అగ్ని మహా పురాణము

33 - అథ పవిత్రారోపణ విధానమ్

అగ్నిరువాచః-

పవిత్రారోపణం వక్ష్యే వర్షపూజాఫలం హరేః

ఆషాడాదౌ కార్తీక్ నే పతిప త్యజ్యతే తిథి. 

శ్రియా గౌర్యా గణేశ స్య సరస్వత్యా గుహస్య చ

మార్షణమాతృదుర్గాణాం నాగర్షిహరిమన్మథై.

శివస్య బ్రహ్మణ స్తద్వద్వితీయాదితిథేః క్రమాత్

యస్య దేవస్య యో భక్తః పవితా తస్య సా తిథి.

అగ్ని దేవుడు పలికెను : మునీ! ఇపుడు నేను పవిత్రారోపణమును గూర్చి చెప్పెదను. సంవత్సరమునందు ఒక మారు పవిత్రారోపణము చేసినచో, సంవత్సర మంతయు శ్రీహరి పూజ చేసిన ఫలము నిచ్చును. ఆషాడశుక్ల ఏకాదశి మొదలు కార్తీక శుక్లైకాదశి వరకు నున్న కాలమున పవిత్రారోపణము చేయవలెను. ప్రతిపత్తు విడువవలెను. ద్వితీయాదితిథులు క్రమముగ లక్ష్మ్యాదిదేవతల తిథులు. ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణేశునికి, పంచమి సరస్వతికి, షష్టి కుమారస్వామికి, సప్తమి సూర్యునకు, అష్టమి మాతృదేవతలకు. నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువునకు, త్రయోదశి మన్మథునకు, చతుర్దశి శివునకు, పౌర్ణమాసవాస్యలు బ్రహ్మకు సంబంధించినవి. ఏ ఉపాసకుడు ఏ దేవతను ఉపాసించునో ఆతనికి ఆ దేవతయొక్క తిథి పవిత్ర మైనది.

 ఆరోహణే తుల్యవిధిః పృథజ్ మంత్రాదికం యది

సౌవర్ణం రాజతం తామ్రం నేత్రకార్పాసనాదికమ్.

పవిత్రారోపణ విధి అందరు దేవతలకును సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరు వేరుగా నుండును. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి, రాగి తీగలను గాని నూలు దారముగాని ఉపయోగింపవలెను.

బ్రాహ్మణ్యా కర్తి తం సూత్రం తదలాభే తు సంస్కృతమ్

ద్విగుణం త్రిగుణీకృత్య తేన కుర్యాత్ పవిత్రకమ్.

అష్టోత్తరశతాదూర్ధ్వం తదర్ధం చోత్త మాదికమ్

క్రియాలో పవిఘాతార్థం యత్వయాభిహితం ప్రభో.

మయా తత్రియతే దేవ యథా యత్ర పవిత్రకమ్

అవిఘ్నం తు భవేదత్ర కురు నాథ జయావ్యయ.

బ్రాహ్మణస్త్రీ చేతితో వడికిన నూలు చాల. శ్రేష్ట మైనది. అది లభించనిచో ఏ దారము నే నను గ్రహించి, దానిని సంస్కరించి, ఉపయోగింపవలెను. దారమును మూడు పేటలు చేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానితో పవిత్రకమును నిర్మింపవలెను. నూట ఎనిమిది మొదలు అధికము లగు తంతువులతో నిర్మించిన పవిత్రకము, ఉతమాది శ్రేణికి చెందినదిగ పరిగణింపబడుచున్నది. పవిత్రారోపణమునకు ముందు ఇష్టదేవతను గూర్చి ఈ విధముగ ప్రార్థింప. వలెను. “ప్రభూ! క్రియాలోపమువలన కలిగిన దోషమును తొలగించుటకై నీవు ఏ సాధనమును చెప్పినావో దానినే నేను చేయుచున్నాను. క్కడ ఏ పవిత్రకము ఆవశ్యకమో ఆక్కడ అట్టి పవిత్రకమునే ఆర్పించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్న బాధ లేవియు కలుగకుండుగాక. అవినాశి యైన పర మేశ్వరా! నీకు జయమగుగాక.

ప్రార్ధ్యతన్మజ్ఞలాయాదౌ గాయత్ర్యా బందయేన్నరః

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి.

