ఈశ్వర ఉవాచః-
అథ ప్రాతః సముత్థాయ కృతస్నా నాదికో గురుః ।
దధ్యార్ద్రమాంసమద్యాదేః ప్రశస్తాభ్యవహారితా.
గజాశ్వారోహణం స్వ ప్నే శుభం శుక్లాంశుకాదికమ్ ।
తైలాభ్యగాదికం హీనం హోమో మోరేణ శాన్తయే.
నిత్యకర్మద్వయం కృత్వా ప్రవిశం మఖమజ్ఞపమ్ ।
స్వో చాన్తో నిత్యవత్కర్మ కుర్యాన్నైమి త్తి కేవిధే.
తతః సంశోధ్య చాత్మానం శివహ స్తం తథాత్మని ।
విన్యస్య కుమ్భగం ప్రార్చ్య ఇన్గాదీనామనుక్రమాత్.
మణ్డలే స్థణ్డిలే వాపి ప్రభుర్వాత శివార్చనమ్ ।
తర్పణం పూజనం వహ్నే పూర్ణాన్తం మ నతర్పణమ్.
దుఃస్వప్నదోషమోషాయ శ శ్రేణాష్ట్రాధికం శతమ్ ।
హుత్వా హూం సంపు దేనైవ విదధ్యాన శ్రదీపనమ్.
ఆన్తర్భలివిధానం చ మధ్యే స్థణిలకుబ్బయోః ।
కృత్వా శిషప్రవేశాయ లబ్దానుజో బహిర్వజేత్ .
కుర్యాత్సమయవ తత్ర మడ్డలారోపణాదికమ్ ।
సంపాతహోమం తన్నా డీరూపదర్భకదానాగమ్.
సత్సన్నిధానాయ తిసో హుత్వా మూలానుణాహుతీః ।
కుమ్భస్థం శివమభ్యర్చ్య పాశ సూత్రముపాహ రేత్ .
స్వదక్షిణోర్ద్వకాయస్య శిష్యస్యాభ్యర్చితస్య చ ।
తచ్ఛిఖాయాం నిబధ్నీ యాత్పాదాజుష్టావలమ్బితమ్.
తం నివేశ్వ నివృత్తేస్తు వ్యాప్తిమాలోక్య చేతసా ।
జ్ఞేయాని భువనాన్యస్యాం శతమష్టాధికం తతః.
ఈశ్వరుడు చెప్పెను. గురువు ప్రాతఃకాలమునందు లేచి, స్నానాదులు పూర్తి చేసికొని, మీరేమి స్వప్నములు చూచితి రని శిష్యులను ఆడుగవలేను. పెరుగు, పచ్చిమాంసము, మద్యము మొదలగువాటిని భుజించినట్లు గాని, చూచి నట్లుగాని స్వప్నము వచ్చినచో అది ఉత్తమము, శుభసూచకము. అట్లే ఏనుగు, గుజము ఎకుట, శ్వేతవస్త్రాదులను చూచుట గూడ శుభప్రదము. తైలము పూసికొని నట్లు స్వప్నము చూచినచో ఆశుభము. దాని శాంతికొరకై అఘోరమంత్ర ముతో హోమము చేయవలెను. ప్రాతఃకాల మధ్యాహ్న కాల నిత్యకర్మలు పూర్తిచేసుకొని యజ్ఞమండపమున ప్రవేశించి, యధాశాస్త్రముగ ఆచమనము చేసి, నై మత్తిక కర్మ కూడ నిత్యవిధి వలెనే చేయవలెను. ఆధ్వశుద్ధి చేసుకొని తనపై హస్త ముంచుకొనవలెను. కలశ పై నున్న శివుని పూజించి, క్రమముగ ఇంద్రాది దిక్పాలకుల పూజ చేయవలెను. మండలమునందును, వేదియందును శివునిపూజింపవలెను. పిమ్మట తర్పణములు, అగ్నిపూజ, పూర్ణాహుతివరకును హోమములు, మంత్రతర్పణములు చేయవలెను.