అగ్ని మహా పురాణము

121 - అథ జ్యోతిః శాస్త్రసారః.

ఆగ్నిరువాచః-

జ్యోతిఃశాస్త్రం ప్రవక్ష్యామి శుభాశుభ నివేదకమ్

చాతుర్లక్షస్య సారం యత్తద్ జ్ఞాత్వా సర్వవిద్భవేత్.

షడష్ట కే వివాహో న నచ ద్విౄ్వద శే శ్రియాః

న త్రికోణే హ్యథ ప్రీతి శేషే చ సమసప్తకే.

ద్విద్వాదశే త్రికోణే చ మైత్రీ చేత్రపయేర్యది

భవేదేకాధిపత్యం చ తారాప్రీతిరఠాపీ వా.

తథాపి కార్య సంయోగో న తు షష్టాష్టకే పునః

జీవే భృగా చా సమితే ప్రియతేచ పుమాన్ శ్రియా.

గురు క్షేత్రగతే సూర్యే సూర్య క్షేత్రగతే గురౌ

వివాహం న హోంనని కన్యావైదవ్యకృడ్మవేత్.

ఆతిదారే త్రిపక్షం స్యాద్వ కే మాసచతుష్టయమ్

వతోద్వాహ న కుర్వీత గురోర్వక్రాతిచారయోః.

చైత్ర పౌషే న రిక్తాసు హరౌ సుప్తే కుజే రనౌ

చన్హక్షయే చాళుభం స్యాత్సన్ద్యా కాలః శుభావహః.

రోహిణీ చోత్తరా మూలం స్వాతీ హస్తోఽథ రేవతీ

తులే చ మిథునే శస్తో వివాహః పరికీర్తితః.

వివా హే కర్ణవేరే చ ప్రతే పుంసవనే తథా

ప్రాశనే బాద్యచూడాయాం విద్ధర్ణంచ వివర్జయేత్.

శ్రవణే మూలపు ష్యే చ సూర్యమజ్జలజీవ కే .

 కుమ్భే సిం హే చ మిథునే కర్మ పుంసవనం స్మృతమ్.

హస్తే మూలే మృగే పౌష్టి బురే శుకే చ నిష్కృతిః

అర్కేనుజీవభృగుజే మూలే తామ్బూలభక్షణమ్.

అన్న స్య ప్రాశనం శుకే జీవే మృగే చ మీన కే

హస్తాది పంచ కే పుష్యే కృత్తికాదితయే తథా.

అశ్విన్యామథ రేవత్యాం న వాన్న ఫలభక్షణమ్

పుష్యో హస్తస్తథా జ్యేష్ఠ రోహిణీ శ్రవణాశ్వినౌ.

స్వాతిసౌమ్యే చ భేషజ్యం కుర్యాదన్యత్ర వర్జయేత్

పూర్వాత్రయం మఘ యామ్యం పావనం శ్రవణత్రయమ్.