తన్నో విష్ణుః ప్రచోదయాద్దేవదేవానురూపతః

జానూరునాభినాసాస్త్రం ప్రతిమాసు పవిత్రకమ్.

పాదాస్తా వనమాలా స్యాదష్టోత్తర సహస్రతః

మాలాం తు కల్పసాధ్యాం వా ద్విగుణాం షోడశాజ్గులామ్.

కర్ణికా కేసరం పత్రం మన్రోద్యం మణ్డలాన కమ్

 మణ్డలాజులమాత్రాకచక్రాబ్దాదౌ పవిత్రకమ్.

స్థణ్డిలేజ్గులమానేన ఆత్మనః సప్త వింశతిః

ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతామండలమునకు గాయత్రీమంత్రముతో కట్టవలెను. “ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్” అనునది ఇష్టదేవత యగు నారాయణుని గాయత్రీమంత్రము. ఈ గాయత్రీ ఇష్టదేవతానామానుసారముగ ఉండును. దేవప్రతిమల పై అర్పించుటకు అనేక విధములగు పవిత్రకము లుండును. విగ్రహము యొక్క నాభివరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరియొకటి మోకాళ్ళవరకు వచ్చునది మరియొకటి. పాదము వరకు వ్రేలాడునది  ఒకటి. చివరిదానికి వరమాం అని పేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారముతో నిర్మింపవలేము. సాధారణ పూలను శ క్త్యనుసారము నిర్మింపవలెను. లేదా ఆది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను. కర్ణికా-కేసర-దళాచులుగల యంత్ర-చక్రా మండలములపై వేయు పవిత్రకము పైనుడి క్రిందివరకును కప్పునదిగా ఉండవలెను. ఒక చక్రము, ఒక కనులము ఉన్న మండలము పై ఆ మండలము ఎన్ని అంగుళము ఉన్నదో అన్ని అంగుళముల పవిత్రకము ఆర్పేంపవలెను. వేద పై ఆర్పించు పవిత్రకము తన చేతి ఆంగుళములతో ముప్పయేడు అంగుళము పొడ వుండవలెను.

ఆచార్యాణాం చ సూత్రాణి పితృమాత్రాదిపుస్త కే.

నాభ్యనం ద్వాదశగ్రస్థాం తథా గంధపవిత్ర కే

 అజ్గలాత్కల్పనాచౌద్విర్మాలా చాప్టోత్తరం శతమ్.

 అథవార్కచతుర్వింశషటింశన్మాలికా ద్విజ

అనామామధ్యమాజు ఫైర్మన్గాద్యైర్మాలికార్థిభిః.

కనిష్టాదౌ ద్వాదశ జాగ్రస్థయః స్యుః పవిత్ర కే

రవేః కుమ్భహుతాశాదేః సమ్భవీ విష్ణువన్మతమ్.

పీఠస్య పీఠమానం స్యాన్మేఖలానే చ కుజ్ఞ కే

యథాశక్తి సూత్రగ్రస్థిః పరిచారేథ వైష్ణవే.

సూత్రాణి వా సప్తదశ సూత్రేణ విభక్త కౌ

ఆచార్యునికోరుకును, తందండ్రులకొరకును, పుస్తకముపై ఉంచుటకోరకును  నిర్మింపబడు పవిత్రకము నాభిప్రదేశమువరకును వ్రేలాడవలెను.. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను. వనమా గుందు రెండేసి అంగుళములదూరము క్రమము నూట ఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ట-మధ్యమ- ఉత్తమపకము పై ఆచమూ పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారు ముడులు వేయవలెను. ముంద. మధ్యమఉత్తమమాలార్థు లగు పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రక ములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకారి నామధేనుము- గల పవిత్రక ఘులందు అన్నింటియంను పండ్రెండేసి ముడులే ఉండవలెను. (తంతువుల సంఖ్యను పట్టి, పాడవును పట్టియు ఈ కనిష్టి కాదనామధేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు పొడని గూడ చుథాసంభవము భగవంతు డగు విష్ణువుకు వలెనే పవిత్రకములను ఆర్పేంచుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠము కొరకు వాని పొడవును పట్టియు, కుండము కు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండ వలెను. విష్ణుపార్షదులు యథాశక్తిగ సూత్రగ్రంథు:ను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదుకు త్రిసూత్రము సమర్పించవలెను.

