అగ్ని రువాచః
దీక్షాది వక్ష్యేవిన్యస్య సింహవజ్రాకులేబ్జ కే ।
హే హే హుతీవజ్రదంత పురుపురు లులు లులు.
గర్జ గర్జ ఇహ సింహాసనాయనమః।
తీర్వగూర్ధ్వ గతా రేఖా చత్వారశ్చతతో భవేత్.
నవభాగవిభాగేన కోష్టకాన్కార యద్బుధః ।
గ్రాహ్యాదిశాగతాః కోష్ఠావిదిశాసు వినాశ యేత్.
బాహ్యేవై కోష్టకోణేషు బాహ్యరేఖాష్ట కంస్మృతమ్ ।
బాహ్యకోష్ఠస్య బాహ్యేతు మధ్యేయావత్ప మానయేత్.
వజ్రస్య మధ్యమం శృంగం బాహ్యరేఖా ద్విధార్థతః ।
బాహ్యరేఖా భవేద్వక్రా ద్విభంగాం కార యేద్భుధః.
మధ్యకోష్ఠం భవేత్పద్మం పీతకర్ణిక ముజ్జ్వలమ్।
కృష్ణేన రజసాఽఽలిఖ్య కులిశాసి శిరోర్ధ్వతా.
బాహ్యతశ్చతురస్రంతు వజ్రసంపుట లాంఛితమ్ ।
ద్వారే ప్రదాయేన్మంత్రీ చతురో వజ్రసంపుటాన్.
పద్మనామ భవేద్వామ వీథేచైవ సమాభవేత్ ।
గర్బం రక్తం కేసరాణి మండలే దీక్షితాః స్త్రియః.
జయేచ్చ పరరాష్ట్రాణి క్షిప్రం రాజ్యమవాప్నుయాత్ ।
మూర్తిం ప్రణవ నందీప్తాం హుంకారేణ నియోజయేత్.
మూల విద్యాం సముచ్చార్య మరుద్వ్యోమ గతాం ద్విజ ।
ప్రథమేన పునశ్చైవ కర్ణికాయాం ప్రపూజయేత్.
ఆగ్ని దేవుడు చెప్పెను. సింహాసనము నందున్న వజ్ర వ్యాప్తకమలము నందు మంత్రన్యాస పూర్వక దీక్షాది విధాన మును చెప్పెదను. “హే హే హుతి వజ్ర దంత పరుపురు, లు, లు, గర్ణ, గర్ణ, ఇహ సింహాస నాయ నమః.” ఇది సింహాసన పూజా మంత్రమా. నాలుగు నిలువు రేఖలు, నాలుగు ఆడ్డరేఖలు గీయగా తొమ్మిది కోష్ఠములు ఏర్పడును. నాగు దిక్కు లందును వున్న కోష్ఠ స్కలను వుంచి విదిక్కులందున్న కోష్ఠములను చెరిపి వేయవలెను. మిగిలిన కోక్షముల కోణముల వరకు వచ్చు రేఖల ఎనిమిది యుండును. బాహ్య కోష్ఠము యొక్క బాహ్య భాగమునకు సరిగా మధ్య యందు వజ్ర మధ్య శృంగ మగును. బాహ్య రేఖను రెండు భాగములు చేయగా యెంత రేఖార్ధ మగునో అంత శృంగము మాత్రమే వుండవలెను. బాహ్య రేఖ వక్రముగా నుండవలెను. దానిని రెండుగా విభజించవలెను. మధ్య కోష్టమును కమలాకారముగ మార్చి పీత వర్ణ మగు కర్ణిక ఏర్పరుప వలయును. నల్లటి చూర్ణముతో కులిశ చక్రమను ఏర్పరచి దానిపై శృంగము ఆకారము ఖడ్గాకార ములో వుండునట్లు చేయవలెను. చక్ర బాహ్య భాగమున చతురస్ర చక్రము వ్రాసి వజ్ర సంపుటముతో చిహ్ని తము చేయవలెను. భూపుర ద్వార మున నాల్గు వజ్ర సంపుటములు ఏర్పరుప వలయును. పవ్మవు వామ వీడియు సమముగా నుండవలయును. కమలము లోపలి భాగము కేసరములు ఎర్రగా నుండవలెను. మండలము నందు స్త్రీలకు దీక్ష ఇచ్చి మఠిత్ర జపానుష్ఠానము చేయించినచో రాజు శీఘ్రము గా ఇతర రాజ్యములను జయించును. తాను తన రాజ్యమును కోల్పోయినచో దానిని మరల పొందును. ఓంకారముచే సందీప్త మగు మూ ర్తిని హుంకారముతో నియు క్తము చేసి వాయ్వాకాశ బీజములతో స-పుటిత మగు మూల విద్యనుచ్చరించి ఆద్యంతము లందు కర్ణి క యందు పూజి-చవలెను. ప్రదక్షిణ క్రమమున ఒక్కొక్క అక్షర రూపమగు బీజములను ఉచ్చరించుచు కమల దళములపై పూజ చేయవలయును.
