ఈశ్వర ఉవాచః-
అథ నిర్వాణదీక్షాయాం కుర్యాన్మూలాదిదీపనమ్ ।
పొశ బన్దన శ క్త్యర్థం తాడనాదికృతేన వా.
ఏకైకయా తదాహత్యా ప్రత్యేకం తత్త్రమేణ వా ।
బీజగర్బశిఖార్ధం తు హూం ఫడ నధువాదినా.
ఓం హ్రూం హ్రాం హౌం హూం ఫడితి మూలమన్తస్య దీపనమ్ ।
ఓం హ్రూం హ్రాం హూం ఫడితి హృదయ ఏవం శిరోముఖే.
ప్రత్యేకం దీపనం కుర్యాత్సర్వస్మిన్ క్రూరకర్మణి ।
శాంతికే పౌష్టి కే చాస్య వషడన్హాదినాణునా.
వషడ్వౌషట్సమో పేతైః సర్వకామ్యోతరిస్థితైః ।
హవనం సంవర్తైః కుర్యాత్సర్వత్రాప్యాయవాదిషు.
తతః స్యసవ్యభాగస్థం మణలే శుద్ద విగ్రహమ్ ।
శిష్యం సంపూజ్య తత్సూత్రం సుషుమ్నేతి విభావితమ్.
మూలేన తచ్చిఖాబన్దం పాదాజుష్టాన్తమానయేత్ ।
సంహా రేణ ముముకోస్తు బన్నీ యాచ్చిష్యకాయ కే.
పుంసస్తు దక్షిణే భాగే వామేనార్యా నియోజయేత్ ।
శ క్తిం చ శ క్తిమ శ్రేణ పూజితాం తస్య మస్తకే.
సంహారముద్రయాదాయ సూత్రం తేనైవ యోజయేత్ ।
నాడీం త్వాదాయ మూలేన సూత్రే న్యస్య హృదార్చయేత్.
అవకుణ్ఠ్య తు రుద్రేణ హృదయేనాహుతిత్రయమ్ ।
ప్రపద్యాత్సన్ని ధానార్థం శక్తావప్యేవమేవ హి.
శివుడు పలికెను: పిమ్మట నిర్వాణదీక్షయందు, పాశ బంధనశక్తి కొరకును, తడనాదుల కొరకును మూలమంత్రాదుల దీపనము చేయవలెను. ఒక్కొక్కదానికి, ఒక్కొక్క హోమము, లేదా మూడేడి హోమములు చేసి మంత్రదీపనము చేయవలెను. మొదట ప్రణవమును, మధ్య బీజ.గర్భ- శిఖాబంధస్వరూపము లగు మూడు 'హం' లను ఉచ్చరించవలెను. దీనివలన మూలమంత్రదీపన మగును. “ఓం హూం హుం హుం ఫట్” అని దీపనము. దేనిచేతనే “ఓం హూం హూం హం వట్ హృదయాయ నమః” అని హృదయదీపన మగును పిమ్మట “ఓం హూం హూం హరాం ఫట్ శిర సే స్వాహా ఇత్యాదులచే శిరస్సు మొదలగు అంగముల దీపనము చేయవలెను. క్రూర కర్మలన్నింటియందును మూలాది దీవనము ఈ విధముగనే చేయవలెను. శాంతి పుష్టి.వశీకరణ కర్మలయందు మొదట నున్న ప్రణవము చివర వషట్' చేర్చి ఒక్కొక్క దానిని ఆ మంత్రముచేతనే దీపనము చేయవలెను. ఆప్యాయవాది కర్మ లన్నింటియందును 'వషట్' ‘నౌషట్'లతో కూడిన, సంపూర్ణ కామ్యకర్మలపై నున్న శంబరమంత్రమాలతో హోమము చేయవలెను. తన ఎడమ ప్రక్క నున్న మండలముపై ప్రకాశించుచున్న పరిశుద్ధ శరీరవంతు డగు శిష్యుని పూజించి, ఒక ఉత్తమసూత్రమును