ఆగ్ని రువాచః-
గయామాహాత్మ్యమాఖ్యా స్యే గయా తీర్ధోత్తమోత్తమమ్ ।
గయాసుర స్తపనే పే తత్తపస్తాపిభిః సురైః.
ఉక్తః క్షీరాబ్దిగో విష్ణు పాలయాస్మాన్గయాసురాత్ ।
తథోత్యుక్త్వాహరిర్దేత్యం వరం బ్రూహీతి చాబ్రవీత్.
దైత్యోబ్రవీత్సవితోహం భవేయం సర్వతీర్థత ।
తథోత్యుక్త్వా గతో విష్ణుర్థి త్యం దృష్ట్వా నరా హరిమ్.
గతాః శూన్యా మహీ స్వరే. దేవో బహ్మాదయః సురాః ।
గతా ఊచుర్ఘ రిం దేవాః శూన్యా భూ శ్రీదివం హరే .
దైత్యస్య దర్శనాదేవ బహ్మాణం చాబ్రవీద్దరి ।
యాగార్థం దైత్యదేవం త్వం ప్రార్థయ తిదశైః సహ.
తచుల్వా ససురో బహ్మా గయాసుర మఠా బ్రవీత్ ।
అతిథిః ప్రార్థయామి త్వాం దేహం యాగాయ.
పావనమ్. గయాసురస్త భేత్యుక్త్వాపతత్తస్య శిరస్యథ ।
యాగం చకార చలితే దేహి పూర్ణాహుతిం విభుః.
పువరహ్మాఐవీద్విమ్లం పూర్వకాలేజసులోచలత్ ।
విష్ణుర్ధర్మమథాహూయ ప్రాహ దేవమయీం శిలామ్.
ధారయధ్వం సురాః సర్వే యస్యాముపరి సత్తు తే ।
గదాధరో మదీయాథ మూర్తి స్టాస్యతి సామరైన్.
ధర్మః శిలాం దేవమయీం తచ్భుత్వాధారయత్పరామ్ ।
యాధర్మాద్ధర్మవత్యాం చ జాలా ధర్మవరా సుతా.
మరీచిర్భ్రహ్మణః పుతస్తామువాహ తపోన్వితామ్।
యథా హరిః శ్రియా రేమే గౌర్యాశమ్భుస్తథా తయా.
అగ్ని దేవుడు చెప్పెను. ఇపుడు నేను గయామాహాత్మ్యమును చేప్పెదను. గయ ఉత్తమతీర్ధములలో ఉత్తమ మైనది. గయడను, అసురుడు గొప్ప తపస్సు ప్రారంభించెను. దానిచే డేవతలు పీడితు లై క్షీరసాగరశాయి యగు విష్ణువు వద్దకు వెళ్ళి భగవంతుడా! నీవు గయాసురునినుండి మమ్ము రక్షించుము” అని ప్రార్థించిరి. అటులనే అని పలికి శ్రీమహా విష్ణువు గయాసురుని వద్దకు వెళ్ళి వరకు కోరుకొనుము అని పలికెను. “మహావిష్ణ నేను సకల తీర్థములకంటెన అతి పవిత్రుడను అగుదును గాక” అని గయుడు పలికెను. “అటులనే అగుగాక” అని పలికి శ్రీమహావిష్ణువు వెడలిపోయెను. పిదవ మానవు లందరును ఆ దైత్యుని దర్శనము చేసి “భగవంతుని చేరుచుండిరి భూమి శూన్య మైపోయెను. ఆపుడు బ్రహ్మాదిదేవతలు” మహావిష్ణువువద్దకు వెళ్ళి “దేవా! స్వర్గము భూలోకము కూడ శూన్య మైపోయినవి. ఆ దైత్యుని దర్శనము చేసికొనినంతమాత్రముననే ఆందరును నీ లోకమును చేరుకొనుచున్నారు అని పలికిరి. ఆ మాటలు విని శ్రీహరిబ్రహ్మ తో నీవు దేవతాసమేతుడవై వెళ్ళి యజ్ఞభూమిగా చేయుటకై నీ శరీరమునిమ్ము అని గయాసురుని కోరుము” అని పలికెను. బ్రహ్మ దేవతాసమేతుడై