అగ్ని మహా పురాణము

312 - అథ త్వరితావిద్యా

అగ్ని రువాచః

 విద్యా ప్రస్తార మాఖ్యాస్యే ధర్మమాది సిద్ధిదమ్

 నవకోష్ఠ విభాగేన విద్యాభేదం చ విన్దతి.

అనులో మవిలో మేన సమ స్తవ్య స్తయోగతః

కర్ణావికర్ణ యోగేన అద ఊర్ధ్వం విభాగశః.

 త్రిత్రి కేణచ యోగేన దేవ్యా సన్నద్ధ విగ్రహః

జానాతి సిద్దిదాన్మంత్రాన్ ప్రస్తారాన్నిర్గతా న్భహూన్.

శాస్త్రే శాస్త్రే స్మృతామంత్రాః ప్రయోగా స్తత్ర దుర్లభాః

గురుః స్యాత్ప్రథమో వర్ణః పూర్వేద్యుర్నచ వర్ణ్యతే.

ప్రస్తారేతత్ర చై కార్ణ ద్వ్యర్ణాత్ర్య కర్ణాదయోఽభవన్

తిర్య గూర్ధ్వగతా రేఖాశ్చతురశ్చతురోభ జేత్ .

 నవ కోష్ఠా భవన్త్యేవం మద్యదేశే తథాదిమాన్

ప్రదక్షిణేన సంస్థాప్య ప్రస్తారం భేదయే త్తతః.

ప్రస్తార క్రమయోగేన ప్రస్తారం యస్తు విన్దతి

కరముష్టి స్థితా స్తస్య సాధకస్య హి సిద్ధయః.

త్రైలోక్యం పాదమూలే స్కాన్నవ ఖండాం భువం లభేత్

కపాలేతు సమాలిఖ్య శివతత్త్వం సమంతతః.

 శ్మశాన కర్పటే వాథ బాహ్యం నిష్క్రమ్య మంత్రవిత్

తస్యమధ్యే లిఖేన్నామ కర్ణికోపరి సంస్థితమ్.

 తాపయే త్ఖాందారాంగాయై ర్భూర్జమాక్రమ్య పాదయోః

సప్తాహా దానయేత్సర్వం త్రైలోక్యం నచరాచరమ్.

 వజ్ర సంపుట గర్భేతు ద్వాదశా రేతు లేఖయేత్

 మధ్యే గర్భగతం నామ సదాశివ విదర్భితమ్.

 కుడ్యే ఫలక కే వాథ శిలాపట్టే హరిద్రయా

ముఖ స్తంభం గతి స్తంభం సైన్య స్తంభం తుజాయతే.   

అగ్ని దేవుడు పలికెను. ఇపుడు ధర్మ కామాది సిద్ది ప్రదమగు విద్యా ప్రస్తారమును చెప్పెదను, నవకోష్ఠ విభాగ ముచే విద్యా భేదము లభించును. అనులోమ విలోమ యోగము సమస్త వ్వ స యోగము కర్ణావి కర్ణయోగము ఆధఊర్ధ్వ విభాగ యోగము త్రిత్రిక యోగము వీటిచే ఎవని శరీరముకు దేవీరక్ష ఏర్పరుపబడునో ఆతడు సిద్ధిదాయకములగు మంత్రము లను ఆనేక ములను ప్రస్తార మును తెలుసుకోగలుగును. ప్రతి శాస్త్రము నందును మంత్రములు చేపబడినవి కాని వాటి వాటి ప్రయోగము దుర్లభము మొదటి వర్ణము గిరుపు యగును. సర్వము దాని వర్ణనము చెప్పబడలేదు. దాని ప్రస్తార ముచే ఏకాక్షర ద్వక్షర త్ర్యక్షర మంత్రములు ఏర్పడును. నిలువుగను ఆడ్డముగను నాలుగేసి రేఖలు గీయ తొమ్మిది కోష్ఠ ములగును. మద్యకోష్ఠముతో ప్రారంభించి ప్రదక్షిణ క్రమమున మంత్రాక్షరములు వాటిపై వ్రాసి ప్రస్తార భేదనము చేయవలెను. ప్రస్తార క్రమయోగ మందే ప్రస్తారమును పొందగలిగిన సాధకుని చేతిలో అన్ని సిద్ధుఁలుండును. మూడులోకములను ఆతని పాదము పై వంగును ఆతడు నవ ఖండ విభక్తయగు భూమిని పొందును. కపాలము పై గాని, శ్మశాన వస్త్ర ముపై గాని అన్ని వైపులను శివతత్త్వమును వ్రాసి మత్ర వేత్తదాని మధ్య భాగము నందలి కర్ణిక పై తానుదలచిన వ్యక్తి పేర భూర్జ పత్రముపై వైసిపుంచవలెను. అచిర వృక్షము యొక్క బొగ్గులతో భూర్జపత్రమును వెచ్చచేసి రెండు పాదముల కింద తొక్కి వుంచవలెష. ఈ ప్రయోగమాచే ఒకేసప్తాహము నందు సచరాచర ములగు మూడు లోకములను తన పాదముల పై పడ వేయగలు గుస. వజ్ర సంపుట గర్భయుక్తమగు ద్వాదళార చక్రము మద్యయందు శత్రువు పేరు వ్రాసి, దానిని సదాశివ మతము చెప్పుచు దర్భలతో మార్జనము చేయవలెను. పైన చెప్పిన ద్వాదళార చక్రమును నామాధికరణము లను పశుపుతో గోడ పైగాని పీఠ పైగాని, శిలా పట్టం పైగాని వ్రాయవలెను. ఇట్లు చేయుటచే శత్రువున ముఖ స్తంభము, గీతి స్తంభము, సైన్య స్తంభము కలుగును.

