అగ్ని మహా పురాణము

294 - అథ సర్పలక్షణాని 

ఆగ్ని రువాచః

నాగాదయోఽథ భావాది దశస్థానానికర్మచ

సూతకం దష్ట చేష్టేతి సప్తలక్షణ ముచ్యతే.

శేషవాసుకి తక్షాఖ్యాః కర్కటోఽబ్జో మహామ్బుజః

 శంఖ పాలశ్చ కులిక ఇత్యస్టౌ నాగవర్యకాః.

దశాష్ట పంచ త్రిగుణ శతమూర్ధాన్వితౌ క్రమాత్

విప్రౌనృపౌ విశౌ శూద్రౌ ద్వౌద్వౌ నాగేషుకీ ర్తితాః.

తదన్వయాః పంచశతం తేభ్యోజాతా అసంఖ్యకాః

ఫణిమండలి రాజీల వాతపిత్త కఫాత్మకాః.

వ్యన్తరా దోషమిశ్రాస్తే సర్పాదర్వీకరాః స్మృతాః

రథాంగ లాంగలచ్ఛత్ర స్వస్తి కాంకుశ ధారిణః.

గోనసామందగా దీర్ఘా మండలైర్వి విధైశ్చితాః

రాజిలాశ్చి త్రితాః స్నిగ్ధాస్తిర్య గూర్ధ్వంచ వాజిభిః.

వ్య న్తరామిశ్ర చిహ్నాశ్చ భూవర్షాగ్నేయ వాయవః

చతుర్విధాస్తే షడ్వింగ భేదాః షోడశ గోనసాః.

త్రయోదశచ రాజీలా వ్యన్తరా ఏకవింశతిః

యేఽను క్తకాలే జాయన్తేసర్పాస్తే వ్యన్తరాః స్మృతాః.

ఆషాఢాది త్రిమా సైః స్మాద్గర్భో మాసచతుష్టయే

అండకానాంశ తేద్వేచ చత్వారిం శత్ప్రసూయతే.

సర్పాగ్రసన్తిసూతౌ ఘాన్వితాస్త్రీ పున్నపుంసకాన్

ఉన్మీలతేక్షి సప్తాహాత్కృష్ణో మాసాద్భవేద్బహిః.

ద్వాదశాహాత్సుబోధః స్యాద్దన్తాః స్యుః సూర్యదర్శనాత్

ద్వాత్రింశద్దిన వింశత్యా చ తస్రస్తేషు దంష్ట్రికాః .

కరాలీ మక రీ కాలరాత్రీచ యమదూతికా

ఏతాస్తాః సవిషాదంష్ట్రా వామదక్షిణ పార్శ్వగాః.

షణ్మాసాన్ముచ్యతే కృత్తిం జీవేత్షష్టి సమాద్వయమ్

నాగాః సూర్యాదివారేశాః సప్త ఉక్తా దివానిశి.

స్వేషాంషట్ ప్రతివారేషు కులికః సర్వ సంధిషు

శంఖేన వామహాబ్జేన సహత స్యోదయోఽథవా.

ద్వయోర్వనాడి కామాత్రమ న్తరం కులికోదయః

దుష్టః సకాలః సర్వత్ర సర్పదంశే విశేషతః.

కృత్తికా భరణి స్వాతీ మూలంపూర్వత్ర యాశ్వినీ

విశాఖార్ద్రా మఘాశ్లేషా చిత్రాశ్రవణ రోహిణీ.

హస్తోమందకుజౌవారౌ పంచమీ చాష్టమి తిథిః

 షష్ఠీరిక్తా శివానింద్యా పంచమీచ చతుర్దశి.

సంధ్యా చతుష్టయం దుష్టం దగ్ధయోగాశ్చరాశయః

ఏక ద్విబహ వోదంశా దష్టం విద్ధంచ ఖండితమ్.

అదంశమవగు ప్తంస్యాద్దంశ మేవం చతుర్విధమ్

త్రయోద్వ్యేక క్షతా దంశావేదనా రుధిరోల్బణా.

నక్తన్త్వేకాంఘ్రి కూర్మాభా దంశాశ్చ యమచోదితాః

దాహీ పిపిలికాస్సర్శీ కంఠశోధ రుజాన్వితః.

సతో దో గ్రంథితో దంశః సవిశ్యోన్యన్త నిర్విషః

దేవాలయే శూన్యగృహే వల్మీకో ద్యాన కోటరే.

