స్కంద ఉవాచః
షోడాసమాసం వక్ష్యామి అష్టావింశతిధా పునః ।
నిత్యా నిత్య విభాగేన లుగులో ఫేన చద్విధా.
కుంభకారశ్చ నిత్యః స్యాద్దేమకారాదిక స్తథా ।
రాజ్ఞః పుమాన్రాజ పుమాన్న విత్యోఽయం సమాసకః.
కష్టశ్రితోలుక్సమాసః కంఠేకాలాదిక స్త్వలుక్ ।
స్వా దష్టదా తత్పురుషః ప్రథమాద్యసుపాసహ.
ప్రథమా తత్పురుషోఽయం పూర్వం కాయస్య విగ్రహే ।
పూర్వ కాయోఽపరకాయోహ్యధరో త్తరకాయకః.
అర్ధంకణాయార్ధకణా భిక్షౌతూర్య మథేదృశమ్ ।
ఆపన్న జీవిక స్తద్వద్ద్వితీయా చాధరాశ్రితః.
వర్షం భోగ్యో వర్షభోగ్యో ధాన్యార్థశ్చ తృతీయయా ।
చతుర్థీస్వాద్విష్ణబలిర్వృక భీతిశ్చ పంచమీ.
రాజ్ఞః పుమాన్రాజపుమాన్షష్ఠీ వృక్షఫలం తథా ।
స్తప్తమీ చాక్ష శాండోఽయమహితోఞ్ సమాసకః.
స్కందుడు చెప్పెను. ఆరు విధములగు సమాసము చెప్పెదను. ఇది మరల ఇరువది యెనిమిది. విధములు. నిత్యము ఆనిత్యము అని సమాసము రెండు విధములు. లుక్ , ఆలుక్ లచే మరల రెండు విధములు. కుంభకారః, హేమ కారః ఇత్యాదులు నిత్య సమాసములు, రాజ్ఞః పుమాన్ రాజ పుమాన్ ఇత్యాదులు అనిత్య సమాసములు. కష్టత ఇత్యాదులు లక్ సమాసములు. కంఠేకాల ఇత్యాదులు ఆలుక్సమాసములు. ప్రథమాది సుప్రత్యయములను బట్టి తత్పురుషము ఎనిమిది విధములు. పూర్వం కాయస్య పూర్వకాయః ఇది ప్రథమాతత్పురుషము. అపరకాయ, ఆధర కాయ, ఉత్తరతాయః, ఆర్ధ కణా తుర్య బిక్షా ఇత్యాదులు ప్రథమాతత్పురుషములు. ఆపన్న జీవికః ఆధరాతః, వర్షం భోగ్యః వర్ష భోగ్య: ఇత్యాదులు ద్వితీయాతత్పురుషములు. ధాన్యార్థః ఇది తృతీయాతత్పురుషము. విష్ణుబలిః ఇది చతుర్థి తత్పురుషము. వృకభీతిః పంచమీ తత్పురుషము. రాజ్ఞః పుమాన్ రాజపుమాన్, వృక్ష ఫలము ఇత్యాదులు షష్టితత్పురుష అక్ష శాండః ఇది సప్తమీ తత్పురుష. అపాత ఇదీ నః తత్పురషము.
కర్మధారయః స ప్తధా నీలోత్పల ముఖాః స్మృతాః ।
విశేషణ పూర్వపదో విశేష్యోత్తరత స్తథా.
వైయాకరణఖసూచిః శీతోష్ణం ద్విపదం శుభమ్ ।
ఉపమాన పూర్వపదః శంఖపాండుర ఇత్యపి.
ఉపమానోత్తర పదః పురుష వ్యాఘ్ర ఇత్యపి ।
సంభావనా పూర్వపదో గుణవృద్ధిరితీదృశమ్.
గుణఇతి వృద్ధిర్వాచ్యాసు హృదేవ సుబంధుకః ।
అవధారణ పూర్వపదో బహు వ్రీహిశ్చసప్తధా.
ద్విపదశ్చ బహువ్రీహి రారూఢ భవనోనఠః ।
ఆర్చితా శేషపూర్వోయం బహ్వంఘ్రి పరికీర్తితః.
ఏతేవి ప్రాశ్చోపదేశాః సంఖ్యోత్తర పదస్త్వయమ్ ।
సంఖ్యోభయపదో యద్వద్ద్వితాద్వ్యే కత్రయానరః,
సహపూర్వపదోఽయం స్యాత్సమూలోద్దత క స్తరు: ।
వ్యతిహార లక్షణాథః కేశా కేశి నఖానిఖి.
