అగ్ని మహా పురాణము

293 - అథ మంత్ర పరిభాషా

అగ్ని రువాచః

మంత్ర విద్యా మహం వక్ష్యే భుక్తిముక్తి ప్రదం శృణు

వింశత్యర్ణాధికా మంత్రా మాలా మంత్రాః స్మృతా ద్విజ.

దశాక్షారాధికా మంత్రాస్త దర్వాగ్బీజ సంజ్ఞితాః

వార్ధ క్యే సిద్ధిదా హ్యేతే మాలా మంత్రాస్తు యౌవనే.

పంచాక్షరాధికా మంత్రాః సిద్ధిదా: సర్వదాపరే

స్త్రీ పుంన పుంసకత్వేన త్రిధాస్యుర్మం త్రజా తయః. :

స్త్రీ మంత్రా వహ్ని జాయాన్తా నమోఽ న్తాశ్చ నపుం సకాః

శేషాః పుమాం శస్తావస్తే శశ్యో చ్చాటన కేషు చ.

క్షుద్రక్రియా మయధ్వంసే స్త్రీ యోఽన్యత్ర నపుంసకాః

మంత్రావాగ్నేయ సౌమ్యాఖ్యాతారాద్య న్తార్ద యోర్జపేత్.

తారాన్త్యాగ్ని వియత్ప్రాయో మంత్ర ఆగ్నేయ ఇష్యతే

శిష్టః సౌమ్యః ప్రశస్తౌతే కర్మణోః క్రూర సౌమ్య యోః.

ఆగ్నేయ మంత్రః సౌమ్యః స్యాత్ప్రాయశోఽన్తే నమోఽన్వితః

సౌమ్య మంత్ర స్తథాగ్నేయః ఫట్కా రేణాన్త తోయుతః.

సుప్తః ప్రబుద్ధ మాత్రోవా మంత్రః సిద్ధిం న యచ్చతి

స్వాపకాలో మహా బాహో జాగరో దక్షిణా వహః.

ఆగ్నేయస్య మనోః సౌమ్యమంత్ర స్యైత ద్విపర్యయాత్

ప్రబోధ కాలం జానీయాదుభయో రుభయోరహః.

దుష్టర్క్షరాశి విద్వేషి వర్ణా దీన్వర్జయేన్మ నూన్

రాజ్యలాభోపకారాయ ప్రారభ్యారిః స్వరః కురూన్.

గోపాలక కుటీం ప్రాయాత్పూర్ణ మిత్యుదితా లిపిః

నక్షత్రేషు క్రమాద్యోజ్యౌ స్వరాన్త్యే రేవతీర్యుజౌ. 

వేలా గురుః స్వరాః శోణః కర్మణై వేతి బేదితాః

లిప్యర్ణా వశిషుజ్ఞేయా షష్ఠేశా దీంశ్చ యోజయేత్.

లిపౌ చతుష్పథ స్థాయామాఖ్యా వర్ణపదాం తరాః

సిద్ధాః సాధ్యా ద్వితీయస్థాః సుసిద్ధా వైరిణః పరే,

 సిద్ధాదీన్కల్పయే దేవం సిద్ధోత్యన్త గుణైరపి

 సిద్దే సిద్ధో జపాత్సాధ్యో జపపూజా హుతాదినా.

సుసిద్ధో ధ్యానమాత్రేణ సాధకం నాశ యేదరిః

దుష్టార్ణ ప్రచురోయః స్యాన్మంత్రః సర్వవినిన్దితః.   