భౌమాదిత్య శనేర్వారే స్నాతవ్యం రోగము క్తితః

అగ్ని పలికెను  మహామునీ! ఇపుడు శభాశుభనివేకమును ఇచ్చునదియు, మనుష్యుని సర్వజ్ఞానిగ చేయునదియు, వాలుగు లక్షల శ్లోకముల జ్యోతికశాస్త్రము యొక్క సారభూతమును అగు జ్యోతిఃశాస్త్రమును గూర్చి సంక్షిప్త ముగా చేప్పెదను. కన్య యొక్క జన్మరాశినుండి వరుని రాశి సంఖ్య ఆరు - ఎనిమిదిగాని, తొమ్మిది - అయిదు గాని, రెండు , తండ్రెండు గానీ అయినచో వారి వివాహము శుభప్రదము - కాదు; మిగిలిన పది_ నాలుగు, పదకొండు - మూడు, సమసప్తకము ఆయినచో శుభ ప్రదము; వధూవరుల రాశ్యధిపతులు పరస్పరమిత్రులైనను, రెండు రాశుల ఆధిపతియు ఒక్కడే యైనను ఇరువురి జన్మనక్షత్రములకు మైత్రి యన్నను, పంచమ - నవమ, ద్విర్ద్వాదశ దోషములు చూడక వివాహము చేయ వచ్చును. షష్టాష్టక మున్నపుడు మాత్రము ఎన్నడును వివాహము చేయరాదు. గురు - శుక్రులు అస్తంగతులై యుండగా వివాహము చేయుటచే వరుడు మరణించును. గురు నేత్రమున సూర్యుడును, సూర్య క్షేత్రమున గురువును ఉన్నచో వివాహము మంచిది కాదు. కన్యకు వైధవ్యము కలుగును. బృహస్పతి వక్ర మైనను అతిదారవంతు డైనను వివాహోపనయనములు చేయరాదు. తప్పనిసరి యెనపుడు ఆతిచార సమయమున పత్రయమును వక్రు డైనపుడు నాలుగు మాసములను విడచి ఉపనయనాదులు చేయవలెను. చైత్ర - పుష్యమాసములందును రిక్త తిథియందును, శ్రీమహావిష్ణువు నిద్రించుచున్నప్పుడును మంగల రవివారములందును, చంద్రుడు క్షీణించి యున్నపుడును వివాహము శుభకరము కాదు. సంధ్యాకాగము శుభము. రోహిణి ఉత్త రాత్రయ - మూల - స్వాతీ - హస్త రేవతి నక్షత్రములందు, తులతప్ప మిగిలిన ద్విస్వభావశులందును, స్థిరరాశులందును వివాహము - శుభపదము. వివాహ - కర్ణవేధ - ఉపనయన - పుంసవనసంస్కారములందును ఆన్న ప్రాశన - చూడా కర్మలందును ఏద్దనక్షత్రమును పరిత్యజింపవలెను. శ్రవణ - మూల - పుష్యనక్షత్రములందును రవి - మంగళ - బృహస్పతి వారములందును, కుంభ - సింహ - మిథున లగ్నములందును పుంసవనము చేయవలెను. హస్త - మూర్తి - మృగశీర్ష - రేవతీనక్షత్రములందును, బుధ శుక్రవారములందును, పిల్లలను ఇల్లు కదుపుట మంచిది. తొలిసారిగా తాంబూల భక్షణము చేయుటకు రవి - సోమ - గురు - శుక్రవారములును, మూల నక్షతము ఉత్తమ మైనవి. శుక - గురువారములందున మకరమీనలగ్నములందును, హస్తాది నక్షతృపంచకమునందును, పుష్యమునందును, కృత్తి కాది. వక్షతతయమునందును, అన్నప్రాశనము చేయవలెను. అశ్వినీ - రేవతి - పుష్య - హస్త - జ్యేష్ఠ - రోహిణి - శ్రవణనక్షతములందు నూతనాన్న ఫలభక్షణము - శుభకరము - స్వాతీ - మృగశిరానక్షతములందు ఔషధ సేవ చేయవలెను. పూర్వాత్రయమునందును, మఘా - భరణి  స్వాతి - శవణ - ధనిష్ట - శతభిషక్కులందును, రవి - శని - మంగళ వరములందును, రోగవివక్తుడు స్నొనము చేయవలెను

పార్ధివే చాష్ట్ర ప్రాంతారం మధ్యే నామ చ దిక్షు చ.

హ్రీంపుటం పార్థివే దికు హీంవిదికు లిఖేద్వసూన్

గోరోచనాకంకు మేన భూర్జీ వస్త్రే గలే ధృతమ్.

శత్రవో వళమాయా న్త మ శ్రేణానేన నిశ్చితమ్

శ్రీం హ్రీం సంపుటం నామ శ్రీం హ్రీం పత్రాష్ట్ర కేక్రమాత్.

గోరోచనాకుంకు మేన భూర్కేథ సుభగావృతే

గోమధ్యపాగమః పత్ర హరిద్రాయ రసేన చ.

శిలాపటేరీన్ స్తమ్భయతి భూమావధోముఖీకృతమ్.

ఓం హూం స. సంపుటం నామ ఓం హూం సః

పత్రాష్ట్ర కే క్రమాత్. గోరోచనా కుంకుమేన

భూర్ణ మృత్యునివారణమ్  ఏక పజ్చ నవ ప్రీత్యై ద్విషడ్ ద్వాదశయోగకః.

త్రిస వై కాద లాబో వేదాష్టద్వాద కే రిపుః .

తనుర్ధనం చ సహజః సుహృత్సుతో రిపు స్తథా.

జాయా నిధనధర్మా చ కర్మాయవ్యయకం క్రమాత్.

స్పుటం మేషాదిలగ్నేషు నవ తారాబలం వదేత్.

జన్మ సంపద్విపల్లేమం ప్రత్యరిః సాధకః క్రమాత్

నిధనం మిత్రపరమమిత్రం తారాబలం విదుః.