ఏకాదశ్యాం యాగగృహే భగవన్తం హరిం యజేత్ .

సమస్త పరివారాయ బలిం పీకే సమర్చయేత్

క్షౌం క్షేత్రపాలాయ ద్వారానే ద్వారోపరి శ్రియమ్.

ధాత్రే దకే విధాత్రే చ గఙాం చ యమునాం తథా

శజ్ఞపద్మనిధీ పూజ్య మధ్యే వాస్వపసారణమ్.

సారబ్దాయేతి భూతానాం భూతశుద్దిం స్థితశ్చ రేత్

ఓం హూం హః ఫట్ హ్రూం గన్లతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హ ఫట్ ఫ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ ఫ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దత న్మాతం సంహరామి నమః.

పఞ్చోద్ఘాతైర్గస్థతన్మాతస్వరూపం భూమిమణ్డలమ్

చతురసం చ పీతం చ కఠినం వజలాణ్చితమ్.

ఇంద్రాధిదై వతం పాదయుగ్మమధ్యగతం స్మరేత్

 శుద్ధం చ రసతన్మాతం ప్రవిలాప్యాథ సంహరేత్

రసమాత్రం రూపమాత్రే కమేణానేన పూజకః.

పవిత్రకమును గోరోచనముతోను, ఆగురుకర్పూరము కలిపి పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజాగృహము ప్రవేశించి, భగవంతు డగు శ్రీహరిని పూజింపవలేను. విష్ణువుయొక్క సమ స్తపరిచారమునకును బలి సమర్పించి విష్ణువును పూజించవలెను. ద్వారము యొక్క అంతమునందు “క్షం క్షేత్రపాలాయ నమః” అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను. ద్వారము పై భాగమున “శియై నమః” అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున “ధాత్రే నమః” “గంగాయై నమః” అను ముత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపపలెను. ఎడమ వైపున “విధాత్రే నమః” యమునాయై నమః” అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను. ఇదే విధముగ ద్వారముయోక్క కుడి ఎడమ ప్రదేశములందు క్రమముగ “శ జ్ఞానిధయే నమః” పద్మ నిధయే నమః” అని చెప్పుచు శంఖపద్మ నిధులను పూజింపవలెను.[(పిదప మండపములోపల కుడి హదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్న ములను పారద్రోలవలెను.] పిమ్మట ' “సారజ్ఞాయ నమః అని అనుచు విఘ్న కారకము లగు భూతములను పారద్రోలవలెను. [పిమ్మట “ఓం హాం వాస్వధిపతయే బ్రహ్మణే నమః  అను మంత్రము నుచ్చరించుచు బ్రహ్మ యొక్క స్థానమున పుష్పములుంచవలెను.] పిదప ఆసనముపై కూర్చుండి భూతశుద్ది చేయవలెను.

“ఓం హ్రూం హః ఫట్ హ్రూం గంధతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ హూం రసతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రూం హః ఫట్ ఫ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ ఫ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.”

అను ఐదు ఉదాతవాక్యముల నుచ్చరించుచు గంధతన్మాత్రస్వరూపమగు భూమండలమును, వజచిహ్ని తము, సువర్ణమయము, చతురస్రము (నలుపలకలు గలది) పీఠమును, ఇంద్రాదిదేవతలను తన పాదములు మధ్య నున్నట్లు చూచుచు వాటి భావన చేయవలెను. ఈ విధముగ శుద్ద మగు గంధతన్మాత్రను రసతన్మాత్రయందు లీనము చేసి ఉపాసకుడు అదే క్రమమున రసతన్మాత్రను రూపతన్మాత్రయందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్ హూం రసతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రీం హః ఫట్ హూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్ హూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్ హూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

జానునాభిమధ్యగతం శ్వేతం వై పద్మలాజ్ఛితమ్

శుక్లచస్త్రం చార్గదనం ధ్యాయేద్వరుణదైవతమ్.

చతుర్భిశ్చ తదుద్ఘాతైః శుద్దం తదసమాతకమ్

సంహరేదసతన్మాతం రూపమా చ నంహరేత్.

ఓం హ్రీం హః ఫట్ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం ఫట్ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమ.

ఓం హ్రీం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హీం హః ఫట్ హూం శబతన్మాత్రం సంహరామి నమః.

