పుష్కర ఉవాచః
దండప్రణయనం వక్ష్యే యేనరాజ్ఞః పరాగతిః ।
త్రియవం కృష్ణలం విద్ధి మాష స్తత్ప ఞ్చకంభ వేత్.
కృష్ణలానాం తథాషష్ట్యాకర్షార్థం రామకీర్తితమ్ ।
సువర్ణశ్చ వినిర్దిష్ణో రామ షోడశమాషకః.
నిష్కః సువర్ణాశ్చత్వారో ధరణం దశభిస్తుతైః ।
తామ్రరూవ్య సువర్ణానాం మానమేత త్ప్రకీర్తితమ్.
పుష్కరుడు పలికెను : రామా! రాజుకు ఉత్తమగతినిచ్చు దండ నీతిప్రయోగమును గూర్చి చేప్పెడను. మూడు యవలు ఒక కృష్ణలము ఐదుకృష్ణలములు ఒక మాషము ఆరవది కృష్ణలములు ఆర్ధకర్షము. పదునారు మాషములు. ఒక సువర్ణము. నాలుగు సువర్ణమాలు ఒక నిష్కము. పది నిష్కములు ఒక ధరణము. ఇవి రాగి, వెండి, బంగారము తూచుమానములు.
తామ్రికైః కార్షికో రామప్రోక్తః కర్షాపణోబుధైః ।
పణానాంద్వేశ తేసార్ధం ప్రథమః సాహసఃస్మృతః.
మధ్యమః పంచవిజ్ఞేయః సహస్రమపిచోత్తమః।
చోరైరమూషితో యస్తు మూషితోఽస్మిత్రిభాషలే.
తత్ప్రదాతంరి భూపాలే నదండ్యస్తావదేవతు ।
యోయావద్విపరీతార్ధం మిత్యాయోవదేత్తుతమ్.
తౌ నృపేణహ్యధర్మజ్ఞౌ దాప్యౌ తద్ద్విగుణం దమమ్ ।
కూటసాక్ష్యం తు కుర్వాణాం స్త్రీన్వర్ణాంశ్చ ప్రదాయేత్.
వివాసయే ద్బ్రాహ్మణం తు భోజ్యోవిధిర్న హీరితః ।
నిక్షేపస్య సమం మూల్యం దండ్యోనిక్షేపభుక్తథా.
వస్త్రాదికస్య ధర్మజ్ఞ తథాధర్మో న హీయతే ।
యో నిక్షేపం మాతయతి యశ్చానిక్ష్మీవ్యయాచతే.
తావుభౌ చౌరవచ్ఛాస్యౌ దండ్యౌవాద్విగుణందమమ్ ।
అజ్ఞానాద్యః పుమాన్ కుర్యాత్పర ద్రవ్యస్యవిక్రయమ్.
నిర్దోషో జ్ఞానపూర్వం తు చౌరవద్దండ మర్హతి ।
మూల్యమాదాయ యః శిల్పం నదద్యాద్ధండఏవసః.
ప్రతిశ్రుత్యాప్రదాతారం సువర్ణం దండ యేన్నృపః ।
భృతిం గృహ్యనకుర్యాద్యః కర్మాష్టౌ కృష్ణలాదమః.
అకాలేతు త్యజన్భృత్యం దండ్యఃస్యాత్తావ దేవతు ।
క్రీత్వా విక్రయవా కించిద్య స్యేహానుశ యోభవేత్.
సోంఽతర్దశాహాత్తత్స్యామీ దద్యాచ్చై వాదదీతచ ।
పరేణతు దశావహస్య నాదద్యాన్నైవ దాపయేత్.