దుఃస్వప్న దోష నివారణార్థమై ‘హూం'తో సంపుటితము చేసిన అస్త్రమంత్రముతో (హూం ఫట్ హూం)నూట ఎనిమిదిహోమములుచేసి మంత్రదీపనము చేయవలెను. వేదీకలశలమధ్య అంతర్బలి చేసి, శిష్యుల ప్రవేశార్థమై ఇష్టదేవతానుజ్ఞ పొంది గురువు మండపమునుండి బైటకు వెళ్ళవలెను. ఆచట, సమయదీక్షలోవలెనే మండలారోపణాదికము చేసి సంపాత హోమము. సుషుమ్నా నాడీరూపమగు కుశమును శిష్యునిహ స్తములోనుంచుట మొదలగుకార్యములను పూర్తిచేయవలెను. నివృత్తి కళాసాన్నిధ్యముకొరకై మూలమంత్రముచే మూడు ఆహుతు లిచ్చి, కుంభము పై నున్న శివుని పూజించి కలాపాశమయ మగు సూత్రమును సమర్పింపవలెను. పిమ్మట పూజింపబడిన శిష్యుని ఊర్ధ్వదేహము కుడి భాగమున వాని శిఖకు ఆ సూత్రమును కట్టి కాలి బొటనవేలివరకును వ్రేలాడు నటుల ఉంచవలెను. ఆ విధముగ ఆ పాశమును ఉంచి, దానిలో నివృత్తి కళావ్యాప్తి జరిగి నట్లు భావన చేయవలెను. దానియందు నూటఎనిమిది భువనములు చూడవలెను.
కపాలో ఽజశ్చ బుద్దశ్చ వజ్రదేహః ప్రమర్దనః ।
విభూతిరవ్యయః శాస్తా పినాకీ త్రిదశాధిపః.
అగ్ని రుద్రో హుతాశీ చ పిజ్గలః ఖాదకో హరః ।
జ్వలతో దహనో బ భుర్భస్మాన కక్షపాన కౌ.
యామ్యమృత్యుహరో ధాతా విధాతా కార్యరజ్ఞకః ।
కాలో ధర్మోప్యధర్మశ్చ సంయోక్తా చ వియోగకః.
నైరృతో మారణో హన్హా క్రూరదృష్టిర్భయానక । ।
ఊర్ధ్వాంశకో విరూపాక్ష ధూమలోహితదంష్టవాన్.
బలశ్చాతి బల శ్చైవ పాళహస్తో మహాబలః ।
శ్వేతశ్చ జయభద్రశ్చ దీర్ఘబాహుర్జలాన్తకః.
వడ వాస్యశ్చ భీమశ్చ దశైతే వారుణాః స్మృతాః ।
సూక్ష్మో లఘుర్వాయు వేగః సూక్ష్మ సేళ్ల క్షపా న్తకః.
పజ్చస్తకః పఞ్చశిఖః కపర్టీ మేఘవాహనః ।
జటాముకుటధారీ చ నానారత్నధర స్తథా.
నిధీశో రూపవాన్జన్యః సౌమ్యదేహః ప్రసాదకృత్ ।
ప్రకాశోప్యథ లక్ష్మీ వాన్ కామరూపో దళత్తరీ.
విద్యాధరో జ్ఞానధరః సర్వజ్ఞో వేదపారగః ।
మాతృవృత్తశ్చ పిజ్జాక్షో భూతపాలో బలిప్రియః.
సర్వవిద్యావిధాతా చ సుఖదుఃఖహరో దశ ।
అనన్తః పాలకో ధీరః పాతాళాధిపతి స్తథా.
వృషే వృషధరో వీగ్యో గ్రసనః సర్వతోముఖః ।
లోహితశ్చైవ విజ్ఞేయా దశ రుద్రాః ఫణిస్థితాః.
శమ్భుర్వీభుర్గణాధ్యక్షస్త్ర్వక్షస్త్రిదశ వన్దితః ।
సంహారశ్చ విహారశ్చ లాభో లిప్సుర్విచక్షణః.
అత్తా కుహక కాలాగ్నిరుద్రా హాటక ఏవచ ।
కూష్మాణ్డ శ్చైవ సత్యశ్చ బ్రహ్మా విష్ణుశ్చ సప్తమః.
రుద్రశ్చాష్టావిమే రుద్రా కటాహాభ్యన్తరే స్థితాః ।
ఏతేషా మేవ నామాని భువనానామపి స్మరేత్.
