అగ్ని మహా పురాణము

290 - అథాశ్వ శాంతిః

శాలిహోత్ర ఉవాచః

ఆశ్వశాంతిం ప్రవక్ష్యామి వాజిరోగ విమర్దినీమ్

నిత్యాం నైమిత్తికీం కామ్యాం త్రివిధాం శృణు సుశ్రుత.

శుభేదినే శ్రీధరంచ శ్రియముచ్చైః శ్రవాశ్చతమ్

హయరాజం సమభ్యర్చ్య సావిత్రై ర్జుహుయాద్ ఘృతమ్.

ద్విజేభ్యో దక్షిణాం దద్యాదశ్వ వృద్ధి స్తథా భవేత్

ఆశ్వయుక్శుక్ల పక్షస్య పంచ దశ్యాంచ శాంతికమ్.

బహిః కుర్యాద్విశేషేణ నాసత్యౌ వరుణం యజేత్

సముల్లిఖ్య తతో దేవీం శాఖాభిః పరివారయేత్.

మటాన్సర్వర సైః పూర్ణాన్దిషు దద్యాత్సవస్త్రకమ్

యవాజ్యం జుహుయాత్ప్రార్చ్య యజేదశ్వాంశ్చ సాశ్వితాన్.

విప్రేభ్యో దక్షిణాం దద్యాన్నైమి త్తిక మతః శృణు

మకరాదౌ హయానాంచ వద్మైర్విష్ణుం శ్రియంయజేత్.

బ్రహ్మాణం ఆంకరం సోమమాదిత్యంచ తథాశ్వినౌ

రేవ న్త ముచ్చైః శ్రవసం దిక్పాలాంశ్చ దలేష్వపి.

ప్రత్యేకం పూర్ణకుంభైశ్చ వేద్యాంతత్సౌమ్యతః స్థలే

తిలాక్షరాజ్య సిధార్థాన్డేవతానాం శతం శతమ్.

ఉపోషితేన కర్తవ్యం కర్మ చాశ్వరుజాపహమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయేఽశ్వశాంతి కథనం నామ నవత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః. 

శాలిహోత్రుడు చెప్పెను : ఓ సుశ్రుతా! ఇపుడు అశ్వరోగములను తొలగించునదియు నిత్యనైమిత్తిక కామ్య రూపమున మూడు విధములై నదియగు ఆశ్వశాంతిని చెప్పెదను వినుము. శుభ దివసమున విష్ణువునకును లక్ష్మికిని ఉచ్చైశ్రవ పుత్రుడగు హయరాజునకును పూజ చేసి సావిత్ర ముత్రములతో మృత హోనుముచేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చినచో అశ్వవృద్ధి కలుగును. ఆశ్వీయుజ శుక్ల పౌర్ణమి దివసమున నగర బహిః ప్రదేశమున శాంతికర్మ చేయవలయును. విశేషించి అశ్వినీ వరుణపూజ చేయవలయును పిదప దేవీ చిత్రముగీసి నాల్గు వైపుల నుండియు వృక్ష శాఖ లతోకప్పి సమస్త రస పూరితములగు వస్త్ర సహితములయిన కలకలను స్థాపించవలెను. పిదప శ్రీదేవిని పూజించి యవాజ్యహోమము చేయవలయును. పిదప అశ్వినీ దేవతలను ఆశ్వములను పూజించి బ్రాహ్మణులకును దక్షిణ ఇవ్వవలెను. ఇపుడు నైమిత్తిక శాంతిని వినుము. మకర సంక్రాంత్యాదులయందు అశ్వములను పూజించవలయును. విష్ణులక్ష్మి బ్రహ్మశివ చంద్రసూర్య రేవంత ఉచ్చైశ్రవస్సులను పద్మములతో పూజించవలెను. కమల దళి మురిపై దిక్పాలులను పూజించవలెను. పూజింపదగిన ఒక్కొక్క దేవత కొరకు వేదిక పై జలపూర్ణ కలళలు స్థాపించవలెను. ఈ దేవతల ఉత్తరమున తిల, అక్షత, ఆజ్య, సిద్ధార్థ ములను హోమము చేయవలయును. ఒక్కొక్క దేవతకు నూరుహోమములు చొప్పున చేయవలయును, ఆశ్వశాంతి నివారణమునకు ఉపవాస పూర్వకముగ శాంతికర్మ చేయవలయును. 

అగ్ని మహాపురాణమున అశ్వశాంతికథనమను రెండువందల తొంబదవ అధ్యాయము సమాప్తము.