పరశురామా! ఒక తామ్రకర్షమునకు విద్వాంసులు “కార్షికము” కార్షాపణము అని పేరు పెట్టినారు. రెండువందల ఏబది పణముల దండమునకు ప్రథమసాహసడండమని పేరు. ఐదువందల పణములదండము మధ్యమసాహసము. వెయ్యి పణములదండము ఉత్త మసాహసము. చోరుడు తన ధనమును అపహరించకపో నను అపహరించినట్లు అసత్యముగా రాజుతో చెప్పి రాజునుంచి అపహరించిన ధనమును పొందుటకై ఎవ్వడై న ప్రయత్నించినపుడు ఆతడు అసత్యము చెప్పినట్లు నిర్ధారణ మైనచో అట్లు అసత్యము చెప్పినవానినుండి అంతధనమును దండముగా గ్రహించవలెను. దొంగతనమునందు పోయిన ధనము నకు బదుగా ఎక్కువగా ఎవడై న చెప్పినచో ఆతనినుండియు, ఎంత ఆసత్యముగాచేప్పునో వానినుండియురాజు రెట్టింపు ధనము దండరూపమున వసూలు చేయవలెను; ఎందుచేతననగా వారిరువురును ధర్మమును పాటించలేదు. కపటసాక్ష్యము చెప్పు క్షత్రియ - వైశ్య - శూద్రులను కఠినముగా శిక్షించవలెను. బ్రాహ్మణుని మాత్రము రాజ్యమునుండి వెడలగొట్టవలేను అతనికి మరొక దండమేదియు విధింపబడలేదు. ఓధర్మజ్ఞా! కుదువబెట్టిన దానిని అపహరించినవానినుండి కుదువబెట్టిన వస్తాదులమూల్యమెంతయుండునో అంత దండరూపమున అపహరించినచో ధర్మహాని కలుగదు. కుదువబెట్టినదానిని పోగొట్టినవానిని, కుదువబెట్టకుండగనే వస్తువునిమ్మని అడుగువానినికూడ దొంగనువలె శిక్షించవలెను లేదా రెట్టింపు ధనమును దండముగా వసూలు చేయవలెను. ఎవ్వడై న ఇతరుల వస్తువును తెలియక ,ఆమ్మి వేసినను. ఆతడు నిర్దోషిగ పరిగణింపబడును. కాని తెలిసి ఇతరుల వస్తువులను తన వస్తువులని చెప్పి ఆమ్మినవానిని దొంగనువలె శిక్షించవలేను. ఇచ్చెదనని చెప్పి ఇవ్వని వానిని రాజు. ఒక సువర్ణము దండించవలెను. కూలి తీసుకొని పనిచేయనివానిపై ఎనిమిది కృష్ణలములు జుర్మానా వేయవలెను. ఆసమయమునందు భృత్యుని విడచివేయువాని పై కూడ అంతచండమే వేయవలెను. ఏదైన ఒక వస్తువును కొన్న తరవాతగాని.. అమ్మి నతర వాతగాని పశ్చాత్తాపము కలిగినచో ఆమ్మినవాడు పదిరోజులలోగా ఆమూల్యమ తిరిగిఇచ్చివేసి వస్తువును మరల తీసికొనవచ్చును. కొన్న వాడు, వస్తువును తిరిగి ఇచ్చి వేసి తన ధనమును పొంద వచ్చును. పదిదినములు దాటినచో ఈ. ఆదానప్రదానములు కుదరవు. అనుచితములగు ఆదానప్రదానములు చేయువారిని రాజు ఆరువందలుదండము వేయవచ్చును.
ఆదదద్ది దదచ్చైవ రాజ్ఞాదండ్యః శతానిషట్।
పరే దోషానవిఖ్యావ్యయః కన్యాం వరయేదిహ.
దత్తాప్యదత్తా సాతస్యరాజ్ఞాదండ్యః శతద్వయమ్ ।
ప్రదాయకన్యాం యోఽన్య స్మై పునస్తాం సంప్రయచ్ఛతి.
దండః కార్యో నరేంద్రేణ తస్యాప్యు త్తమసాహసః ।
నత్యఙ్కా రేణ వాచా చ యుక్తం శుణ్యమసంశయమ్.
లుబ్ధోఽన్యత్ర చ విక్రేతా షట్ఛతం దండమర్హతి ।
దద్యాద్దేనుం నయఃపాలో గృహీత్వా భక్త వేతనమ్.
సతుదండ్యః శతం రాజ్ఞాసువర్ణంవాప్యర క్షితా ।
ధనుః శతం పరీడాహో గ్రామస్యతు సమ న్తత.
ద్విగుణం త్రిగుణం వాపి నగరస్య చ కల్పయేత్ ।
వృతిం తత్ర ప్రకుర్వీత యాముష్ట్రోనావలోక యేత్.