అగ్ని దేవుడు పలికెను. వశిష్ఠా ! ఇపుడు భుక్తి ముక్తి ప్రదమగు మంత్ర విద్యను చెప్పెదను వినుము. ఇరువది కంటె అక్షరములు ఆధికముగల మంత్రములు మాలామంత్రము. పది అక్షరములు మించియున్న ఏ మంత్రములు. పదికి తక్కువ అక్షరములున్నవి బీజమంత్రములు. ఇవి వార్ధక్యమున సిద్ధినిచ్చును. మాలామంత్రములు యౌవనమున సిద్ధి నిచ్చును. ఐదుకు మించిన అక్షరము గల మంత్రములు అన్ని ఫలముల నిచ్చును. మంత్రజాతులు స్త్రీ పురుష నపుంసక భేదములచే మూడు విధములు. స్వాహాయనువది అంత మందు గలవి స్త్రీ ముత్రములు. నమః అనునది చివరగలు నపుంసక మంత్రములు. మిగిలినవి పురుషమంత్రములు, అవివశీకరణము నందును ఉచ్చాటనము వందును ప్రశస్తమై వవి. క్షుద్ర క్రియయందును. రోగశాంతి యందును. స్త్రీమంత్రములు మంచివి. నపుంసక మంత్రములు ఇతర కార్యములందు మంచివి. ఆగ్నేయములు సౌమ్యములు యని మంత్రములు రెండు విధములు. ఆది యందు ఓంకారము చేర్చినవి ఆగ్నేయములు, ఓంకారము చివర యున్నవి సౌమ్య మంత్రములు. వీటిని అన్ని చంద్ర నాడి సమయ ముస జపించ వలయును. ఓం, క్ష, ర, హ, అనునవి అధికముగా గల మంత్రములు ఆగ్నేయములు. మిగిలి నవి సౌమ్యములు. ఈ రెండును వరుసగా క్రూర సౌమ్యకర్మల యందు ప్రశస్తములు. ఆగ్నేయ మంత్రములు, ప్రాయశ: చివర సమః చేర్చుటచే సౌమ్యము లగును. సౌమ్య మంత్రము కూడ చివర ఫట్ చేర్చినచో ఆగ్నేయ మగును. మంత్రము నిద్రించినను అపుడే లేచినను సిద్ధి ప్రదము కాదు. హిమ నాడి చలించునపుడు ఆగ్నేయ మంత్రమునకు, నిద్రా సమయము, దక్షిణ నాడి చలించునపుడు జాగరణ సమయము. సౌమ్య మంత్రము యొక్క నిద్ర జాగరణ సమయములు ఇందుకు విపరీతముగ నుండును. రెండు నాడులు చలించునపుడు రెండు మంత్రములకు జాగరణ సమయము. చుష్ట నక్షత దుష్ట రాశి, శత్రు రూపాది అక్షరములు గల మంత్రములను తప్పక విడిచి వేయవలయును. “రాజ్య లాభోప కారాయ” మొదలు “లిపిః” వరకు ఉన్న శ్లోకములో మొదటి నుండి “పుల్లె” యను వరకును, లిపి చెప్పబడినది. ఈ వర్ణమాలను నక్షత్రములతో కూడ, అశ్విన్యాది క్రమమున చేర్చవలయును. “అం, అః” యను రెండును. సర్వదా రేవతీ నక్షత్రముతో చేరి యుండును. వా, లా, గౌ, రం, ఖు, రం, శో, నం, భా, య సంఖ్యలలో విభక్తములగు అకారాద్య క్షర ములు క్రమముగ మేషాది రాళుల లో వున్నట్లు గ్రహించ వలయును. శ, ష, స, హ, అను అక్షరములను ఐదవ దగు కన్యా రాశి యందు చేర్చవలెను. క్ష కారమును మీన రాశి యందు చేర్చవలెను. చతుష్కోణము నందున్న ప్రథమ కోష్టము నందలి నాలుగు పంక్తులు సిద్ధములు. రెండవ కోష్టము నందున్న నాలుగు పంక్తులు సాధ్యములు. మూడవ కోష్టము వందున్న నాలు గుపంక్తులు సుసిద్ధములు. నాలుగవ కోష్టమునందలి పంక్తులు ఆరి. సాధుకుని నామాద్యక్షరము ఏచతుష్కము వందపడునో ఆది వానికి సిద్ధచతుష్కమ. రెండవది సాధ్యము ఇట్లే గ్రహించవలెను. సిద్ధమంత్రము అత్యంత గుణ యుక్తము. దాని జపమాత్రముకనే సిద్ధికలుగును. సాధ్యమంత్రము జప పూజాదులచే సిద్ధించును. సుసిద్ధమంత్రము ధ్యాన మాత్రముచే సిద్ధించును. అరిమంత్రము సాధకుని వశింపజేయును. అధికముగ దుష్టవర్ణములు గల మంత్రము అందరిచేతను నిందింపబడినది. 

ప్రవిశ్య విధివద్దీక్షాభిషేకా వసానికామ్

శ్రుత్వాతంత్రం గురోర్లబ్ధం సాధయే దీప్సితం మనుమ్,

ధీరో దక్షః శుచిర్భకో జపధ్యా నాదితత్పరః

సిద్ధస్తపస్వీ కుశల స్తంత్రజ్ఞః సత్యభాషణః, 

నిగ్రహానుగ్ర హేశక్తో గురురిత్య ధీభియతే

శాంతో చాంతః పటుశ్బీర్ణ బ్రహ్యచర్యో హవిష్యభుక్.