సుషుమ్నారా నిర్వాణాదీక్షా వాడిగా భావన చేసి, మూలమంత్రముతో దానిని శిఖిబంధమువరకును తీసికొని పోయి, అచటినుండి కాళ్ళబొటనవేళ్ళ వరకును తీసికొని రావలెను. పిదప, సంహారక్రమముచే దానిని మరల ముముక్షు వగు శిష్యని శిఖవద్దకు తీసికొని పోయి అచటనే కట్టవలెను. పురుషునకు కుడి ప్రక్కను, స్త్రీకి ఎడమ ప్రక్కను కట్టవలెను. శిష్యుని శిరస్సుపై శ క్తిని శక్తి మంత్రముచే పూజించి, ఆ శక్తిని సంహార ముద్రచే తీసికొని వచ్చి ఆ సూత్రమునందు, ఆ మంత్రముతోడనే, కలపవలెను. సుషుమ్నానాడిని గ్రహించి, దానిని మూలమంత్రముతో ఆ సూత్రముపై న్యాసం చేసి, హృదయమంత్రముతో దానిని పూజించవలెను. కవచమంత్రముచే ఆచాదించి, హృదయమంత్రముతో మూడు హోమములు చేయవలెను. ఈ హోమ ములు నాడీసం విధానముకొరకు చేయబడినవి. శక్తిసంవిధానముకొరకుగూడ ఈ విధముగనే హోమమును చేయవలెను.
ఓం హాం వర్ణధ్వనే నమో హాం భువనాధ్వనే నమః ।
హాం ఓం కలాధ్యనే నమః శోధ్యాధ్వానం హి సూత్ర కే.
న్యస్యాగ్రవారణా శిష్యం ప్రోత్యాశ్రమ నితేన చ ।
పుష్పేణ హృది సన్హాడ్య శిష్యదే హే ప్రవిశ్య చ.
గురుశ్చ తత్ర హూంకారయుక్తం రేచకయోగతః ।
చైతన్యం హంసబీజస్థం విశ్లి ష్యేదాయుధాత్మనా.
ఓం హౌం హూం వట్.
ఆచ్ఛిద్య శ క్తిసూత్రేణ హాం హం స్వాహేతి చాణునా ।
సంహారముద్రయా సూత్రనాడిభూతే నియోజతాత్.
ఓం హాం హం హామ్ ఆత్మనే నమః వ్యాపకం
భావదేయేదేనం తనుత్రేణావకుజ్జయేత్ ।
ఆహుతిత్రితయం దద్యాద్ధృదా సన్నిధి హేతవే.
విద్యాదేహం చ విన్యస్య శాన్యతీతావలోక నమ్ ।
తస్యాభిమతతరత్వాద్యం మన్రభూతం విచి క్షయేత్.
ఓం హాం హౌం శాన్యతీతక లాపాశాయ నమ ఇతనేనావలోక యేత్ .
ద్యే త త్వే మ శ్రమ ప్యేకం పదం వర్ణాశ్చ షోడశ ।
తథాష్ట్రాభువనాన్యస్యాం బీజనాడీక థద్వయమ్.
విషయం చ గుణం చైకం కారణం చ సదాశివమ్. ।
సితాయాం శాన్యతీతాయామ నర్భావ్య ప్రపీడయేత్.
ఓం హౌం శాన్యతీతకలాపాశాయ హూంఫట్ ।
సంహారముద్రయాదాయ విదధ్యాత్సూత్రమస్తకే.
పూజయేదాహుతీ నిగ్రో దద్యాత్సన్నిధి హేతవే ।
త త్వే ద్వే అక్షరే ద్వే చ బీజనార్తీక థద్వయమ్.
గుణౌ మన్రా తథాబ్దస్థమేకం కారణమీశ్వరమ్ ।
పదాని భానుసంఖ్యాని భువనాని దశ సప్త చ.
ఏకం చ విషయం శాంతౌ కృష్ణాయామచ్యుతం స్మరేత్.