తత్రాపరివృతేధాన్యే హింసితే నై వదండనమ్ ।
గృహం తటాక మా రామం క్షేత్రం వా భీషయాహరన్.
శతాని పంచ దండ్యః స్యాదజ్ఞాన్వాశతీ నమః ।
మర్యాదాభేదకాః సర్వేదండ్యాః ప్రథమహసాహసమ్.
శతం బ్రాహ్మణమా కుక్య శత్రియే దండమ రతి ।
వైశ్యశ్చ ద్విశతం రామ శూద్రశ్చ వధమర్హతి.
పంచాశద్ర్భోహ్మణో దంత్యః క్షత్రియస్వాభిశంసనే ।
వైశ్య వాప్వర్ధ పంచాశచ్చూదే ద్వాదశ జో దమః.
క్షత్రియ స్యాప్నుయాద్వైశ్యః సాహసం పూర్వ మేవతు ।
శూద్రః క్షత్రియమాక్రుశ్వజిహ్వా చ్చేదనమాప్నుయాత్ .
ధర్మోపదేశం విప్రాణాం శూద్రః కుర్వంశ్చ దండభాక్ ।
శ్రుతదేశాదివితథదాప్యో ద్విగుణసాహసమ్.
ఉత్తమః సాహన స్తస్యయః పావైరు మాన్షి పేత్ ।
ప్రమాదాద్యైర్మయా ప్రోక్తం ప్రీత్యాదండార్దమర్హతి.
మాతరం పితరం జ్యేష్ఠం ధాతరం శ్వశురం గురుమ్ ।
ఆకారయ్ఛతం దం వ్యకి పంథానం చాదదద్దురోః.
అంత్యజాతిర్ద్విజాతింతు యే నాఙ్గేనా పరాధ్నుయాత్ ।
తదేవ ఛేదయేత్తస్య క్షిప్రమేవావిచారయన్.
అవనిష్ఠీవతో దర్పాద్ద్వావోష్ఠౌ ఛేదయేన్నృపః ।
అపమూత్రమతో మేడ్రమపశబ్దయతో గుదమ్.
ఉత్కృష్టాసన సంస్థస్య నీచస్యాదో నికృన్తపమ్ ।
యా యద జం చ రుజయే త్తదఙ్గం తస్యకర్తయేత్.
అర్ధపాదకరాః కార్యాగోగజాశ్వోష్ట్రమాతకాః ।
వృక్షంతు విఫలం కృత్వా సువర్ణం దండమ ర్హతి.
ద్విగుణం దాపయేచ్ఛిన్నే పథిసీమ్ని జలాశయే ।
ద్రవ్యాణి యో హరేద్యస్య జ్ఞానతోఽజ్ఞానతోఽపివా.
స తస్యోత్పాద్య తుష్టింతు రాజ్ఞేదద్యాత్తతో దమమ్ ।
యస్తు రజ్జుం ఘటం కూపాద్ధరేచ్ఛిన్ద్యాచ్చతాం ప్రపామ్.
పరునిలో ఉన్న దోషములను చెప్పక కన్యావరణము చేసినవానికి కన్యక నిచ్చెదమని మాట ఇచ్చినను ఇవ్వనట్లే ఆగును. రాజు ఆట్టి దాని పై రెండు వందల దండము విధించవలేను. కన్యను ఒకనికిచ్చేదనని మాట ఇచ్చి మరొకనికి ఇచ్చిన వానిపై ఉత్త మసాహస దండము విధించవలెను. నోటితో చెప్పిన దానిని కార్యరూపమాన చేసినచో తప్పక పుణ్యము లభించును. ఏదైన ఒక వస్తువున ఒకచోట ఇచ్చెదనని చెప్పి లోభముచే మరొకరికి అమ్మినవానికి ఆరు వందల దండము. యజమాని నుండి భోజనవ్యయము, జీతము తీసికొని కూడ ఆతని ఆవున ఆతనికి అప్పగించని లేదా ఆవును పోషించని గొల్ల దానిని నూడసువర్ణములచే దండించవలెను. గ్రామమునకు నలువైపుల నూరు ధనుస్సుల పరిధి యందును, వగరమునకు రెండు వందల థనుస్పుల పరిధి యందును వ్యవసాయము చేయవలెను. ఆది నిలచి ఉన్న ఒంటెకు కనబడనంతదూరమున ఉండవలెను. కంచెలేని చేనులోని సస్యమవకు ఎవరినుండియైన హాని కల్గిన ఆతనిని దండించరాదు. ఇతరులను భయ పెట్టి, వాని ఇళ్లు, చెరువులు, తోటలు, పొలములు కాజేయ ప్రయత్నించు వారికి ఐదువందల దండము. ఆతడు తెలియక చేసినచో రెండు వందలు మాత్రమే దండము. సరిహద్దులు మార్చివేయ వారికి ప్రథమ సాహసదండము.
