అగ్ని మహా పురాణము

54 - అథ నానాలిజ్గామానాదిలక్షణమ్ :

 శ్రీ భగవానువాచః-

వక్ష్యామ్యన్య ప్రకారేణ లిజమానాదికం శృణు

వత్యే లవణజం లిజం ఘృతజం బుద్దివర్ధనమ్. 

భూతయే వస్త్ర లిజ్జంతు లిజ్జంతాత్కాలికం విదుః

పక్వాపక్వం మృన్మయం స్యాదపక్వాత్పక్వజం వరమ్.

తతోదారుమయం ముఖ్యం దారుజాచ్చైలజం వరమ్

శైలాద్వరంతు ముక్తాజం తతోలౌహం సువర్ణజమ్.

 రాజతం కీర్తితం తామ్రం వైత్తలం భుక్తి ముక్తిదమ్

రజ్గజం రసలిజంచ భుక్తిముక్తిప్రదం వరమ్.

రసజం రసలోహాది రత్నగర్భంతు తువర్ధయేత్

మానాది వేష్టం సిద్ధాది స్థాపితేథ స్వయంభువి.

హయగ్రీవుడు చెప్పెను :- బ్రహ్మదేవా! ఇపుడు నేను ఇతర లింగాదులను గూర్చి చెప్పెదను; వినుము. లవణముతోను, ఘృతముతోను చేసిన శివలింగము బుద్ధిని వృద్ధి పొందించును. వస్త్రమయ లింగము ఐశ్వర్యదాయకము. ఆది తాత్కాలిక లింగము. మృత్తిక తో నిర్మించిన లింగము పక్వము, అపక్వము అని రెండు విధములు. అపక్వము కంటె పక్వము శ్రేష్ఠము. దాని కంటే కణతో చేసిన లింగము ఆధిక పుణ్య దాయకము, పవిత్రము. దాని కంటే శిలా లింగము శ్రేష్టము. దాని కంటే ముత్యముల శివ లింగము. దాని కంటే సువర్ణ లింగము ఉత్తమములు. వెండి, రాగి, ఇత్తడి, రత్నములు, పాదరసము వీటితో నిర్మించిన శివలింగము భోగ మోక్ష ప్రదము, శ్రేష్టము. రసలింగమును రత్నము లలోగాని, సువర్ణాది లోహములలో గాని బంధించి స్థాపించవలేను. సిద్దాదులచే స్థాపింపబడిన స్వయం భూలింగాదులకు కౌలతలు మొదలగునవి చేయుట యుక్తముకాదు.

బాణే చ స్వేచ్ఛయాతేషాం పీఠప్రాసాడ కల్పనా

 పూజయేత్సూర్య బిమ్బ స్థందర్పణే ప్రతిబిమ్బితమ్.

పూజ్యోతిహరస్తు సర్వత్ర లిజ్గే పూర్ణార్చనం భవేత్

హస్తోత్తరోచ్ఛితం శైలం దారుజం తద్వదేవహి.

చలమఱులమానేన ద్వార గర్భక రైః స్థితమ్

అజ్గులాద్గృహలిజ్గం స్యా ద్యావత్పఞ్చాదశాజ్గులమ్.

బాణ లింగమున విషయమున కూడ (నర్మదోద్భవమునకు) ప్రమాణాదిచింత ఉండ కూడదు. అట్టి లింగములకై ఇచ్చానుసారముగ పీఠ ప్రాసాదాది నిర్మాణము చేయవచ్చును. సూర్యమండలస్థ శివలింగమును అద్దములో ప్రతిబింబింపజేసి పూజించవలెను. లింగ ముపై శివార్చన పరిపూర్ణము, సకలకామప్రదరణ, శివలింగము ఎత్త హస్తము కంటే ఎక్కువ ఉండ వలెను. కాష్టమయ శివలింగము కూడ ఆంతయే ఉండవలెను. చల శివలింగ స్వరూపమును అంగుళమానానుసారమును, స్థిర లింగ స్వరూపమును ద్వార - గర్భ-హస్తమానముల అనుసారమును నిర్ణయింపవలెను. గృహములో పూజింపబడు చల లింగము ప్రమాణము ఒక అంగుళము మొదలు పదునై దు అంగుళముల వరకును ఉండవచ్చును.

ద్వారిమానా సంఖ్యాకం నవధా గర్బ మానత్య

 నవధా గర్బమానేన లిజ్గం ధామ్ని చ పూజయేత్.

