అగ్ని మహా పురాణము

287 - అథ గజ చికిత్సా

పాలకాప్య ఉవాచః

గజలక్ష్మీ చికిత్సాంచ లోమపాద వదామితే

 దీర్ఘహస్తా మహోచ్ఛ్వాసాః ప్రశస్తాస్తే సహిష్ణవః.

వింశత్యష్టాదశ నఖాః శీతకాలమదాశ్చయే

దక్షిణశ్చోన్నతోదంతో బృంహితం జలదోపమమ్.

కర్ణౌచ విపులౌ యేషాం సూక్ష్మబింద్వ న్వితా స్త్వతి

తేధార్వా నతథా ధార్యా వామనా యేత్వలక్షణాః.

 హ స్తిన్యః పార్శ్వ గర్భిణ్యో యేచ మూడ మతంగజాః

వర్ణం సత్త్వం బలం రూపం కాంతీః సంహననంజవః.

సప్తస్థితో గజశ్చే దృక్సంగ్రామేఽరీంజయేత్సచ

కుంజరాః పరమా శోభా శిబిరస్య బలస్యచ.  

పాలకాప్యుడు పలికెను. ఓ లోమపాదా! నీకు గజ లక్షణములను, గజ చికిత్సను చెప్పెదను. దీర్ఘములైన తొండము లుండి, దీర్ఘ శ్వాస తీసుకును గజములు సహన శక్తి కలవి. ఇరువది లేదా పదునెనిమిది నఖము లుండి శీత కాల మన మదమును స్రవించునవి ప్రశస్తములు కుడిదంతము ఎత్తుగా వున్న వి, మేమము వంటి బృంహితము కలవి విశాలమైన కర్ణములు కలిపి, చర్మ పై సూక్ష్మ బిందువులు, కలవియు యగు ఏనుగులను సంగ్రహించవలేను. పొట్టి లక్షణ హీనము లగు వాటిని సంగ్రహించరాదు. పార్శ్వ గర్బము గల ఆడ ఏనుగులను మూడోన్మత్త గజములను వుంచుకోన గూడదు. వర్ణము సత్వము, బలము, రూపము, కాంతి సంహననము, జవము యను ఏడు సల్ల క్షణములు గల గజము యుద్ధమున శత్రువులను జయించును. శిబిరమునకు, సేనకును గొప్పథ నిచ్చు నవియు గజములే. రాజులు ఏనుగుల వలననే విజయ మును కోరుకును చుందురు.  

ఆ దృతః కుంజరై శ్చైవ విజయ పృథివీక్షితా

పాకలేషచ సర్వేషు కర్తవ్య మనువాసనమ్.

మృత తైలాభ్యంగ యుక్తస్నానం వాతవివర్జితమ్

స్కందేషు చ క్రియా కార్యా తథాపాలక వన్నృపైః.

గోమూత్రం పాండు రోగేషు రజనీభ్యాం ఘృతం ద్విజ

 అనా హే తైల సిక్తస్య నిషేక స్తస్య శస్యతే.

లవణైః పంచభిర్మిశ్రా ప్రతిపానాయ వారుణీ

విడంగత్రి ఫలావ్యోష సైంధవైః కవలాన్కృతాన్.

మూర్ఛాస్తు భోజయేన్నా గం క్షౌద్రం తోయం చ పాయయేత్

అభ్యంగః శిరసః శూలే నస్యం చైవ ప్రశస్యతే.

నాగానాం స్నేహపుటకైః పాదరోగా నుపక్ర మేత్

పశ్చాత్కల్క కషాయేణ శోధనం చ విధీయతే.

శిఖితిత్తిరి లావానాం పిప్పలీ మరి చాన్వితైః

రసైః సంభోజయేన్నాగం వేపథర్యస్య జాయతే.

బాలబిల్వం తథాలోధ్రంధాతకి సితయానహ

ఆతీసార వినాశాయ పిండీం భుంజీత కుంజరః.

నస్యం కరగ్రహే దేయం ఘృతంలవణ సంయుతమ్

మాగధీ నాగరాజాజీయ వాగూర్ము స్త సాధితాః.

ఉత్కర్ణకేతు దాతవ్యా వారాహం చ తథార సమ్

 దశమూల కులత్థామ్ల కాక మాచీవి పాచితమ్.

తైలం శృంఖల సంయుక్తం గలగ్రహ గదాపహమ్

 అష్టభిర్లవణైః పిష్టైః ప్రసన్నా! పాయయేద్ధృతమ్.

