అగ్ని మహా పురాణము

248 - అథ పుష్పాది పూజాఫలమ్

అగ్నిరువాచః

పుష్పైస్తు పూజనాద్విష్ణుః సర్వకార్యేషు సిద్ధిదః

మాలతీ మల్లికా యూథీ పాటలా కరవీరకమ్.

యావన్తి రతిముక్తశ్చ కర్ణికారః కురంటకః

కుబ్జకస్తగరో నీపో బాణో బర్బరమల్లికా.

అశోకస్తిలకః కుందః పూజాయైస్యాత్తమాలజమ్

బిల్వపత్రం శమీపత్రం పత్రం భృంగరజస్యతు.

తులసీ కాల తులసీ పత్రం వాసక మర్చనే

కేతకీపత్ర పుష్పంచ పద్మం రక్తోత్పలాదికమ్.

నార్కం నోన్మత్తకం కాంచీ పూజనే గిరిమల్లికా

కుటజం శాల్మలీ పుష్పం కంటకారీభవం నహి.

ఘృత ప్రస్థేన విష్ణోశ్చ స్నానం గోకోటి సత్పలమ్

ఆఢకేన తు రాజాస్యాద్ ఘృత క్షీరైర్ధివం వ్రజేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే పుష్పాది పూజాఫలం నామాష్ట చత్వారింశదధిక ద్విశతతమోఽధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను : వసిష్ఠా! పుష్పములతో పూజించినచో శ్రీ మహావిష్ణువు అన్ని కార్యములను సిద్దింప చేయును. మాలతి, మల్లిక, గిలిమల్లిక, గులాబి, కనేగము, పొవంతి, అతిముక్తకము, కర్ణికారము, కురంటకము, తగరము, నీచము, దాణము, యూథిక, ఆశోకము, తిలకము, కుందము, తమాలము - ఈ పూవులతో పూజ శ్రేష్ఠము. బిల్వపత్రము, శమీపత్రము. భృంగరాజ పత్రము, తులసి, కృష్ణతులసి, వాసక పత్రము - ఇవి కూడ పూజకు తగినవి. కేతకీపత్ర-పుష్పములు, పద్మములు, రక్తకమలములుకూడ పూజలో గ్రాహ్యములు. జిల్లేడు, ధత్తూరము, గులివెంత, పర్వత మల్లిక, కుటజము, శాల్మలి, కటోరపుష్పము - ఇవి పూజానర్హములు. ప్రస్థము (నాలుగుసేర్లు) నెయ్యితో శ్రీమహావిష్ణువునకు ఆభిషేకము చేసినచో కోటి గోవుల దానము చేసిన ఫలము లభించును. ఒక ఆడకము ఘృతముతో అభిషేకము చేసినవాడు రాజ్యమును పొందును. ఘృతమిశ్రదుగ్ధముతో అభిషేకము చేసినవాడు స్వర్గమును పొందును.

అగ్నిమహాపురాణమునందు పుష్పాదిపూజాఫల కథనమను రెండువందల నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.