అగ్ని రువాచః-
వక్ష్యే ప్రతాని చాష్టమ్యాం రోహిణ్యాం ప్రథమం వ్రతమ్ ।
మాసి భాద్రపదేష్టమ్యాం రోహిణ్యమర్ధరాత్రకే.
కృష్ణా జాతో యత స్తస్యాం జయ స్త్రీ స్యాత్తతోష్టమీ ।
సప్తజన్మకృతాతాపాన్ముచ్యతే చోపవాసతః.
కృష్ణపక్షే భాద్రపదే చాష్టమ్యాం రోహిణియుతే ।
ఉపోషితోర్చయేత్కృష్ణం భుక్తి ముక్తి ప్రదాయకమ్.
ఆవాహయామ్యహం కృష్ణం బలభద్రం చ దేవకీమ్ ।
వసుదేవం యశోదాం గాః పూజయామి నమోస్తుతే.
యోగాయ యోగపతయే యోగేశాయ నమోనమః ।
యోగా సంభవాయైవ గోవిన్దాయ నమోనమః.
స్నానం కృష్ణాయ దద్యాత్తు హ్యర్ధ్యం చానేన దాపయేత్।
యజ్ఞాయ యజైశ్వరాయ యజ్ఞానాం పతయే నమః.
యజ్ఞాదిసంభవాయైవ గోవిన్దాయ నమో నమః ।
గృహాణ దేవ పుష్పాణి సుగన్దని ప్రియాణి తే.
సర్వకామప్రదో దేవ భవ మే దేవవద్గీత ।
ధూపధూపిత ధూపం త్వం ధూపిత స్త్వం గృహాణ మే.
సుగన్దధూపగన్గాడ్యం కురు మాం సర్వదా హరే ।
దీపదీప్త మహాదీపం దీపదీ పిద సర్వదా.
మయాదత్తం గృహాణ త్వం కురుబోర్వగతిం చ మామ్ ।
విశ్వాయ విశ్వపతయే విశ్వేశాయ నమో నమః.
విశ్వాదిసంభవాయైవ గోవిన్దాయ నివేదితమ్ ।
ధర్మాయ ధర్మపతయే ధర్మేశాయ నమో నమః.
ధర్మాదిసంభవాయైవ గోవిన్ద శయనం కురు ।
సర్వాయ సర్వపతయే సర్వేశాయ నమో నమః.
సర్వాదిసంభవాయైవ గోవిన్దాయ చ పావనమ్।
క్షీరోదార్ణవసంభూత అత్రినేత్రసముద్భవ.
గృహాణార్ఘ్యం శశాజ్కేదం రోహిణ్యా సహితో మమ ।
స్థబ్దిలే స్థాపయేద్దేవం నచస్దాం. రోహిణీంయజేల్.
దేవకీం వసుదేవం చ యశోదాం నన్దకం బలమ్ ।
ఆర్దరాత్రే పయోధారాః పాతయేద్దుడసరిషా.
వస్త్ర హేమాదికం దద్యాదాహ్మణాన్భోజయే ద్వతీ ।
జన్మాష్టమీచతకరః పుత్రవాన్విష్ణులోక భాక్.
వర్షే వర్షే తు యః కుర్వాత్పులాఠీ వేత్తి నో భయమ్ ।
పుత్రాన్ దేహి ధనం దేహి హ్యాయురారోగ్యసన తిమ్.
ధర్మం కామం చ సౌభాగ్యం స్వర్గం మోక్షం చ దేహి మే .
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే జయన్యష్టమీ వ్రతం నామ త్ర్యశీతు త్తర శతతమోధ్యాయః.