మూత్రభంగేఽథ వాబీజం కథితంత్రా పుషస్యచ

త్వగ్ధోషేషు పిబేన్ని మ్బం వృషంవా క్వథితం ద్విపః.

గవాం మూత్రం విడంగాని కృమికోష్ఠేషుశ స్యతే

 శృంగ వేరకణాద్రాక్షా శర్కరాభిః శృతంపయః.

క్షతక్షయకరం పానం తథా మాంసరసః శుచః

ముద్గౌదనం వ్యోషయుత మరుచౌతు ప్రశస్యతే.

త్రివృద్వ్యోషాగ్ని దంత్యర్కశ్యామా క్షీరేభ పిప్పలీ

ఏతై ర్గుల్మహరః స్నేహః కృతశ్చైవ తథాపరః.

భేధనద్రావణాభ్యంగ స్నేహపానాను వాసనైః

సర్వానేవ సముత్పన్నా న్వి ద్రథీన్సము పాహరేత్.   

ఏనుగుల, అన్ని విధముల జ్వరమునందును ఆనువాసనము చేయవలయును. ఘృత తైలాభ్యంగ యుక్త మగు స్నానము వాత రోగ వినాశకము. స్కంద రోగమునకు కూడ పాలకమునందువలే ఏనుగులకు చికిత్స చేయవలయును. పాండు రోగమున గోమూత్రమును హరిద్రను ఘృతమును ఇవ్వవలెను. కలబంధమునందు శరీరమునకు తైలముపూసి స్నానము చేయించుట మంచిది. ఏనుగుకు పంచల వణయుక్తమగు మదిరను త్రాగించవలెను. మూర్ఛరోగము వచ్చిన ఏనుగుకు వాయు విడంగ, త్రిఫలా, త్రికటు, సైంధవముల గ్రాసమును తినిపించి మధు యుక్త మగు జలము త్రాగించ వలెను. శీరశ్శూల రోగమునందు అభ్యంగము నశ్యము ప్రక సతములు. తె లయుక్త పుటకములతో పాదరోగములకు చికిత్స ప్రారంభించి, పిదప కలకషాయముతో శోధనము చేయించవలెను. కంపన రోగముననున్న గజమునకు 18 తితి రి, లావపక్షుల మాం:మును పిప్పలి మరిచములు కలిపి తినిపించవలేను అతీసాన రోగమునందు బిలబిల్వ లోధ్రధానకీ, శర్కరలతో పిడి తినిపించవలేను, తొండమునకు రోగము వచ్చినపుడు లవణయుక్తమగు ఘృతమును నశ్యముగ ఇవ్వ వలెను. ఉత్కర్లక రోగము నందు మాగధి నాగరాజ జీర, లతో చేసిన గంజి వారాహీకందరసము ఇవ్వవలెను. దళ మూల కులుళ్ల ఆమ్ల కాక మాచి, లతో చేసిన తైలమును మిర్చితో కలిపి ఉపయోగించినచో గల గ్రహరోగము నశించును. మూత్రక్చురోగము నందు అష్టలవణయు క్తములగు సురను మృతమును, త్రాగించవలెను. లేదా త్రాపుష బీజ క్వాథమును ఇవ్వవలెను. చర్మ దోషమునందు నింబ, క్వాథముగానీ, వృషక్వాథ ముగాని ఇవ్వవలెను. కోష్ణ కుములను తొలగించుటకు గోమూత్ర వాయు విడంగ మురు ప్రశస్తములు, గాయములు మాన్పించుటకు శృంగి బేకకణ ద్రాక్ష, శర్కరలతో కాచి 5 జలము ప్రశస్త ము. మాంసరసము కూడ పాతకరము ఆ రుచిరోగమున వ్యోషయుక్తమగు పెసల అన్నము మంచిది త్రివృత్ వ్యోష ఆగ్ని, దంతి, ఆర్క, శ్యామ, క్షీర గజ పిప్పలులతో చేసిన స్నేహము గుల్మరోగములు పోగొట్టును. ఇట్లే గజ చికిత్స కుడు భేన ద్రావణ ఆక్యంగ స్నేహపావ, అనువాసనములతో గూగ అన్ని విధములగు విదధి రోగములను నశింపచేయవలెను.   

యష్టికం ముద్గసూ పేన శారదేశ తథా పిబేత్

బాలబిల్వై స్తథాలేపం కటరోగేషు కస్యతే.

విడంగేంద్రయవౌ హింగు సరలం రజనీద్వయమ్

పూర్వా హ్నేదాపయే త్పిండాన్సర్వ శూలోపశాంతయే.