మట్టితో చేసిన చతురస్ర పట్టము మీద ఎనిమిది దిక్కులందు ఎనిమిది హీం లు వ్రాసి, మధ్య తన పేరు వాయవలెను. లేదా మట్టితో చేసిన పట్టముపై గాని భూర్జపతముపై గాని ఎనిమిది దిక్కులందును హ్రు వాసి మధ్య తన పేరు గోరోచనాకుంకుమలతో వాయవలెను. ఇట్టి యంత్రమును వస్త్రము చుట్టి కంఠమునందు ధరించు: చే తప్పక శత్రువులు వశ మగుదురు. ఈ విధముగనే 'శ్రీం' హీం లతో సంపుటిత మైన పేరును గోరోచనముతోను కుంకుమతోను ఎనిమిది భూర పతముల పై వాసి భూమిలో పాతి పెట్టి నచో విదేశములకు వెళ్ళిన వ్యక్తి శీఘ్రముగ తిరిగి వచ్చును. ఆ యంతమనే పసుపురసముతో శిలాపట్టము పై వాసి కిందికి ముఖ ముండు నట్లు భూమి పై ఉంచినచో శత్రుస్తంభన మగును. 'ఓం' “హూం’ ‘స' మంతములచే సంపుటిత మైన పేరును గోరోచనా కుంకుమలతో ఎనిమిది భూర్ణ పతముల పై వాసి ఉంచినచో మృత్యునివారణము కలుగును. ఈ మంత్రమును ఒక మారు, ఏడుమార్లు, తొమ్మిదిమార్లు వాపిశచో పరస్పర హేమ కలుగును. రెండు సార్లు, ఆరు సార్లు, లేదా పండ్రెండు సార్లు వాసినచో వియోగమును పొందినవారు కలియుదురు. మూడు, ఏడు లేదా పదకొండు సార్లు వాసినచో లాభము కలుగును. నాలుగు, ఎనిమిది, పండెండు సార్లు వాసినచో వరస్పర శత్రుత్వము కలుగును. మేషాది లగ్నములవలన తను - ధన - సహజ - సుహృత్ - సుత - రిపు - జాయో - నిధన - ధర్మ - కర్మ - ఆయ- వ్యయభావము లేర్పడును. ఇపుడు నవతారాబలము చెప్పబడు చున్నది. జన్మ - సంపత్ - విపత్ - తేమ - హత్యం - సాధక - మైత్ర - అతిమైత్రము లని తొమ్మిది తారలు.

వారే జ్ఞగురుశు కాణాం సూర్యాచన్దమసో స్తథా

మాఘాదిమాసషట్కౌ తు ఔరమాదం ప్రశస్యతే.

కర్ణ వేధో బుధే జీవే పుష్యే శ్రవణచిత్రయోః

పఇమేజే బాధ్యయనం షష్ఠిం ప్రతిపదం త్యజేత్.

రిక్తం పణ్ఛదం భౌమం ప్రార్చ్య వాణీం హరిం శ్రియమ్

మాఘాదిమాసష ఓ తు మేఖలాబన్దనం శుభమ్.

చూడాకరణమాద్యం చ శ్రావణాదౌ న శస్యతే

అస్తం యాతే గురౌ శుకే క్షీణే చ శశలానే.

ఉపనీతస్య విప్రస్య మృత్యుం జాడ్యం వినిర్ది శేత్

ఔరక్షే శుభవారే చ సమావర్తనమిష్యతే.

శుభ క్షేత్రే విలగ్నేషు శుభయు కేజితేషు చ

ఆశ్వినీమఖాచిత్రాసు స్వాతీయా మ్యోత్తరాసు చ.

పునర్వసౌ తథా పుష్యే ధనుర్వేదః ప్రశస్యతే

భరణ్యాక్టా మహ శ్లేషా వహ్ని భర్గరయో స్తథా.

జిజీవిషుర్న కుర్వీత వస్త్ర పావరణం నరః

గురౌ శుకే బుధే వస్త్రం వివాహాదౌ నభాదికమ్.

లేఖత్యశ్విధనిష్ఠాసు హస్తాదిషు చ పశ్చాసు

శంఖవిద్రుమరత్నా నాం పరిధానం ప్రశస్యతే .

యామ్యనర్పధనిష్ఠాసు త్రిషు పూర్వేషు వారుణే

క్రితం హానికరం ద్రవ్యం వీక్రితం హానికృద్భవేత్.

ఆశ్వినీ స్వాతీచిత్రాసు రేవల్యం పోరణే హారా

క్రీతం లాభకరం ద్రవ్యం విక్రీతం హానికృద్భవేత్.

ధరణీ త్రీజీపూర్వాణి అర్ధా శేషావమానిలాః

వహ్ని జ్యేష్ఠవీశాభాసుస్వామినోనోపతీష్ఠతి.

ద్రవ్యం దత్తం ప్రయుక్తం వా యత్ర నిక్షిప్యతే ధనమ్

ఉత్తరే శ్రవణే శాక్రే కుర్యాద్రజాభి షేచనమ్.