వదండం ప్రాప్ను యాన్మాసం దండ్యః స్యాత్ప్రాజితాడనే ।
ధాన్యం దశభ్యః కుంభేభ్యో హరతోఽభ్యధికం వధః.
శేషేఽ ప్యేకాదశగుణం తస్య దండం ప్రకల్పయేత్ ।
సువర్ణ రజతాదీనాం నృస్త్రీణాం హరణేవధః.
యేనయేన యథాఙ్గేన స్తేనోన్నషు విచేష్టతే ।
తత్తదేవ హరేదస్య ప్రత్యాదేశాయ పార్థివః.
బ్రాహ్మణః శాక ధాన్యాది హ్యల్పం గృహ్ణన్న దోష భాక్ ।
గోదేవార్ధ హరంశ్చాపి హన్యాద్దుష్టం వధోద్యతమ్.
గృహక్షేత్రప హర్తారం తథా పత్న్యబిగామినమ్ ।
ఆగ్నిదం గరదం హన్యాత్తథా చాభ్యుద్యతాయుధమ్.
పరశురామా ! బ్రాహ్మణుని అవమానించు క్షత్రియునకు నూరు, వైశ్యునకు రెండువందలు జర్మాన విధించవలెను; శూద్రుని కారాగారములో నుంచవలెను. బ్రాహ్మణుడు, క్షత్రియుని పై దోషారోపణము చేసినచో ఏబది, వైశ్యుని పై చేసినచో ఇరువదియైదు, శూద్రుని పై చేసినచో పండ్రెండు దండము. వైశ్యడు క్షత్రియుని అవమానించినచో ప్రథమసాహసడండమా. శూద్రుడు క్షత్రియుని తిట్టినచో ఆతని నాలుకకు శిక్ష ఇవ్వవలెను. బ్రాహ్మణునకు ఉపదేశము చేయు శూద్రుడు కూడ దండార్హుడు. అసత్యముగా తన దేశ మును గూర్చి, శాస్త్రజ్ఞానమును గూర్చి అసత్యము చెప్పువానికి రెట్టింపు సాహసదండము. శ్రేష్ట పురుషులను గూర్చి వారు పాపాచారవంతులని చేప్పి నిందించు వానికి ఉత్తమ సాహసదండము. “నేను పొరబాటున ఇట్లు చెప్పినాను” అని ఆనుచు అతడు ప్రేమను ప్రకటించినచో సగ ము దండము. తలిదండ్రులు, అన్న, మామ, గరువు వీరిపై నిందారోపము చేయువానికిని పెద్ద వారికి దారి ఇవ్వనివానికిని, నూరు దండము. ఒకడు. తన ఏ అవయవముచే, పెద్దవారి విషయమున అపరాధము చేయునో ఆతని ఆ ఆవయవమును నిస్సందేహముగ వెంటనే ఖండించి వేయవలెను. గర్వాంధుడై ఉత్త మపురుషుని వైపు ఉమ్మి వేసిన వాని పెదవులు ఖండించివేయవలెను. అట్లే ఉత్తమ పురుషుని వైపు తిరిగి మూత్రము పోయువానీ రంగమును, అతని వైపు దృష్టము పెట్టి, అపానశబ్దము చేయువాని - గుదమును ఛేదించవలెను. ఉన్నతాసనముపై కూర్చున్న నీచుని శరీరము క్రింది భాగమునందు దండము ఇవ్వవలెను. ఒకడు ఇతరుల ఏ అవయవమును గాయపరచునో ఆతని ఆ అవయవమును ఖండించి వేయవలెను. గోవు, ఏనుగు, అశ్వఘు, ఒంటె ఏటికి హాని కలిగించువాని సగము చేతులు సగము కాళ్ళు ఖండించి వేయవలెను. ఇతరుల వృక్ష ముల పండ్లు కోసినవానికి ఒక సువర్ణము