అగ్ని మహా పురాణము

184 - అథాష్టమీవ్రతాని

 ఆగ్ని రువాచః-

బ్రహ్మాదిమాతృయజనాజ్ఞ పేన్మాతృగణాష్టమీమ్

కృష్ణాష్టమ్యాతి చైత్రమాసే పూజ్యాబ్దం కృష్ణమర్థభాక్ .

 కృష్ణాష్టమి వ్రతం వత్యే మాసే మార్గశిరే చరేత్

నక్తం కృత్వా శుచిర్భూత్వా గోమూత్రంప్రాళ యేన్ని శి.

 భూమిశాయీ నీళాయాం చ శ జ్కరం పూజయే ద్ర్వతీ

 పౌషే శమ్భుం మృతం ప్రాశ్య మా మే క్షీరం మహేశ్వరమ్.

మహాదేవం ఫాల్గునే చ తిలాశీ సముపోషితః

 చై తే స్థాణుం యవాశీ చ వై శాఖే థ శివం యజేల్.

 కుశోదాశీ పశుపతిం జ్యేషే శృజోడకాశనః

ఆషాఢ గోమయాశ్యుగ్రం శ్రావణే సర్వకర్మభుక్.

త్ర్యమ్బకం చ భాద్రపదే బిల్వపత్రాశనో నిశి

తఱులాశీ చాశ్వయుజే చేశం రుద్రం తు కార్తికే.

 దర్యాశీ హోమకారీ స్యాద్వర్షానే మణలే యజేత్

గోవస్త్ర హేమ గురవే దద్యాద్వి పేభ్య ఈదృశమ్.

ప్రార్థయిత్వా ద్విజాన్బోజ్య భుక్తిం ముక్తిమవాప్నుయాత్

నక్తాశీ త్వష్టమీషు స్యాద్వత్సరానే చ ధేనుదః.

పౌరన్దరం పదం యాతి స్వర్గశి వ్రతముచ్యతే

 అష్టమీ బుధవారేణ పక్షయోరుభయోర్యదా.

 తదా వ్రతం ప్రభుర్వీత హ్యథ వా సగుడాశిత

 తస్యాం నియమకర్తారో న స్యుః ఖణ్డితసమ్పదః.

అగ్ని దేవుడు పలికెను: చైత్రకృష్ణపక్షమున అష్టమీ వ్రత మాచరించి ఆ దినమున బ్రహ్మాదిదేవతలను, మాతృగణమును పూజించవలెను. ఒక సంవత్సరము పాలు కృష్ణపష్టములందు. శ్రీకృష్ణపూజ చేయు వాడు సంతాన మను పొందును. ఇపుడు కాలాష్టమీవ్రతము చేప్పెదను. ఈ వ్రతము మార్గశీర్షకృష్ణాష్టమినాడు చేయవలెను. రాత్రి మైనపిదప వ్రతము చేయు వాడు స్నానాదులచే పవిత్రుడై శివుని పూజించి,  గోమూ తముచే వ్రతఫారణము చేయవలెను. రాత్రియందు భూమిపై శయనించవలెను. పుష్యమాసమునందు శివుని పూజించి మృతాహారమును, మాఘమున మహేశ్వ రని పూజించి దుర్ఖాహారమును తీసికొనవలెను. ఫాల్గునమునందు మహాదేవుని పూజించి, ఉపవాసము చేసి తిలలు ఆహారముగా గ్రహించవలెను. చైత్రమునందు ‘స్థాణువును’ పూజించి యవలు భుజించవలెను. వైశాఖమున ‘శివుని’ పూజించి కుశ జల ముతో పారణ చేయవలెను. జ్యేష్ఠమున పశుపతిని పూజించి నదీజలము త్రాగవలెను. ఆషాఢమున ఉగ్రుని పూజించి గోమయమును భక్షించవలెను. శ్రావణమున శర్వుని పూజించి ముదారపుష్పము భుజించవలెను. భాద్రపదమునందు రాత్ర్యంబకుని పూజించి బిల్వపత్రమును భుజించవలెను. ఆశ్వయుజమున ఈశుని పూజించి బియ్యమును, కార్తికము నందు రుద్రుని పూజించి పెరుగు భుజించవలేను, సంవత్సరాంతమున హోమము చేసి, సర్వతోభద్రలింగమును నిర్మించి శంకరుని పూజించవలెను. పిదప ఆచార్యునకు గో-వస్త్ర-సువర్ణదానము చేయవలెను.  ఇతరులకు గూడ ఆది దానము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టినవాడు భుక్తిముక్తులను పొందును. ప్రతిమాసమునందును, అష్టమీ తిథులందు రాత్రిమాత్రమే భోజనము చేసి సంవత్సరాంతమునందు గోదానము చేయవలెను. ఇట్లు చేసినవాడు ఇంద్రపద మును చెందును. దీనికి స్వర్గతివ్రత మని పేరు. శుక్ల పక్షమునందు గాని, కృష్ణపక్షమునందు గాని అష్టమీబుధవార యోగము కలిగినపుడు వ్రతమాచరించి ఒక మారు భోజనము చేయవలెను. అష్టమీ వ్రతము చేయువావికి గృహైశ్వర్యాదు లకు లోప ముండదు.