రథ్యాసంధౌ శ్మశానే చనద్యాంచ సింధుసంగమే

ద్వీపే చతుష్పథే సౌధే గృహేఽబ్జే పర్వతాగ్రతః.

బిలద్వారే జీర్ణకూపే జీర్ణ వేశ్మని కుడ్య కే

శిగ్రు శ్లేష్మాతకా క్షేషు జంబూదుంబర వేణుషు.

వటేచ జీర్ణ ప్రాకారే ఖాస్యహృత్కక్ష జత్రుణి

తాలౌశంఖే గ లేమూర్ధ్ని చిబు కే నాభిషాదయోః.

దంతోఽశుభః శుభోదూతః పుష్పహస్తః సువాక్సుధీః

లింగవర్ణ సమానశ్చ శుక్ల వస్తోఽమలః శుచిః.

ఆపద్వార గతః శస్త్రీ ప్రమాదీ భూగతేక్షణః

వివర్ణవాసాః పాశాది హస్తో గద్గద వర్ణభాక్.

శుష్క కాష్ఠా శ్రితః భిన్న స్తిలా క్తక కరాంశుకః

ఆర్ద్రవాసాః కృష్ణర క్త పుష్పయుక్త శిరోరుహః.

కుచమర్దీ నఖచ్చేదీ గుదస్పృక్పాద లేఖకః

కేశలుంచీ తృణచ్చేది దుష్టాదూతాన్త థైకశః. 

