అగ్ని మహా పురాణము

304 - అథ పంచాక్షరాది పూజాదికమ్

అగ్ని రువాచః

మేషః సంజ్ఞా విషం సాజ్యమ స్తి దీర్ఘోదకంరసః

ఏతత్పంచాక్షరం మంత్రం శివదంచ శివాత్మకమ్.

 తారకాది సమభ్యర్చ్య దేవత్వాది సమాప్నుయాత్

జ్ఞానాత్మకం పరంబ్రహ్మ పరం బుద్ధిః శివోహృది.

 తచ్ఛ క్తి భూతః నర్వేశో భిన్నో బ్రహ్మాది మూర్తిభిః

మంత్రార్ణాః పంచ భూతాని తన్మాత్రా విషయా స్తథా.

ప్రాణాది వాయవః పంచ జ్ఞాన కర్మేంద్రియాది చ

సర్వం పంచాక్షరం బ్రహ్మ తద్వదష్టాక్షరాత్మకమ్.

 గవ్యేన ప్రోక్షయేద్ధీక్షా స్థానం మంత్రేణ చోదితమ్

తత్రసంభూత సంభారః శివమిష్ట్వా విధానతః.

 మూల మూర్త్యంగ విద్యాభి స్తండుల క్షేపణాదికమ్

కృత్వాచరుం పచేత్క్షారం పున స్తద్విభజేత్త్రిధా.

 నివేద్యైకం పరం హుత్వా సశిష్యోఽన్యద్భజేద్గురుః

ఆచమ్య సక లీకృత్య దద్యాచ్ఛిష్యాయదేశికః.

దంతకాష్ఠంహృదా జప్తం క్షీరి వృక్షాది సంభవమ్

 సంశోధ్య దంతాన్ తం క్షిప్త్వా ప్రక్షాల్యైత త్ క్షి పేద్భువి.

 పూర్వేణ సౌమ్యవారీశ గతం శుభమతోఽ శుభమ్

పునస్తం శిష్యమాయాన్తం శిఖాబంధాది రూక్షితమ్.

కృత్వా వేద్యాం సహానేన స్వ పెద్దర్భాస్తరే బుధః

 సుషుప్తం వీక్ష్యతం శిషః ప్రభాతే శ్రావయేద్గురుమ్.  

అగ్ని దేవుడు పలికెను. మేషము (న) సంజ్ఞా విషము (మః) శకార పూర్వాక్షరము (శ) దానితో ఆక్షి (సి) దీర్ఘోదకము (వా) మరుత (య) ఇది పంచాక్షర మంత్రము (నమః శివాయ)  ఇది శివ స్వరూపము, మంగళప్రదము. దీనికి ఓంకారము చేర్చి జపించినచో దేవత్వాదులను పొందును. జ్ఞానాత్మక మగు పరబ్రహ్మయే పరమ బుద్ధి రూపము. ఆదియే శివ రూపమున హృదయము నందున్నది. శక్తి రూపము మగు ఆ సర్వేశ్వరుడే బ్రహ్మాది మూర్తులతో వున్నాడు. మంత్రము నందలి అక్షరములు ఐదు మహా భూతములు. ఐదు తన్మాత్రలు, ఐదు విషయములు, ఐదు ప్రాణాది వాయువులు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదుక ర్మేంద్రియములు ఐదు. ఇవన్నియు పంచాక్షర బ్రహ్మ స్వరూపమైనవి. అట్లే అష్టాక్షరాత్మకమైనవి. దీక్షా స్థానమును మంత్రోచ్చారణ చేయుచు పంచగవ్యములతో ప్రోక్షించవలయును. సంభారములు సమకూర్చుకుని శివుని పూజించి మూల మంత్రము కష్ట మూర్తికి సంబంధించిన మంత్రములు, అంగ మంత్రములు పఠించుచు అక్షతలను చల్లి భూతములను తొలగించుకొని ఆత్మ రక్షణ చేసికొనవలెను. పిదప చేరువు వండి మూడు భాగములు చేసి ఒక భాగము ఇష్ట దేవతకు నివేదన చేసి రెండవ భాగము ఆహుతి యిచ్చి మూడవ భాగము శిష్య సహితుడై తాను భుజించవలెను. పిదప ఆచమనసకలీకరణములు చేసి శిష్యుని హృదయ మంత్రముతో అభిమంత్రించి పాల చెట్టుకు సంబంధించిన కాన్షమును దంత ధావనార్థమై ఇవ్వవలేను. దానితో దంతములు శోధన చేసుకుని, దానిని చీరి నాలుక శుభ్రము చేసుకొని కడిగి నేలపై విసిరి వేయవలెను. తూర్పు వైపు విసిరిన ఆ దంత కాష్ఠము ఉత్తర ము వై పు కాని పశ్చిమము వైపు కొని వెళ్ళి పడినచో శుభ మగును. ఆట్లు కానిచో ఆశుభము. పిదప తన ఎదుటకు వచ్చుచున్న కమ్యునకు శిథా బంధముచే రక్షణ కల్పించి జ్ఞానవంతు డైన గురువు ఆతనితో కలిసి వేదిక పై నున్న కుళా స్తరణముపై నిద్ర పోవలయును. శిష్యుడు రాత్రి తాను చూసిన స్వప్నము ప్రాతః కాలమున గురువునకు చెప్పవలెను.

