అగ్ని మహా పురాణము

201 - అథ నవవ్యూహార్చనమ్.

అగ్ని రువాచః-

నవవ్యూహార్చనం వక్ష్యే నారదాయ హరీరితమ్

 మణ్డలేబేర్చయేన్మధ్యే హ్యబీజం వాసుదేవకమ్. 

అబీజం చ సజర్షణం ప్రద్యుమ్నం చ ప్రదక్షిణే

అః అనిరుద్ధం నైరృలే ఓం నారాయణమప్సు చ.

తత్పద్ర్బహ్మాణమనిలే హృది విష్ణుం క్రైం నృసింహకమ్

ఉత్తరే భూవరాహం చ త్వీ ద్వారి చ పశ్చిమే.

కం టం సం శం గరుత్మస్తం పూర్వవక్రం చ దక్షిణే

ఖం భం వం హుం ఫడితి చ ఖం ఠం సం శం గదాం విధే.

నవవ్యూహార్చనమ్ ఐం ణం మం క్షం కోణేశం

చ ధం దం భం హం శ్రియం యజేత్

దక్షిణే చోత్త రే పుష్టిం గం డం వం శం స్వబీజకమ్.

పీఠస్య పశ్చిమే ధం వం వనమాలాం చ పశ్చిమే

శ్రీవత్సం చైవ సం హం లం ఛం తం యం కౌస్తుభం జలే.

దళ మాజ్ఞక్రమాద్విష్ణోర్నమోనన్త మథోర్చయేత్

దశాబ్దాదిమ హేన్గాదీన్ పూర్వాదౌ చతురో ఘటాన్.

తోరణాని వితానం చ ఆగ్న్యనిలేన్గుబీజకై

మడ్డలాని క్రమర్ద్యాత్వాతనుం వన్ద్య తతః వేల్.

 అమ్బరసం తతో ధ్యాత్వా సూక్ష్మరూపమఠాత్మనః

సితామృతే నిమగ్నం చ చౄబిమ్బాత్సృతేన చ.

తదేవ చాత్మనో బీజమమృతం పూర్వసంస్కృతమ్

ఉత్పద్యమానం పురుషమాల్మా నముపకల్పయేత్.

ఉత్పన్నో ఒస్మి స్వయం విష్ణుర్బీజం ద్వాదశకం న్య సేత్

హచ్చిరస్తు శిఖా చైవ కవచం చాస్త్ర మేవ చ.

వక్షో మూర్ధశిఖిపృష్ఠలోచనేషు న్య సేత్పురః

ఆస్త్రం కరద్వయే న్యస్య తతో దివ్యతనుర్భవేత్.

యథాత్మని యథా దేవే శిష్యదే హే న్య సేత్త థా

అనిర్మాల్య స్మృతా పూజా యద్ద రే పూజనం హృది.

సనిర్మాల్యా మడ్డలాదౌ బద్దనే తాశ్చ శిష్యకాః

పుష్పం & పేయుర్యన్మూర్తి తస్య తన్నామ కారయేత్.

నివేళ్య వామతః శిష్యాం స్త్రీల క్రీహిమృతం హువేత్

శతమష్టోత్తరం హుత్వా సహస్రం కాయశుద్ధయే.