అను నాలుగు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు మోకాళ్లు మొదలు నాభివరకును ఉన్న శరీర భాగమును శ్వేతకములచే చిహ్నిత మైనదానినిగాను, శుక్ల వర్ల మైనదానినిగాను, అర్ధచంద్రాకారము కలదానినిగాను చూడవలెను. ఈ జలియ భాగమునకు వరుణుడు దేవత యని భావన చేయవలెను. పై నాలుగు ఉదాతవాక్యములను ఉచ్చరించుటచే రసతన్మాత్రము శుద్ద మగును. ఈ రసతన్మాత్రను రూపతన్మాత్రయందు లీనము చేయవలెను.

ఓం హ్రూం హః ఫట్ హ్రూం రూపతన్మాతం సంహరామి నమః

ఓం  హ్రూం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాతం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దతన్మాతం సంహరామి నమః.

ఇతి తిభిస్త దుద్ఘాతైన్రికోణం వహ్ని మణలమ్

నాభికణమధ్యగతం రక్తం స్వస్తి కలాళ్ఛతమ్.

ధ్యాత్వానలాధిదైవం తచ్ఛుద్దం స్పర్శే లయం నయేత్

ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరాను నమః.

            అను మూడు మూడు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు నాభి మొదలు కంఠమువరకును ఉన్న భాగమునందు త్రికోణాకారాగ్నే మండలమును భావింపవలెను. దాని రంగు ఎరుపు. ఆది స్వ సికాకారముచే చిహ్నిత మైనది. దాని అధిదేవత అగ్నిఈ విధముగా శుద్ధము చేయబడిన రూపతన్మాత్రను స్పర్శతన్మాత్రయందు లీనము చేయవలెను.

 ఓం హ్రీం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాతం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్ హ్రూం శబ్దతన్మాతం సంహరామి నమః.

కణ్ణనాసామధ్యగతం వృత్తం వై వాయుమణ్డలమ్

ద్విరుద్ధౌర్తధూమవర్ణం ధ్యాయేచ్ఛుద్దేనులాక్ఛోతమ్

 స్పర్శ మాత్రం శబ్దమాతే సంహరేద్ధ్యానయోగతః.

ఓం హ్రీం హః ఫట్ హ్రూం శబ్దతన్మాతం సంహరామి నమః.

 ఏకోద్ఘాతేన చాకాశం శుద్ధస్ఫటిక సన్నిథమ్

నాసాపుటఃఖానఃస్థ మాకాశ ముపసంహరేత్.

 “ఓం హ్రీం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సుహూ సము.

ఓం హ్రీం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.”

అను రెండు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు కంఠము మొదలు నాసికామధ్య వరకును ఉన్న భాగమునందు గోలాకార వాయు మండలమును భావన చేయవలెను. దాని రంగు ధూమము వలె నుండును. ఆది నిష్కలంకచంద్రునిచే చిహ్నత మైనది. స్పర్శతన్మాత్రమును ధ్యానముచే శతన్మాత్రయందు లీనము చేయవలెను. పిమ్మట “ఓం హ్రీం హః ఫట్ హూం కవిత్రాటి విధాల శబ్దతన్మాత్రం సంహరామి నమః అను ఒక ఉద్ఘాతవాక్యము సచ్చరించుచు శద్ధ స్ఫటికముతో సమాన మైన ఆతాళమును, వాసికి నుండి శిఖవరకును ఉన్న శరీరభాగముపై భావన చేయవలెను. ఆ శబ్దాతాళమును (అహంకారమునందు) ఉపసంహరింపవలెను.

శోషణాద్యైర్దేహశుద్ధిం కుర్యాదేవ కమాత్త తః

శుష్కం కలేవరం ధ్యాయేత్పాదాద్యం చ శిఖానకమ్.

యం బీజేన వం బీజేన జ్వాలామాలాసమాయుతమ్

దేహం రమిత్యనేనైన బ్రహ్మరన్తాద్వినీర్గతమ్.

బిగ్దుం ధ్యాత్వా చామృతస్య తేన భస్మ కలేవరమ్.

సంస్థాపయేల్లమితస్మాద్దేహం సంపాద్య దివ్యకమ్.

న్యాసం కృత్వా కరే దేహే మానసం యాగమాచరేత్

 విష్ణుం సాజం హృది పద్మే మానసైః కుసుమాదిభిః.