శుభైః  సిద్దిపదై ర్బ క్తిస్తైః పునర్మండలార్చనమ్ :

మండలం భద్రకా ద్యుక్తం పూజయేత్సర్వ సిద్ధిదమ్.

స్నా త్వా చమ్య మృదా దేహం మంత్రై రాలిప్య కల్ప్యతే

శివ తీర్థేనరః స్నాయాదఘ మర్షణ పూర్వకమ్.

హస్తాభి షేకం కృత్వాథ ప్రాయాత్పూజా గృహంబుధః

మూలేనాబ్జాసనం కుర్యాత్తేన పూరక కుంభ కాన్ .

ఆత్మానం యోజయిత్వోర్ధ్వం శిఖాన్తే ద్వాదశాంగులే

సంశోష్య దగ్ద్వా స్వతనుం ప్లావయేదమృతేనచ.

ధ్యాత్వా దివ్యం వపు స్తస్మిన్నాత్మానంచ పునర్న యేత్

కృత్వైవం చాత్మశుద్ధిః స్యాద్విన్యస్యార్చన మారభేత్.

క్రమాత్కృష్ణాసిత శ్యామ ర క్తపీతా నగాదయః

మంత్రార్ణా0 దండినాంగానీ తేషు సర్వాస్తు మూర్తయః.

అంగుష్ఠాదిక నిష్ఠా న్తం విన్యస్యాంగాని సర్వతః

న్య సేన్మంత్రాక్షరం పాదగుహ్య హృద్వక్త్ర మూర్ధసు.

హ్యావకం న్యస్య మూర్దాది మూలమంగాని విన్య సేత్

ర క్తపీత శ్యామసితాన్పీఠ పాదాన్ స్వకోణజాన్.

స్వాంగాన్మంత్రైర్న్య సేద్గాత్రాణ్య ధర్మాదీనిదిక్షుచ

తత్రపద్మం చ సూర్యాది మండల త్రితయం గుణాన్,

పూర్వాది పత్రే వామాద్యా నవమీ కర్ణికోపరి

వామాజ్యేష్ఠా క్రమాదౌద్రీ కాలీకల వికారిణీ.

బలవికారిణీ చాథ బలప్రమథనీతథా

సర్వభూత దమనీ చ నవమీ చ మనోన్మనీ.

 శ్వేతారక్తాసితా పీతా శ్యామా వహ్ని నిభాఽసితా

కృష్ణారుణాశ్చతాః శక్తీర్జ్వాలారూపాః స్మరేత్క్ర మాత్.