“ఓం హాం తత్త్వాధ్వనీ నమః”, “ఓం హాం పదాధ్వనే నమః” “ఓం హాం వర్ణనాధ్వనే నమః” “ఓం హాం మక్తాధ్వనే నమః”, “ఓం హాం కలాధ్వనే నమః” “ఓం హాం భువనాధ్వనే నమః” అను వర్జి మంత్రములచే, సూత్రముపై ఆరు అధ్వల న్యాసము చేసి అస్త్రమంత్రముచే అభిమంత్రించిన ఉదకముతో శిష్యుని ప్రోక్షించవలెను. అస్త్రమంత్రము జపించుచు పుష్పము గ్రహించి శిష్యని హృదయమును కొట్టవలెను. పిమ్మట హుంకారయుక్త రేచక ప్రాణాయామముతో శిష్యుని శరీరమునందు ప్రవేశించి, దాని లోపల హంసబీజములో జీవచైతన్యమును, అస్త్రమంత్రమును జపించుచు, అచటినుండి తొలగించవలెను. పిమ్మట “ఓం హః హూం ఫట్” అను శ క్తిసూత్రముచేతను, “హాం హం స్వాహా” అను మంత్రముచేతను సంహార ముద్రతో, వాడి యేన ఆ సూత్రమునందు విడదీసిన జీవచైతన్యమును నియమించ వలెను, ఓం హాం హం హోమాత్మనే నమః అను మంత్రము జపించుచు జీవాత్మ వ్యాపక మనీ భావన చేయవలెను. పిదప కవచమంత్రముచే దానిని ఆచ్చాదించి దాని సాన్నిధ్యమును కోరుచు హృదయమంత్రముచే మూడు - హోమములు చేయ వలెను. పిమ్మట విద్యా దేహన్యాసము చేసి దానిలో తాంత్యతీతకళను చూడవలెను. ఇతర తత్వములతో కూడిన ఆత్మ ఆ కళయందు అంతర్గతమై యున్నట్లు భావన చేయవలెను. “ఓం హరాం శాన్యతీతకలాపాళాయ నమః” అను మంత్రముచే ఆ కళను చూడవలేను. రెండు తత్వములు, ఒక మంత్రము, ఒక పదము, పదువారు వర్ణములు, ఎనిమిది భువనములు, క ఖ మొద లైన బీజములు, నాడులు, రెండు కళలు, విషయములు, గుణములు, ఏకమాత్రకారణభూతు డైన సదాశివుడు. వీటి నన్నింటిని శ్వేతవర్ణ యగు శాంత్యతీతక లలో ఆంతర్బూతము చేసి “ఓం హూం శాన్యతీత కలాపాళాయ హూం ఫట్” అను మంత్రముచే ప్రతాడనము చేయవలెను. కలాపాక మును సంహారముద్రతో తీసికొని, సూత్రము శిరస్సుపై నుంచి దానిని పూజించవలెను. దాని సొంనిధ్యముకొరకై వేనుక టివలెనే మూడు హోమములు చేయవలెను. “హూం' అనునది శాంత్యతీత కళాబీజము, రెండు తత్వములు, రెండు అక్షరములు, బీజములు, నాడి, క ఖ అను అక్షరములు, రెండు గుణములు, రెండు మంత్రజలు, కమలములో నున్న ఏకమాత్రకారణభూతు డైన ఈశ్వరుడు, పండ్రెండు పదములు, ఏడు లోకములు, ఒక విషయము—వీటి నన్నింటిని కృష్ణవర్ణయగు శాంతికళలోపల భావన చేయవలెను.
తాడయిత్వా సమాదాయ ముఖసూత్రే నియోజయేత్ ।
జుహుయాన్ని జబీజేన సాన్ని ధ్యాయాహుతిత్రయమ్.
విద్యాయాం సప్త తత్త్వాని పదానామేకవింశతిమ్ ।
షడ్వర్టైన్సఞ్చరం చైకం లోకానాం పణ్చవింశతిమ్.
గుణానాం త్రయమేకం చ విషయం రుద్రకరణమ్ ।
అనర్భావ్యతిరిక్తాయాం బీజనాడీకథ (ఖ) ద్వయమ్.
అస్త్రమాదాయ దద్యాచ్చ పదం ద్వ్యధిక వింశతిమ్ ।
లోకానాం చ క లానాం చ షష్టిం గుణచతుష్టయమ్.