కపాల- అజ-అహిర్బుధ్న్య-వజ్రదేహ-ప్రమర్ధన-విభూతి - అవ్యయ-శాస్తృ - పినాకి - త్రిదళాధిపు లను పదిమంది రుద్రులు తూర్పు దిక్కున నుందురు. అగ్ని రుద్ర - హుతాశ - పింగల - ఖాదక-హర-జ్వలన-దహన-బభ్రు-భస్మాంతక. క్షపాన్లకు లను పదిమంది రుద్రులు ఆగ్నేయమున నుందురు. దమ్య-మృత్యుహర -ధాతృ-విధాతృకర్తృ-కాల-ధర్మ-అధర్మ-సంయోక్తృ వియోజకు లను పదిమంది రుద్రులు దక్షిణమున నుందురు. నైరృత్య-మారుత-హన-క్రూర దృష్టి-భయానక ఊర్ధ్వకేక -విరూపాక్ష ధూమ్ర-లోహిత దంష్టలను పదిమంది రుద్రులు నైరృతిదిక్కునం దుందురు. బల- ఆతిబల-పాళహస్త-మహాబల- శ్వేత-జయభద్ర-దీర్ఘబాహు-జలాంతక వడవాస్య భీములను పదిమంది రుద్రులు పశ్చిమమునం దుందురు. శీఘ్ర-లఘు-వాయువేగ-సూక్ష్మ తీక్ష.క్షమాంతక.పంచాంతక పంచశిఖ-కపర్ది-మేమవాహనులను పదిమంది రుద్రులు వాయవ్యమునం దుందురు. జటాముకుటధారి_నానారత్న ధర, నిధీశ రూపవత్-ధన్య-సౌమ్యదేహ-ప్రసాదకృత్ప్రకామ–లక్ష్మీవత్ - కామరూపు లను పదిమంది రుద్రులు ఉత్తరమునం దుందురు. విద్యాధర-జ్ఞానధర-సర్వజ్ఞవేదపారగ మతృవృత్త-పింగాక్ష- భూతపాలబలిప్రియ-సర్వవిద్యావిధాతృ-సుఖదుఃఖకరు లను పదిమంది రుద్రులు ఈశాన్యమునం దుందురు. అనంత_పాలక ధీర పాతాళాధిపతి-వృష-వృషధర-వీర-గ్రసన-సర్వతోముఖ-లోహితులను పదిమంది రుద్రులు క్రింది దిక్కునందు పాతాలలోకమునం దుందురు. శంభు-విభు-గణాధ్యక్ష-త్ర్యక్ష-త్రిదశ వందిత-సంవాహ వివాహ-నథ-విప్పు-విచక్షణు లను పదిమంది రుద్రుణp ఊర్థ్వదిక్కునం దుందురు. హుహుక కాలాగ్ని రుద్రహాటకకూష్మాండ సత్య-బ్రహ్మ-విష్ణు-రుద్రు లను ఎనమండుగురు రుద్రులు బ్రహ్మాండ కటాహము మధ్య నుందురు. ఈ రుద్రుల పేర్లను బట్టియే నూటఎనిమిది భువనముల పేర్లు ఏర్పడిన వను విషయమును గుర్తుంచుకొనవలెను.
భవోద్భవః సర్వభూతః సర్వభూతసుఖప్రదః ।
సర్వసాన్నిధ్యకృద్భ్రహ్మ విష్ణురుద్రశివార్చితః.
సంస్తుత పూర్వస్థిత ఓం సాక్షిన్ ఓం రుద్రా న్తక ఓం పతజ్గ ఓం
శబ్ద ఓం సూక్ష్మ ఓం శివ సర్వ సర్వదా సర్వసాన్నిధ్యకర బ్రహ్మ
విష్ణురుద్రపర ఓం నమః శివాయ ఓం నమః
అష్టావింశతిపదాని వ్యోమవ్యాపి మనో గుహ
సద్యోహృదస్త్రనేత్రాణి మనవర్ణాష్టకో మతః.
బీజాకారో మకారశ్చ నాడ్యావిడాపిజలాహ్వయే ।
ప్రాణాపానావుభౌ ఐయూ ప్రజోపస్థీ తథేన్దియే.