మూలమనేణ దేవేశం ప్రార్థయద్భుక్తి ముక్తి దమ్

 స్వాగతం దేవదేవేశ సన్నిధౌ భవ కేశవ.

గృహాణ మానసీం పూజాం యథార్థం పరిభావితమ్

ఆధారశక్తి కూర్మోథ వూజ్యోనన్తో మహీ తతః.

మధ్యేఽగ్న్యాదౌ చ ధర్మాద్యా ఆధర్మాద్యాశ్చ ముఖ్యగాః

నత్త్వాది మధ్యే పద్మం చ మాయావిద్యాఖ్యతత్త్వకే.

కాలతత్త్వం చ సూర్యాదిమణలం పక్షి రాజక

మధ్యే తతశ్చ వాయవ్యాదీశాస్త్రి గురుపజ్త్కికా.

పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలెను. పాదమునుంచి శిఖవరకును దేహము 'యం' ఆను వాయుబీజముచే ఎండిపోయినట్లు భావన చేయవలెను. పిమ్మట ‘రం' ఆను బీజము ద్వారా అగ్నిని ప్రకటించి నమ స్తశరీరము అగ్నిజ్వాలలచే దగ్గ మై భస్మ మైనట్లు భావన చేయవలెను. పిమ్మట “వం బిందువును ఉచ్చరించుచు బ్రహ్మరంధ్రమునండి. అమృతబిందువు ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. దాని నుండి ప్రవహించిన అమృతధార చే శరీరము నంతను ముంచెత్తివేయవలెను. పిమ్మట 'ఎం' అను బీజమును ఉచ్చరించుచు ఆ భస్మమునుండి దివ్యదేహము ఆవిర్భవించి నట్లు భావన చేయవలెను. ఈ విధముగ దివ్యదేహభావన చేసి అంగన్యాసకరన్యాసములు చేయంలేను. పిమ్మట మానసయాగాను ప్లానము చేయవలెను. హృదయకమలముపై అంగ దేవతాసహితు డగు మహావిష్ణువును నిలిపి, మానసికవుష్పాద్యుపచారములు చేయుచు, మూలమంత్రము లుచ్చరించుచు పూజింపవలెను. ఆ భగవంతుడు భోగమోక్షముల నిచ్చువాడు.. మానసిక పూజలను స్వీకరింపు మని భగవంతుని ఈ విధముగ ప్రార్థింపవలెను. “దేవా! దేవాధిదేవా! కేశ వా! నీకు స్వాగతము. నా సమీపమున సన్నిహితుడవై నేను ఆర్పించు మానసికపూజను కే కొనుము. పీఠము మధ్యభాగమునందు, యోగపీఠమును ధరించు ఆధారశక్తి యైన కూర్మమును, అనంతుని, పృథివిని పూజింపవలెను. ఆగ్నేయకోణము మొదలగు నాలుగు కోణములందును క్రమముగ ధర్మ-జ్ఞాన-వేరాగ్య-ఐశ్వర్యములను పూజింపవలెను. తూర్పుమొదలగు ప్రధానదిక్కులందు అధర్మ -అజ్ఞాన-అవే రాగ్య-అనేశ్వర్యములను పూజింపవలెను. పీఠమధ్యమునందు సత్తాదిగుణత్రయమును, కమలమును, మాయను, అవిద్యను. కొలతత్వమును, సూర్యాది మండలములను, పక్షిరా జైన గరుత్మంతుని పూజింపవలెను. పీఠము వాయవ్యకోణమునుండి ఈశాన్యకోణము వరకు గురుపం క్తిని పూజింపవలెను.

గణః సరస్వతీ పూజ్యో నారదో నలకూబర

గురుర్గురోః పాదుకా చ పరో గురుశ్చ పాదుకా.

పూర్వసిద్ధాః పరసిద్ధాః కేసరేషు చ శ క్షయః

లక్ష్మీః సరస్వతీ ప్రీతిః శానిశ్చ కాని కా.

పుష్టిస్తుష్టిర్మ హేంద్రాద్యా మధ్యేచావాహితో హరిః

ధృతిశ్రీరతికాన్యాద్యా మూలేన స్థాపితోఒచ్యుతః.

ఓం అభిముఖో భవేతి ప్రార్ధ్య ప్రాచ్యాం సన్ని హితో భవ

విన్యస్యార్యాదికం దత్వా గన్గాద్యైర్మూలతో యజేత్.