ప్రధాన భోజనే తేషాం షష్టిక వ్రీహిశాలయః

మధ్యమౌయవ గోధూమౌ శేషాదంతిని చాధమాః.

యవశ్చైవ తథైవేక్షుర్నా గానాం బలవర్ధనః

నాగానాం యవసం శుష్కం తథా ధాతుప్రకోపనమ్.

మద క్షీణస్య నాగస్య పయః పానం ప్రశస్యతే

దీప నీయై స్తథా ద్రవ్యైః శృతోమాంసర నః శుభః.

వాయసః కుక్కురశ్చోభౌ కాకోలూక కులో హరిః

 భవేత్క్ష్ణొఇద్రేణ సంయుక్తః పిండోయుద్ధే మహాపది.

కటుమత్స్య విడంగాని క్షారః కోషాతకీపయః

హరిద్రచేతి ధూపోఽయం కుంజర స్వజయావహః.

పిప్పలీ సండు లాస్తైలం మాధ్వీకం మాక్షికం తథా

నేత్రయోః పరి షే కోయం దీపనీయః ప్రశస్యతే.

పురీషం చటకాయాశ్చ తథాపారావతస్యచ

క్షీరవృక్ష కరీషాశ్చ ప్రసన్నా యేష్టమంజనమ్.

అనేనాంజిత నేత్రస్తుకరోతి కదనంరణే

ఉత్పలానీచ నీలాని ముస్తం తగర మేవచ.

తండులోదక పిష్టాని నేత్ర నిర్వాపణం పరమ్

నఖవృద్ధౌ నఖచ్చే దస్తైల సేకశ్చ మాస్యపి.

శయ్యాస్థానం భవేచ్ఛాస్య కరీ షైః పాంసుభి స్తథా

శరన్ని దామయోః సేక: సర్పిషాచతథేష్యతే.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే గజ చికిత్సా నామ సప్తా శీత్యధిక ద్విశతతమోఽధ్యాయః.    

గజమునకు కట రోగము నందు ముద్ద సూపముతో దష్టికమును కలిపి, బాల బిల్వములతో లేపము చేయవల యును. అన్ని విధముల శూలములను తొలగించుటకు దివ పూర్వ భాగమున పిడంగ, యింద్ర, యవ, హింగు వివిధ హరిద్రా పిండములను ఇవ్వవలెను. ఏనుగులకు ఉత్తమ భోజనము. యితర భక్ష్యములు ఆధమ భోజనము యవలు ఇస్తువు ఏనుగులకు బలమును పెంచును. శుష్క తృణము ధాతు ప్రకోపము కల్గించును. క్షీణించిన మనము గల గజమువకు పాలు త్రాగించుట ఆగ్ని దీప్తిని కలిగించు ద్రవ్యము. వండిన మాంస రసము లాభకరములు. వాయస, కుక్కుర కాక ఉలూక, హరులను కౌద్రముతో కలిపి పిండము చేసి, యుద్దము నందు మహా పద యందును ఇవ్వవలెను. కటు, మత్స్య, విడంగ లవణ కోశాతకీ క్షీర, హరిద్రలతో ధూపము వేసినచో ఏనుగ జయప్రద మగును. పిప్పలి తండులములు బియ్యము తైలము మాధ్వీకము, తనే వీటిని నేత్ర మందు వేసినచో యవి దీపనీయములు. చటక పురీషము, పార్వత పురీషము, క్షీర వృక్షము. మద్యము వీటితో చేసిన అంజనము ఏనుగులకు ఇష్టమైనది. ఈ ఆంజనము నేత్రములకు పూసిన ఏనుగు యుద్ధము నందు శత్రువును మర్దించును. నీని కమలములు ముస్తతగరము, వీటిని, తండు లోదకము నందు నూరి, ఏనుగుల నేత్రము లకు పెట్టినచో పరమ శాంతి నిచ్చును. గోళ్ళు పెరిగినపుడు వాటిని ఖండించ వలెను. ప్రతిచూసము తైలాభ్యంగనము చేయవలయును. ఏనుగులు శయనించు స్థానమున ఎండిన పేడ పరాగము యుండవలెను. శర ద్గ్రీష్మము లందు వీటికి ఘృత సేకము చేయుట ఉపయోగ కరము.

అగ్ని మహా పురాణమున గజ చికిత్స యను రెండు వందల యెనభై ఏడవ అధ్యాయము సమాప్తము.