విషరక్తేన సం లిఖ్య క్మనే కర్పరే బుధః

 షట్ కోణం దండమాక్రాన్తం నమంతాచ్చక్తి యోజీతమ్.

మారయే దచిరా దేష శ్మశానే నిహతం రిపమ్

చేదం కరోతి రాష్ట్రస్య చక్రమధ్యేన్య సేద్రిపుమ్.

చక్రధరాంగతాం శ క్తిం రిపు నామ్నా రిపుం హరేత్

టార్ క్షేణైవతు బీజేన ఖడ్గమధ్యేతు లేఖయేత్.

విదర్భ రిపునామాథ శ్మశానాంగార లేఖితమ్

సప్తాహాత్సాధయేద్దేశం తాడయేత్ప్రేత భస్మనా.

భేదనే భేదనే చైవ మారణేషు శివో భవేత్

తారకం నేత్ర ముద్దిష్టం శాంతి పుష్టా నియోజయేత్.

దహనాది ప్రయోగోయం శాకినీం చైవ కర్షయేత్

మధ్యాది వారుణీం యావద్వక్రతుండ సమన్వితః.

కుష్టాద్యావ్యాధయోయేతు నాశ యేత్తాన్న సంశయః

మధ్యాది ఉత్తరాంతంతు కరాలీ బంధనాజ్ఞ పేత్.

రక్షయేదాత్మనో విద్యాం ప్రతిపాదీయ దాశివః

వారుణ్యాది తతోన్యస్య జ్వర క్లేశ వినాశనమ్.

సౌమ్యాది మధ్యమాన్తంతు గురుత్వం జాయతే వటే

పూర్వాది మధ్యమాన్తంతు లఘుత్వం కురుతేక్షణాత్.

భూర్జేరోచనయా లిఖ్య ఏతద్వజ్రా కులంపురమ్

క్రమ స్థైర్మంత్ర బీజై స్తురక్షాం దేహేషు కారయేత్

వేష్టితాం భావ హేమ్నా చ రక్షేయం మృత్యునాశినీ

విఘ్న పాపారి దమనీ సౌభాగ్యాయుః ప్రదాధృతా.

ద్యూతేరణే చ జయ దా శక్ర సైన్యేన సంశయః

వంధ్యానాం పుత్రదాహ్యేషా చింతామణి రిహపరా.

సాధయేత్పర రాష్ట్రాణి రాజ్యంచ వృథివీం జయేత్

ఫట్ స్త్రీం ఓం హ్రూం లక్ష్యజప్యాద్యడిర క్ష్వాశ గోభవేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే త్వరితా విద్యా సిద్ది కథనం నామ ద్వాదశాధిక త్రిశతతమోఽధ్యాయః.

