అగ్ని మహా పురాణము

202 - అథ పుష్పాధ్యాయ కథనమ్.

అగ్ని రువాచః-

పుష్పం శ్రేష్ఠం మాలతీ చ తమాలో భుక్తిముక్తిమాన్

మల్లికా సర్వపాపఘ్ని యూథికా విష్ణులోకదా.

అతిముక్తమయం తద్వత్ పాటలా విష్ణులోకదా

కరవీరై ర్విష్ణులో కే జపాపుష్పైశ్చ పుణ్యవాన్.

పావనీ కుబ్జకాద్యైశ్చ తగరై ర్విష్ణులోక భాక్

కర్ణికారై ర్విష్ణులోకః కురుణ్ణిః పాపనాశనమ్.

పదైశ్చ కేతకీభిశ్చ కున్దపు షైః పరా గతిః

బాణపు ష్పైర్బర్బరాభిః కృష్ణాభిర్ఘ రిలోక భాక్.

అశో క్రైస్తిలకై స్త ద్వద్వటరూషభవై స్తథా

ముక్తి భారీ బిల్వపత్రైః శమీపతైః పరాగతిః.

విష్ణులోకీ భృజరాజై సమాలస్య దలై స్తథా

తులసీ కృష్ణగౌరాఖ్యా కహారోత్పలకాని చ.

పద్మం కోకనదం పుణ్యం శతాబ్దమాలయా హరిః

నీపార్జనక దమైశ్చ బకులై శ్చ సుగన్దిభి.

కింశుకైర్మునిపుష్పైస్తు గోక ధైర్నా గకర్ణ కైః

సన్గ్యాపుష్పైరిల్వత కైరక్తానీ కేతకీభవై కి.

కూష్మాణతిమిరోతైశ్చ కుశ కాశశరోద్భవైః

ద్యూతాదిభిర్మరువకైః పతైరన్యైః సుగర్ఘకైః.

భుక్తి ర్ముక్తిః  పాపహానిగ్భక్త్యా సర్వైస్తు తుష్యతి

స్వర్ణలక్షాధికం పుష్పం మాలాకోటిగుణాధికా.

అగ్ని దేవుడు పలికెను : శ్రీమహావిష్ణువు పుష్ప-గంధ-ధూప-దీప-నైవేద్యముల సమర్పణచే ప్రసన్ను డగును. శ్రీ మహావిష్ణువునకు సమర్పింప యోగ్యములు, ఆయోగ్యములు అయిన పుష్పములను గూర్చి చెప్పెదను. మాలతీ పుష్పము పూజకు అత్యుత్తమము. తమాలపుష్పము భోగమోక్షప్రదము. మల్లికాపుష్పము సమ స్తపాపనాశకము. యూథిక విష్ణులోకమునిచ్చును. అతిముక్తకలో ధ్రపుష్పములు విష్ణులోక ప్రాప్తి హేతువులు. కరవీరపుష్పములతో పూజించువాడు విష్ణులోకమును చేరును. జపాపుష్పములు పుణ్యప్రదములు. పావ స్త్రీ - కుబ్జక - తగరపుష్పమాలు విష్ణులోకము నిచ్చును. కర్ణికారపుష్పపూజ చేయువాడు వైకుంఠము చేరును. కురంటపుష్పపూజ పాపవినాశ కము. కమల - కుంద - కేతకీ పుష్పములు పరమగతినిచ్చును. బాణపుష్ప - కృష్ణతులసీ పత్రములతో పూజచేయువాడు - విష్ణులోకమును పొందును. ఆశోక - తిలక - ఆటరూషపుష్పములచే పూజించువాడు మోక్షాధికారి యగును. బిల్వ - శమీపత్రములచే పరమగతి సులభము. తమాలదలములతోను, భృంగరాజముతోను పూజచేయువాడు విష్ణులోక నివాసి యగును. కృష్ణతులసీ - శుక్ల తులసి - కల్హార - ఉత్పల - పద్మ - కోకనదపుష్పములు  పుణ్యప్రదములు. నూరుక మలముల మాల సమర్పించినచో శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును. నీప-అర్జున - కదంబ - కింశుక - ఆగ స్త్య - గోకర్ణ - నాగకర్ణ - సంధ్యాపుష్పి బిల్వాతక - రంజనీ - కేతకీ - కూష్మాండ - గ్రామకర్కటి - కుశ - కా - ద్యూత - విభీతక - మరువ కాదిపత్రములతోను, ఇతరమైన సుగంధిపత్రములతోను పూజ చేసినచో శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును. వీటితో పూజించిన వాడు పాపవిముక్తుడై భుక్తిముక్తులను పొందును. లక్షస్వర్ణములకంటె గూడ కోట్ల రెట్లు పుష్పములు ఉత్తములు. తన ఉద్యానవనమునుండియు, ఇతరుల ఉద్యానములనుండియు తెచ్చిన పుష్పములకంటె వన్యపుష్పములకు మూడు రెట్లు ఫల మధిక మని చెప్పబడినది.

విశీర్ణైర్నార్చయేద్విష్ణుం నాధికా జ్గైర్న మోటితైః.

కాఞ్చనారై ప్రథోన్మ తైర్గికర్ణిక యా తథా

కుటజై  శాల్మలీయైశ్చ శిరీ షెర్నరకాదికమ్.