గన్తస్తు విషయః ప్రోక్తో గన్గాదిగుణపశ్చి కే ।
పార్థివం మడ్డలం పీతం వజ్రాజ్కం చతురస్రకమ్.
విస్తారో యోజనానాత్తు కోటిరస్య శతాహతా ।
అతైవా నర్గలా జేయా యోనయోఽపి చతుర్ధశ.
ప్రథమా సర్వదేవానాం మన్యాద్యా దేవయోనయః ।
మృగః పక్షే చ పశవశ్చతుర్ధా తు సరీసృపాః.
స్థావరం పజ్చమం సర్వం యోనిః షష్టి అమానుషీ ।
వైశాచం రాక్షసం యాక్షం గాన్గర్వం చే స్తోమేవ చ.
సౌమ్యం ప్రాణేశ్వరం బ్రాహ్మమష్టరుం పరికీర్తితమ్ ।
అష్టానాం పార్ధివం తత్త్వవమధికారాస్పదం మతమ్.
(ఒకటి రెండు శ్లోకాలు మూలపాఠంలో లోపించినట్లున్న ఈ అనువాదం హిందీపాఠాన్ని అనుసరించి ఇవ్వబడినది) సద్భావేశ్వర, మహాతేజః, యోగధిపతే, ముంచ ముంచ. ప్రమథ ప్రమథ, శర్వ శర్వ, భవ భవ, భవోద్భవ, సర్వభూత సుఖప్రద, సర్వసాంనిధ్యకర, బ్రహ్మవిష్ణురుద్ర పర, అనర్చితానర్చిత, అసంస్తుతాసంస్తుత, పూర్వస్థిత, సాక్షిన్ సాక్షిన్, తురు తురు, పతణ్ణి పతజ్ఞ, పిజ్జ పిజ్జి, జ్ఞాన జ్ఞాన, శబ్ద శబ్ద, సూక్ష్మ సూక్ష్మ, శివ-సర్వ, సర్వద, ఓం నమో నమః, ఓం నమః, శివాయ, నమో నమః ఇవి ఇరువదియెనిమిది పదములు. స్కందా! వ్యాపక మైన ఆకాశము మనస్సు, “ఓం నమో షట్ - ఇది అభీష్టమంత్రవర్ణము, అకారలకారములు (ఆం లం) బీజములు. ఇడా పింగళలు రెండు నాడులు ప్రాణాపానము లనునవి రెండు వాయువులు ఝణము, ఉపస్థ అనునవి రెండు ఇంద్రియములు. గంధము విషయము. దీనియందు గంధాదు లగు నాలుగు గుణములున్నవి. ఇది పృథ్వీతత్త్వముతో సంబంధించినది. పీతవర్ణము, దీని మండలాకారము చతురస్రము. నాలుగు వైపులా వజ్రముచే చిహ్నిత మైనది. ఈ పార్థివమండల విస్తారము నూరు కోట్ల యోజనములు. పదునాలుగు యోనులు కూడ దీనియందే ఆంతర్గతము లని గ్రహించవలెను. మొదటి ఆరును మృగాదియోనులు, తరువాతి ఎనిమిది దేవయోనులు. మొదటిది మృగయోని, రెండవది పడియోని, మూడవది పశయోని, వాల్గవది సర్పాదియోని, ఐదవది స్థావర యోని, ఆరవది మనుష్యయోని. ఎనిమిది దేవయోనులు వరుసగ పిశాచ-రాక్షస-యక్ష-గంధర్వ-ఇంద్రసోమ-ప్రజా పతి- బ్రహ్మలకు సంబంధించినవి. ఈ ఎనిమిది యోనులకును పార్థివతత్త్వముపై అధికార మని చెప్పబడినది.
లయస్తు ప్రకృతౌ బుద్ధౌ భోగీ బ్రహ్మా చ కారణమ్ ।
తతో జాగ్రదవస్థానైః సమస్తైర్భువనాదిభిః.