ఆ స్వప్నము శుభపై సిద్ధి సూచకమైనచో మంత్ర దేవతల విషయమున భక్తి కలుగును. పిదప మండలార్చ నము చేయవలయును. సర్వతో భద్రాది మండలములలో పూజించినచో సర్వ సిద్దులు కలుగును. స్నానాచమనములు చేసి మంత్రోచ్చారణ పూర్వకముగ శరీరమునకు మట్టి పూసుకొని శివతీర్థమునందు ఆమమర్షణ పూర్వకముగా స్నానము చేయవలెను. హ స్తశుద్ధి చేసికొని పూజాగృహమును ప్రవేశించి మూలమంత్రముతో కమలాసనమును భావనచేసి మూల మంత్రముతో పూరక కుంభక, ప్రాణాయామములు చేయవలెను. జీవాత్మను పైన బ్రహ్మరంధ్రమునందు వున్న పర మాత్మతో కలుపవలెను. శిరస్సు మొదలు శిఖాంతము వరకువున్న పన్నెండు అంగుళముల విస్తృత స్థానమే బ్రహ్మ రంధ్రము. వాయుబిజముతో శరీరమును శుష్కింపచేసి ఆగ్ని బీజముతో శరీరమును భస్మముచేసి అమృతబీజమతో ఆభ స్మ మును ఆప్లావితము చేయవలయును. దివ్యరూపధ్యానము చేయుచు జీవాత్మను మరల తన శరీరములో ఉంచుకొనవలెను. ఇట్లు చేయుటచే ఆత్మశుద్ధియగును. పిదప న్యాసము చేసి పూజ ప్రారంభించవలెను. పంచాక్షరిలోని ఐదు అక్షరముల వర్ణ ములు క్రమముగ కృష్ణ శ్వేత, శ్యామ, రక్త పీతములు. నకారాద్యక్షరములతో వరసగా అంగన్యాసము చేసి ఆ ఆంగ ముల పైననే తత్పురుషాది మూర్తి పంచకాది న్యాసము చేయవలెను. పిదప అంగుష్ఠము మొదలు కనిష్ఠిక వరకు ఐదు వేళ్ళపై క్రమముగా ఆంగ మంత్రములను న్యాసము చేసి పాద గుహ్య హృదయముఖ శిరస్సులందు మంత్రాక్షర న్యాసము చేయవలయును. పిదప శిరస్సు మొదలగు వాటియందు ఈ ఆంగముల వ్యాపక న్యాసము చేయవలయును మూల మంత్ర మును ఆంగమంత్రములను కూడ అచట న్యాసము చేయవలయును. ఆగ్నేయాది విదిక్కులందు ధర్మా పీఠపాదములు క్రమముగా రక్త పీత శ్యామ శ్వేత వర్ణములను ధావనచేసి వాటి పై మంత్రాక్షర వ్యాసము చేసి పూర్వాది దిక్కులందు ఆధర్మాదులను భావన చేసి వాటిపై అంగ మంత్రి వ్యాసము చేయవలెను . ఇట్లే యోగ పీఠమును దాని పై అష్టదళ కమల మను సూర్య సోమ ఆగ్ని మండలములను సత్త్వాది గుణత్రయమును భావన చేయవలెను . పూర్వాది దళములందు వామాది క క్త్యష్టకమును కర్ణిక పై తొమ్మిదవ శక్తి ని భావన చేయవలయును. వామా జ్యేషా రౌద్రీ కాళి, కల వికారిణీ వికారిణీ ప్రమథనీ సర్వ భూతద మనీ మనోన్మ నీయను ఈ శక్తులు జ్వాలా స్వరూపమలు. వీటి వర్ణములు క్రమముగ శ్వేత రక్త సితపీత శ్యామ అగ్ని సదృశ ఆసిత, కృష్ణ, ఆరుణములు . ఈవిధమాంగ భావన చేయవలెను.

 అన న్తయోగ పీఠేచ ఆవాహ్యాథ హృదబ్జతః

స్పటికాభం చతుర్బాహుం ఫలశూలధరం శివమ్.

సాభయం వరదం పంచవదనంచ త్రిలోచనమ్

పత్రేషు మూర్తయః పంచస్థాప్యా స్తత్పురుషాదయః.

పూర్వే తత్పురుషః శ్వేతోహ్య ఘోరోఽష్టభుజోసితః

చతుర్బాహు ముఖః పీతః సద్యోజాతశ్చ పశ్చిమే.

వామదేవః స్త్రీవిలాసీ చతుర్వక్త్ర భుజోఽరుణః

సౌమ్యే పంచాస్య ఈశానే ఈశానః సర్వదః సితః.

ఇష్టాంగాని యతాన్యాయ మనన్తం సూక్ష్మమర్చయేత్

సిద్దేశ్వరం త్వేక నేత్రం పూర్వాదౌదిశి పూజయేత్.