మన్రాణాం త్రయమేకం చ విషయం కారణం హరిమ్।
అనర్భావ్య ప్రతిష్టాయాం శక్తాయాం తాడనాదికమ్.
విధాయ నాభిసూత్రస్థాం సన్ని దాయాహుతీర్యజేత్।
హీం భువనానాం శతం సాగ్రం పదానామష్టమింశతిమ్.
బీజనాడీ సమీరాణాం ద్వయోరిస్దాయయోరపి ।
వర్ణం త త్వం చ విషయమే కైకం గుణపశ్చికమ్.
హేతుం బ్రహ్మాణ్ణమ నస్థం కమ్వరాణాం చతుష్టయమ్ ।
నివృత్తా పీతవర్ణాయామ నర్భావ్య ప్రతాడయేత్.
ఆదౌ యత్ర త్వభాగే స్తే సూత్రే విన్యస్య పూజయేత్ ।
జుహుయాదాహుతీ స్తిసః సన్నిధానాయ పావ కే.
పిమ్మట వెనుకటి వలెనే తాడనము చేసి సూత్రముఖ భాగమున వీటి నన్నింటిని కూర్చవలెను. సాన్నిధ్యము కొరకే శాంతిక లాబీజమంత్రమతో (హూం హూం) హూడు హోమములు చేయవలెను. ఏడు తత్త్వములు, ఇరువదియొక్కపదములు, ఆరు వర్ణములు, ఒక శబరము, ఇరువదియైదు లోకములు, మూడు గుణములు, ఒక్క విషయమ, రుద్రరూప -కాతత్వము, బీజము, నాడాలు, క ఖ అను కళలు-వీటి నన్నింటిని మిక్కిలి ఎఱ్ఱని రంగు గల విద్యాకళలో అంతర్భూతములు చేసి, ఆవాహాన సంయోజనపూర్వకముగా వెనుక చెప్పిన సూత్రము హృదయభాగమున స్థాపించి, తన మంత్రముచే పూజించి, వీటి అన్నింటి సన్నిధికొరకై వెనుక టివలెనే మూడు ఆహుతు లీయవలెను. ఆహుతి చేయు బీజమంత్రము “హూం హూం హూమ్”, ఇరువదినాలుగు తత్త్వములు, ఇరువది యైదు వర్ణములు, బీజములు, నాడులు, క ఖ ఆను కళలు, ఇరువది రెండు పదములు, అరువది లోకములు, ఆరువది కళలు, నాలుగు గుణములు, మూడు మంత్రములు, ఒక విషయము, కారణరూప శ్రీహరి వీటి నన్నింటిని శుక్లవర్ణ మగు ప్రతిష్టాకళలో అంతర్భూతములు చేసి, తాడనాదికము చేయవలెను మరల వీటినన్నింటిని సూత్రనాభిభాగమున సంయోజనము చేసి, సంన్ని ధానకరణమునకై, “హూం హరాం హూం హూం” అను మంత్రముచే మూడు హోమములు చేయవలెను. నూటఎనిమిది భువనములు, ఇరువది యెనిమిది పదములు, బీజములు, రెండు నాడులు, రెండు సమీరములు, రెండు ఇంద్రియములు, ఒక వర్ణము, ఒక తత్త్వము, ఒక విషయము, ఐదు గుణ ములు, కారణరూపకమలాసనబ్రహ్మ నాలుగు శంబరములు.వీటి నన్నింటిని పీతవర్ణ మగు నివృత్తికళలో అంతర్భూతములు చేసి తాడనము చేయవలెను. వీటిని గ్రహించి, సూత్రచరమభాగమునందు స్థాపించి, పూజించి, వీటి సాన్నిధ్యముకొర “హూం హూం హుం హుం హూం” అను బీజమంత్రముతో మూడు హోమములు చేయవలెను.
ఇత్యాదాయ కలాసూత్రీ యోజయేచ్చిష్యవి గ్రహాత్ ।
సబీజాయాం తు దీక్షాయాం సమయాచానమాగతః.
దేహారమ్భకర క్షార్థం మంత్రసిద్ధిఫలాదపి
ఇష్టాపూర్తాది ధర్మార్థం వ్యతిరిక్తం ప్రబన్ధకమ్.