ఆగ్ని దేవుడు పలికెను - ఇపుడు అష్టమి తిథియందు జరుపబడు వ్రతములను వర్ణింతును. వాటిలో మొదటిది రోహిణి యుర్దాష్టమీవ్రతమ భాద్రపద కృష్ణ పక్షమున రోహిణీయుర్దాష్టమి తిథియందు అర్ధరాత్రి శ్రీకృష్ణుడవతరించెను. అందుచే ఈ అష్టమి జయంతీగా చెప్పబడుచున్నది. ఆ దినమున ఉపవాసము చేయువాడు సప్త జన్మకృతపాపములనుండి విముక్తుడగును. భాద్రపదమున, రోహిణీ యుక్తాష్టమి తిథియందు ఉపవాస ముండి శ్రీకృష్ణుని పూజించవలెను. ఇది భుక్తి ముక్తి ప్రదము. “నేను శ్రీకృష్ణ - బలరామ - దేవకి - వసుదేవ - యశోదా - గోవులను ఆవాహన చేసి పూజించు చున్నాను. మీ అందరికిని నమస్కారము. యోగస్వరూపుడు యోగపతి, యోగీశ్వరుడు, అగు శ్రీకృష్ణునకు నమస్కారము. యోగమునకు ఆదికారణ భూతుడును, ఉత్పత్తి స్థానమును అగు గోవిందునకు అనేక పర్యాయములు నమస్కరించుచున్నాను. ఇట్లు ఆవాహనము చేసి శ్రీకృష్ణునకు స్నానము చేయించి – “యజైశ్వరా! యజ్ఞరూపా! యజ్ఞాధిపతి! యజ్ఞాది కారణభూతుడా! గోవిందా! నీకు మాటిమాటికిని నమస్కారము” అని అర్ఘ్యదానము చేయవలెను. దేవా! నీకు ప్రియమైన సుంగధయుక్తములగు ఈ పుష్పములను స్వీకరింపుము. దేవతలచే పూజింపబడినవాడా! నా కోరికల నన్నింటిని తీర్పుము. నీవు సదా ధూపముచే ధూపితుడవు, నేను సమర్పించిన ఈ ధూపముచే నీవు ధూప సుగంధమును గ్రహింపుము. నన్ను సర్వదా ధూపసుగంధ సంపన్నుని చేయుము.” అని చెప్పుచు పుష్ప ధూపములు సమర్పించవలేను. “ఓ ప్రభూ! నీవు సర్వదా దీపమువలె దీపించుచుందువు. దీపమునకు కాంతి నిచ్చువాడవు. శే నిచ్చిన ఈ మహాదీపమును స్వీకరించి నన్ను కూడ దీపము వలే ఊర్ధ్వగతి కలవానిని చేయుము, విశ్వరూ, విశ్వపతీ, విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! నీకు నమస్కారము; నమస్కారము, విశ్వమునకు- ఆదికారణభూతుడైన శ్రీ గోవిందును నేను ఈ దీపము నిచ్చుచున్నాను” అని చెప్పుచు దీపము సమర్పించవలెను. “ధర్మ స్వరూపుడును, ధర్మాధిపతియు, ధర్మమునకు ఆదిస్థాన భూతుడును అగు - వాసుదేపునకు నమస్కారము, గోవిందా! నీ విపుడు శయనింపుము. సర్వరూపుడు, సర్వాధిపతి, సర్వేశ్వరుడు, సర్వాధికారణ భూతుడు అగు గోవిందునకు మాటి మాటికిని నమస్కారము,” అని చెప్పుచు శయనింప చేయవలెను. “క్షీర సముద్రము నుండి పుట్టినవాడవును, ఆత్రినేత్ర సముద్భూతు డవును, తేజఃస్వరూపుడవును ఆగు ఓ శశాంకా! రోహిణీ సహితుడవై నే నిచ్చు ఆర్ఘ్యము గ్రహించుము” అని చెప్పుచు చంద్రునకు అర్ఘ్య ప్రదానము చేయవలెను. పిదప థగ వడ్విగ్రహముమ వేదిక పై స్థాపించి, చంద్ర సహిత రోహిణి పూజ చేయవలెను. అర్ధరాత్రియందు గుడ - ఘృతమిశ్ర క్షీర ధారలతో వసు దేవ - దేవకీ - వంద - యశోదా - బలరాములకు అభి షేకము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారికి, దక్షిణగా వస్త్రసువర్ణాదుల నీయవలెను. జన్మాష్టమీవ్రతము చేయువాడు పుటౌనండము పొంది విష్ణులోక నివాసి యగును. పుత్రప్రాప్తిని కోరి ప్రతిసంవత్సరము ఈ వ్రతము చేయువాడు పున్నా మనరక విముక్తుడగును. “హే ప్రభూ! నాకు పుత్రులను, ధనమును, ఆయుస్సును, ఆరోగ్యమును సంతతిని ఇమ్ము, గోవిందా! నాకు ధర్మ - కామ - సౌభాగ్య - స్వర్గ మోక్షముల నిమ్ము “ అని ప్రార్థించవలెను.
అగ్ని మహాపురాణము నందు అష్టమీవ్రతవర్ణన మను నూటఎనుబదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 183 of the Agni Purāṇa is as follows:
The Janmāṣṭamī vrata—Kṛṣṇa's birth celebration on Bhādrapada-kṛṣṇa-aṣṭamī when the Rohiṇī nakṣatra falls at midnight—is described in full liturgical detail. The observance dissolves the sins of seven previous births through a single day's upavāsa. The pūjā sequence involves āvāhana of Kṛṣṇa, Balarāma, Devakī, Vasudeva, Yaśodā, and cows; the arghya is offered with the formula "yajñāya yajñeśvarāya"; at midnight the deity is bathed in streams of gudha, ghṛta, and kṣīra with Vedic mantras. The annual observance of Janmāṣṭamī protects the devotee from the punnamā-naraka and grants entry into Goloka.