గయునిదగ్గరకు వెళ్ళి “దైత్యశేషా నేను అతిథి నైనీ ద్వారమువద్దకు వచ్చితిని. నీ పవిత్రశరీర మును యజ్ఞముకొరకై ఇమ్ము” అని కోరెను. “తథాస్తు” అని పలికి గయాసురుడు భూమిపై పరుండెను. బ్రహ్మ ఆతని శిరముపై యజ్ఞము ప్రారంభించెను. పూర్ణాహుతి సమయము వచ్చుసరికి, గయుని శరీరము కదలిపోయెను. అది చూచి బ్రహ్మదేవుడు విష్ణువుతో “దేవా! పూర్ణాహుతి సమయమున గయాసురుని శరీరము కదలి పోవుచున్నది” అని చెప్పెను. అపుడు విష్ణువు ధర్మదేవతను పిలిచి “నీవు అసురుని శరీరముపై ధర్మమయశిలను ఉంచుము. దేవతలందరును ఆ శిలపై కూర్చుండవలెను దేవతలతోపాటు నా గదాధరమూ ర్తికూడ ఆ శిలపై ఉండగలదు” అని పలికెను. ఆ మాట విని ధర్మ దేవత విశాల మగు దేవమయశిలను తీసికొని వచ్చి ఆ అసురుని దేహముపై ఉంచెను. (ఆ శిల కథ యిది):- ధర్మునకు తన భార్య యగు ధర్మవతి గర్భమున ధర్మవ్రత యను కుమార్తె జనించెను. అమె గొప్ప తపశ్శాలిని, బ్రహ్మ కుమార్త డైన మరీచిమహర్షి ఆమెను పరిణయమాడెను. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె, శివుడు పార్వతితో వలె, మారీచి ధర్మ వ్రతతో సుఖముగా నుండెను.
కుశ పుష్పాద్యరణ్యాచ్చహ్యానియాతిశ్రమాన్వితః ।
భుక్త్వా ధర్మవ్రతాం ప్రాహ పాదసంవాహనం కురు.
విశానస్య మునేః పాదౌ తāత్యుక్త్వా ప్రియాకరోత్ ।
ఏతస్మిన్నన రే బ్రహ్మ మునౌ సుస్తే తథాగత.
ధర్మవ్రతా చిన్ల యచ్చ కిం బ్రహ్మణం సమర్పయే ।
పాదసంవాహనం కుర్వే బ్రహ్మా పూజ్యో గురోర్దురు.
విచినః పూజయామాన బ్రహ్మాణం చారడాదిభిః ।
మరీచిస్తామపశ్యన శపో కీవ్యతిక్రమాల్,
శిలా భవిష్యసి కోరాద్ధర్మవ్రతాబ్రవీచ్చ తమ్ ।
పాదాభ్యం పరిత్యజ్య త్వద్గురుః పూజితోమయా.
ఆదోషాహం యతస్త్వం హి శాపం ప్రాప్స్యసి కజరాత్ ।
ధర్మవ్రతా పృథక్ శాపం ధారయిత్వా గ్నిమధ్యగాత్.
తపక్చచార వర్షాణాం నహస్రాణ్యయురాని చ ।
తతో విష్ణ్వాదయో దేవా వరం బ్రూహితి చాబ్రువన్.
ధర్మవ్రతాబవీద్దేవా కాపం నిర్వర్త యను మే దేవా ఊచుః
దతో మరీచినా శాపో భవిష్యతి న చాన్యధా.
శిలా పవిత్రా దేవాజొలతా త్వం. భవిష్యసి ।
దేవవ్రతా దేవశిలా సర్వదేవాదిరూపిణీ.
నర్వదేవమయీ పుణ్యా నిశ్చలా యాసురస్య హి
దేవవ్రతోవాచః-
యది తుష్టా స్థ మే సర్వే మయి తిష్ఠన్తు సర్వదా.
బ్రహ్మ విష్ణుక రుద్రాధ్యా గౌరీలక్ష్మీముఖాః సురాః ।
అగ్ని రువాచః
దేవవ్రతావచః శ్రుత్వా తథోత్యుక్త్వా దివంగతాః.