చైతన్యబోధకం సూక్ష్మం కలానామ స్తరే స్మరేత్ ।
అమునైవ క్రమేణాథ కుర్యాత్తర్పణదీపనే.
ఆహుతిభిః స్వమ శ్రేణ తిసృభి స్తిసృభి స్తథా ।
ఓం హౌం శాన్యతీతకలాపాశాయ స్వా హేత్యాది తర్పణమ్ ।
ఓం హాం హ హోం శాన్యతీతకలాపాశాయ హుం ఫడిత్యాది దీపనమ్ ।
తత్సూత్రం వ్యాప్తిబోధాయ కలాస్థానేషు పజ్చసు.
సంగృహ్య కుజ్కుమాజ్యేన తత్ర సాజం శివం యజేత్ ।
హూం ఫడనైః కలామశౌర్భిత్వా పాశాననుక్రమాత్.
నమోనైశ్చ ప్రవిశ్యాస్తః కుర్యాథోహణబన్జనే ।
ఓం హూం హాం హాం హాం ఫట్ గా న్యతీతకలాం గృహ్లామి ।
బధ్నామి చేత్యాది మన్రా కలానాం గ్రహణబన్దనాదిప్రయోగః ।
పాశాదీనాం చ స్వీకారో గ్రహణం బన్దనం పునః.
పురుషం ప్రతి నిః శేషవ్యాపార ప్రతిపత్తయే ।
ఉపవేశ్యాథ తత్సూత్రం శిష్యసనే నివేళ యేత్.
విస్తృతామప్రమోషాయ శతం మూలేన హోమయేత్ ।
శరావసంపుటే పుంసః క్రియాశ్చ ప్రణితోదరే.
హృదస్త్రసంపుటం సూత్రం విధాయాభ్యర్చయేర్హృదా ।
సూత్రం శివేన సాక్షేన కృత్వా సంపాతశోధితమ్.
నిదధ్యాత్కలశ స్యాధో రక్షాం విపయేదితి ।
శిష్యం పుష్పం కరే దత్త్వా సంపూజ్య కలశాదికమ్.
ప్రణమయ్య బహిర్యాయాద్యాగమన్దిర మధ్యతః ।
ఈ విధముగ, సూత్రమునం దున్న ఐదు కళలను తీపి శిష్యుని శరీరమునం దుంచవలెను. సబీజ దీయందు, సమయాచార పాశ ముకంటెను, దాహారంభకధర్మముకంటెను, మంత్రసిద్ధి ఫలము కంటేను, ఇష్టాపూర్తాదిధర్మముకంటెను భిన్న మైన చైతన్యరోధక సూక్ష్మ ప్రబంధకములను కళలలో భావన చేయవలెను. వాటి వాటి మంత్రములతో మూడేసి హోమములు చేసి తర్పణ- దీపనములు చేయవలెను. “ఓం హూం శాన్యతీత కలాపాశాయ స్వాహా” ఇత్యాది మూత్రములచే తర్పణములు, “ఓం హూంహూం శాన్యతీతకలాపాశాయ హూం హుం ఫట్” ఇత్యాది మంత్రములచే దీపనము చేయవలెను. హ్య ప్తిబోధకొరకై, సూత్రమును, సుర పూర్వకముగ ఐదు కళాస్థానముల పై నుంచి, దాని పై కుంకుమాదులచే ఆంగదేవతా సమేతుడై న శివుని పూజించవలెను. కలామంత్రముల చివర 'హుం ఫట్' అను పదములు చేర్చి ఉచ్చరించుచు పాశ భేదనము చేసి, నమస్కారాంతక లామంత్రములతో వాటి లోపల ప్రవేశ ము చేయవలెను. కళాగ్రహణబంధనములు కూడ చేయవలెను. “ఓం హుం హుం హుం శాన్యతీతక లాం గృహ్లామి బధ్నామి”, ఇత్యాదిమంత్రములు గ్రహణ బంధనము లందు వినియోగింపబడును. ఒక్కొక్క కళ విషయమునమ తప్పక పాశాది వశీక రణమును, గ్రహణమును, బంధనమును, పురుషుని విషయమున సకల వ్యాపార నిషేధమును చేయవలెను. శిష్యుని కూర్చుండబెట్టి, సూత్రమును వాని బుజమునుండి చేతిలో ఉంచి 'జ్ఞాతాజ్ఞాత పాపపరిహారార్ధమై నూరు పర్యాయములు మూలమంత్రముతో హోమము చేయవలెను. పురుషుని సూత్రము అస్త్రమంత్రసంపుటమునందును, శ్రీ సూత్రమును ప్రణవసంపుటమునందును ఉంచి, హ్నడమంత్రముతో సంపుటిత మొనర్చి, ఆ మంత్రముతోనే దాని పూజ చేయవలెను. సూత్రమునకు సాంగ శివునిచే సంపాతధనము చేసి, దానిని కలశ క్రింద ఉంచి, దాని రక్షకోరకై ఇష్టదేవతా ప్రార్థన చేయవలెను. శిష్యుని చేతిలో పూవులిచ్చి, కలశము పూజా ప్రణామాదులు చేసిన పిమ్మట యాగశాలనుండి బైటకు రావలెను.