తణ్డులస్యాష్టముష్టి నాం వర్జయిత్వాజులీద్వయమ్

భ క్తం కృత్వా చామ్రపుడే సకు శేసకులామ్బికామ్.

సాత్వికం పూజయిత్వాజం భుజాని చ కథాశ్రవాత్

శ క్తితో దక్షిణాం దద్యాత్కర్కటీం తణులాన్విరామ్.

ధీరో ద్విజోఒప్య భార్యా స్త్రీ రమ్బా పుత్రస్తు కౌశికః

దుహితా విజయా తస్య ధీరస్య ధనదో వృషః.

 కౌశిక స్తం గృహీత్వా తు గోపాలశ్చారయన్వృషమ్

 గఙ్ఞాయాం స్నానకృత్యేథనీతశ్చేరై ర్వృష స్తథా.

 స్నాత్వా వృషమపశ్యన వృషం మార్గాతుమాగతః

విజయా భగినీ యుక్తో దదర్శ స సరోవరే.

 దివ్యశ్రియోషితాం బృన్దమబ్రవీద్దేహి భోజనమ్

స్త్రీవృన్దమూచే వ్రతకృద్బుజ్వ త్వమతిథిరతః.

 వ్రతం కృత్వా స బుభుజే ప్రాప్తవాన్ వనపాలకమ్

 గతో ధీరః సవృషలో విజయాసహిత స్తదా.

 ధీరేణ విజయా దత్తా యమాయా నరితః పితా

వ్రతభావాతాశికోపి హ్యయోధ్యాయాం నృపోథవత్.

పితోస్తు నర కే దృష్ట్వా విజయా ర్తిం యమే గతా

మృగయామాగతం ప్రోచే ముచ్యతే నర కాత్కథమ్.

 వతద్వయాద్యమః ప్రోచే ప్రాప్య తతాశికో దదౌ

బుధాష్టమీద్వయఫలం స్వర్గతా పితరౌ తతః.

 విజయా హర్షితా చ కే వ్రతం భుక్త్యాదిసిద్దయే

అశోకకలికాశ్చాష్టా యే పిబ ని పునర్వసౌ.

చైత్ర మాసి సితాష్టమ్యాం న తే శోకమవాప్నుయుః

త్వమశోక హరాభీష్టం మధుమాససముద్భవ.

 పిబామి శోకస నపో మామశోకం సదా కురు

చైత్రాదౌ మాతృపూజాకృదష్టమ్యాం జయతే రిపూన్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అష్టమీవ్రతనిరూపణం నామ చతురశీత్యధిక శతతమోధ్యాయః.