నవవ్యూహస్య మూర్తీ నామ జ్గనాం చ శతాధికమ్

పూర్ణాం దత్త్వా దీక్ష యేత్తాన్ గురుః పూజ్యశ్చ తైర్ధనైః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నవవ్యూహార్చనం నామైకాధిక ద్విశతతమోధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను : వసిష్ఠమహామునీ! శ్రీ మహావిష్ణువు నారదునకు చెప్పిన విధమున నవవ్యూహార్చన విధానము చేప్పెదను. పద్మ మయ మగు మండలము మధ్య ‘అం’బీజముతో కూడిన వాసుదేవుని పూజించవలెను. (ఉదా : ఆం వాసుదేవాయ నమః) ఆగ్నేయమునందు ‘ఆం’ బీజయుక్త ప్రద్యుమ్నుని, నైరృతియందు ‘అః’ బీజయుక్తు డగు అని రుద్దుని, పశ్చిమమున ప్రణవయుక్త నారాయణుని, వాయువ్యమునందు తత్సద్ బ్రహ్మను, ఉత్తరమునందు ‘హుం’ బీజ యుక్త విష్ణువును, ‘క్రాం’ బీజయు కనృసింహుని, ఈశాన్యమున పృథ్విని, పశ్చిమద్వారమున వరాహమూర్తిని పూజించవలెను. కం, టు, శం, సం బీజయుక్తగరుడుని, పూ్వూభిముఖునిగా దక్షిణమున పూజించవలెను. ఐం, భం, బం, హుం, ఫట్ అను బీజమలతోను, ఖం, ఛం, ఛం, శం ఆను బీజములతోనుగదను చంద్రమండలమునందు పూజించవలెను. బం, ణం, మం, క్షం బీజములతోను, శం, ధం, దం భు, హం బీజములతోను శ్రీదేవిని కోణభాగమునందు పూజించవలెను. దక్షిణే త్తర ములందు గం, డం, బం, శం బీజములతో పుష్టిదేవిని పూజించవలెను. పీఠ పశ్చిమభాగమునందు ధం, వం బీజము లతో వనమాలను పూజించవలెను, పశ్చిమ దిశయందు సం, హం, లం బీజములతో శ్రీవత్సమును, జలమునందు థం, తం, యం, బీజములతో కౌస్తుభమును పూజించవలెను. పిదప దశమాంగ క్రమమున విష్ణువును, అతని క్రింది భాగమున అనంతుని, వారి పేర్లకు నమః, జోడించి పూజించవలెను. పూర్వాది దిశలందు దళాంగాదులను, మహేంద్రాది దశ డిక్పాలులను, పూర్వాది దిశలందు నాలుగు కలశలను పూజించవలెను.  తోరణ - వితాన - అగ్ని - వాయు - చంద్రుల బీజములతో కూడిన మండ లములను క్రమముగా ధ్యానించి, తన శరీరమును వంచనపూర్వకముగ అమృతఫ్లావితము చేయవలెను. ఆకాశ ముం దున్న ఆత్మయొక్క సూక్ష్మరూపమును ధ్యానించి, ఆ ఆత్మ చంద్రమండలమునుండి ప్రవహించుచున్న శ్వేతామృతధారలో నిమగ్న మైనట్లు భావన చేయవలెను. ప్లవన సంస్కృత మైన అమృతమే ఆత్మబీజము. ఆ ఆమృతము నుండి పుట్టిన పురుషుడే తానని భావన చేయవలెను. “నేనే విష్ణుస్వరూపమున ప్రకట మైతిని” అని భావన చేయవలెను. పిదప ద్వాదశ బీజ వ్యాసము చేయవలెను. క్రమముగ వక్షఃస్థల - మస్తక - శిఖా - పృష్టభాగ - వేత్ర హస్తద్వయములందును, హృదయ శిరః - శిఖా - కవచ - నేత్ర అస్త్రములందును అంగన్యాసము చేయవలెను. రెండు హస్తములందును అస్త్రన్యాసము చేసిన పిదప సాధకుని శరీరమునందు దివ్యత్వము వచ్చును. తన శరీరమునందు చేసినట్లే దేవతావిగ్రహ శరీరమునందును శిష్యశరీరమునందును గూడ న్యాసము, చేయవలెను. హృదయములో చేయు శ్రీమహావిష్ణుపూజనము నిర్మాల్యరహిత పూజనము మండలాదుల పై చేయునిది నిర్మాల్యసహితము. దీక్షాకాలమున శిష్యుని నేత్రములు బంధింపబడి యుండును. ఆసమయమున ఆతడు ఇష్టదేవతా విగ్రహము పై విసరిన పుష్పమునుబట్టివానికా పేరు పెట్టవలెను. శిష్యులను ఎడమ ప్రక్క కూర్చుండ బెట్టుకొని అగ్నియందు తిలలు, బియ్యము, ఘృతము హోమము చేయవలెను. నూటఎనిమిది ఆహుతులిచ్చిన పిదప కాయ శుద్ధి కొరకై వెయ్యి హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చి గురువు శిష్యులకు దీక్ష ఇవ్వవలెను, శిష్యులు ధనముచే గురువును పూజించవలెను.

            అగ్ని మహాపురాణమునందు నవవ్యూహార్చనవర్ణన మను రెండు వందల ఒకటవ అధ్యాయము సమాప్తము.