ఒకనాడు అడవినుంచి కుశ సమిధాదులు తెచ్చిన ఋషి చాల అలసిపోయేను. ఆతడు భోజనానంతరము ధర్మ తను తన పాదము లొత్తు మని యాజ్ఞాపింపగా ఆమె సరే నని అలసి యున్న ఆ మహర్షి పాదములను ఒత్తసాగెను. ముని నిద్రించెను. ఇంతలో బ్రహ్మ వచ్చెను. “నేను బ్రహ్మదేవునిని సత్కారములు చేయవలేవా, లేదా? మహాముని పాదము లొత్తవలేనా?” బ్రహ్మ గురువునకు గూడ గురువు నా భర్తకు కూడ పూజ్యుడు. ఆందుచే ఈయనను పూజించవలెను.” అని ఆలోచించి ధర్మవ్రత బ్రహ్మ ను పూజించుచుండెను. మేల్కొన్న ముని ధర్మవ్రత అచట లేకుండుట జూచి, ఆజ్ఞనుల్లంఘించినందులకు “నీవు శిలవు కమ్ము” అని ఆమెను శపించెను. అది విన్న ధర్మవ్రత కుపితురాలై , “మునీ! నీ చరణసేన విడచి: నేను నీకు కూడ హజూ డైన నీ తండ్రికి, పూజ చేసితిని. అందుచే నేను సర్వధా నిర్దోషురాలను. ఇట్టి పరిస్థితులలో కన్ను శపించితిరి. ఆందుచే నీకు గూడ శివునివలన కాపము లభించగలదు.” అని పలికి, శాస్త్రమును , దూరముగానుంచి, అగ్నిలో, ప్రవేచి వేలకొలది సంవత్సరములు తీవ్ర తపస్సు చేసెను. ఆ తపస్సుకు సంతసించిన విష్ణ్వాది దేవత్తల వరము కోరు శ్రీమదగ్ని మహాపురాణము కొను మని పలికిరి. “మీరు నా శాపమును తొలగింపుడు” అని ధర్మవ్రత ప్రార్ధించెను. దేవతలు పలికిరి పూజ్యురాలా! మరిచిమహర్షి ఇచ్చిన శాపము అన్యధా కాజాలదు. నీవు దేవతా చరణచిహ్న ములచే అంకిత మైన శరీరము గల పరమపవిత్ర మైన శిలగా అవగలవు. గయాసురుని శరీరమును స్థిరముగా నుంచుటకై నీవు శిలారూపమును ధరించవలసి యున్నది. అపుడు నీకు “దేవవ్రతా, దేవశిలా, సర్వదేవస్వరూపా, సర్వతీర్థమయీ, వుణ్యశిలా” అను పేర్లు లభింపగలవు. దేవవ్రత వలికెన దేవతలారా! మీరు నాపై అనుగ్రహించినచో బ్రహ్మ విష్ణురుద్రాది దేవతలుమ, గౌరీ లత్మ్యాది దేవులను నాపై సర్వదా ప్రకాశింతురు గాక.” అగ్ని దేవుడు పలికెను; దేవవ్రత మాటలు విని ఆ దేవత లందరును 'అట్లే అగుగాక' అని వలికి స్వర్గమునకు వెళ్ళిపోయిరి.
సా ధర్మేణాసురస్యాస్య ధృతా దేవమయీ శిలా ।
నశిలశ్చలితో దైత్యః సితారుద్రాదయస్తతః.
నదేవశ్చలితో దైత్యస్త తో దేవై కి పసాదితః
క్షీరాబ్దిగో హరిః ప్రాదాత్స్వమూర్తి శ్రీగదాధరమ్.
గచ్ఛను భోః స్వయంస్థాస్యేమూర్త్యా వై దేవగమ్యయా
స్థితో గదాధరో దేవో వ్యక్తావ్యక్తో థయాత్మకః.
నిశ్చలార్థం స్వయం దేవః స్థిత ఆదిగదాధరః ।
గదో నామాసురో దైత్యః నహతో విష్ణునా పురా.
తదస్థి నిర్మితా చాద్యా గదా యా విశ్వకర్మణా ।
ఆద్యయా గదయా పాతిప్రముఖా రాక్షసాహలో.
గదాధ రేణ విధివత్తస్మాదాది గదాధరః ।
దేవమయ్యాం శిలాయాం చ స్థితే చాదిగదారరే.
గయాసురే నిశ్చలేథ బ్రహ్మా పూర్ణాహుతిం దదౌ ।
గయాసురోజఐవీద్దేవాన్ కిమర్గం వళ్లతో హ్యహామ్.
విష్ణోర్వచనమాత్రేణ కిం న స్యాం నిశ్చలో హ్యహమ్।
ఆక్రాన్తో యద్యహం దేవా దాతుమర్హథ మే వరమ్.
