోరాస్త్ర వర్ణనమను మూడువందల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 324 of the Agni Purāṇa is as follows:
The science of gemstones (ratnaśāstra) is expounded as a branch of both aesthetics and protective knowledge. Agni enumerates the nine principal gems (navaratna) — diamond (vajra), ruby (māṇikya), pearl (muktā), coral (pravāla), emerald (marakata), topaz (puṣparāga), sapphire (nīla), hessonite (gomeda), and cat's eye (vaiḍūrya) — and their presiding planets. For each gem, the chapter describes tests for genuineness versus flaws, the bodily and spiritual benefits of wearing a genuine stone set in the correct metal, and the dangers of a flawed stone. The rites for consecrating gems before wearing them are also prescribed.