నివృత్తిం గర్భితాం ధ్యాత్వా స్వమ శ్రేణ నియోజ్య చ ।
ఓం హ్రాం హ్రూం హాం నివృత్తికలాపాశాయ
హూం ఫట్ తత ఓం హాం హాం నివృత్తికలాపాశాయ
స్వా హేతనే నాజ్కుశముద్రయా ।
పూర కేణాకృష్య ఓం హ్రూం హ్రాం హ్రూం నివృత్తిక లాపాశాయ ।
హూం ఫడిత్యనేన సంహారముద్రయా కుమ్భ కేనాధః స్థా
నాదాదాయ ఓం ఓం హ్రాం హాం నివృత్తిక లాపాశాయ నమః ।
ఇత్యనేనోద్భవముద్రయా రేచ కేన కుమ్భే సంస్థాప్య ।
ఓం హాం నివృత్తికలాపాశాయ నమః ఇతనేనార్ఘ్యం ।
దత్త్వా సంపూజ్య విముఖేనైవ స్వాహా నేనై వ సంసిధానా ।
యాహుతిత్రయం సన్తర్పణాహుతీత్రయం చ దత్త్వా ।
ఓం హాం బ్రహ్మణే నమ ఇతి బ్రహ్మాణమావాహః సంపూజ్య ।
చ స్వాహా నేన సంతర్ప్య ।
బ్రహ్మం స్తవాధికా రేస్మిన్ ముముక్షం దీక్షయామ్యహమ్.
భావ్యం త్వయానుకూలేన విధిం విజ్ఞాపయేదితి ।
ఆవాహయ్ త్తతో దేవీం రక్షాం వాగీశ్వరీం హృదా.
ఇచ్ఛాజ్ఞానక్రియారూపాం షడ్విదాం హ్యేక కారణమ్ ।
పూజయేత్తర్పయేద్దేవం ప్రకారేణామునా తతః.
వాగీశ్వరీం వినిః శేషయోని విక్షోభ కారణమ్ ।
హృత్సంపుటార్ధబీజాదిహుం పడ న శ రాణునా.
తాడ యేద్ధృదయే తస్య ప్రవి శేత్సవిధానవిత్ ।
తతః శిష్యస్య చైతన్యం హృది వహ్ని కణోపమమ్.
నివృత్తిస్థం వృతం పాలైర్జ్యష్ఠయా విభజేద్యథా ।
ఓం హాం హూం హః ఫట్ ఓం హాం స్వాహేతనేనాథ పూర కణాంకుశముద్రయా.
తదాకృష్య స్వమ శ్రేణ గృ హేత్వాత్మని యోజయేత్ ।
ఓం హాం హ్రూం హాం ఆత్మనే నమః.
లయము ప్రకృతియందును, భోగము బుద్దియందును అగును. బ్రహ్మ ' కారణము పిమ్మట జాగ్రదవస్థవర కును. సమ స్తభువనాది గర్భిత యగు నివృత్తికళను ధ్యానము చేసి, తదీయమంత్రముచే వినియోగము చేయవలెను. “ఓం హం హ్రం హాం నివృత్తికలాపాళాయ హుం ఫట్ స్వాహా” అనునది దాని మంత్రము. పిదప “ఓం హం హోం హోం నివృత్తి కలాపాయ హరాం ఫట్ స్వాహా” అను మంత్రముచే ఆంకుశ ముద్రాప్రదర్శన పూర్వంముగ, పూరక ప్రాణాయామముతో ఆ కళను. ఆకర్షించవలెను. పిదప ఓం హూం హోం హాం హూం నివృత్తికలాపాళాయ హుం ఫట్ స్వాహా” అనుమంత్రముచే సంహార ముద్రా కుంభక ప్రాణాయామములతో దానిని నాభి క్రింది భాగమునకు తీసికొనిపోయి “ఓం హం నివృత్తికలాపాళాయ నమః” అను మంత్రముచే, ఉదృవముద్రా రేచక ప్రాణాయామములతో దానిని కుండమునందు ఏదైన ఒక ఆధారముపై నుంచవలెను. పిమ్మట”ఓం హం నివృత్తికలాపాళాయ నమః అను మంత్రముచే ఆర్ఘ్యప్రధానపూర్వకముగ పూజించి దాని చివర “స్వాహా చేర్చితర్పణముచేసి, సంవిధానముకొరకై వేరువేరుగా మూడు హోమములు చేయవలెను. పిమ్మట “ఓం హం బ్రహ్మణే నమః” అను మంత్రముచే బ్రహ్మను ఆవాహన చేసి, పూజించి, దాని చివర “స్వాహా చేర్చి మూడు హోమములచే బ్రహ్మను సంతృప్తుని చేయవలేమ. అనంతరము “ఓ బ్రహ్మదేవా! ఈ ముముక్షువునకు, నీ అధికారమున, దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదావీనికి అనుకూలుడవుగ నుండుము. అని ప్రార్థించవలెను.