ఓం భీషయ భీషయ హృచ్ఛిరస్త్రాసయ వై పునః

మర్దయ మర్డయ శిఖా ఆగ్న్యాదౌ శస్త్రతోఒత్రకమ్.

రక్ష రక్ష ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమస్తే తః

ఓం హ్రూం ఫట్ అస్త్రాయ నమో మూలబీజేన చాజ్గకమ్.

పూర్వదక్షావ్యసౌమ్యేషు మూర్త్యావరణమర్చయేత్

గణములు, సరస్వతి, నారదుడు, నలకూబరుడు, గురువు, గురుపాదుక. పరమగురువు, ఆతని పాదుక వీటి పూజయే గురుపంక్తిపూజ. పూర్వసిద్ధపర సిద్ధ శక్తులను కేసరముల పై పూజింపవలెను. లక్ష్మి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, కాంతి, పుష్టి-; తుష్టి-వీరు పూర్వసిద్ధశ క్తులు, పూర్వాది దిక్కులలో క్రమముగ ఈ శక్తుల పూజ చేయవలెను. ఇంద్రాదిదిక్పాలకులను గూడ వారి వారి దిక్కులందు పూజింపవలెను. వీరందరి మధ్యయందు శ్రీహరి విరాజిల్లుచుండును ధృతి, శ్రీ, రతి, కాంత్యాదులు పర సిద్దశక్తులు. మూలమంత్రముచే అచ్యుతుని స్థాపింపవలెను. పూజాప్రారంభమున”ఓం ఆభిముఖో భవ” పూర్వదిక్కున నా సమీపమున నుండుము అని భగవంతుని ప్రార్థింపవలెను. ఈ విధముగ - ప్రార్థించి స్థాపించిన పిమ్మట ఆర్ఘ్యపాద్యాదులను సమర్పించి, గంధాద్యుపచార ముల ద్వారా మూలమంత్రముతో అచ్యుతుని పూజింపవలెను. “భీషయ భీషయ హృదయాయ నమః” “ఓం త్రాసయ త్రాసయ శిరసే నమః” ఓం మర్గయ మర్గయ శిఖాయై నమః” “ఓం రక్ష రక్ష నేత్రత్రయాయ నమః” “ఓం ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమః” “ ఓం హుం ఫట్ ఆస్తాయ నమః” ఈ విధముగ ఆగ్నేయాదివిదిశలయందు క్రమముగా, మూలబీజములతో అంగ ముని పూజ చేయవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ దిక్కులందు మూర్త్యాత్మక ఆవరణముల పూజ చేయవలెను.

వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్న శ్చానిరుద్ధకః.

అగ్న్యాదౌ శ్రీధృతిరతికానయో మూర్త యే హరేః

 శబ్ధచక్రగదాపద్మమగ్న్యాదౌ పూర్వకాదికమ్.

శార్ణం చ ముసలం ఖడ్గం వనమాలాం చ తద్బహిః

ఇన్గాద్యాశ్చ తథానన్తో నైరృత్యాం వరుణస్తతః.

బ్రహ్మేస్ట్రాశానయోర్మధ్యే అస్త్రావరణకం బహిః

ఐరావతస్త తళ్ఛాగో మహిషో వానరో రుషః.

మృగః శశోథ వృషభః కూర్మో హంసస్త తో బహిః

పృశ్నిగర్భః కుముదాద్యా ద్వారపాలా ద్వయం ద్వయమ్.

 పూర్వాద్యుత్తరద్వారా నం హరిం నత్వా బలిం బహిః

విష్ణుపార్షదేభ్యో నమో బలిపీఠే బలిం దదేత్.

విశ్వాయ విష్వక్సేనాత్మనే ఈశాన కే యజేత్

దేవస్య దృణే హస్తే రజాసూత్రం చ బన్జయేత్.

సంవత్సరకృతార్చాయాః సంపూర్ణఫలదాయినే

పవిత్రారోహణాయేదం కౌస్తుభం ధారయ ఓం నమః.

ఉపవాసాదినియమం కుర్యాద్వై దేవసన్నిధౌ

ఉపవాసాదినియతో దేవం సంతోషయామ్యహమ్.

 కామక్రోధాదయః సర్వే మా మే తిష్ఠను సర్వదా

 ఆద్యప్రభృతి దేవేశ యావద్వై శేషికం దినమ్.