ఏవం లిజ్గాని షట్త్రింశద్ జ్ఞేయాని జ్యేష్ఠ మానతః

మధ్యమానేన షట్త్రింశత్ షట్త్రింశ దధ మేనచ.

ఇత్థమైక్యేన లిఙానాం శతమష్టోత్తరం భవేత్

ఏకా జులాది ప్చూన్తం కనిష్ఠం చలముచ్యతే.

షడాదిదశ పర్యస్తం చలలిజంచ మధ్యమమ్

ఏ కాదశాజులాదిస్యా జ్యేష్ఠపణ దశా నకమ్.

షడజ్గులం మహార త్నైరన్యై రన్యైర్న వాజ్గులమ్

రవిభిర్హే మభారోత్ధం లిజ్గాం శేషైస్త్రిపఞ్చభిః.

ద్వారమానమును బట్టి లింగము మూడు విధములగును. వీటిలో ఒక్కొక్క దానికి గర్భమానమును బట్టి, తొమ్మిదేసి భేదములగును. హస్తమానముచే తొమ్మిది భేదములగును. వీటిని దేవాలయములో పూజింపవలెను. ఈ విధముగ అన్నింటిని కలపగా ముప్పదియారు లింగములు. ఇది లింగ ముం జ్యేష్ఠమానము. మధ్యమమాన-కనిష్ట మానముల చేత కూడ ముప్పదియారు ముప్పదియారు. శివలింగము లగును. ఈ విధముగ అన్ని లింగములను కలుపగానూట ఎనిమిదిలింగము లగును. ఒకటి మొదలు ఐదు అంగుళముల వరకు కనిష్టమ (చిన్నది). ఆరునుండి పది అంగుళములవరకు చల లింగము మధ్యమము. పదకొండు నుండి పదునైదు అంగుళముల వరకు చల శివలింగము జ్యేష్టము. చాలమూల్యముగల రత్నములతో నిర్మించిన లింగము ఆరు అంగుళములు, సాధారణ రత్న నిర్మితము తొమ్మిది ఆంగుళములు, సువర్ణ నిర్మితము పండ్రెండు అంగుళములు ఇతర పదార్థ నిర్మితము పదునైదు అంగుళములు ఉండవలెను.

షోడశాంశేచ వేదాంశే యుగం లుప్త్వార్ధ్వదేశతః

ద్వాత్రింశత్ షోడశాంశాశ్చ కోణయోస్తు విలోపయేత్.

చతుర్ని వే శనాత్కళో వింశతిశ్రియుగై స్తథా

పార్శ్వాభ్యాంతు విలుస్తాభ్యాం మనలిజ్ఞం భవేద్వరమ్.

ధామ్నో యుగర్తునాగాం శైఠ్వారమానోన్నతం క్రమాత్

లిఖేద్వారోచ్ఛ యాదర్వాగృ వేత్పాదోనితం క్రమాత్.

గర్భాల్దేనాధమం లిఖం భూతాం కైః స్సాత్తి భిర్వరమ్

తయోర్మధ్యేచ సూత్రాణి సప్త సంపాదయేత్సమమ్.

ఏవం సుర్నవసూత్రాణి భూతసూతైశ్చ మధ్యమమ్

ద్వ్యక్షరో వామభాగశ్చ లిఙానాం దీరతా తవ.

హస్తా ద్వివర్ధతే హస్తో యావత్స్యుర్నవ ప్రాణయః

హీనమధ్యోత్తమం లిజ్గం త్రివిడం త్రివిధాత్మకమ్.