పిదప, రక్తవర్ణ యగు వాగీశ్వరిని, హృదయమంత్రముతో, తన మనస్సులోనే ఆవాహన చేయవలెను. ఆ దేవి ఇచ్ఛా-జ్ఞాన-క్రియారూపిణి. ఆరు ఆధ్వలకును ఏకై కకారణము. వెనుక చెప్పిన విధానమున వాగీశ్వరికి పూజాతర్పణములు చేయవలెను. సమ స్తయోనులను విముఖము చేయువాడును, హృదయములో నుండువాడును అగు వాగీశ్వరదేవుని కూడ పూజించి తర్పణము చేయవలెను. ఆదియందు బీజముతోడను, అంతమునందు అస్త్రమంత్రముతోడను కూడిన అస్త్రమంత్రముతో శిష్యుని హృదయ తాడనము చేసి, ఆతనిలో ప్రవేశించినట్లు భావన చేయ వలేను. హృదయమునందు, నివృత్తికళలోపల నున్న, ఆగ్ని కణసదృశమగు పాశ బద్ధ మైన శిష్యజీవచైతన్యమును జ్యేష్ఠతో విశ క్షము చేయవలెను. “ఓం హాం హూం హః హూం ఫట్” అనునది విథానమంత్రము. “ఓం హం స్వాహా అను మంత్రముచే, పూరక ప్రాణాయామ అంకుశ ముద్రలతో, ఆ జీవచైతన్యమును హృదయమునందు ఆకర్షించి, ఆత్మ మంత్రముచే పట్టుకొని, దానిని లన ఆత్మలో చేర్చవలెను. “ఓం హం హం హాం ఆత్మనే నమః” అనునది ఆత్మ మంత్రము.
ప్రితోర్వీ భావ్య సంయోగం చైతన్యం రేచ కేన తత్.
బ్రహ్మాది కారణత్యాగాన్న త్వా శివాస్పదమ్ ।
గర్భాదానార్ధమాదాయ యుగపత్సర్వయోనిష.
క్షి పేద్వాగీశ్వరీయోనౌ వామయోద్భవముద్రయా ।
ఓం హాం హాం హమ్ ఆత్మనే నమః ।
పూజయేదపలనేనైవ తర్పయేదపి పజ్చగా.
అన్యమోనిఘ సర్వాసు దేహశుద్ధిం హృదా చరేత్ ।
నాత్రపుంసవనం స్ర్య దిశ రీరస్యాపి సంభవాత్.
సీమస్తోన్నయనం వాపి దై వన్యజ్ఞాని దేహవత్ ।
శిరసా జన్మ కుర్వీత యుగపత్పర్వదేహినామ్.
తదైవ భావయేదేషామధికారం శివాణునా ।
భోగం కవచమ శ్రేణ శ శ్రేణ విషయాత్మనా.
మోహరూపమబేద్యం చ లయసంజ్ఞం విభావయేత్ ।
శివేన సోతసాం శుద్ధిం హృదా తత్వవిశాడనమ్.
పళ్చి పళ్చాహుతిః కుర్యాద్ధర్భాదానాదిషు క్రమాత్ ।
మాయయా మలకర్మాది పాశ బన్ద నివృత్తయే.
నిష్కృత్యైవ హృదా పశ్చాద్యజేత శతమాహుతీః ।
మలశ క్తినిరోధేన పాశానాం చ వియోజనమ్.
స్వాహాక్షాయుధమ శ్రేణ పళ్ళా పక్చాహృతీర్యజేత్ ।
మాయాద్య నస్య పాశ స్య స ప్రచారాస్త్రజ ప్రయా.
కర్తర్యా భేదనం కుర్యాత్కల్ప శ్రేణ తద్యథా ।
ఓం హూం నివృత్తికలాపాశాయ హూం ఫట్.