కుర్వన్నా చార్య శుశ్రూషాం సిద్దోత్సాహీ సశిష్యకః

సతూపదేశ్యః పుత్రశ్చ వినయీవసుద స్తథా.

మంత్రం దద్యాత్సు సిద్ధౌతు సహస్రం దేశికం జపేత్

యదృచ్ఛయా శ్రుతం మంత్రం చలేనాథ బలేనవా.

పత్రే స్థితంచ గాథాంచ జనయేద్యద్య నర్థకమ్

 మంత్రంయః సాధయేదేకం జపహో మార్చనాదిభిః.

క్రియాభిర్భూరి భిస్తస్య సిధ్యన్తి స్వల్ప సాధనాత్

సమ్యక్సిద్ధైక మంత్రస్య నాసాధ్య మిహకించన.

బహుమంత్ర వతః పుంసః కాకథా శివఏవసః

దశలక్ష జపాదేక వర్ణో మంత్రః ప్రసిధ్యతి.

వర్ణ వృద్ధ్యా జపహ్రాస స్తేనాన్యేషాం సమూహయేత్ !

బీజాద్ధ్వితి గుణాన్మంత్రాన్మాలామంత్రే జప క్రియా.

సంఖ్యానుక్తౌ శతం సాష్ట సహస్రం వాజపాదిషు

జపాద్దశాంశం సర్వత్ర సాభిషేకం హుతం విదుః. 

శిష్యుడు అభిషేకాంత దీక్షయథావిధిగా గ్రహించి గురువు ద్వారా తంత్రోక్త విధానము తెలుసుకొని గురువు ఇచ్చిన ఆభీష్టమంత్రమును సాధించ వలెను. ధీరుడు, సమర్థుడు, పవిత్రుడు, భక్తి సంపన్నుడు, జప, ధ్యానాదితత్పరుడు సిద్ధుడు, తపశ్శాలి, కుశలుడు, తంత్రజ్ఞుడు, సత్యవాది, నిగ్రహానుగ్రహ సమర్థుడైన వాడే గురువు. శాంతుడు జితేంద్రియుడు సమర్థుడు, బ్రహ్మచారి హవిష్యమును తినువాడు, గురు సేవాతత్పరుడు మంత్ర సిద్ధికై ఉత్సాహముకలవాడు యైన వ్యక్తియే యోగ్యుడైన శిష్యుడు. అట్టి శిష్యునకును, తనపుత్రునకును. మంత్రోపదేశము చేయవలయును. శిష్యుడు వినయవంతుడై గురువునకు ధనమును ఇవ్వవలెను. గురువు ఆట్టి శిష్యునకు మంత్రోపదేశము చేసి తన్మంత్ర సిద్ధికై తాను సహస్ర జపము చేయవలయును. అకస్మాత్తుగా విన్నది వంచనచే కాని, బలముచేగాని పొందబడినది పుస్తకములలో వ్రాయబడి నది గాథలలో వున్నది యగు మంత్రము జపించకూడదు. ఆట్టు జపి.చినచో అనర్హము కలుగును. హోమ ఆర్చనా ఏ వివిధ క్రియలతో మంత్ర సాధన చేయువానికి స్వల్ప కాలమునందే మంత్ర సిద్ధికలుగును. ఒక్క మంత్రము నైనను, విధి పూర్వకముగ సిద్ది చేసికొనిన వానికి అసాధ్యమైనది యేదియు వుండదు. అనేక మంత్రముల సిద్ది సంపాదించిన వాని, మాహాత్మ్యము వర్ణనాతీతము. అతడు సాక్షాత్తు శివుడే. ఏకాక్షర మంత్రమును పదిలక్షలు జపించినచో సిద్దించును. మంత్రము నందలి వర్ణములు పెరిగిన కొలది జపసంఖ్య తగ్గును. ఈ విధముగ జపసంఖ్యను ఊహించుకొనవలయును. మాలా మంత్రము)ను బీజమంత్రము కంటే రెండు మూడు రెట్లు అధికము జపించవలెను. జపసంఖ్య చెప్పని మంత్రమును నూటయెనిమిది పర్యాయములు కాని, ఒక వెయ్యి యెనిమిది పర్యాయములుకాని జపించవలయును. జపములో దశాంశము హోమము తర్పణము చేయవలయును. 