లింగ శిలను పదునారు భాగములు చేసి పై నాలుగు భాగములలో ప్రక్కనున్న రెండు భాగములను తీసివేయ వలెను. మరల ముప్పది రెండు భాగములు చేసి దాని రెండు కోణములందును ఉండు పదునారు భాగములు తీసివేయవలెను. మరల దానిలో నాలుగు భాగములు కలుపగా కంఠము ఏర్పడును. అనగా ఇరువది భాగములు కంఠముగా ఏర్పడును. రెండు ప్రక్కలను ఉన్న పడ్రెండు భాగములను తీసివేయుటచే జ్యేష్ట చల లింగము ఏర్పడును. ప్రాసాద (దేవాలయ)ము ఎత్తును పదునారు భాగములుగా విభజింపగా, నాలుగు, ఆరు, ఎనిమిది భాగముల ఎత్తుచే వరుసగా కనిష్ట - మధ్య-జ్యేష ద్వారము లేర్పడును, ద్వారము ఎత్తులో నాల్గవ వంతు తగ్గించగా అది లింగము ఎత్తు , అగును.. లింగ శిలాగర్బము ఎత్తులో సగము ఎత్తుగల శివలింగము కనిష్టము. పదునై దు భాగముల ఎత్తు గలది జ్యేష్ఠము. ఈ రెండింటి మధ్య ఏడు చోట్ల సూత్రపాతము చేయవలెను. ఈ విధముగ తొమ్మిది సూత్రము లగును . ఈ తొమ్మిది సూత్రములలో ఐదు సూత్రముల ప్రమాణము గల లింగము మధ్యమము, లింగముల ఎత్తు రెండేసి భాగముల తేడాతో ఉండుమ. ఈ విధముగ లింగముల పొడవు పెరగగా తొమ్మిది లింగములు నిర్మాణమగును. హస్తప్రమాణముచే లింగమును. నిర్మించినచో, మొదటి లింగము ప్రమాణము ఒక హస్తము రెండవ దాని ప్రమాణము మొదటి దాని కంటే ఒక హస్తము ఎక్కువ. ఈ విధముగా తొమ్మిది హస్తముల కొలత పూర్తిఅగు వరకు ఒక్కొక్క హస్తము పెంచుతు పోవలెను. పైన చెప్పిన హీన-మధ్యమ - జ్యేష్ఠ లింగములలో ఒక్కొక్క దానికి మూడేసి భేదము లుండును.

ఏకైక లిజ్గ మధ్యేషు త్రీణి త్రీణి చ పాదశః

లిజ్గాని ఘటయేద్దీమాన్ షట్సు చాప్టోత్త రేషు చ.

స్థిర దీర్ఘ ప్రమాణెస్తు ద్వార మర్దక రాత్మికా

భాగేశం చాప్యమీశంచ దై వేశంతుల్య సంజ్ఞతమ్.

చత్వారి లింగరూపాణి విషమ్భేణతు లక్షయేత్

దీర్ఘ మాయాన్వితం కృత్వా లింగం క్షుర్యాత్రి రూపకమ్.

చతురష్టాష్ట్రవృత్తంచ తత్వ త్రయగుణాత్మకమ్

లిజ్ఞానామీప్సితం దైర్ఘ్యం నకృత్వాజు లానివై.

ధ్వజాయాద్యైః స్వరై ర్భూతైః శిఖిభి ర్వాహరేత్కృతిమ్

తాన్యజ్గులాని యచ్ఛేషం లక్షయేచ్ఛ శుభాశుభమ్.

బుద్ధిమంతుడు ఒక్కొక్క లింగమునందు విభాగ పూర్వకముగ. మూడేసి లింగములు నిర్మింప చేయవలెను. ద్వారమానము, గర్భమానము, హస్తమానము అను ఈ మూడు దీర్ఘమానానుసారము స్థిర లింగమును నింపవలెను. పై మూడు ప్రమాణముల ననుసరించి భగేశుడు, జవేశుడు, దేవేశుడు అని మూడు పేర్లు ఏర్పడును విష్కంభ (విస్తార) మును బట్టి లింగమునకు నాలుగు రూపములు గుర్తింపవలెను. దైర్ఘ్య ప్రమాణానుసారము ఏర్పడు, మూడు రూపములలో కావలసిన లింగమునకు శుభమగు ఆయాదికనుండు నట్లు చూచు కొనవలెను. ఈ మూడు విధముల లింగముల పొడవు నాలుగు లేదా ఎనిమిది హస్తము లుండుట మంచిది. ఇవి వరుసగ త్రిగుణ స్వరూపములు. లింగము పొడవు ఎన్ని హస్తములున్నదో ఆ హస్తములను ఆంగుళములలోనికి మార్చి, ఎనిమిది, ఏడు, ఐదు, మూడు సంఖ్యలచే విభజించవలెను మిగిలిన దానిని పట్టి శుభాశుభ నిర్ణయము చేయవలెను.

ధ్వజాద్యా ధ్వజసిం హేభ వృషాః శ్రేష్ఠః పరే శుభాః

స్వరేషు షడ్జగన్గార పశ్చిమాః శుభదాయకాః.

భూతేషుచ శుభాభూఃస్యాదగ్ని శ్చాహవనీ యక

ఉక్తా యామస్యచాఠాంశే నాగార శై ర్భాజితే క్రమాత్

 రసభూతాలతో షష్టాంశత్ర్యం శాధిక శరై ర్భవేత్

ఆడ్యానాడ్య సురేజ్యార్క తుల్యానాం చతురస్రతా.