మాతాపితరుల సంయోగమును భావన చేయుచు, రేచక ప్రాణాయామముతో బ్రహ్మాదికారణములను క్రమముగ త్యజించుచు జీవచైతన్యమును శివరూపాధిష్టానమునందు చేర్చి, గర్భాధానముకొరకై, దానిని గ్రహించి ఒకే సమయమున అన్ని యోనులందును, పామా-ఉద్భవముద్రలతో వాగీశ్వరయోనియందును ఉంచవలెను. పిమ్మట “ఓం హం హం హామ్ ఆత్మనే నమః” అను మంత్రముతో పూజను, ఐదు పర్యాయములు తర్పణమును చేయవలెను. అన్ని యోనులయందును, ఈ జీవచైతన్యమునకు, హృదయమంత్రముచే దేహసాధనము చేయవలెను. శ్రీ శరీరాదులు పుట్టుటకు కూడ అవకాశ మున్నది గాన పుంసవనసంస్కారము చేయ నవసరము లేదు. దైవవశముచేత ఆంధాదిక రీలోత్పత్తి కూడ సంభావ్యము గాన సీమంతోన్నయసము కూడ అనావశ్యకము. శిరోమంత్రము (స్వాహా) చే ఒకే సమయమున సకలజీవ నించి నట్లు భావవ చేయవలెను. శివమంత్రముతో కూడ ఈ విధముగనే భావన చేయవలెను. కవచమంత్రముతో భోగ మును, అస్త్రమంత్రముతో విషయమునందును ఆత్మయందు మోహరూప మగు లయమను అభేదమును భావన చేయవలెను. పిదప శివమంత్రముతో ప్రోతశ్శుద్ధిని, హృదయమంత్రముతో తత్వశోదనమును చేసి గర్భాధానాది సంస్కారముల నిమిత్తమై వరుసగ ఐదేసి హోమములు చేయవలెను. మాయజనిత - మలజనిత - కర్మజనితాం పాశ బంధములు తొలగుటకై హృదయవంత్రముచే శుద్ధి చేసి, అగ్నిలో నూరు హోమములు చేయవలెను. మలశ క్తిని లయింపచేయుటకును, పాశములు తొలగించుకొనుటకును స్వాహాంత మగు అస్త్రమంత్రముతో ఐదేసి హోమములు చేయవలెను. “ఓం పం పం పం నివృత్తిక లాపాశాయ హః హూం ఫట్” అను మంత్రము మచ్చరించుచు, అస్త్రమంత్రజపాభిమంత్రిత మగు ఖడ్గమైన కళాశస్రముతో అంతఃకరణములో నున్న మలాదిపాశములను ఏడు పర్యాయములు భేదించవలెను.
బన్దకత్వం చ నిర్వర్య. హస్తాభ్యాణ్చ శరాణునా.
విసృజ్య వర్తులీకృత్య ఘృతపూర్ణ స్రువే ధరేత్ ।
దహేదనుక లా స్రణ కేవలా శ్రేణ భస్మ సాత్.
కుర్యాతృణాహుతీర్ధత్వా పాశాంకుశ నివృత్తయే.
ఓం హః అస్త్రాయ హూం ఫట్ ।
ప్రాయశ్చిత్తం తతః కుర్యాధస్రాహుతిభిరష్టభిః.
అధావాహ్య విధాతారం పూజయేత్తర్పయేత్తథా ।
తత ఓం హాం శబ్దస్పర్శకుద్ధ బ్రహ్మాన్ గృహాణ
స్వాహేత్యా హుతిత్రయేణాధికారమస్య సమర్పయేత్ ।
దగ్ధనిః శేషపాపస్య బ్రహ్మన్న స్య వశోస్వయా.
బస్ధాయ న పునః స్టేయం శివాజ్ఞాం శ్రావయేదితి ।
తతో విసృజ్య ధాతారం నాడ్యా దక్షిణయా శనై.
సంహారముద్రయాత్మానం కుమ్భ కేన విజాత్మనా ।
రాహుయు కైక దే శేన చౄబిమ్బన సన్ని భమ్.
ఆదాయ యోజయేత్సూతే రేచ కేనోద్బవాఖ్యయా ।
పూజయిత్వార్ఘ్యపాత్రస్థతోయబిన్దుం సుధోపమమ్.