ఆ దేవమయీ శిలనే ధర్మదేవక గయాసురుని శరీరము పై నుంచేను. కాని గయుడు శిలతో సహ కదల నారం భించెను. అది చూచి రుద్రాది దేవతలు కూడ ఆ శిలపై కూర్చుండిరి. ఆ దేవతలతో సహా అతడు కదల మొదలిడెను, అపుడు దేవతలు క్షీరసాగరముపై శయనించి యున్న విష్ణువును ప్రసన్ను ని చేసికొనగా శ్రీమహావిష్ణువు తన గదాధరమూర్తిని వారికిచ్చి “దేవతలారా మీరు వెళ్ళుడు. దేవగమ్య మైన ఈమూర్తి ద్వారా నేను ఈ విధముగ గయుని శరీరమం స్థిరముగా మండు నట్లు చేయుటకై సాక్షాత్ వ్యక్తావ్యక్తోభయస్వరూపుడగు గదాధారి యగు విష్ణువు అచట ఉండెను. ఆదిగదాధరు డన పేరుతో శ్రీమహావిష్ణువు అచట నున్నాడు. పూర్వము గదు డను ఒక భయంకరుడగు. రాక్షసుని శ్రీమహావిష్ణువు సంహరించగా, వాని ఎముకలతో విశ్వకర్మ గదను నిర్మించేను. అది “ఆదిగద” ఆ ఆదిగదతో గదాధరుడు హేతి మొద లగు రాక్షసులను సంహరించెను. అందుచే అతడు “అదిగదాధరుడు ఆయెను. దేవమయీశిలపై గదాధరుడు కూర్చుండగనే గయాసురుడు కదలకుండ నుండెను. అపుడు బ్రహ్మ పూర్ణాహుతి ఇచ్చెను. గయాసురడు దేవతలతో “మీరు నన్నిట్లు ఏల వంచించితిరి? శ్రీవిష్ణువు చెప్పినచో నేను స్థిరముగానుండ కుందునా! దేవతలారా మీరు నన్ను శిలాదులచే అణచి ఉంచినారు గాన నాకు వర మీయవలెను” అని పలికెను.
దేవా ఊచుః-
తీర్థస్య కరణే యత్వమస్మాభిర్నిశ్చలికృతః ।
విష్ణోః శమోర్ర్బహ్మణశ్చ క్షేత్రం తవ భవిష్యతి.
ప్రసిద్ధం సర్వతీరేభ్యః పితాదేర్బహ్మ లోకదమ్ ।
ఇత్యుక్త్వా తే స్థితా దేవా దేవ్య స్తిర్జాదయః స్థితా.
యాగం కృత్వా దదౌ బ్రహ్మా ఋత్విగ్యో దండాం తదా ।
పంచక్రోశం గయా క్షేత్రం ప్చశతజ్ఞ్చ చార్పయేత్.
గ్రామాన్స్వర్ణగిరీకృత్వా నదీర్దుగ్గమధు సవాః ।
సరోవరాణి దద్యాజ్మెర్భహూనన్నాదిపర్వఖాన్.
కామధేనుం కల్పతరుం స్వర్ణరూప్యగృహాణి చ ।
న యాచకున్తు విప్రేంద్రా అల్పానుక్త్వా దదౌ ప్రభు.
గయామాహాత్మ్య మ్ గయామాహాత్మ్యమ్
ధర్మయాగే ప్రలోభాలు ప్రతిగృహ్య ధనాదికమ్ ।
ఢిలా యదా గయాయాం తే శత్తేస్తే బ్రహ్మణా తదా.
విద్యావివర్ణిలా యూయం తృష్ణాయుక్తా భవిష్యథ ।
దుర్గాది వర్ణితా నద్యః శైలాః పాషాణరూపిణః.
బ్రహ్మాణం బ్రాహ్మణ్చాచున్నద్ధం గా పేన చాఖిలమ్ ।
జీవన్య ప్రసాదం నః కురు విప్రాంశ్చ సోబ్రవీత్.
తీర్థోపజీవికా యూయమాచన్గారం భవిష్యథ ।
యే యుష్మాన్ పూజయిష్య ని గయాయాయాగలో నరాః.
హవ్యకవ్యైర్ధనైః శ్రాద్ధేస్తేషాం కులశతం వ్రజేత్ ।
నరకాత్స్వర్గలోకాయ స్వర్గలోకాత్పరాం గతిమ్.