పఞ్చమం వర్ధ మానాఖ్యం వ్యాసానాహ ప్రవృద్ధితః

ద్విధా భేదా బహూన్యత్ర వన్యనే విశ్వకర్మతః.

ఆధ్యాదీనాం త్రిధా స్థాల్యాద్యవధూతం తదష్టదా

త్రిధహస్తా జ్ఞానాఖ్యంచ యుక్తం సర్వ సమేన చ.

ధ్వజాద్యాయములలో ధ్వజ – సింహ - గజ - వృషభాయములు మంచివి. మిగిలిన నాల్గును చెడ్డవి. స్వర సంఖ్యచే - ఆనగా ఏడుచేత భాగించినప్పుడు వడ్డ - గాంధార - పంచమములు (శేషము) శుభదాయకములు. భూతములచేత. అనగా ఐదుచేత - భాగించినపుడు శేషము పృథివి, ఆయిన శుభము. అగ్ని చేత- అనగా మూడుచేత భాగించినపుడు శేషము ఆహవనీయాగ్నియైన శుభము. లింగము పొడవును సగము చేసి, దానిని ఎనిమిదిచే భాగించగా శేషము ఏడు. వచ్చినచో ఆలింగము “ఆడ్యము” ఐదు కంటె. ఆధికము. శేషమైనచో “అనాథ్యము” ఆరు అంశల కంటే అధికము శేషమైనచో అది “దేవేజ్యము”. మూడు అంశల కంటె . ఆధికము. శేషించినచో అది. “ఆర్కతుల్యము”. ఈ నాలుగు విధములగు లింగములుమ చతుష్కోణములుగ నుండును. ఐదవది “వర్గమాన లింగము”, దీనికి వ్యాసము కంటే ఆనాహము ఆధికము. ఆవాహము, వ్యాసముతో సమానముగ ఉండుట, దాని కంటే పెద్దదిగా ఉండుట అను దానినిపట్టి, ఈ లింగములలో రెండు భేదము లుండును. విశ్వకర్మ శాస్త్రానుసారము ఈ అన్నింటి భేదము లనేకములు చెప్పబడగలవు. స్థూలత్వాదులచే ఆధ్యాది లింగములలో మరల మూడు భేదము లుండును. వాటికి ఒక్కొక్క యవ చొప్పున పెంచగా మొత్తము ఎనిమిది విధముల లింగము లేర్పడును. హస్తమానమును పట్టి ‘జిన’ మను లింగమునకు గూడ మూడు భేదము లగును. దానిని సర్వ సమలింగమున కలిపివేయవలెను.

పఞ్చవింశతి లిజ్గాని నాద్యే దేవార్చితే తథా

పఞ్చచి సప్తభి రేక త్వా జ్ఞానై ర్భకైరృవ నిహి.

చతుర్దశ సహస్రాణి చతుర్దశ శతానిచ

ఏవమష్టాజ్గుల విస్తారో నవై కకర గర్భతః.

తేషాంకోణార్ధ కోణస్థశ్చిస్త్యా తోణాని సూత్రకైః

విస్తారం మధ్యతః కృత్వా స్ధాప్యంవా మధ్యతశ్రయమ్.

విభాగా దూర్ధ్వ మష్టాగ్రో ద్వ్యష్టాసః స్యాచ్ఛివాంశకః

పాదాజ్ఞాన్వనకో బ్రహ్మా సౌభ్యన్తో విష్ణురిత్యతః.

            ఆనాడ్యము, దేవార్చితము, అర్కతుల్యము అను లింగములకు గూడ ఐదేసి భేదములగుటచే ఇరువదియైడు అగును. ఏక-జిన-భక్త భేదములచే డెబ్బదియైదు భేదము లగును. అన్నియు కలుపగా పదునై దువేల, నాలుగు వందల శివలింగము లగును. ఎనిమిది అంగుళముల విస్తారముగల లింగము కూడ ఏకాంగుళమానము, హస్తమానము, గర్భమానము అను మానత్రయము ననుసరించి తొమ్మిది భేదము లగును. వీటి నన్నింటిని కోణ-అర్ధకోణము. లందున్న సూత్రములచే వీటి కోణములను విభజింపవలెనని ఒక్కొక్క విభాగము యొక్క విస్తారము, లింగ మధ్యభాగ విస్తారతుల్యముగ భావించి మధ్య. ఊర్ధ్వ-అధో విభాగము లేర్పరుపవలేను. మధ్యమ విభాగముపై నున్న ఆష్ట్ర కోణము లేదా షోడశకోణము అగు విభాగము శివుని అంశము. మూల భాగమునుండి జానువు పర్యంతము ఉండు లింగాధోభాగము బ్రహ్మ యొక్క అంశము. జానువు నుండి నాభి వరకును ఉన్న లింగ మధ్యభాగము విష్ణువు యొక్క అంశము.