ఆప్యాయనాయ శిష్యస్య గురుః శిరః విన్య సేత్ ।
విసృజ్య పితరౌ దద్యాద్వౌషడ న శివాణునా.
పూరణాయ విధిః పూర్ణ నివృత్తిరీతి శోధితా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నిర్వాణదీక్షాయాం నివృత్తికలాశోధనం నామ చతురాశీతీతమోధ్యాయః.
పాశము బంధించకుండ ఉండుటకు దానిని ఆశ్రమంత్రముతో, రెండు చేతులతో నలిపి, గోలాకారము చేసి, నేతితో నింపిన స్రువములో పడ వేయవలెను. కలామయ మగు అస్త్రముచేత గాని, దేవతాస్త్రమంత్రముచే గాని దానిని కాల్చివేసి భస్మము చేయవలెను. పిమ్మట పాశాంకురము తొలగిపోవుటకు నాలుగు హోమములు చేయవలెను. “ఓం హః ఆస్త్రాయ హూం ఫట్ స్వాహా” అనునది హోమమంత్రము. పిదప అస్త్రమంత్రముతో ఎనిమిది హోమములు చేసి ప్రాయశ్చిత్తము చేయవలెను. పిమ్మట విధాతను ఆవాహన చేసి పూజాతర్పణములు చేయవలెను. “ఓం హాం శబ్దస్పరెడ్డి శుం బ్రహ్మన్ గృహాణ స్వాహా” అను మంత్రముతో మూడు హోమములు చేసి శిష్యునకు అధికారము సమర్పింప వలెను. శివుని ఆజ్ఞను ఈ విధముగ బ్రహ్మ కు తెలుపవలెను. “ఓ బ్రహ్మా! ఈ పిల్లవాని పాశము లన్ని యు దగ్ధము లైనవి. ఈతని మరల బంధనములలో పడవేయుటకై నీ విచట ఉండరాదు”. ఇట్లు చెప్పి, బ్రహ్మ ను పంపివేసి, సంహార ముద్రా కుంభక ప్రాణాయామములతో, రాహువు యుక్తచందైక దేశమువలె నున్న ఆత్మను, ఆత్మ మంత్ర ముచ్చరించుచు కుడినాడి ద్వారా మెల్ల మెల్లగా తీసికొని, రేచక ప్రాణాయామ ఉద్భవముద్రలతో వెనుకటి సూత్రమునందు చేర్చవలెను మరల దానిని పూజించి గురువు అర్ఘ్యపాత్రలో నున్న అమృతోపమజలబిందువులను గ్రహించి, శిష్యుని పుష్టి తృపులకొరకే శికముపై నుంచవలెను. పిమ్మట మతాపితరుల విసర్జనము చేసి ఔషడంత మగు అస్త్రమంత్రముతో, విధిదూ ర్తికొరకైచుచు పూర్ణాహుతి ఇవ్వవలెను. ఇట్లు చేయుటచే నివృత్తికళ శుద్ద మగును. “ఓం హూం హాం ఆముకస్య ఆత్మనో నివృత్తి కలాడద్ధిరస్తు స్వాహా ఫట్ నౌషట్” అనునది పూర్ణాహుతి మంత్రము.
అగ్నిమహాపురాణములో, నిర్వాణదీక్షయఁదు నిర్వాణకళాశోధన మను ఎనుబదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 84 of the Agni Purāṇa is as follows:
This chapter describes the first level of the nirvāṇa-dīkṣā: the purification of the nivṛtti-kalā — the lowest of the five cosmic levels, associated with the gross elements and the earthly plane. The 108 bhuvana-s (cosmic worlds) within this kalā, each presided over by a form of Rudra named after a sacred site — Kapāla (Kāpāleśvara), Aja (Ajagiri), Ahirbudhnya, and 105 others — are enumerated. The ritual process of the śiṣya's jīva being "extracted" from within the nivṛtti-kalā through the guru's sūtra, "purified" by burning in the fire of Śiva-consciousness, and then "re-implanted" in the purified kalā is described. The pāśa-chedana with the kalā-astra — the cutting of the bonds at each bhuvana level — is given as the specific act that severs the soul's attachment to each cosmic realm.