ద్రవ్యానుక్తౌ ఘృతం హోమే జపేఽశక్తస్య సర్వతః

మూలమంత్రాద్ధశాం శః స్యాదంగాదీనాం జపాదికమ్.

జపాత్స శక్తి మంత్రస్య కామదా మంత్ర దేవతాః

సాధకస్య భవేత్తృప్తా ధ్యాన హోమార్చనాదినా.

ఉచ్చైర్జపాద్వి శిష్టః స్యా దుపాం శుర్దశభి ర్గుణైః

జిహ్వాజ పే శతగుణః సహస్రో మానసః స్మృతః. 

ప్రాజ్ముఖోఽవాజ్ముఖో వాపి మంత్రకర్మ సమారభేత్ ,

ప్రణవాద్యాః సర్వమంత్రా వాగ్యతో విహితాననః.

ఆసీనస్తు జపేన్మంత్రా న్దేవతా చార్యతుల్య దృక్

కుటీ వివిక్తా దేశాః స్యుర్దేవాలయ నదీ హ్రదాః.

సిద్దౌయ వాగూ పూపైర్వాపయో భక్ష్యం హవిష్యకమ్

 మంత్రస్య దేవతా తావ త్తిథి వారేషు వై జపేత్ .

కృష్ణాష్టమీ చతుర్దశ్యోర్గ్ర హణాదౌ చ సాదకః

దస్రౌయమోఽనలో ధాతా శశీ రుద్రోగురుర్దితిః.

సర్పాః పితరోఽథ భగోఽర్యమా శీతేతరద్యుతిః

త్వష్టా మరుత ఇంద్రాగ్నీ మిత్రేంద్రౌ నిరృతిర్జలమ్.

విశ్వేదేవా హృషీ కేశో హయవః సలిలాధిపః

అజైకపాద హిర్బుద్న్యః పూషా శ్విన్యాది దేవతాః.

అగ్నిర్దస్రావుమానిఘ్నౌ నాగశ్చంద్రో దివాకరః

మాతృదుర్గా దిశామీశః కృష్ణో వైవస్వతః శివః.

పంచదశ్యాః శశాంకస్తు పిత ర స్తిథి దేవతాః

హరో దుర్గా గురుర్విష్ణు ర్భ్రహ్మా లక్ష్మీర్ధనేశ్వరః.

ఏతే సూర్యాది వారేశా లిపిన్యాసోఽథకథ్యతే  

విశేష ద్రవ్యమును దేనిని చెప్పనప్పుడు హోమమునందు ఘృతమును ఉపయోగించవలయును. హోమా సమర్దుడు హోమమునకు బదులు జపసంఖ్యలో దశాంగ జపము చేయవలయును. అంగాది మంత్రములకు కూడ జపము చెప్పబడినది. సశక్తి కమగు మంత్రమును జపించుటచే (దేవతలు) మంత్ర దేవతలు అభీష్టఫలమును ఇత్తురు. సాదకుడు చేసిన ధ్యానహోమ అర్చనాదులచే తృప్తి చెందుదురు. ఉచ్చస్వరముతో జపము చేయుటకంటే ఉపాంశు జపము పది రెట్లు శ్రేష్ఠము. జిహ్వ మాత్రమే కథుపుచు చేసిన జపము నూరు రెట్లు శ్రేష్ఠము. మానసిక జపము వెయిరెట్లు శ్రేష్ఠము. మంత్ర జపమును పూర్వాభి ముఖుడై గాని, దక్షిణాభిముఖుడై గాని ప్రారంభించవలయును, మౌనము అవలంబించి విహితమైన ఆహారమును స్వీకరించుచు, ప్రణవాది మంత్రము న్నింటిని జపించవలయును. ఆసనముపై కూర్చుండి దేవతను ఆచార్యుని ఒక్కరుగా భావించుచు జపించవలయును. పర్ణశాల ఏకాంతమైన పవిత్ర ప్రదేశము, దేవాలయము సదీ తటాకాదుల తీరములు జపమునకు ఉత్తమ ప్రదేశములు. మంత్ర సిద్ధికోరువాడు గంజి, అపూపములు, పాలు, హవిష్యము ఆహారముగ తీసుకొనవలయును. సాధకుడు మంత్ర దేవతలకు సంబంధించిన తిథివారములందును కృష్ణపక్ష అష్టమి చతుర్ద శులయందును గ్రహణాది పర్వముల యందును మంత్రదేవతలను పూజించ వలయును. అశ్వివ్యాది నక్షత్రము లకు క్రమముగ అశ్వినీకుమారులు, యముడు, అగ్ని, ధాత, చంద్రుడు, రుద్రుడు, అదితి, బృహస్పతి, సర్పము, పితృదేవతలు, భగుడు, అర్యమ సూర్యుడు, త్వష్ట వాయువు ఇంద్రాగ్నులు, మిత్రుడు, ఇంద్రుడు జలము నిఋరుతి, విశ్వేదేవులు, :ష్ణువు వసుగణము, వరుణుడు, అజై కపాత్, అహిర్భుధ్యుడు, పూషయను వారు దేవతలు. ప్రతిపత్తు మొదలు చతుర్దశి వరకును తిథులకు, క్రమముగ , అగ్ని బ్రహ్మపార్వతి, గణేశుడు, సగము, స్కందుడు, సూర్యుడు, మహేశ్వరుడు, దుర్గ, యముడు, విశ్వేదేవతలు విష్ణువు, కామదేవుడు, ఈశ్వరుడు దేవతలు, పూర్ణమికి చంద్రుడును అమావాస్యకు పితృదేవతలును దేవతలు. శివుడు దుర్గ బృహస్పతి, విష్ణవు, బ్రహ్మ. లక్ష్మి కుబేరుడు వీర వరుసగ రవ్యాది వారములకు దేవతలు, ఇపుడు లిపిన్యాసమును చెప్పెదను. 