సుగత్తెర్బహ్మపద్మేశ్చ పుష్పైర్నీ లోత్పలైర్ఘ రి

ఆర్క మన్దార ధుస్తూర కుసుమైరర్చ్యతే హరః.

కుటజై కర్కటీపు ష్పైకి కేతకీం న శివే దదేత్

కూష్మా ఇనిమ్బసమ్భూతం వైశాచం గన్తవర్జితమ్.

అహింసా చేశొయజయః షో నిర్జానం దయాశ్రుతమ్

భావాష్టపు షైః సంపూజ్య దేవాన్స్యాద్భు క్రిము క్తిఱక్ .

అహింసా ప్రథమం పుష్పం పుష్పమిస్ట్రియనిగ్రహః

సర్వపుష్పం దయా భూతే పుష్పం శా నిర్విశిష్యతే.

శమః పుష్పం తపః పుష్పం ధ్యానం పుష్పం చ సప్తమమ్

సత్యం చైవాష్టమం పుష్ప మేలై స్తుష్యతి కేశవః.

ఏతై రేవాష్టభిః పుష్పైస్తుష్యత్యేవార్చితో హరిః

పుష్పా నరాణి సన్యత్ర బాహ్యాని మనుజో శ్రమ.

భక్త్యా దయాన్వితై ర్విష్ణుః పూజితః పరితుష్యతి

దారుణం సలిలం పుష్పం సౌమ్యం ఘృతపయోదధి.

ప్రాజాపత్యం తదాన్నా ది హ్యాగ్నేయం ధూపదీపకమ్

ఫలపుష్పాదికం చైవ వానస్పత్యం తు పశ్చిమమ్.

పార్థివం కుశ మూలాద్యం వాయవ్యం గస్థచన్దనమ్

శ్రద్ధాఖ్యం విష్ణుపుష్పం చ సర్వదా చాష్టపుష్పికా.

ఆసనం మూ ర్తిపఞ్చాజ్గం విష్ణుర్వా చాష్ట్రపుష్పితా

విష్ణోస్తు వాసుదేవాద్యైరీశానాద్యైః శివస్య వా.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే పుష్పాధ్యాయో నామ ద్వ్యధిక ద్విశతతమోధ్యాయః.

రాలిన పూవులతోను, అధిక మైన అవయవములు గలవాటితోను, నలిగిపోయినవాడొతోను శ్రీమహావిష్ణువును పూజించరాదు. కాంచనార ఉన్మత్త - గిరికర్ణికా - కుటజ - కార్మిలి - శిరీషపుష్పములతో విష్ణువును పూజించరాదు. వీటితో శ్రీమహావిష్ణువును పూజించువాడు నరకము చెందును. సుగంధము గల రక్త కమలముతోను, నీలకమలములతోను శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఆర్కే - మందార - ధుస్తూరకుసుమముతో శివుని పూజించవలెను. కాని కుటజ - కర్కటి - కేతకీపుష్పములతో శివుని పూజింపగూడదు. కూష్మాండ - నింబపుష్పములును, గధహీనము లగు ఇతర పుష్పములును పైశాచము అని చెప్పబడుచున్నవి. అహింస, ఇంద్రియజయము, ఓర్పు, జ్ఞానము, దయ, స్వాధ్యాయము మొదలగు ఎనిమిది భావపుష్పములచే దేవతలను పూజించు మానవుడు భుక్తిముక్తి . పొతుం డగును. వీటిలో అహింస మొదటి పుష్పము. ఇంద్రియ నిగ్రహము రెండవది. సకలప్రాణుల పై దయ మూడవ పుష్పము. ఓర్పు నాల్గవడగు శ్రేష్టపుష్పము. ఈ విధముగ శమ - తపోధ్యానములు పంచమ - షష్ఠ - సప్త మ పుష్పములు. సత్యము ఎనిమిదవ పుష్పము. వీటితో పూజించినచో భగవంతుడు ప్రసన్ను డగును; సంతసించును. నరశ్రేష్ఠా! ఇతర పుష్పములు పూజకు బాహ్యోపకరణములు మాత్రమే. శ్రీమహావిష్ణువు భక్తిదయాసమన్వితము లగు భావపుష్పములతో పూజించినచో సంతుష్టు డగును. జలము దారుణ పుష్పము. మృత-దుగ్గ-దధులు సౌమ్యపుష్పములు. అన్నాదులు ప్రాజాపత్య పుష్పములు, ధూపదీపములు అగ్నేయపుష్పములు. వలపుష్పాదులు వానస్పత్యపుష్పములు. శ్రద్ధాదిభావములు వైష్ణవకుసుమములు. ఈ అష్ట విధకుసుమములు సర్వకామప్రదములు. ఆసనము (యోగ పీఠము) పంచాంగన్యాసము, అష్ట పుష్పము . ఇవి విష్ణురూపములు. ఈ అష్ట పుష్పములచే పూజితుడై శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును. ఇవి కాక వాసుదేవాది నామములతో శ్రీమహష్ణువును, ఈశానాదినామ వుష్పములతో శివుని పూజించవలెను.

ఆగ్ని మహాపురాణము నందు పుష్పాధ్యాయ మను రెండువందలరెండవ అధ్యాయము సనూప్తము.