రెండు వేళ్ళు విడచిన పిడికిలితో ఎనిమిది పిడికిళ్ళ బియ్యముతో అన్నము వండి దీనిని కుశయుక్త మైన మామిడాకుల దొన్నెలో ఉంచవలెను. కులాంబి కాసమేతు డగు బుధుని పూజించి, బుధాష్టమీవ్రతకథ విని భోజనము చేయ వలెను. పిదప బ్రాహ్మణులకు తండులసహిత మగు కర్కటి దానము చేసి, యథాశక్తిగా దక్షిణ ఇవ్వవలెను. (బుధాష్టమీవ్రత కథ): ధీరు డను ఒక బ్రాహ్మణు డుండెను. అతని భార్య పేరు రంభ; పుత్రుని పేరు కౌశికుడు. అతనికి విజయ అను ఒక పుత్రిక కూడ ఉండెను. అతనికి ధనదము అను ఒక ఎద్దు ఉండెను. కౌశికుడు ఆ ఎద్దును మేపుటకై గోపాలకులతో కలసి వెళ్లాను. కౌశికుడు గంగలో స్నా నాది కార్యములు చేసికొనుచుండగా ఒక దొంగ ఆ ఎద్దును అపహరించెను. స్నానము చేసి వచ్చిన కౌశికుడు ఎద్దును కానక దానిని వెదకుటకై సోదరి యగు విజయతో కలిసి బయలుదేరెను. ఇత డొక సరోవరము నందు కొందరు దేవతాశ్రీలసు జూచి భోజనము పెట్టమని అడిగెను. అపుడా దేవతాస్త్రీలు ఇట్లు పలికిరి- “నీవు మాకు ఆతిథిగా వచ్చినావు; అందుచే వ్రతము చేసి భోజనము చేయుము”. అపుడు కౌశికుడు బుధాష్టమీవ్రతము చేసి భోజనము చేసెను. వనరక్షకునివద్దకు వెళ్ళి తన ఎద్దును తీసికొని విజయతో తిరిగి వచ్చేను అతడు యథాకాలమున విజయకు వివాహము చేసి మరణానంతరము యమలోకమునకు పోయేను. వ్రతప్రభావముచే కౌశికుడు అయోధ్యకు రాజుఆయెను. తన తలిదండ్రులు నరకయాతన అనుభవించు  చూచి, విజయ యముని శరణుజూచ్చెను. కౌశికుడు వేటకొరకై వనమునకు వెళ్ళి నపుడు నా తలిదండ్రులు నరకమునుండి విముక్తు లేట్లగుదురు” అని ప్రశ్నించెను. అపుడు యముడు  ప్రత్యక్షమై “రెండు బుధాష్టమీవ్రతముని సలముచే విముక్తు లగుదురు” అని చెప్పగా కౌశికుడు రెండు బుధాష్ట్ర వ్రతముల ఫలములను తలిదండ్రులకు ధారపోసెను వారు స్వర్గమునకు వెళ్ళిరి. విజయకూడ సంతసించి భోగమోతాదిసిద్దికై ఈ వ్రతము వాచరించెను. చైత శుక్లాష్టమి పునర్వసునక్షత్రయుక్త మైనపుడు ఎనిమిది ఆశోకపుష్పముల మొగ్గల రసము త్రాగినవాడు ఎన్నడును శోకము పొందడు. చైత్రమునందు వికసించు ఓఆశోకమా! నీవు శంకరునకు చాల ఇషమైనదానవు. నేను శోకసంతప్తుడ నై నీ కలికల రసమును త్రాగుచున్నాను. నీ వలెనే నన్ను కూడ శోకరహితుని చేయుము” అను ఆర్థము గల ‘త్వామశోక’ ఇత్యాదిమంత్రము చెప్పుచు కలికార సపానము చేయవలెను, చైత్రాద్యష్టములందు మాతృగణ పూజ చేయువాడు శత్రువులపై  విజయమును సాధించుము.

ఆగ్ని మహాపురాణమునందు వివిధాష్టమీవ్రతవర్ణన మను నూట ఎనుబదినాల్గవ అధ్యాయము సమాప్తము.