మణ్డలతిత్రయం కృత్వా ముమూకను త్తరాననాన్ ।
భుక్తయే పూర్వవ క్రాంశ్చ శిష్యాం సత్ర నివేశ యేత్ ।
ప్రధమే వఞ్చగవ్యస్వ ప్రాళ యేచ్చుంకత్రయమ్.
పాణినా కుళయుక్తేన అర్చితాన నరా నరమ్ ।
చరుం తత స్తృతీయే తు గ్రాసత్రితయసంమితమ్.
అష్టగ్రాసప్రమాణం వా దశనస్పర్శవర్జితమ్ ।
పాలాకపుట కే ముక్తా భుక్తా పిప్పలపత్రకే.
హృదా సంభోజనం దత్త్వా పూతై రాచమయేజ్జలైః ।
ద నకాష్ఠం హృద కృత్వా ప్రక్ష పేచ్ఛోభనే శరభమ్.
న్యూనాదిదోషమోషాయ మూలేనాష్టోత్తరం శతమ్ ।
విధాయ స్థబ్దిలేశాయ సర్వకర్మసమర్పణమ్.
పూజావిసర్జనం చాస్య చణేశ స్య చ పూజనమ్ ।
నిర్మాల్యమపనీయూథ శేషమగ్నౌ యజేచ్చరో.
కలశం లోకపాలాంశ్చ పూజయిత్వా విసృజ్య చ ।
విసృజేద్గణమగ్నిం చ రక్షితం యది బాహ్యతః.
బాహ్యతో లోకపాలానాం దత్త్వా సం షేపతో బలిమ్ ।
భస్మనా శుద్ధతోయైర్మా స్నాత్వాయాగాలయ విశేత్.
గృహస్థాన్ దర్భశయ్యాయాం వూర్వశీర్షాన్ సురక్షితాన్ ।
హృదాసర్భస్మ శయ్యాయాం యతీశ్ ధక్షిణమ స్తకాన్.
శిఖాబద్ధశిఖానశ్రా స ప్రమాణవకాన్వితాన్ ।
విజ్ఞాయ స్నాపజేచ్ఛిష్యాన్ తతో యాయాత్పునర్భహిః.
ఓం హివి హివి త్రిశూలపాణయే స్వాహా.
పఞ్చగవ్యం చరుం ప్రాశ్య గృ హేత్వా ద స్తధావనమ్ ।
సమాచత్యు శివం ధ్యాత్వా శయ్యామాస్థాయ పావనీమ్.
దీక్షాగతం క్రియాకాబ్దం సంస్మరన్సంలి శేద్గురుః ।
ఇతి సంక్షేపతః ప్రోక్తి విధిర్ధీక్షాధివాసనే.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే నిర్వాణదీక్షాయామధివాసనవిధిర్నామ త్త్రశీతితమోధ్యాయః.