మూర్ధా న్తో భూతభాగేశో వ్యక్తేవ్యక్తే చతద్వతి

 పఞ్చ లింగవ్యవస్థాయాం శిరోవర్తుల ముచ్యతే.

చత్రాభం కుక్కుటాభంవా బాలేందు ప్రతిమా కృతిః

ఏకైక స్య చతుర్భేదై కామ్య భేదాత్సలం వదే.

లింగమస్త కవిస్తారం వసుభ క్తంతు కారయేత్

ఆద్యభాగం చతుర్ధాలు విస్తారోచ్ఛాయతోభజేత్

చత్వారి తతసూత్రాణి భాగభాగానుపాతనాల్

పుణ్డరీకంతు భాగేన విశాలాఖ్యం విలోకనాత్

త్రిశతనాత్తు శ్రీవత్సం శత్రుకృద్వేదలోపనాత్

 శిరః సర్వసమే శ్రేష్ఠం కక్కుటాభంసురాహ్వయే.

మూర్ధానభాగము భూతభాగేశ్వరునిది. వ్యక్త-అవ్యక్త లింగ మన్నింటికిని ఇదే పద్దతి. ఐదులింగము ఏర్పాటున్న శివలింగమునకు శిరోభాగమును గుండ్రముగ చేయవలెను. ఈ గోలాకారము ఛత్రమువలె నుండవచ్చును, కోడిగుడ్డువలె నుండవచ్చును, లేదా నవోదితచంద్రుడువలె ఉండవచ్చును. కామ్యభేదమును పట్టి నాలుగువిధములగు నలభేదములను చెప్పుచున్నాను. లింగము శిరోవిస్తారము ఎన్ని అంగుళములుండునో ఆ సంఖ్యను ఎనిమిది చే భాగించవలెను. ఈ విధముగ శిరస్సును ఎనిమిదిభాగములుగ- ఈ విభజించి మొదటి నాలుగుభాగములను విస్తార. ఔన్నత్యములననుసరించి గ్రహింపవలెను. ఒక భాగమును తీసివేసుగా “పుండరీకము” అను లింగ ఘు, రెండుభాగమును తీసివేయగా, “విశాలము” అనులింగము, మూడు భాగములను తీసివేయగా “శ్రీవత్సము” అనులింగము, నాలుగుభాగములను తీసివేయగా, శత్రుకారకలింగము ఏర్పడును. అన్ని ప్రక్కలనుండియు శిరోభాగము సమముగ నున్నది. శ్రేష్ఠము. దేవపూజ్య లింగమునందు లింగ శిరోభాగము కుస్కుటాండమువలె గోలాకారమున నుండవలెను.

చతుర్భాగాత్మ కే లింగేత్రపుషం ద్వయలోపనాత్

అనాద్యస్య శిరఃప్రో కమర్ధ చన్దం శిరః శృణు .

అంశాత్ప్రానే యుగాంతైశ్చ ద్వ్యేకహాస్యామృతాక్షకమ్

పూర్ణబాలేన్షుకుముదం ద్విత్రివేదక్షయాత్ర మాత్.

చతుస్త్రి రేఖం వదనం ముఖలింగ మతః శృణు

పూజాభాగః ప్రకర్తవ్యో మూర్త్యగ్ని పదకల్పిత.

పూర్వవ త్యక్త్వా షట్ స్థానాని వివర్తయేత్

శిరోన్నతికి ప్రకర్తవ్యాలలాటం నాసికా తతః.

వదనం చిబుకంగ్రీవా యుగ భాగై ర్భుజాక్షిభిః

కరాభ్యాం ముకులీకృత్యప్రతిమాయాః ప్రమాణతః,

ముఖం ప్రతి సమః కార్యో విస్తారాదష్టమాం శతః

చతుర్ముఖం మయా ప్రోక్తం త్రిముఖం చోచ్యతే శృణు.