దండము. మార్గమును, పొలము సరిహద్దును, జలాశ యాదికమును ఖండించి నష్టము కలు చేసిన దానికి ఎంతనష్టము కలిగినదో దానికి రెట్టింపు దండము. తెసికొని, తెలియక కాని ఇతరుల ధనము అపహరించిన వాడు ముందు ఆతని కాధసము తిరిగి ఇచ్చి వేసి, ఆతనిని సంతోష పెట్టవలెను. పిమ్మట రాజుకు కూడ జర్మానా చెల్లించవలెను. నూతి నుండి ఇతరుల త్రాడు, పాత్ర, ఆపహరించిన వాని కిని, చలివెందలి పాడు చేసిన వానికిని ఒక మాసముకై దు శిక్ష. ప్రాణులను చంపిన వానికి గూడ ఇదియే శిక్ష. పది మటముల ధాన్యమునకు మించిన ధాన్యమును అపహరించిన పోనికి ప్రాణదండమ. పది ఘటముల లోపు ధాన్యము అపహరించిన వానికి ఎస్నీ ఘటములు అపహరించబడినవో వాటికి పండ్రెండు రెట్లు దండము. బంగారమును, వెండిని, స్త్రీలను, పురుషులను అపహరించిన వానికి మరణదండము. చౌరుడు ఏ ఏ అవయవములతో మనుషులకు ప్రతి కూలముగ ప్రవర్తించునో ఆయా అవయవములను నిర్దాక్షిణ్యముగ ఖండించవలెను. ఇట్లు చేయుటచే చోరులకు బుద్ది వచ్చును. బ్రాహ్మణుడు చాల కొంచెము కాక మును, ధాన్యమును గ్రహించినచో ఆతడు దోషి కాడు. గో సేవ కొరకును, దేవపూజ కొరకును ఏదై న వస్తువును తీసికొనిన బ్రాహ్మణుడు కూడ దండ్యుడు కాడు. ఎవరినై న చంపనుద్యమించు దుష్టుని వధించవలెను. ఇతరుల గృహమేత్రముల నపహరించిన వానికిని, పరభార్యాసంగము చేసినవానికిని, ఇంటికి నిప్పు అంటించిన వానికిని, విషము పెట్టిన వానికిని, ఆయుధముతో చంపుటకై వచ్చిన వానికిని మరణదండన తగినది.
రాజాగవాభిచారాద్యం హన్యాచ్చైవాతతాయినః ।
వరస్త్రియం న భాషేత ప్రతిషిద్ధోవిశేన్నహి.
అదండ్యాస్త్రీ భవేద్రాజ్ఞా వరయ న్ తీపతిం స్వయమ్ ।
ఉత్తమాం సేవమానః స్త్రీం జఘన్యోవధమర్హతి.
భర్తారం లంమయేద్యాతాం శ్వభిః నంఘాత యేత్త్స్రియమ్।
సవర్ణదూషితాం కుర్యాత్పిండ మాత్రోప జీవినీమ్.
జ్యాయసా దూషితా నారీ ముండనం సమవాప్నుయాత్ ।
వైశ్యాగమే తు విప్రస్య క్షత్రియస్యా న్ త్యజాగమే.
క్షత్రియః ప్రథమం వైశ్యో దండ్యః శూద్రాగమే భవేత్ ।
గృహీత్వా వేతనం వేశ్యా లోభాదన్యత్రగచ్చతి.
వేతనం ద్విగుణం దద్యాద్దండం చ ద్విగుణం తథా ।
భార్యా పుత్రాశ్చ దాసాశ్చ శిష్యో భ్రాతా చ సోదరః.
కృతాపరాధాస్తాడ్యాః స్యూరజ్జ్వా వేణుదలేనవా ।
పృష్ఠేన మస్తకే హన్యా చ్చౌరస్యాప్నోతి కిల్బిషమ్.