అచట మూడు మండలములు చేసి ముక్తికాము లగు పష్యులను ఉత్తరాభిముఖముగమ, భోగకముకలమ సర్వాభి ముఖముగను కూర్చుండబెట్టవలెను. ముందుగా, కుశ యుక్త మగు చేతిలో మూడు చాళుకములు పంచగవ్యము త్రాగించ వలెను. మధ్య ఆచమనము చేయరాదు. పిమ్మట ఒక్కొక్క శిష్యునికిని మూడు లేదా ఎనిమిది గ్రాసములు చరవు ఇవ్వవలెను. ముక్తికామునకు పలాశ పత్రముల దొన్నెయందును, భుక్తికామునకు రావియాకుల దొన్నెయందును చరువు ఇవ్వవలేమ. ఆతడు దంతస్పర్శ కలుగకుండ దానినిభజించవలేను. గురువు చేతులు కడిగికొని పవిత్రజలముతో ఆ శిష్యులచే ఆచమనము చేయించ వలెను. హృదయ మంత్రముచే దంతధావనము చేసి ఆ కాష్ఠమును పార వేయవలెను. దాని ముఖము శుభదిశ వైపున పడినచో శుభఫలము కలుగును.న్యూనతాదోషపరిహారార్థమే మూలమంత్రముతో నూటఎనిమిది పర్యాయముల హోమము చేయవలెను. కర్మ నంతను స్థండిలేశ్వరునకు సమర్పించవలెను. పిమ్మట ఆ శివుని పూజించి, విసర్జించి చండేశుని పూజించవలెను. నిర్మాల్య మును తొలగించి మిగిలిన చదువును అగ్నిలో హోమము చేయవలెను. కలశమునకును, లోకపాలకులకును. పూజవిసర్జన ములు చేసి, గణములును, అగ్నియు జాహ్య దిక్కున ఉంచబడినచో వాటిని కూడ విసర్జించవలెను. మండలము వెలుపలలోకపాలకులకు కూడ సుడి ప్తముగ బలి సమర్పించి, భస్మ-శుద్ధ జలములతో స్నానముచేసి యాగమండలమును ప్రవేశించ వలెను. గృహస్థు లైన శిష్యులను అస్త్రమంత్రముచే రక్షించి కుశశయ్య పై నిద్రింపచేయవలెను. వీరి తల తూర్పు వైపు ఉండవలెను. విరక్తు లైన శిష్యులను హృదయమంత్రముచే భస్మశయ్య పై దక్షిణశిరస్కులనుగా పరుండబెట్టవలెను. ఆ శిష్య లందరును అస్త్రమంత్రముచే రక్షితులై , శిఖామంత్రముచే తమ తమ శిఖలను బంధించుకొనవలెను. పిమ్మట గురువు వారికి స్వప్నమానవుని గూర్చి చెప్పి మండలమునుండి బైటకు రావలెను. పిమ్మట “ఓం పాలీ హిలి శూలపాణయే నమః స్వాహా” అను మంత్రముచే పంచగవ్య చరువుల ప్రాశనము చేసి, దంతధావనానంతరము ఆచమనము చేయవలెను. శివుని ధ్యానించుచు దీక్షకు సంబంధించిన కర్మకాండను స్మరించుచు పవిత్రశయనముపై శయనించవలెను. ఈ విధముగ దీవాది వాసనవిధి సంక్షిప్తముగ చెప్పబడినది.
ఆగ్ని మహాపురాణమున నిర్వాణదీక్షాధివాసనవిధి యను ఎనుబదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 83 of the Agni Mahā Purana is as follows:
The eighty-third chapter describes the adhivāsana (preliminary vigil) procedures specific to the nirvāṇa-dīkṣā — the highest form of initiation that grants liberation (mokṣa) itself, or at least the certainty of liberation, to the śiṣya. The pañcakala-śuddhi — the purification of the five cosmic levels (nivṛtti, pratiṣṭhā, vidyā, śānti, and śāntyatīta) through the sūtra-saṃdhāna (thread-connection) — is described as the essential preliminary. The arrangement of kalaśa-s representing the five levels and the specific waters and substances in each are specified. The guru's yogic process of entering the śiṣya's heart through visualization, inspecting the śiṣya's accumulated karma-s, and preparing the ground for their removal is described. The rules for the śiṣya's conduct during the night-vigil — maintaining silence, consuming only water, lying in a specific posture — are given.