దిగ్గలక్ష్యా స్యాద్ధక్షిణపూర్వా ద్విగురాభాషితోద్విదా ।
ఏకవద్భావి ద్విశృంగం పంచమూలీ త్వనేక ధా.
ద్వందః నమాసో ద్వివిధో హీతరే తరయోగకః ।
రుద్రవిష్ణు సమాహారౌ భేరీపటహ మీదృశమ్.
ద్విధాఖ్యాతోఽ వ్యయీభావో నామపూర్వ పదోయథా ।
శాకస్య మాత్రాశాకప్రతి యథాఽవ్యయ పూర్వకః.
ఉపకుందం చోపరథ్యం ప్రాధాన్యేన చతుర్విధః ।
ఉత్తరపదార్థ ముఖ్యోద్వంద్వశ్చో భయముఖ్యకః.
పూర్వార్థేశోఽ వ్యయీభావో బహువ్రీహిశ్చ బాహ్యగః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే నమాసనిరూపణంనామ పంచపంచశదధిక త్రిశతతమోఽధ్యాయ:.
కర్మధారయము ఏడు విధవలు. నీలోత్పలమ్ ఇత్యాదులు ఉదాహరణములు. ఇది విశేషణ పూర్వ పదము. పై యాకరణ ఖసూచి ఇది విశేష్యోత్తర పదము. శీతోష్ణమ్. ఇది విశేషణాభయ పదము. శంఖపాండురః. ఇది ఉపమాన పూర్వ పదము. పురుష వ్యామః ఇది ఉపమానో త్తర పదము. గుణ వృద్ధిః ఇది సంభావనా పూర్వ పదము, గుణ ఇతి వృద్ధిః యని విగ్రహ వాక్యము. సుహృదేవసుబంధుకః నుహృత్సుబంధుక . ఇది అవధారణ పూర్వ పదము. బహు వీరిఏడు విధములు. ఆరూఢ భవన, ఇది ద్విపద బహు ద్రోహి. ఆర్చితా శేష పూర్వః ఇది బహుపద బహువ్రీహి. “ఉపదశాః సంఖ్యోత్తర పదము. ద్విత్రాః ఇత్యాదులందు సంఖ్యీ భయ పదము. సమూలోద్ధృత. ఇది సహ పూర్వ బహువ్రీహి. కేశాకే?, నఖానఖి ఇత్యాదులు వ్యతిహార లక్షణ బహువ్రీహి. దక్షిణ పూర్వా ఇల్యాదులందు దిగ్లక్షణ బహువ్రీహి. ద్విగు రెండు విధములు. ద్విశృంగమ్. ఇది ఏకవద్భావీ ద్విగు. ఆనేక వద్భావి కూడ వుండును. ద్వంద్వ సమాసము రెండు విధ ములు. రుద్ర విష్ణూ ఇతరేతర యోగ ద్వంద్వము. భేరీ పటహం. ఇది సమహార ద్వంద్వము. అవ్యయీ భావము రెండు విధములు. శాక స్య మాత్రాగాక ప్రతి. ఇది నామ పూర్వ పదావ్యయీభావము. ఉపకుంభమ్. ఉపరథ్యమ్, అవ్యయ పూర్వక అవ్యయీ భావములు. సమాసము ప్రాధాన్యమును బట్టి నాలుగు విధములు. ఉత్తర పదార్థ ప్రధాన మగు తత్పురు షము, ఉభయ ప్రధాన మగు ద్వంద్వము, పూర్వార్థ ప్రధానమగు ఆవ్యయీ భావము, ఆత్యార్థ ప్రధాన మగు బహు ద్రోహి.
ఆగ్ని మహా పురాణమున సమాస నిరూపణ మను మూడు వందల యేబది ఐదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 356 of the Agni Purāṇa is as follows:
Secondary nominal derivation through taddhita suffixes is described. Three broad categories are distinguished: sāmānya-taddhita (general meanings such as descent, belonging, produced-from), avyaya-taddhita (yielding indeclinables), and bhāvavācaka-taddhita (abstract nouns denoting states or qualities). Representative suffixes in each class — val, ilac, iṇ, ṇic, and others — are listed with their conditioning environments and the semantic changes they effect. The chapter also covers tāc/tvap, the two principal suffixes for forming bhāvavācaka (abstract) nouns from adjectives and nouns — corresponding to the English suffixes -ness and -ity — and works through a series of derived words to demonstrate the system in action.