శ్మశాన వస్త్రము పై విష మిశ్రిత మగు ర క్తముతో షట్కోణ చక్రము వ్రాసి దాని మధ్య శత్రువు పేరు వ్రాయవలెను. చక్రము నలువైపుల శ క్తి బీజములు వ్రాసి దాని పై దండము ఉంచవలెను. స్మశాన భూమి పై వుంచబడిన ఆ శత్రువుపై శీఘ్రముగా దండ ప్రహారము చేసినచో శత్రు రాజు యొక్క రాష్ట్రము ఖండితమై పోవును. చక్రాకార మండలము ఏర్పరచి దాని మధ్య భాగమున శత్రు నామము వ్రాసి చక్రధార యందు శ క్తి బీజ న్యాసము చేసి శత్రువు పేరు ఉచ్చరించుచు చక్రధారతో వాటిని కొట్టుచున్నట్లు భావవ చేసినచో శత్రువు నశించును. ఖడ్గ మధ్య భాగమున గరుడ బీజముతో శత్రువు నామ ధేయము వ్రాసి దర్భతో మార్జనము చేయవలెను. పేరు వ్రాయుటకు స్మశానము నందు బొగ్గు ఉపయోగించవలెను. దాని పై చితాభస్మముతో ప్రహారము చేయవలెను. ఇట్లు చేసిన సాధకుడు. ఒక్క వారంలో శత్రు దేశమును జయించును. భేదవ భేదన మారణవం లందు అతడు శివుని వలె శ క్తిశాలి యగును. తారక మునకు (నట్) నేత్రమని పేరు. దీనిని శాంతి పుష్టికరముల యందు వినియోగించవలెను. ఈ దహశాది ప్రయోగము శాకినిని కూడ ఆకర్షించువ. పైచేప్పిన నూరు చక్ర ములలో మధ్య నున్న మంత్రాక్షరము మొదలు పశ్చిమ దిక్కునందన్న కోష్టము వరకు నున్న రెండు అక్షరములను “వక్ర తుండ” మంత్రములు జపించుటచే కష్టాది చర్మరోగములన్నియు నశించును. సందేహము లేదు. మధ్య కోష్టము నుండి ఉత్తర కోష్టము వరకు వున్న రెండక్షరముల మంత్రములను కరాళి బంధముతో జపించినచో ఆద్వ్యక్షరీ విద్య సాక్షాత్తు శివుడే ప్రతి వాదియైనను రక్షణము నిచ్చును. పశ్చిమమునందున్న మంత్రాక్షర మను మొదట వుంచి ఉత్తర కోష్టము వరకు వున్న మంత్రాక్షరము లను వక్రతుండ మంత్రములతో జపించినచో చివర కాసాదులు శమించును. ఉత్తర కోష్టము మొదలు మధ్యకోష్టము వరకునున్న మంత్రాక్షరములను జపించినచో వట బీజమునందు కూడ గురుత్వమును కల్గించ కలు గును. సర్వాది మధ్యమాంత పక్షముల జపము వెంటనే లఘుత్వమును కల్గించును. భూర్జపత్రముపై గోరోచనముతో వజ వ్యా ప్తమగు భూపుర చక్రమును నిర్మించి మంత్ర బీజములను క్రమముగ వ్రాసి దానిని ధరించినచో శరీరరక్ష కలుగును. దానిని సువర్ణము చుట్టి ధరించినచో ఆర ఇ యంత్రము మృత్యువును రానీయదు. విఘ్న పాప శత్రువులను అణచి సౌభాగ్య దీర్ఘాయువులను ఇచ్చును. జూదము నందును, యుద్ధము నందును విజయమును ఇచ్చును. ఇందుని సేనతో యుద్ధము చేయ వలసి వచ్చినను విజయము నిచ్చును. సందేహము లేదు వలధ్య శ్రీలకు పుత్రుల నిచ్చును. ఇది రెండవ చింతామణి వంటిది. పర రాష్ట్రముల పై అధికారమును పొందును. రాజ్యమును భూమిని జయించును. వట్ క్రీం, శ్రీం, హూం అను మంత్రమును లక్ష్మపర్యాయములు జపించినచో యవాదులు కూడ వశమగుదురు.