బుధగురు-శక-రవి–సోమవారము లందును. మాఘాది మాసషట్కము నందును, బాలకునకు ప్రథమ కొరకర్మ చేయుట మంచిది. కర్ణవేధ సంస్కారమునకు బుధ, గురువారములు, వుష్య-శ్రవణచిత్రానక్షత్రములను మంచివి. ఐదవ సంవత్సరమునందు, ప్రతిపత్-షష్టి-రక్తతిథి-పూర్ణిమలను, మంగళవారమును విడచి ఇతర తిథీవారము లందు విష్ణువును, అడ్మిని పూజించి అక్షరారంభము చేయవలెను. మాఘమునుండి ఆరు మాసముల వరకును ఉపనయన సంస్కారమునకు కథకరము. గ్రావణాది మాసషట్కము చూడా కరణాది సంస్కారములకు ముచివి కావు. గురు శుక్రులు ఆ స్తంగతు లైనపుడును, చంద్రుడు క్షీణుడై యున్నపుడును యజ్ఞోపవీత ధారణము చేయుటచే బాలుడు జడబుద్ది యగును; లేదా మరణించును. క్షౌరమునకు చెప్పిన నక్షత్రములందును, శుభగ్రహవారము లందును, సమావర్తన సంస్కారము చేయుట మంచిది. లగ్నము కథ గ్రహరాశీ యైనను, శుభగ్రహము లగ్నమునం దున్న పుడును లేదా చూచు చున్నను అశ్వినీ - మఘా-చిత్రా-స్వోతీ-భరణీ-ఉత్తరాత్రయ - పునర్వసు - పుష్యనక్షత్రములందును, ధనుర్వేదము ప్రారంభింపవలెను. భరణి, ఆర్ద్ర, మమ, ఆశ్లేష, కృత్తిక, పుబ్బ నక్షత్రములందు, జీవింప గోరువా డెవ్వడునూతన వస్త్రధారణము చేయరాదు. బుధ-గురుశుకవారములందు వస్త్రధారణము చేయవలెను. వివాహాది మంగళ కార్యములందు వస్త్రధారణము విషయమున నక్షత్రాదివిచారము చేయ పని లేదు. రేవతీ-ఆశ్వినీ-ధనిషానక్షత్రములందు, హస్తాది నక్షత్ర వంచకమునందును, శంఖ-విదుమ-రత్నములను ధరించవలెను. భరణీ-ఆశ్లేషి-ధనిష్ణా-పూర్వాత్రయకృత్తికానక్షత్రము లందు వస్తువులను కొన్నను, అమ్మినను హాని కలుగును. అశ్వినిస్వాతిచిత్రా-రేవతీశతభిషా-శ్రవణ నక్షత్రము లండు కొనుట లాభదాయకము; అమ్ముట అశుభకరము, భరణీ-పూర్వాతయఆర్ధా-ఆశ్లేషా-మఘా-స్వాతీ-కృత్తికావిశాఖానక్షతములందు స్వామి సేవాప్రారంభము చేయరాదు. ఈ నక్షత్రములందు ఇతరులకు దవ్య మిచ్చుటగాని, తాకట్టు పెట్టుటగాని చేయకూడదు. ఉత్తరాత్రయవణ–జ్యేష్ణానక్షతములందు రాజ్యాభిషేకము చేయవలెను.

చైత్రం జ్యేష్టం తథా భాద్రమాశ్వినం పౌషమేవ చ

మాఘం చైవ పరిత్యజ్య శేషమానే గృహం శుభమ్.

అశ్వినీ రోహిణీ మూలముత్తరాత్రయమైనవమ్

స్వాతీ హస్తోనురాధా చ గృహారమే ప్రశస్యతే.

ఆదిత్యభౌమవర్ణం తు వాపీ ప్రాసాద కే తథా

సింహ రాశిగతే జీవే గుర్వాదిత్యే ములిమ్రుచే. బాలే వృదే.

సగే శు కే గృహకర్మ వివర్జయేత్

అగ్నిదాహో భయం రోగో రాజపీడా ధనక్షతిః.

సంగ్రహే తృణకాష్టానాం కృతే శ్రవణపజ్చ కే

గృహప్రవేశనం కుర్యాద్ధనిష్ణో త్తరవారణే.

నౌకాయా ఘటనే ద్వితీపశ్చిస పత్రయోదశి

నృపధర్మోధనిష్ఠాసు హస్తపౌష్యాశ్వినీషు చ.

పూర్వాత్రయం ధనిష్ఠౄ వహ్నిః సౌమ్యవిశాఖయోః

ఆశ్లేషా చాశ్వినీ చైవ యాత్రాసిద్ధిస్తు సమ్పదా.

త్రిషత్తరేషు రోహిణ్యాం సినీవాలీ చతుర్దశి

శ్రవణం చైవ హస్తో వైచిత్రావై వైష్ణవీ తథా.