ఏవం ప్రదక్షిణం పూజ్య ఏకైకం బీజమాదిత: ।
దలమధ్యేతు విద్వాంగా ఆగ్నేయ్యాం పంచ నైరృతమ్.
మధ్వే నేత్రం దిశాస్త్రంచ గుహ్యకాంగేతు రక్షణమ్ ।
హుతయః కేసర సాస్తు వామ దక్షిణ పార్శ్వతః.
పంచపంచ ప్రపూజ్యాస్తు స్వైః స్వైర్మంత్రైః ప్రపూజయేత్ ।
లోకపాలాన్న్య సేదష్టౌ బాహ్యతో గర్భమండలే.
వర్ణాంతమగ్ని మారూఢం షష్ఠస్వర విభేదితమ్ ।
పంచదశేన చాక్రామ్న్ తం స్వై: స్వైర్నా మభిర్యోజయేత్.
శీఘ్రం సింహే కర్ణికాయాం యజే ద్గంధాదిభిః శ్రియే ।
అష్టాభిర్వేష్టయేత్కుంభైః మంత్రాష్ట గత మంత్రితైః.
మంత్రమష్టసహస్రంతు జప్త్వాంగానాం దశాంశ కమ్ ।
హోమం కుర్యాదగ్నికుండే వహ్ని మంత్రేణ చాలయేత్ .
నిక్షి పేద్ధృదయే నాగ్నిం శ క్తిం మధ్యేఽగ్ని గాం స్మరేత్ ।
గర్భాధానం పుంసవనం జాతకర్మచ హోమయేత్.
హృదయేన శతం హ్యేకం గుహ్యాంగే జనయేచ్చిఖిమ్ ।
పూర్ణాహుత్యాతు విద్యాయాః శివాగ్నిర్జ్వలితోభవేత్.
హోమయేన్మూల మంత్రేణ శతంచాంగం దశాంశతః ।
నివేదయే త్తతో దేవ్యా స్తతః శిష్యం ప్రవేశ యేత్.
ఆస్త్రేణ తాడనం కృత్వా గుహ్యాంగాని తతోన్య సేత్ ।
విద్యాంగై శ్చైవ నన్నద్ధం విద్యాంగేషు నియోజయేత్ .
పుష్పం శిక్షాపయేచ్చిష్య మానయే దగ్ని కుండకమ్ ।
యవై ర్గాన్యై స్తిలై రాజ్యైర్మూల విద్యాశతం హు నేత్.
స్థావరత్వం పురాహోమం సరీసృపమతః పరమ్ ।
పక్షి మృగ పశుత్వంచ మానుషం బ్రాహ్మ మేవచ
విష్ణుత్వం చైవ రుద్రత్వమనే పూర్ణాహుతిర్భవేత్ ।
ఏక యాచైవ హ్యా హుత్యా శిష్యః స్యాద్దీక్షితోభవేత్ .
అధికారో భవేదేవం శృణు మోక్షమతః పరమ్ ।
దళముల పై విద్యాంగములను పూజించవలెను. ఆగ్నేయము నుండి వామ క్రమమున నైఋతి దిక్కు వరకు హృదయ శిరః శిఖా కవచ, నేత్రములను అన్ని దిక్కు లందును అస్త్రమును పూజించవలెను. గుహ్యాంగ మువ రక్షా పూజను కేసరముల పై వామ దక్షిణ పార్శ్వము లందున ఐదేసి హుతులను వాటి వాటి సోమ మంత్రములతో పూజించవలెను. గర్భ మండము వెలుపల ఎనమండుగురు లోక పాలకుల న్యాసము చేయవలెను. వర్ణాంతమును (క్ష హ) అగ్ని పై (ర) ఎక్కించి దానిని ఆరవ స్వరముతో (ఊ) భిన్నము చేసి పదునై దవ స్వరమును (0) దానిని శిరస్సుపై చేర్చి (క్షూం) లేదా (హూం) ఆ బీజమును ఆది యందుంచి దిక్పాలకులను తమ తమ నామ మంత్రములతో పూజించవలెను. పిదప శీఘ్రముగా సింహాసనముపై కమల కర్ణిక యందు గంధాద్యుప చారములతో పూజ చేయవలయును. దీనిచే ఐశ్వర్యము లభించును. పిదప నూట యెనిమిది మంత్రములతో ఆభి మంత్రితములగు ఎనిమిది కళలను కమలము చుట్టు వుంచి వెయ్యి పర్యాయములు జపము చేసి దశాంశము హోమము చేయవలయును. ముందు ఆగ్ని మంత్రముతో (రం) కుండము దగ్గరకు ఆగ్నిని