కేశాన్తేషుచ వృత్తేషు చక్షుషోః శ్రవణద్వయే,

నాసాగండౌష్ఠద న్తేషు ద్వే ద్వే మూర్దాస్యయోః క్రమాత్

 వర్ణాన్పంచను వర్గాణాం బాహుచరణ సంధిషు.

పార్శ్వయోః పృష్ఠతో నాభౌ హృదయే చక్రమాన్న్య నేత్

యాదీంశ్చ హృదయేన్య స్యేదేషాం స్యుఃసప్తదాతవః.

త్వగసృజ్మాంస మేదోస్థి మజ్జాశుక్రాణి ధాతవః

రసాద్వైశ్చ పయోన్తైశ్చ లిఖ్యన్తేచ లిపిశ్వరైః.

శ్రీకంఠోఽనన్త సూక్ష్మౌచ త్రిమూర్తిరమరేశ్వరః

అగ్నీ శోభావ భూతిశ్చ అధీశః స్థాణుకోహర:

దండీశో భౌతిక సద్యో జాతశ్చాను గ్రహేశ్వరః

ఆక్రూరశ్చ మహానేనః శరణ్యా దేవతా ఆమూః.

తతః క్రోధీశ చండౌచ పంబా న్తక శివోత్తమౌ

తథైవ రుద్రకూర్మౌచ త్రినేత్రశ్చతురాననః,

ఆజేశః శర్మ సోమేశౌతథా లాంగలి దారుకౌ

అర్ధనారీశ్వరశ్చోమా కాంతశ్చాషాడి దండినౌ.

అత్రిర్మీనశ్చ మేషశ్చ లోహితశ్చ శిఖీతథా

చగలండ ద్విరం డౌద్వౌ నమహాకాల బాలినౌ.

భుజంగశ్చ పినాకీచ ఖడ్గీశశ్చ బకః పునః

శ్వేతో భృగర్గుడీశాక్షాః క్షయః సంవర్తకః స్మృతః.

రుద్రాన్సశక్త కల్లిఖ్యా దీన్న మోఽనాన్విన్య సేత్ర్కమాత్

అంగాని విన్య సేత్సర్వే మంత్రాః సాంగాస్తుసిద్ధిదాః.

హృల్లేఖావ్యోమ సంపూర్వాణ్యే తాన్యంగాని విన్య సేత్

హృదాదీన్యంగ మంత్రాన్తైర్యోజయద్ధృదయేనమః.

స్వాహా శిరస్యథ వషట్ శిఖాయాం కవచేచహుమ్

వౌషణ్నేత్రేఽ స్త్రాయుఫట్ స్యాత్పం చాంగం నేత్రవర్ణితమ్.

నిరంగస్యాత్మనా చాంగంన్య స్యైతం నియుతం జపేత్

క్రమేణ దేవీం వాగీశాం యథోక్తాంస్తు తిలాన్హునేత్ .

లిపిదేవీ సాక్షసూత్ర కుంభ పుస్తక పద్మధృక్

కవిత్వాది ప్రయచ్ఛేత కర్మాదౌ సిద్ధ యేన్య సేత్. 