గోష్ఠయాత్రాం న కుర్వీత ప్రవేశం నైవ కారయేత్

అనీలోత్తర రోహిణ్యాం మృగమూలపునర్వసా..

పుష్యశ్రవణల్ష కృషికర్మ నమాచరేత్

పునర్వసూత్తరాస్వాతీ భగమూలేన్డవారుణే.

గురో శుక్రశః వారే వా వారే వా సోమ భాస్వతో

వృషలగ్నే చ కర్తవ్యం కన్యాయాం మిథునే తథా.

ద్విపఇదళమీన స్తతృతీయా చ త్రయోదశి

లేవ్యం రోహిణిన్హాగ్నిహ క్షమైతోత్తరేషు చ

జ్యోతి శాస్త్రసార మన్గాగవర్లే బీజాని వాపయేత్సంపదర్థ్యపి

రేవతీహ స్తమూలేషు శ్రవణే భగమైత్రయోః.

పితృదేవే తథా సౌమ్యే ధాన్యచ్ఛేదం మృగోదయే

హ స్తచిత్రాదితిస్వాతీ రేవతీశ్రవణత్రయే.

స్థిరే లగ్నే గురోర్వార్థవా భార్గవసౌమ్యయోః

యామ్యాదితిమఘాజ్యేష్ఠాసూత్తరేషు ప్రవేశ యేత్.

చైత్ర-జ్యేష్ట-భాద్రపద-ఆశ్విషపౌష-మామ మాసములు తప్ప ఇతరమాసములు గృహారంభమునకు మంచివి. అశ్వినీ-రోహిణీమూరి-ఉత్తరాతయ-మృగశీర్ష-స్వాతీ-హస్త, అనురాధానక్షతములను, కీరవి-ముగళవారములు తక్క ఇతర వారమును గృహ-తటాకవాపీ-ప్రాసాచారంభముకు శుభప్రదములు. గురుడు సింహరాశిలో నన్నపుడును, గుర్వాదిత్యమునందును (అనగా గురుడు సింహమునందును సూర్యుడు ధనుర్మీనములందును. ఉన్నపుడు, ఆధికమాసము నందును, శుక్రుడు బాలుడుగా గాని, వృద్ధుడుగా గాని, ఆస్తగతుడుగా గాని ఉన్న ప్పుడును గృహమునకు సంబంధించిన కార్యము లేవియు చేయరాదు. శ్రవణా నక్షత్రపంచకుండ తృణకాష్ట సంచయము చేసినచో ఆగ్ని దాహము, భయము, రోగము, రాజపీడ, ధనవాశము కలుగును. ధనిష్ఠ, ఉత్తరాత్రయము, శతభిషక్ - ఈ నక్షత్రములందు గృహప్రవేశము చేయవలెను. ద్వితీయా-తృతీయా-పచమీసప్తమీ-త్రయోదశీతిథులు నౌకానిర్మాణమునకు మంచివి. ధనిష్ణా-హస్త రేవతీ-ఆశ్వినీనక్షత్రములందు రాజదర్శనము చేయవలెను. పూర్వాత్రయ-ధనిషా-ఆక్టా-కృత్తికా-మృగశీర్ష-విఖాఆశ్లేషాఅశ్వినీ నక్షత్రములందు యుద్ధయాత్ర సంపత్తి నిచ్చును. సిద్ధిదాయకమగును. అష్టమి-అమావాస్యా-చతుర్ధశతి యందును, ఉత్తరాత్రయమునందును రోహిణీ-శ్రవణ-హస్త చిత్రనక్షత్రము సందును పశువులను గోశాలనుండి బైటక అమ్ముటకై తీసికొని రాగూడదు; కొన్న వాటిని లోనికి తీసికొని పోగూడదు. స్వాతీ-ఉత్తరాత్రయ-రోహిణి-మృగశీర్షమూల-పునర్వసుపుష్య-హస్త శ్రవణనక్షత్రములందు సాధారణ వ్యవసాయ ప్రారంభము చేయవలెను. పునర్వసు ఉత్తరాత్రయ-స్వౌతీ-పుబ్బ-మూజ్యేష్ఠా-శతభిషక్ నక్షత్రము లందును. రవి-సోమగురుశుక్రవారమే లందును, వృషభ, మిథునకన్యాలగ్నము లుదును, ద్వితీయా-పంచమీదశమీ-సప్తమీ-తృతీయా-త్రయోదశలందు, దున్నట మొదలగు వ్యవసాయపు పను. చేయవలెను. రేవతీ రోహిణీజ్యేష్ణా-కృత్తిక-హస్త-అనూరాధా-ఉత్తరాయములందును, శని మంగళవారములు తక్క ఇతరవారము లందును, విత్తనములు చల్లినచో సకలసంపదలు లభించును. నస్య చ్చేదనమునకు రేవతీ-హస్త-మూరి-శ్రవణ-పూర్వఫల్గునీ - మూ - మృగశిర నక్షత్రములును, మకర లగ్నము మంచిది. హస్త-చిత్ర-పునర్వసు-స్వాతీరేవతీ-శ్రవణాదిత్రయములందు ధాన్యము తీసి, స్థిర లగ్నమునందును, బుధగురు-శుక్ర వారములందును, భరణీ-పునర్వసుమఘా-జ్యేష్ణా-ఉత్తరాత్రయమునందును, ధాన్యమును గోతామంలో నిలవచేయవలెను.