తీసుకొని పోయి హృదయ మంత్రముతో (నమః) దానిని వుంచవలెను. కుండము నందు ఆగ్ని యుక్త మగు శ క్తిని భావన చేయవలెను. ఆ శక్తి యందు గర్భాధావ, పుంసవన జాతకర్మ సంస్కారములనుద్దేశించి హృదయ మంత్రమతో కూడ యెనిమిది పర్యాయ ములు హోమము చేయవలెను. గుహ్యాంగము నుండి నూతనాగ్ని జన్మించినట్లు భావన చేసి మూలవిద్యను నుచ్చరించుచు పూర్ణాహుతి నివ్వవలెను. దీనితో శివాగ్ని జన్మ సిద్ధించును. పిదప మూల మంత్రముతో దానిలో నూరుహోమములు చేసి అంగములనుద్దేశించి దశాంశ హోమము చేసి శిష్యుని దేవి చేతిలో సమర్పించి వానిని మండపము నందు ప్రవేశ పెట్టవలెను. అస్త్ర మంత్రముతో తాడనము చేసి గుహ్యాంగముల వ్యాసము చేయవలెను. విద్యాంగ ముంచే సన్నద్ధులగు శిష్యుని విద్యాంగము లందు ని యోగింపవలేను. వానిచే ఒక పుష్పమా విసిరినట్లు చేసి వానిని అగ్ని కుండ సమీపమునకు తీసుకొని వెళ్ళి మూల విద్యను ఉచ్చరించుచు యవధాన్య తిల మృతములతో నూరు హోమలు చేయవలెను. ప్రథమ హోమము స్థావర జన్మము నీచ్చి వానికి ముక్తి నిచ్చును. రెండవది సరిప్రుప జన్మను పిదప వరసగా పక్షి మృగ పశు మానవ జన్మమును ఇచ్చి దాని యందు విముక్తి నిచ్చును. పిదప క్రమముగ బ్రహ్మ విష్ణుపడ, రుద్ర పదము లభించును. ఆంతమున పూర్ణాహుతి ఇవ్వవలెను. ఒక ఆహుతిచే శిష్యుడు మోక్షాధికారి యగును. మోక్షమనగా యెట్లుండునో వినుము.
సుమేరుస్థో యదామంత్రీ సదాశివ పదేస్థితః.
పరేచ హోమయేత్స్వస్థోఽకర్మకర్మ శతాన్దశ ।
పూర్ణాహుత్యాతు తద్యోగీ ధర్మాధర్మైర్న లిప్యతే.
మోక్షం యాతిపరం స్థానం యద్గత్వాననివర్తతే ।
యథా జలేజలం క్షిప్తం జలం దేహీశివ స్తథా.
కుంభైః కుర్యాచ్చాభి షేకం జయరాజ్యాది సర్వభాక్ ।
కుమారీ బ్రాహ్మణీ పూజ్యా గుర్వాదేర్దక్షిణాం దదేత్.
యజేత్సహస్రమేకంతు పూజాం కృత్వా దినేదినే ।
తిలాజ్య వురహోమేన దేవీశ్రీః కామదాభ వేత్.
దదాతి విపులాన్భోగానందన్యచ్చ సమీహతే ।
జప్త్వాహ్యక్షర లక్షంతు నిధానాధి పతిర్భవేత్.
ద్విగుణేన భవేద్రాజ్యం త్రిగుణేన చ యక్షిణీ ।
చతుర్గుణేన బ్రహ్మత్వం తతో విష్ణుపదం భవేత్.
షడ్గుణేన మహాసిద్ధిర్ల క్షేణై కేన పాపహా ।
దశ జప్త్వా దేహశుద్ధ్యై తీర్థస్నాన ఫలం శతాత్.
వటేవా ప్రతిమాయాం వాశీఘ్రం వై స్థండిలేయ జేత్ ।
శతం సహస్రమయుతం జపే హోమేప్రకీర్తితమ్.
ఏవంవిధానతో జప్త్వా లక్షమేకం తు హోమయేత్ ।
మహిషాజ మేషమాంసేన నరజేన పు రేణవా.
తిలై ర్యవై స్తథా లాజైర్వ్రీహి గోధూమ కామ్రకైః ।
శ్రీఫలై రాజ్య సంయు క్తైర్హోమయిత్వా వ్రతంచ రేత్ .
అర్ధరాత్రేషు సన్నద్ధః ఖడ్గచాప శరాదిమాన్ ।
ఏక వాసా విచిత్రేణ రక్తపీతాసి తేనవా.