ఏక రుద్రం త్రినేత్రంచ శ్రీకంఠంచ శిఖండినమ్

ఐశాన్యాది విదిక్ష్వేతే విద్యేశాః కమలాసనాః.

శ్వేతః పీత: సితోరక్షో ధూమ్రో రక్తోఽరుణః సితః

శూలాశ నిశ రేష్వాస బాహవశ్చతు రాననాః.

ఉమా చండీశ నందీశౌ మహాకాలో గణేశ్వర:

వృషో భృంగరిటి స్కందాను త్తరాదౌ ప్రపూజయేత్.

కులికం శ క్తి దండౌచ ఖడ్గం పాశ ధ్వజౌ గధామ్

శూలం చక్రం యజేత్పద్మం పూర్వాదౌ దేవమర్చ్యచ.

తతోఽధి వాసితం శిష్యం పాయయేద్గవ్య పంచకమ్

ఆచాన్ తం ప్రోక్ష్య నేత్రా న్తైర్నేత్రే నేత్రేణ బంధయేత్.

ద్వారే ప్రవేశ యేచ్ఛిష్యం మండప న్యాథ దక్షిణే

సాసనాది కుశాసీనం తత్ర సంశోధ యేద్గురుః.

ఆదితత్త్వాని సంహృత్య పరమార్దేలయః క్రమాత్

పునరుత్పాద యేచ్చిష్యం సృష్టిమార్గేణ దేశికః .

న్యాసం శిష్యే తతః కృత్వాతం ప్రదక్షిణ మానయేత్

పశ్చిమద్వార మానీయ క్షేపయేత్కు సుమాంజలిమ్.

యస్మిన్పతంతి పుష్పాణి తన్నా మాద్యం వినిర్ధిశేత్

పార్శ్వే యాగభువః ఖాతే కుండే సన్నాభి మేఖలే.

శివాగ్నిం జనయిత్వేష్ట్వా పునః శిష్యేణ చార్చయేత్

ధ్యానేనాత్మని తం శిష్యం సంహృత్య ప్రలయకమ్రాత్.

పునరుత్పాద్య తత్పాణౌ దద్యాద్ధర్భాంశ్చ మంత్రీతాన్

పృథివ్యాదిని తత్త్వాని జుహుయాద్ధృదయాదిభిః.

ఏకై కస్య శతం హత్వా వ్యోమమూలేన హోమయేత్

హుత్వా పూర్ణాహుతీం కుర్యాద స్త్రేణాష్టాహతీర్హునేత్,

ప్రాయశ్చిత్తం విశుద్ద్యర్థం తతః శేషం సమాపయేత్

కుంధం సుమంత్రితం ప్రార్చ్య శిశుం పీఠేఽభి షేచయేత్.

శిష్యేతు సమయం దత్త్వా స్వర్ణాద్యైః స్వగురుం యజేత్

దీక్షా పంచాక్షర స్యోక్తా విష్ణ్వాదే రేవమేవహి.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే పంచాక్షర దీక్షా విధానం నామ చతురధిక త్రిశతత మోఽధ్యాయః.