 యజమానో హ్యశక్త శ్చేత్కుర్యాన్ని కాదికమ్ ప్రతీ.

హుత్వా విసర్జయేత్ స్తుత్వా శ్రీకరం నిత్యపూజనమ్.

ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయనమః.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే పవిత్రారోహణే శ్రీధరనిత్యపూజావిధానం నామ

త్రయస్త్రింశోధ్యాయః.

వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని నాలుగుమూర్తులు. ఆగ్నేయాది విదిశలయందు క్రమముగ శ్రీ, రతి, ధృతి, కాంతులను పూజింపవలెను. వీరు కూడ శ్రీహరి మూర్తులే. అగ్న్యాదికోణములందు క్రవగ శంఖ చక్ర గదా-పద్మములను పూజింపవలెను. తూర్పు మొదలైన దిక్కులందు - ముసల - ఖడ్గవనమాలలను పూజించవలెను. వాటి వెలుపల తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్ర-అగ్ని-యమ-నిరృతి. హోమాది విధిక వరుణ-వాయు కుబేర - ఈశాను”ను పూజించి నైరృతి పశ్చిమదిక్కుల మధ్య అనంతుని, తూర్పు ఈశాన్యపోక్కుల మధ్య బ్రహ్మను పూజించవలెను. వీటి జైట వజ్రము మొదలగు అస్త్రమయఆవరణములను పూజించవలెను. వీటి బైట దిక్పాలకుల వాహనరూపము లగు ఆవరణములను పూజింపవలెను. తూర్పు మొద లగు దిక్కులందు క్రమముగ ఐరావతమును, మేకను, దున్నపోతును, వానరుని, మత్స్యమును, మృగమును, చేవులపిల్లిని, వృషభమును, కూర్మమును, హంసను పూజింపవలెను. వీటి బయట పృశ్నిగర్భుడు, కుముదుకు మొదలగు ద్వారపాలను పూజింపవలెను. తూర్పు మొదలు ఉత్తర ము వరకు, అన్ని దిక్కులందును ఇద్దరిద్దరు ద్వార పాలకులను పూజింపవలెను. పిమ్మట శ్రీహరికి నమస్కారము చేసి వెలుపల బలి అర్పింపవలెను. - “ఓం విష్ణుపారదేభ్యో నమః” అను మంత్రము నుచ్చరించుచు ఎష్ణపీఠముపై వారలకు బలి అర్పింపవలెను. ఈశానదిక్కు నందు “ఓం - విశ్వాయ విష్వక్సేనాయ నమః” - అను మంత్రముచే విష్వక్సేనపూజ చేయవలెను. పిమ్మట దేవుని కుడి చేతికి రక్షాసూత్రము కట్టవలెను. - ఆ సమయమున ఆ. భగవంతునితో ఇట్లు చెప్పవలెను. “దేవా! ఒక సువత్సరము నిరంతరము జరుగు మీ- పూజ యొక్క సంపూర్ణఫలము లభించుటకై జరుప నున్న పవిత్రారోపణకర్మకొరకై ఈ కౌతుక సూత్రమును ధరింపుము. ఓం నమః పిమ్మట భగవంతుని సమీపమున ఉపవాసాడి నియమమును అవలంబించి ఇట్లు చెప్పవలెను. “నేను నియమపూర్వకముగ ఉపవాసాదులు చేసి ఇష్టదేవతకు సంతోషము కలిగింపగలను. దేవేశ్వరా! నేడు మొదలు వైశేషిక ఉత్సవ దివసము వరకును కామక్రోధాదోషము లేవియు నా వద్దకు రాకుండు గాక వ్రతమును స్వీకరించిన యజ పూనుడు ఉపవాసముచేయు సామర్థ్యము లేని - పక్షము నక్త వ్రతము (రాత్రి మాత్రమే భోజనము చేయుట) ఆచరించవలెను. హవనము చేసి భగవంతునిస్తోత్రము - చేసిన పిమ్మట భగవంతుని ఉద్వాసన చెప్పవలెను. భగవంతుని నిత్యపూజ చేసి చో లక్ష్మి ప్రాప్తించును. భగవంతుని పూజించుటకై “ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనా మే నమః” అనునది మంత్రము.

శ్రీ అగ్ని మహాపురాణము నందు పుత్రారోపణమున శ్రీధర నిత్యపూజావిధాన మను ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.