నీలేన వాథ వస్త్రేణ దేవీం తై రేవ చార్చయేత్ ।
ప్రజేద్దక్షిణ దిగ్బాగం ద్వా రేదద్యాద్బలిం బుధః.
దూతీ మంత్రేణ ద్వారాదౌ ఏకవృక్షేశ్మశాన కే ।
ఏవంచ సర్వకామాప్తిం భుంక్తే సర్వాం మహీం నృపః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే త్వరితా మూల మంత్రాది వర్ణనం నామైకాదశాధిక త్రిశతతమోఽధ్యాయః.
మంత్రోపాసకుడు సుమేరువు పై సదాశివ పదమునందున్న చో రెండవ దినమున స్వస్థచిత్తుడై కర్మ క్షయనిమి త్తమై వేయి హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చిన మంత్రయోగి ధర్మా ధర్మ సంబంధ శూన్యుడై మోక్షమును పొందును. అచ్చటి వెళ్ళి మళ్ళి తిరిగి రాడు జలములో పోసిన జలము దానితో కలసి ఏక రూపమైనట్లు జీవుడు. శివునితో కలసి శివ రూపుడగును. కలశలతో అభిషేకము చేసినవాడు విజయ రాజ్యాదులను పొందును. బ్రాహ్మణ కన్యకను పూజించి గుర్వాదులకు దక్షిణ ఇవ్వవలెను. ప్రతి దినము పూజ చేసి వెయ్యి హోమములు చేయవలెను. తిల ఘృతములతో హోము చేసినచో దేవిలక్ష్మిని, సమస్త కామములను ఇచ్చును. ఆనేక మైన భోగములను ఇచ్చి కోరిన కోరికలన్నియు తీర్చను. మత్రమంలో ఎన్ని అక్షర వలలున్నవో అన్ని లక్షల జపము చేయుటచే నిధులకు ఆధిపతి యగును. రెట్టింపు జపము చేసిన వాడు రాజ్యమును పొందుచు. మూడు రెట్లు జపము చేసినవానికి యక్షిణి సిద్దించును. నాలుగు రెట్లు జపము బ్రహ్మ పదం, ఐదురెట్లు ఎక్కువచేసిన విష్ణు పదము ఆరు రెట్లు ఎక్కువచేసిన మహాసిద్దియు లభించును. ఈ మంత్రమును లక్ష పర్యాయము జపించినచో పాపము నశించును. పది పర్యాయములు జపించినచో దేహశుద్ధి కలుగును. నూరు పర్యాయ ములు జపించినచో తీర్థస్నాన ఫలము లభించును. వేడక పై పటమును గాని, ప్రతిమను గాని వుంచి దాని మొదట లక్ష లేదా పదివేల జపము చేసి హోమము చేయవలెను. ఈ విధముగా జపము చేసి లక్ష హోమములు చేయవలెను. తిల యువ, లాజ, వ్రీహి గోధూమ, ఆమ్ర ఫలబిల్వ ఫలములను కలిపి వాటి పై నెయ్యిపోసి వాటితో హోమము చేసి వ్రతమును ఆవలంబించవలెను. రాత్రి కవచాదులు ధరించి ఖడ్గ ధన్బూణాదులు గ్రహించి ఏకవస్త్ర ధారియై పైన చెప్పిన వస్తువులతో దేవుని పూజించవలెను. వస్త్రము రంగు రక్తముగాని పీతముగాని కృష్ణము గాని నీలము గాని వుండవలెను. దక్షిణ దిశకు వెళ్ళి మండప ద్వారముపై దూతి మంత్రముతో బలి సమర్పించవలెను. ఈ బలి ద్వారాదులందుగాని, ఒక వృక్షము వున్న శ్మశానము నందుగాని ఇవ్వవచ్చును. ఇట్లు చేసిన సాధకుడు రాజ్యము పొంది సమస్త కామములను అను భవించుచు సకల పృథ్విని ఏలును.
అగ్ని మహాపురాణమున త్వరిలో మూలమంత్రాది వర్ణనయను మూడు వందల పదకొండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 311 of the Agni Purāṇa is as follows:
The science of horses (aśvaśāstra) is narrated by Agni to Vasiṣṭha, covering the mythic origin of the horse from the sacrificial fire, the classification of horses by breed, gait, and limb proportion, and the marks (lakṣaṇa) indicating auspiciousness or inauspiciousness in a horse. The four gaits — walk (dhīra), trot (pramita), canter (āvalita), and gallop (dhāvana) — are described along with their appropriate uses in battle and ceremonial contexts. The chapter includes prognostic signs by which a horse's lifespan, temperament, and military suitability may be assessed, and concludes with the horse-diseases and their treatments derived from Śālihotra's tradition.