ఓం ధనాయ సర్వధనేయ దేహి మే ధనం స్వాహా

 ఓం నవే వర్షే ఇలాదేవి లోక సంవర్ధని కామరూపిణి దేహి మే ధనం (ధాన్యం) స్వాహా.

పత్రస్థం లిఖితం ధాన్యరాశిసం ధాన్యవర్ధనమ్

త్రిపూర్వాసు విశాఖాయాం ధనిష్ణావారుజేపి చ

 ఏతేషు షట్సు విజ్ఞేయం ధాన్య నిష్క్రమణం బుధైః

దేవతారామవాప్యాదిప్రతిష్ణోదజ్ముఖే రవో.

మిథుననే రవో దర్మాద్యది స్యాద్ధ్వాదశీతిథిః

సదా తతైవ కర్తవ్యం శయనం చక్రపాణినః.

సింహం తొలిం గతే చార్కే దర్శాద్యద్ద్వాదశీద్వయమ్

ఆదా విస్త్రసముత్థానం ప్రబోధశ్చ హరేఃక్రమాల్.

తథా కన్యాగతే భానౌ దుర్గోత్తానే తథాష్టమీ

త్రిపాదేషు చ ఋ షేషు యదా భద్రా తిథిర్భవేత్.

భౌమాదిత్యశనైశ్చారి విజ్ఞేయం త త్రిపుష్కరమ్

సర్వకర్మణ్యుపారేయా విశుద్దిశ్చళోతారయోః.

జన్మాశ్రీతస్రషష్ఠశ్చ సప్తమో దశమ స్తథా

ఏకాదశః శశి యేషాం తేషామేవ శుభం వదేత్.

శుక్లపక్షే ద్వితీయశ్చ ఏడ్చామో నవమ శుభః

మిత్రాతిమిత్రసాదక సంపత్ప్రేమాద్రితారకాః .

 జన్మనా మృత్యుమాప్నోతి విపదా ధనసంక్షయమ్

ప్రత్యరౌ మరణం. వింద్యాన్ని ధనే యాతి పడ్చాతామ్.

కృష్ణాష్టమీదినాదూర్ధ్వం యావచ్ఛుక్లాష్టమీదినమ్

తావత్కాలం శశీ క్షీణః పూర్ణ స్తత్రోపరి స్మృతః.

వృషే చ మిథునే భానౌ జీవే చన్హేన్దదై వతే

పౌర్ణమాఫీగురోర్వారే మహాజ్యేష్టి ప్రకీర్తితా.

ఐశో గురుః శశీ చైవ ప్రాజావల్యే రవి స్తథా

పూర్ణిమాజ్యేష్ఠమాసస్య మహాజ్యేష్ఠి ప్రకీర్తితా.

స్వాత న్తరే యంత్ర నిష్ఠే శక్రస్యోత్థాపయేద్ధ్వజమ్.

హర్యృక్షపాదే చౌశ్విన్యాం సప్తాహాంతే విసర్జయేత్.