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మంత్రపరిభాషా నామ త్రినవత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః. 

ఆకారాది వర్ణములను సాధకుడు వరసగ, కేశాంతము, ముఖము, నేత్రద్వయము, శ్రవణద్వయము, వాసాపుట ద్వయము, కపోలద్వయము, ఓష్ఠద్వయము, హృదయము, ఊర్ద్వదంతపంక్తి , అధోదంత పంక్తి, వీటిపై “ఓం, ఆంనమః” కేశాంతేషు” ఇత్యాది విధమున చెప్పుచు, న్యాసము చేయవలయును. శిరస్సుయందు, ముఖ వృత్త మునందు, దక్షిణ బాహుమూలము నందు, దక్షిణ కూర్పరము నందు, దక్షిణ మణిబంధము నందు దక్షిణ హస్తాంగుళి మూలము నందు, ఓం, ఆం, నమః, యని ప్రారంభించి, ఓం, వం, నమః అను వరకు చెప్పుచు న్యాసము చేయవలయును. ఐదు వర్ధము - ఐదేసి వర్గమును, బాహుచరణ సంధుల యందును, పార్శ్వము లందును పృష్ఠ, నాభి, హృదయము లందును క్రమముగ వు-చవలయును. యకారాది వర్ణమును త్వక్, అస్మక్ మాంస, మేధస్సు, ఆస్తి, మజ్జ, శుక్రములను ఏడు ధాతువు లందను న్యాసము చేయవలయును. ప్రారంభ మున ప్రణవమును, ఆంతమున నమఃను చేర్చి లిపిశ్వర, మాతృకేశ్వర న్యాసము చేయవలయును. శ్రీకంఠ - అనంత. సూక్ష్మ - త్రిమూర్తి - అమరేశ్వర - ఆర్దీశ - భావ భూతి - తీతిశ స్థాణుక - హర - డఁడీశ - భౌతిక - సద్యోజాత - అనుగ్ర హేశ్వర - అక్రూర - మహా సేనులు స్వరమూర్తి దేవతలు. క్రోధీశ - చండీశ - పంచాంతక - శివోత్తమ - రుద్ర - కూర్మ త్రినేత్ర - చతురానన, అజేశ - శర్మ - సోమేక - లాంగలి - దాయిక - అర్ధనారీశ్వర - ఉమాకాంత - అషాడిన్ - దండిన్ - అద్రిమీన - మేష - లోహిత - శిఖి - చగలాడ - ద్విరండ – మహాకాల - కపాలి - భుజంగేశ - పినాకి - ఖడ్గీశ - బక - శ్వేత, భృగు - నకులీ - శివ - సంవర్తకులు ప్యంజన మూర్తి దేవతలు. శ్రీ కంఠాది రుద్రులను, వారి శక్తులతో క్రమముగ న్యాసము చేయవలయును. అంగముల న్యాసము కూడ చేయవల యును. అన్ని మంత్రములను సాంగము లైననే సిద్ధి ప్రదములగును. ఉల్లేఖకు వ్యోమ బీజము కలిపి ఈ అంగి న్యాసము చేయవలయును. హృదయాది ఆగముత్రములను అంతము నందు చేర్చి పలుక వలయును. హృదయమునందు “నమః” శిరస్సు నందు “స్వాహా”, శిఖ యందు “వషట్”, కవచము నందు “హూం” నేత్రము నందు వౌషట్, హస్రము నందు “ఫట్” చెప్పవలయుమ. నేత్ర న్యాసము లేనిచో పఃదాఁగ న్యాస మగును. మంత్రము నిరంగ మైనదో స్వరూపము చేతనే ఆంగ న్యాసము చేసి, వాగీశ్వరీ దేవీ మంత్రమును ఒక లక్ష జపించి దళాంశము తిల హోమము చేయ వలయును. లిపి దేవియైన వాగీశ్వరి తన హస్తములలో అక్షమాల, కలశం, పుస్తకము, కమలం ధరించి యుఁడును. కపిత్వాదులను ఇచ్చును. అందుచే జప కర్మాది సిద్ది కొరకై వాగీశ్వరి న్యాసము చేయవలయును. ఇట్లు చేయుటచే కవి కాని వాడు కూడ కవి యగును. మాతృకా న్యాసముచే అన్ని మంత్రములును సిద్ధించును. 

అగ్ని మహా పురాణమున మంత్ర పరిభాష యను రెండు వందల తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.