అనంతయోగ పీఠము పై తన హృదయ పద్మములోనున్న శివుని ఆ “స్ఫటిక కాంతిని కలవాడు, నాలుగు బాహువులు కలవాడు, పంచవదనుడు త్రిలోచనుడు. అగు శివుని ఆవాహన చేయుచున్నాను" అని చెప్పుచు ఆవా హన చేయవలెను. పిదప కమల దళములపై తత్పురుషాది పంచమూర్తులను స్థాపించవలెను. తూర్పున తత్పురుషుడు శ్వేతవర్ణుడు. అష్ట భుజుడగు ఆఘోరుడు కృష్ణవర్ణుడు. సద్యోజాతుడు. పశ్చిమమున వుండును. అతనికి నాలుగు బాహువులు నాలుగు ముఖములు వుండును. వర్ణము పీతము. వామదేవరూపము స్త్రీతో ప్రకాశించును. అరుణవర్ణుడగు ఇతడు హాలుగు ముఖములతో నాలుగు భుజములతో ఉత్తరము నందుండను. ఈ శాన్య దిక్కునందున్న ఈళానునకు ఐదు ముఖము లుండును. ఆతడు శ్వేతవర్ణుడు సర్వకామ ప్రదాత పిదప అంగ దేవతలను యధోచితంగ పూజించి పంచ పంచాక ద్విష్ణునామానిపూర్వాది దిక్కులదు అనంత సూక్ష్మ సిద్దేశ్వశ ఏక నేత్రులను పూజించవలెను. ఈశాన్యాది విదిక్కులందు ఏకరుద్ర త్రినేత శ్రీ కంఠ, శిఖండులను, పూజించవలెను. వీరందరును విద్యేశ్వరులు. కమలాసనముపై కూర్చుందురు. వీరి శరీర కాంతి, క్రమముగ శ్వేత పీత సీత రక్తధూమ్ర రక్త అరుణనీలములు. వీరందరును చతుర్బుజుల. శూల అశని, శర, చాపమును ధరించి యుందురు. వీరికి ముఖములు కూడ నాల్గేసి యుండును. తృతీయ అష్టదళి కమలమునందు ఉత్త రాది దళ ముంపై ప్రదక్షిణ క్రమమున ఉమాచండీశనలదీశ మహాకాల గణేశ్వర వృషభ భృంగిరిటి, స్కందులను పూజించవలెను. పిదప పూర్వాది దిక్కులందు చతురస్రరేఖ పై ఇంద్రాది దిక్పాలకులను వారి అస్త్రములగు వజ్రశ క్తి ఖడ్గపాశ ధ్వజగదాశూల చక్రపద్మములను పూజించవలెను. ఈ విధముగా దేవతా పూజచేసి గురువు అధివాసితుడగు శిష్యునిచే పంచగవ్యపానము చేయించి, ఆచమనానంతరము ఆతనిని ప్రోక్షించవలెను. పిదప నూతన వస్త్రముచే "వౌషట్" యని ఉచ్చరించుచు ఆతని నేత్రములు బంధించి మండప దక్షిణ ద్వారమున ప్రవేశము చేయించికుళాసనముపై కూర్చుండ బెట్టి శోధనము చేయవలెను. పాంచ భౌతిక తత్త్వముల సంహారము చేసి క్రమముగా శిష్యుని పరమాత్మ విలీనుని చేసి పిదప సృష్టి మార్గముచే యాతనిని మరల పుట్టించవలెను. పిదప సౌమ్యని దివ్య శరీరముపై న్యాసము చేసి దక్షిణ క్రమమున పశ్చిమ ద్వారమునకు తీసుకొని వచ్చి వానిచే పుష్పాంజలి విసరునట్లు చేయవలెను. ఆ పుష్పములు ఏ దేవత శిరస్సు పై బడునో ఆదేవత నామమును ఆదియందుంఏ శిష్యునకు పేరు పెట్టవలెను. యజ్ఞభూమి ప్రక్క సుందరమగు వాభియు మేఖలయు యున్న అగ్ని కుండమునందు శివాగ్ని ని ఆవిర్భవింప చేసి తాను పూజించి శిష్యుని చేత కూడ పూజ చేయించవలెను. ఆశిష్యుని సంహార క్రమమున తనలో విలీనుని చేసుకొని మరల సృష్టి క్రమమున ఉత్పాదనము చేసి ఆతని హస్తమునందు అభి మంత్రితములగు కుశ లవుంచి హృదయాది మంత్రములతో పృథివ్యాది తత్త్వములను ఉద్దేశించి వాటి మంత్రము : తో వందచొప్పున హోమములుచేసి ఆకాశ తత్త్వమునకు కూడ నూరు హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి యిచ్చి ఆస్త మంత్రమును ఉచ్చరించుచు ఎనిమిడి హోమములు చేయవలెను. పిదప, విశుద్దీకొరకై ప్రాయ శ్చిత్తము చేసి, ఆభిమంత్రితమగు కఎ శను పూజించి, పీఠము పైనున్న శిష్యనకు అభిషేకముచేసి, ఆతనికి సమయా చారము ఉపదేశింపవలెను. శిష్యుడు స్వర్ణాదులను ఇచ్చి గురువును పూజించవలెను. ఇది శివపంచాక్షరీ దీక్ష; విష్ణ్వాది దేవతా మంత్రదీ. కూడ ఇట్లే చేయవలెను.

అగ్ని మహా పురాణమున పంచాక్షర దీక్షా విధాన మను మూడు వందల నాల్గవ అధ్యాయము సమాప్తము.