అగ్ని దేవుడు చెప్పుచన్నాడు. ఇపుడు నాగ ఉత్పత్తి, సర్పదంశన సమయము నందలి ఆశుభ నక్షత్రాదులు, సర్పదంశముతో వివిధ భేదములు దంశ స్థానములు, మర్మ స్థలము, సూతకము, సర్పదష్టుని చేష్ట ఈ ఏడు లక్షణములను చెప్పెదను. శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపమ్మడు - శంఖపాలుడు, కులికుడు యము ఎనమండుగురు నాగులలో శ్రేష్ఠులు. వీరిలో ఇద్దరు నాగులు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు వైశ్యులు, ఇద్దరు శూద్రులు. ఈ నాలుగు వర్ణముల నాగులకు క్రమముగ, వెయ్యి, ఎనిమిది వందలు, ఐదు వందలు, మూడు వందలు, పడగలు వుండును. వీరి వంశమున ఐదు వందల నాగులు పుట్టిరి. వారి నుండి పుట్టిన వారు అసంఖ్యాకులు. సర్పములు, ఫణి, మండలి, రాజిలము యని మూడు విధములు. ఇవి వరసగ వాత, పిత్త, కఫ ప్రధానములు. ఇవికాక ప్యంతరము, దోష మిశ్రము, దర్వీకరము యని జాతి గల సర్పములు కూడ వున్నవి. వీటిపై చక్రము హరిము, ఛత్రము స్వస్తికము, అంకుశము వీటి చిహ్నము లుండును. గోనస సర్పము పై విచిత్రములైన మండలము లుండును. ఇది దీర్ఘ కాయమై మందముగ ప్రాకును. రాజిల సర్పము స్నిగ్ధముగ మండును. దాని పైభాగము నందును పార్శ్వ భాగము లందును రేఖ లుండును. వ్యంతర సర్పముల పై మిశ్రిత చిహ్నము లుండును. వీటిలో పార్థివములు, ఆప్యములు, ఆగ్నే యములు, వాయవ్యములు, యను నాలుగు భేదములును, ఇరువది ఆరు అవాంతర భేషములును వుండును. గోనస సర్ప మురిలో పదునారు రాడిల సర్పములలో పదమూడు, వ్యంతర సర్పములలో ఇరవది యొక్కటి భేషము లుండును. సర్ప ములు పుట్టు కాళము నందు కాక తద్భిన్న కాలము నందు పుట్టిన సర్పములు వ్యంతరములు యని చెప్పబడును. ఆషాఢము మొదలు మూడు మాసములలో సర్పములు గర్భము ధరించును. గర్భము ధరించి నాలుగు మాసము గడచిన పిమ్మట ఆడ సర్పము రెండు వందల నలుబడి గ్రుడ్లను కనును. సర్పపు పిల్లలు ఆ గ్రుడ్ల నుండి బయటికి వచ్చి వాటిలో స్త్రీ, పురుష, . నపుంసక లక్షణములు అవిర్భవించుటకు ముందుగానే సాధారణముగ సర్పములు వాటిని తిని వేయును. కృష్ణ సర్పము ఏడు రోజులలో కండ్లు తెరచును. ఒక మాసముతో గ్రుడ్డు నుండి బయటకు వచ్చును. పుచ్డ్రు దినములు దాటిన పిమ్మట దానికి జ్ఞాపకము కలుగును. ఇరువది దినముల పిమ్మట సూర్య దర్శనము కలుగ గానే దానికి ముప్పది రెండు దంతములు మొలచును. వాటిలో నాలుగు విష దంతము లుఎడును. వాటికి కరాళి, మకరి, కాళరాత్రి. యమ దూతి యని పేర్లు. ఇవి వాటి యెడమ కుడి ప్రక్కలలో వుండును. సర్పము ఆరు మాసముల కొక పర్యాయము కూసము వీడు చును. నూట ఇరువది సంవత్సరములు జీవించును. శేషాచి సప్త నాగములు వరుసగ స్యూని వారములకు అధిపతులు. ఈ ఆధిపత్యము పగలు, రాత్రి కూడ వుండును. శేషా డిస పనాగములు తమ తమ వారములలో ఉదయించును. కాని కుళికుడు అన్నిటి సంధికాలము నందును ఆవిర్భవించును. లేదా అది మహాపమ్మ శంఖ పాలు:తో పాటు ఉదయించును. మహా పద్మ శంఖపాలుల మధ్యనున్న రెండు గడియల కాలమున కుళి కోదయ మగునని మరొక మతము. కుళి కోదయ మతము అన్ని కార్యములకు నిషిద్ధము. సర్ప దంశము నందు ప్రధానముగ ఆశభము. కృత్తికా, భరణి, స్వాతి, మూల పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ, పూర్వాభాద్రా, అశ్వనీ విశాఖా, ఆర్ద్ర, ఆశ్లేష చిత్ర, శ్రవణ, రోహిణి హస్త నక్షత్ర ములు, శని మంగళ వారములు, పుచమి అష్టమి, షషీ, రిక్త చతుర్డీ నవమి, చతుర్దశులు తృతీయ తిథి సర్ప దంగ మువ నింద్యములు పంచమి, చతుర్దశి, తిథులలో సర్ప దంశము విశేషించి నిందితము. నాలుగు సంధ్య లందును, డగ్గ రాషలందును సర్పము కరచినచో అది అసిష్టకర మగును. ఒకటి, రెండు, మూడు దంతము , కాట్లు వరసగ దుష్టము, విద్ధము ఖండితమని చెప్పబడును. సర్పము కేవలము స్పృశించి కరవకున్నచో ఆది ఆదంశము. దీనిలో మనుష్యునకు రయముండదు. ఈ నాల్గు విధములగు దంశములలో మూడు రెండు ఒకటి దంశములు వేదనాజనకములై రక్త స్రావమును కలిగించును. ఒక పొదము కూర్మము వీటితో సమాన మగు ఆకారము గల కాటు రాత్రి యందు జరిగినచో అది మృత్యు ప్రేరితమని తెలీయ వలయును. వేడి చేష్ట లు పాకుతున్నట్లు భావము. కంఠ శోధము మొదలగు పీడలతో కూడిన సర్ప  దంశము నందు విషముండును. ఈ లక్షణములు లేనిచో విషముండదు. దేవాలయము, శూన్య గృహము, పుట్ట, ఉద్యానము, చెట్టుతొర్ర రెండు మార్గము సంధి, స్మశానము, నదీ సాగర సంగమము, ద్వీపము చతుష్పదము, రాజప్రాసాదము, గృహము కమల వము గృహము, పర్వతశిఖరము, బిలద్వారము, జీర్ణకూపము. జీర్ల కుడ్యము సిగ్రు- శ్లేష్మాతక - అక్ష - జంబూ. ఉదుంబర - వేణువన - వట, - వృక్షము లందును, జీర్ణ ప్రాకారాదులందును సర్పములు నివసించుసు. ఇంద్రియ రంధ్రములు ముఖము హృదయము, కక్షములు, కంఠమూలము, తాలువు లలాటము, కంఠము, శిరస్సు గడ్డము వాలి చరణములు ఈ అంగము పై సర్పదంశము ఆశుభకరము. సర్పదంశమును గూర్చి చెప్పుటకు విషచికిత్సకుని వద్దకు వెళ్ళినవాడు చేతులలో పుష్పములు గ్రహించి చక్కగ మాటలాడుచు బుద్ధిమంతుడై సర్పము కరచిన వానితో సమాన మైన జాతి అంగాదులు కలిగి శ్వేత వస్రనారియై నిర్మలుడుగను పవిత్రుకుగను వున్నచో అది శుభకరము. ఇట్లుకాక ఆవార్త తీసుకుని వచ్చిన వాడు, ముఖ ద్వారము నుండిగాక, మరొక ద్వారము నుండి వచ్చినను శస్త్రమును ధరించి నను, ప్రమాదవంతుడై నను నేల వైపు చూచుచున్నను మలిన వస్త్రములు ధరించినను చేతిలో పాళాదులు ధరించినను గద్గద కింఠముతో మాటలాడు చున్నను, ఎండిపోయిన కర్ర పై కూర్చున్నను ఖిన్ను డై చేతిలో తిలను ధరించి, ఎర్ర మచ్చలు గల :స్త్రములు ధరించినను, లేదా తడిసిన వస్త్రములను ధరించినను ఆతని శిరస్సుపై నల్లని లేదా ఎర్రని పూవులున్నను తనకుచస్థానములు మర్దనము చేయుచున్నను నఖములను ఛేపించుచున్నను గుదస్థానమును స్పృశించు చున్నను పాదమురితో నేలపై వ్రాయుచున్నను జుట్టులాగు కొనుచున్నను తృణములను త్రుంపుచున్నను ఇవన్నియు ఆశుభ సూచకములు: - వీటిలో ఏ ఒక్కటియైనను అశుభసూచకములే 