చతుర్బాగాత్మక లింగమునందు పై రెండు భాగములను తొలగించగా.”త్రపుష” మను లింగ మేర్పడును. ఇది అనాథ్యమను. శివలింగముయొక్క శిరస్సుగా చెప్పబడుచున్నది.. ఇప్పుడు అర్ధచంద్రాకార శిరస్సు గూర్చి వినుము. శివలింగ ప్రాంతభాగమునందు ఒక అంశమును నాలుగు అంశములుగ చేసి ఒక అంశమును విడిచినచో దానికి “అమృతాక్షరము” అని పేరు. రెండవ-మూడవ-నాల్గవ అంశములను తొలగింపగా, క్రమముగ వాటికి పూర్ణేందు “బాలేను” “కుముద” ము అని పేర్లు. ఇవి.క్రమముగ చతుర్ముఖ - త్రిముఖ - ఏకముఖములు.. ఈ మూడింటికి “ముఖలింగము” లని కూడ పేర్లు. ఇపుడు ముఖలింగమును గూర్చి వినుము. పూజాభాగమును, మూడ్రిపూజ, “ఆగ్నిపూజ- వదపూజ” అని మూడు విధములుగ కల్పించుకొనవలేను.. వెనుక టివలె ద్వాదశాంశమును విడచి, ఆరుభాగముల ధ్వారా ఆరు స్థానములను అభివ్యక్తము చేయవలెను. శిరస్సు ఎత్తుగానుండునట్లు, లలాటనాసికా-ముఖ-మిక కంఠములు -స్పష్టముగ కనబడునట్లు చేయవలెను. ఈ నాలుగు:ఆంశములచే రెండుభుజములను, నేత్రములను ఏర్పరుపవలేను.. ప్రతిమా ప్రమాణానుసారము హస్తము, ముకులాకారముగ ఏర్పరచి, విస్తారములోని ఎనిమిదవ ఆంశముచే నాలుగుముఖముట్రను ఏర్పరుపవలెను. అన్ని ప్రక్కలనుండియు సమముగ ఉండవలెను. ఇంతవరకు చతుర్ముఖ లింగమును గూర్చి చెప్పితిని; వినుము.

కర్ణపాదాధికాన్యస్య లలాటాదీని నిర్ధికేత్

భుజౌ చతుర్భిర్భాగైస్తు కర్తవ్యా పశ్చిమోర్జితా.

విస్తారాదష్టమాం కేన ముఖానాం ప్రతినిర్గమః

ఏకవ క్రం తథా కార్యం పూర్వస్యాం సౌమ్య లోచనమ్.

లలాట నాసికా వక్త్ర గ్రీవాయాం చ వివ ర్తయేత్

భుజాచ్చపఞ్చమాం శేన భుజహీనం విపర్తయేత్.

 విస్తారస్య షడం శేన ముఖై ర్నిర్గమనం హితమ్

సర్వేషాం ముఖలింగానాంత్రపుషం వాడ కుక్కుటమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే లిజ్గమానాది వ్యక్తావ్యక్తలక్షణం నామ చతుఃపఞ్చశ త్తమోధ్యాయః.

చతుర్ముఖలింగముకంటె త్రిముఖలింగమునకు చెవులు, పాదములు ఆధికము. లలాటాదులను వెనుకటివలెనే ఏర్పరుపవలెను నాలుగు అంశలతో రెండు భుజములను నిర్మింపవలెను. వాటి వెనుక భాగము దృఢముగా నుండవలెను. “విస్తారముయొక్క ఎనిమిదవ ఆంశ మురళడు మూడు ముఖములును స్పషముగ కనబడవలెను. - (ఏకముఖ లింగము). ఏకముఖమును తూర్పువైపున నిర్మింపవలెను. దాని నేత్రములు- సౌమ్యుముగా నుండవలెను. దాన్ని లలాటనాసికా-ముఖ కంఠములు పైకి ఉబికి యుండవలెను. బాహువిస్తారములో ఐదవ అంశముచే పైన చెప్పిన 'అవయవముల నిర్మాణము జరుగవలెను. దానిని బాహురహితముగా నిర్మింపవలెను. ఈ ఏకముఖలింగ మునందు విస్తారములో ఆరవ ఆంశమునందు ముఖ నిర్మాణము హితకరమని చెప్పబడినది. ముఖయు క్తములగు అన్ని లింగముల శిరోభాగములును.-త్రపుషాకారమురో గాని, కుక్కుటాండాకారములోగాని ఉండవలెను.

ఆగ్ని మహాపురాణమునందు లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణమను ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.