“ఓం ధనదాయ సర్వధనేశాయ దేహి మే ధనం స్వాహా” ఓం నవ్యే వరే ఇలాదేవి, లోక సంవర్ధని, కామరూపిణి దేహి ధనం స్వాహా”. ఈ మంత్రములను పత్రముపై వ్రాసి ధాన్యరాశిపై ఉంచినచో ధాన్యాభివృద్ధికలుగును. పూర్వాత్రయ విళాఖా-ధనిష్ణా-శతభిషక్ నక్షత్రములందు ధాన్యమును బైటకు తీయవలెను. సూర్యుడు ఉత్తరాయణమందున్న పుడు దేవలా- ఆరామ-తటాక-ప్యాదుల ప్రతిష్ట చేయవలెను. సూర్యుడు మిథునరాశిలో నున్నపుడు అమావస్యానంతరము, వచ్చు ద్వాదశి తిథియందు శ్రీమహావిష్ణువుశయనోత్సవము చేయవలెను. సూర్యుడు సింహతులారాశులలో, నున్నపుడు అమావస్యానంతరమువచ్చు ద్వాదశులలో వరుసగా శ్రీమహావిష్ణుపరివర్తనోత్సవ-జాగరణోత్సవములు జరుపవలేను. సూర్యుడు కన్యారాశిలో నుండగా, అమావస్యానంతరమువచ్చు అష్టమినాడు దుర్గాజాగరణము. పాదనక్షత్రములందు భద్రా-ద్వితీయాప ప్రమీ ద్వాదశులు వచ్చినపుడు, రవి-శని మంగళవారములైనచో ఆది, త్రిపుష్కరయోగము. ప్రతికార్యమునకును చంద్ర:లారా బలము చూడవలేను. చంద్రుడు జన్మరాశియందు, గానీ తృతీయ-షష-సప్తమ-దశమ ఏకాదశస్థానములందు గాని ఉన్నచో శుభుడు. శుక్ల పక్షమునందు ద్వితీయ-పంచమ-నవమచంద్రుడు కూడ శుభుడు. మిత్ర-ఆతీమిత్రసాధక సంపత్. మాది తారలు  శుభకరములు. జన్మతారయందు మృత్యువు, విపత్తారయందు - ధననాశము, ప్రత్యం.మృత్యుతార లయందు మరణము కలుగును. కృష్ణపక్ష అష్టమి మొదలు శుక్ల పక్ష అష్టమి, వరకును క్షీణచంద్రుడు, తరువాత పూర్ణచంద్రుడు. సూర్యుడు వృషథ-మిథునరాశులందుండి, గురుడు, మృగశిర లేదా జ్యేష్ఠానక్షత్రమునం దుండి, గురువారము, పూర్ణిమా తిథియు ఆయినచో, మహాజ్యేష్ఠ, జ్యేష్ఠలో గురుచంద్రులు, రోహిణిలో సూర్యుడు ఉండగా జ్యేష్టమాసపూర్ణిమ మైనచో ఆ పూర్ణిమ మహాజ్యేష్ఠ. స్వాతి రాకుండగనే యంత్రముపై ఇంద్రుని పూజ చేసి, ఇంద్రధ్వజారోపణము చేయవలెను. శ్రవణ మునందు గాని అశ్వనియందు. గాని, వారాంతమున గాని విసర్జన చేయవలెను.

సర్వం హేమసమం దానం సర్వేబ్రహ్మసమా ద్విజాః

సర్వం గజ్గాసమం వారి రాహుగ్రస్తే దీవాకరే.

ధ్వాండీ మహోదరీ మోరా మన్గా మన్దాకినీ ద్విజాః

రాక్షసీ చ క్రమేణార్కాత్సంక్రా స్తిర్నా మభిఃస్మృతా.

బాలవే కౌల నాగే తైతిలే కరణే యది

ఉత్తిష్ఠన్ సంక్రమత్యర్కస్తదా లోకః సుఖీ భవేత్.

గరే బబే వణిగ్విష్టా కింస్తు ఫ్నే శకునౌ వ్రజేత్

రాజ్ఞో దోషేణ లోకోయం పీడ్యతే సంపదా సమమ్.

చతుష్పాద్విష్టివాణిజ్యే శయితః సంక్రమేద్రవి:

దుర్భిక్షంరాజసంగ్రామో దమ్పత్యోః సంశయో భవేత్.

ఆధానే జన్మ నక్షత్ర వ్యాధే క్లేశాదికం భవేత్

కృత్తికాయా నవదినం త్రిరాత్రం రోహిణీషు చ.

మృగశిరః పళ్చిరాత్రమార్దాసు ప్రాణనాశనమ్

పునర్వసౌ చ పుష్యే చ సప్తరాత్ర విధీయతే.

నవరాత్రం తథా శ్లేషా శ్మశానాన్తం మఘాసు చ

ద్వౌమాసౌ పూర్వఫల్గున్యాము త్తరాసు త్రిప్బూకమ్.

హస్తే తు దృశ్యలే చిత్రా హ్యర్ధమాసం తు పీడనమ్

మానద్వయం తథా స్వాతి విశాఖా వింశతిర్దినమ్.

మైత్రేచైవ దశాపవి. జ్యేష్ఠా స్వేవార్ధమాసకమ్

మూలేన జాయతే మోక్షః పూర్వాషాదాత్రిపళ్బకమ్.

ఉత్తరా దినవింశల్య ద్వౌ మాసౌ శ్రవణేన చ

ధనిష్టా చాఢమాసం చ వారుణే చ దళాహకమ్.

న చ భాద్రపదే మోక్ష ఉత్తరాసు త్రిపశ్చికమ్

రేవతి దళరాత్రం చ అహోరాత్రం తథాశ్వినీ.