ఇడన్యావా వహేద్ధ్వేధాయది దూతస్య చాత్మనః

అభ్యాం ద్వాభ్యాం పుష్టయాస్మాన్వి ద్యాత్ స్త్రీ పున్న పుంసకాన్ .

దూతః స్పృశతి యద్గాత్రం తస్మిన్దంశ ముదాహ రేత్

దూతాంఘ్రి చలనం దుష్టముత్థితిర్నిశ్చలాశుభా.

జీవ పార్శ్వే శుభోదూతో దుష్టోఽన్యత్ర సమాగతః

జీవోగతా గతైర్దుష్టః శుభోదూత నివేదనే.

దూతస్య వాక్ప్రదుష్టాసా పూర్వా మజ్జార్ధ నిందితా

విభక్తైస్తస్య వాక్యాన్తై ర్విష నిర్విష కాలతా.

ఆద్యైః స్వరైశ్చ కాద్యైశ్చ వర్ణైర్బిన్న లిపిర్ద్విదా

స్వరజో వసుమాన్వర్గీ ఇతిజ్ఞేయాచ మాతృకా.

వాతాగ్నీన్ద్ర జలాత్మానో వర్గేషుచ చతుష్టయమ్

నపుంసకాః పంచమాః స్యుః స్వరాః శక్రామ్బుయోనయః.

దుష్టౌ దూతస్య వాక్పాదౌ వాతాగ్నీ మధ్యమోహరిః

ప్రశస్తా వారుణావర్ణా ఆతిదుష్టా నపుంసకాః.

ప్రస్థానే మంగళం వాక్యం గర్జితం మేఘహస్తినోః

ప్రదక్షిణం ఫలేవృక్షే వామస్య చరుతం జితమ్.

శుభా గీతాది శబ్దాః స్యురీదృశంస్యాద్ది సిద్ధయే

అనర్ధగీరతాక్రన్దో దక్షిణే విరుతం క్షుతమ్.

వేశ్యాక్షుతోనృపాః కన్యాగౌర్థన్తీ మురజధ్వజౌ

క్షీరాజ్యదధి శంఖాంబుచ్చత్రం భేరీఫలం సురాః.

తండులా హేమరూప్యంచ సిద్ధయోఽభి ముఖాఅమీ

సకాష్ఠః సానలః కారుర్మలి నాంబర భారభృత్.

గలస్థటంకో గోమాయు గృధ్రోలూక కపర్దికాః

తైలం కపాల కార్పాసా నిషేధే భస్మ నష్టయే.

విషరోగాశ్చ సప్తస్యుర్ధా తోర్ధాత్వన్తరాప్తితః

విషదంశో లలాటం యాత్యతోనేత్రం తతోముఖమ్.

ఆస్యాచ్చవచనీ నాడ్యో ధాతూన్ ప్రాప్నోతి హిక్రమాత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సర్పలక్షణంనామ చతుర్నవత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః.   