గయోపి చాకరోద్యాగం బహ్వన్నం బహుదక్షిణమ్ ।
గయాపరి తేన నామ్నా పాణ్డవా ఈజిరే హరిమ్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే గయామాహాత్మ్యం నామ చతుర్దశాధిక శతతమోధ్యాయః.
దేవతలు పలికిరి : తీర్థమును నిర్మించుటకై నీ శరీరము స్థిరముగా నుండు నట్లు చేయబడినది గాన నీ క్షేత్రము బ్రహ్మవిష్ణుమహేశ్వరుల నివాసస్థానము కాగలదు. . ఈ తీర్థము అన్ని తీర్థములకంటెను ఎక్కువ ప్రసిద్ధి పొందగ అదు. పితృదేవతలకు ఇది బ్రహ్మలోకము నిచ్చును” ఇట్లు పలికి దేవత లందరును అచటనే నివసించిరి. దేవీతీర్థాదు కూడ అచటనే నివాస మేర్పరచుకొనిరి. బ్రహ్మ యజ్ఞము పూర్తి చేసి ఋత్విక్కులకు దక్షిణగా ఐదు క్రోశుల దూరము గయా షేత్రమును ఏబది యైదు గ్రామములను సమర్పించెను. . అనేక మైన బంగారు పర్వతములను నిర్మించేను. పారు తేనె ప్రవ హించు నదుల నిచ్చెను. దధిమధువులతో నిండిన సరోవరములనిచ్చెను. అనేకమైన అన్నాదిపర్వతములను, కామధేను వును, కల్పవృక్షమును, వెండి బంగారముల గృహములను కూడ ఇచ్చేను. వీటి వన్నింటిని ఇచ్చుచు బ్రహ్మదేవుడు. ఆ బ్రాహ్మణులతో ఇట్లు పలికెను. “విప్రవరురాలా! ఇక మీరు వాకంటే తక్కువవానివద్దకు వెళ్ళి, ఎన్నడును యాచన చేయదు”. ఇట్లుపలికి అతడు ఆ వస్తువుల నన్నింటిని వారికి సమర్పించేను. తరువాత ధర్ముడు యజ్ఞము చేయగా లోభముచే ఆ బ్రాహ్మణులు అతని నుండి ధనాది దానములు స్వీకరించి గయలో ఉంటూండగా బ్రహ్మ వారిని శపించెను. “మీరు విద్యావిహీనులును లుబ్దులును అగుదురు గాక”. ఈ నదులలో ఇక పై క్షీరాదులు ఉండవు, ఈ సువర్ణ లములు కూడ శిల లైపోవును”, అపుడు బ్రాహ్మణులు బ్రహ్మతో ఇట్లువలికిరి “దేవా! మీ శాపముచే మా నర్వస్వము సష్ట మైపోయి వధి. మా జీవికకు ఏదైన మార్గము చూపుము”. బ్రహ్మదేవు డిట్లు పలికెను. “ఇటు పై మీ జీవిక ఈ తీర్థము ద్వారా జరగును. సూర్యచంద్రు లన్నంతవరకును మీరు ఈ వృత్తితోడనే జీవించగలరు. గయకు వచ్చువారందరును మిమ్మ లను పూజింతురు. హవ్య-కవ్య-ధన-శ్రాద్ధాదులతో మిమ్మును సత్కరించు వారి వంశములోనివారునూరు తరములవరకును స్వర్గమునకు వెళ్ళుదురు. స్వర్గములోనే ఉన్న వారు. ముక్తి పొందుదురు”. గయమహారాజు కూడ ఈ క్షేత్రమునందు బహ్వన్నదక్షిణలు గల యజ్ఞము చేసెను. అతని పేరుచేతనే గయానగరమునకు ఆ పేరు వచ్చినది. పాండవులు కూడ గయ వెళ్ళి అచట శ్రీమహావిష్ణువును పూజించిరి.
అగ్ని మహపురాణమునందు గయామాహత్మ్యవర్ణన మను నూటపదునాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 114 of the Agni Purāṇa is as follows:
The naming ceremony performed on the tenth or twelfth day after birth is described in full. Agni specifies the principles for selecting a name: it should indicate the deity under whose nakṣatra the child is born, contain an auspicious meaning, have an even number of syllables for a girl and odd for a boy. The ritual framework includes pūjā to Viṣṇu, Sūrya, and the pitṛs, followed by the father whispering the chosen name into the child's ear. The connection between a fitting name and the child's future character and dharmic destiny is emphasized.