 భరణ్యాం ప్రాణహానిః స్యాద్గాయత్రీహోమత శుభమ్

పజధాన్యతిలాజాద్యైర్డేనుధానం ద్విజే శుభమ్.

ధళా సూర్యస్య షష్ణాబ్ది ఇంద్రోః పశ్చిద శైవ తు

ఆష్టావర్షిణి భౌమస్య దశ సప్త తథా బుధే.

దశాబ్దాని దశా పజోరూనవింశదురోర్దశా

రాహోర్ద్వాదశవర్షాణి భార్గవ స్యైక వింశతి.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే జ్యోతికశాస్త్రసారో నామైకవింశత్యధిక శతతమోఽధ్యాయ.

సూర్యుడు రాహుగ్రస్తు డైన సమయమున చేసిన సకలదానములు సువర్ణదానములే, బ్రాహ్మణ లందరును బ్రహ్మసదృశులు. సకలజలములు గంగాజలసమానములు. రవివారమునుండి శనివారము వరకును జరుగు రవిసంక్రాంతు లకు వరుసగా ఘోర, ధ్వాంక, మహోదర, మంద, మందాకిని, యుత, రాక్షసి అని పేర్లు, సూర్యసంక్రమణము కౌలవ-శకుని కింస్తుఘ్న కరణముల నైనచో ప్రజలు సుఖవంతులగుదురు. గరబవ-వణిక్ -విష్టిబాలవకరణములం దైనచో ప్రజలు రాజదోషముచే పీడితులై, సంపదతోమాత్ర ముందురు. చతుష్పాల్-తై తిల.నాగకరణమలం దైనచో దేశమునందు దుర్భిక్షము రాజయుద్ధములు, కలుగును, భార్యభర్తల జీవితము విషయమున గూడ సంశయమేర్పడును. రోగ ప్రారంభము జన్మనక్షత్రమునందు గాని ఆధానమునందు (జన్మనక్షత్రమునుండి పందొమ్మిదవ నక్షత్రమునందు గాని) ఆయినచో అధిక క్లేశ దాయకము. కృత్తికా నక్షత్రమునందై నచో తొమ్మిది దినముల వరకును, రోహిణియం దైనచో మూడు రాత్రులవరకును మృగశిరయం దైనచో ఐదురాత్రులవరకును రోగ ముండును. ఆర్థయందు అయినచో, ప్రాణవాశకము. వునర్వసు పుష్యనక్షత్రములం దైనచో ఏడురాత్రులును, ఆశ్లేషయందు తొమ్మిది రాత్రులును ఉండును. మఱయందు ప్రాణనాశకము. పూర్వఫల్గునియందు ఆయినది తొమ్మిది మాసములును, ఉత్తర ఫల్గునియందు కలిగినది మూడు.. దినములును, చిత్రయందు కలిగినది. పదిహేను దినములును, స్వాతీరోగము. ఒకమాసము, విశాఖయందు ఇరువది దివసములు, అనూరారోగము పది దివసములు, జ్యేష్ఠరోగము పదునైదు దివసములును ఉండును. మూలా, నక్షత్రమున ప్రారంభించిన రోగము విడువదు. పూర్వాషాడారోగము ఐధుదినములు, ఉత్తరాషాడారోగ్లము ఇదువది దినముల శ్రవణరోగము రెండు మాసములు, ధనిష్టాగము. తదునైదు దినములు, శతభిషరోగము, పది దినములు ఉండును. పూర్వాభాద్రారోగము విడవదు. ఉత్తరాభాద్రారోగము ఏడుదినములు, రేవతీరోగము పది రాత్రులు, అశ్వనీరోగము ఒక రాత్రి ఒక పగలు మాత్రము ఉండును. భరణికోగము ప్రాణనాశ కము,  పంచధాన్యములు, తిలలు, ఘృతము మొదలగు హోమద్రవ్యములతో గాయత్రీమంత్రముతో హోమము చేసినచో రోగము. తొలగి శుభఫలప్రాప్తి కలుగును. పాలు ఇచ్చు గోవును బ్రాహ్మణులకు దానము చేసినను రోగళాంతి కలుగును. (అష్టోత్తరీ దశాపద్ధతిలో) సూర్యదళ. ఆరు సంవత్సరములు చంద్రుని దశ పదునైదు సంవత్సరములు, కుజదశ ఎనిమిది, బుధదశ పదునారు, శనిదశ పది, బృహస్పతిదశ పందొమ్మిది రాహుదశ పండ్రెండు, శుక్రదశ ఇరువదియొక్క సంవత్సరములు.

ఆగ్ని మహాపురాణమునందు జ్యోతిషశాస్త్రకథన మను నూట ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.