తనకును అవచ్చివ దూతకును ఇడా పింగళనాడులు రెండును ఆడుచున్నచో దానిని బట్టి సర్పము స్త్రీయా, పురుష, నవుంసక మాయని తెలుసుకొనవచ్చును. దూతయే ఆంగమును స్పృశించునో ఆ అంగమునందే సర్పదంశమై నట్లు తెలుసుకొనవచ్చును. దూతపాదములు చంచలము లైనచో అశుభములు. స్థిరముగనున్నచో శుభము. ఒక జీవుని పార్శ్వమునందన్న దూత, శుభ సూచకుడు, ఇతర భాగములందున్నచో ఆశుభము. దూత నివేదించు సమయమున ఏ ప్రాణియైన వచ్చినచో శుభము. బయటకు వెళ్ళిపోయినచో అశుథము. దూతమాటలు, దోషయు క్షముగా నున్నను . ఆస్పష్ట ముగా నున్నను అది నిందితము. ఆతని స్పష్టమైన మాటలను బట్టి సర్పదం శనము, విషసహితమా ! విషరహితమా! యను విషయమును తెలుసుకొనవచ్చును. దూత వాక్యమునందు ప్రారంభమున, స్వరములు వున్నచో వాటిని బట్టియు "క" ఆది వర్గాక్షరములున్నచో వాటిని బట్టియు, లిపి రెండు విధములుగ నుండును. వాక్య ప్రారంభమున స్వరమున్నచో సర్పదష్టుడు జీవించును. క ఆది వర్గాక్షరములున్నచో ఆ శుభము కలుగవచ్చును. మాతృకా విధానము ఈ విధముగ గ్రహించవలయును. అది వర్గములలో మొదటి నాలుగు అక్షరము కును వరుసగ వాయు అగ్ని ఇంద్ర, వరుణులు దేవతలు వీటి పంచమాక్షరములు నపుంసకములు. స్వరములు హ్రస్వము లైనచో ఇంద్ర దేవతాకము. దీర్ఘము లై నచో వరుణ దేవతాకములు. దూతవాక్య ప్రారంభమున వాయు అగ్ని దేవతాక అక్షరములు చెడ్డవి. ఐంద్రాక్షరము మధ్యమ వలప్రదము. వరుణ దైవత్య వర్ణము ఉత్తమము. నపుంసక వర్ణము అత్యంతము అశుభము. చికిత్సకుడు బయలుదేరి వచ్చు నపుడు మంగళ మయమగు వాక్కులు మేఘ గర్జన గజ గర్జనముూ, కుడి ప్రక్క ఫల యుక్త వృక్షముడుట వామ భాగమున యేపక్షియైనను కలరవము చేయుడు ఇవి జయమును సాఫల్యమును సూచించును. గీతాది శబ్దములు కూడ శుభ కరములు. కుడి ప్రక్కనుండి అనర్థ సూచకములగు మాటలు వినబడుట, చక్రవాకము రోదనము ఇవి కూడ సిద్ధి సూచకములు. పక్షుల అశుభ ధ్వని తుమ్ము ఇవి అవర్థ సూచకములు. వేశ్య బ్రాహ్మణుడు, రాజుకన్య, గోవు, ఏనుగు, మురజము, గజము, క్షీరము, ఆజ్యము, దధిశంఖము, జలము, ఛత్రము, ఫళము, భేరి, మద్యము అక్షతలు, బంగా రము వెండి ఇవి ఎదురైనపుడు కార్య సిద్ధి కలుగును. కాష్ఠము అగ్ని ధరించిన శిల్పిమాసిన బట్టలు మోసుకొనువచ్చు వాడు టంకమును మెడలో వేసుకొన్న వాడు, నక్క గ్రద్ద గుడ్లగూబ, గవ్వలు, తైలము, కపాలము, దూది భస్మము ఇవి నాగ సూచకములు. విషము ఒక ధాతువు నుండి మరొక ధాతువుకు ప్రవేశించుటచే ఏడు విధములగు విషరోగము కలుగును. విషదంశము ముందుగ లలాటములోనికి, లలాటము నుండి నేత్రములలోనికి, అచటి నుండి ముఖములోనికి పిదప అన్ని వాడులలోనికిని ప్రవేశించి క్రమముగ ధాతువులలో ప్రవేశించును. 

అగ్ని మహాపురాణమువ నాగ లక్షణ కథనమను రెండువందల తొంభై నాల్గవ అధ్యాయము సమాప్తము.