గోవులను చలపిన వానిని, అతతాయులను రాజు వధించవలెను. పరస్త్రీతో సంభాషణము చేయరాదు. వలదన్న ఇతరుల ఇండ్లలోనికి పోరాదు. స్వేచ్ఛానుసారము పని వరించు శ్రీ రాజుచే దండ్యురాలు కాదు. కాని నీచవర్ణ పురుషుడు ఉచ్చపర్ణశ్రీ, సమాగమము చేసినచో ఆతడు వధ్యుడు. తన భర్తను కాదని వ్యభిచరించిశ స్త్రీని కుక్కలచే కరిపించవలెను. సజాతీయుడగు పరపురుషునిచే దూషితురాలగు స్త్రీకి బ్రతుకుటకు మాత్రము అన్నము పెట్టవలెను. భర్త అన్న గారితో వ్యభిచరించిన శ్రీ తలగొరిగించవలేను. బ్రాహ్మణుడు వైశ్య స్త్రీ తోడను, క్షత్రియుడు నీచజాతిస్త్రీ తోడను సమాగమము చేసినచో వారికి కూడ ఇదియే దండము. శూద్ర స్త్రీతో వ్యభిచరించిన క్షత్రియ వైశ్యులకు ప్రథమ సాహసదండము. వేశ్యాస్త్రీ ఒకని నుండి వేతనము తీసికొని, లోభముచే మరొక నితో వెళ్ళినచో ఆమె రెట్టింపు వేతనము తిరిగి ఇచ్చివేసి, రెట్టింపు దండముగా చెల్లించవలేను. స్త్రీ, పుత్రుడు, దాసుడు, శిష్యుడు, సహోదరుడు మొదలగు వారు అపరాధము చేసినచో వారిని త్రాటితో గాని, వెదురు బెత్తముతోగాని కొట్టవలెను. వీపుమీదనే కొట్టవలేను కాని తలపై కొట్టకూడదు. తలపై కొట్టువానిని చోరుని దండించినట్లు దండించవలెను.
రక్షాస్వధికృతైర్యస్తు ప్రజాభ్యోర్థో విలుప్యతే ।
తేషాం సర్వస్వమాదాయ రాజా కుర్యాత్ప్రవాసనమ్.
యేనియుక్తాః స్వకార్యేషు మాన్యుః కార్వాణికరిణామ్ ।
నిర్ఘృణాః క్రూర మనస్తాన్నిః స్వాన్కారయేన్నృప.
అమాత్యః ప్రాడ్వి వాకో వా యః కుర్యాత్కార్యమన్యథా।
తస్య సర్వస్య మాదాయ తం రాజావిప్రవాసయేత్ .
గురుతల్పే భగః కార్యః సురాపానే సురాధ్వజః ।
స్తేయేషు శ్వపదం విద్యాద్బ్రహ్మహత్యాశిరఃపుమాన్.
శూద్రాదీన్ ఘాతయేద్రాజా పాపాన్విప్రాన్ప్రవాసయేత్ ।
మహాపాతకినాం విత్తం వరుణాయోపపాదయేత్.
గ్రామేష్వపి చ యేకేచిచ్చౌరాణాం భక్తదాయకాః ।
భాండార కోశ దాశ్చైవ సర్వాంస్తానపి ఘాతయేత్ .
రాష్ట్రేషు రాష్ట్రాధి కృతాన్సామంతానాపినో హరేత్ ।
సంధిం కృత్వా తు యే చౌర్యం రాత్రౌకుర్వంతి తస్కరాః.
తేషాం ఛిత్త్వా నృపో హస్తౌతీక్ష్ణే శూలేని వేశయేత్ ।
తటాక దేవతా గార భేదకాన్ఘాతయేన్నృపః.
సముత్సృజేద్రాజమార్గే య స్త్వమేధ్యమనాపది ।
సహికార్షాపణం దండ్యస్త మమేద్యం చ శోధయేత్.
ప్రతిమాసం క్రమభిదోదద్యుః పంచశతాని తే ।
సమైశ్చ విషమం యో వా చర తే మూల్యతోఽపివా.
నమాప్నుయాన్నరః పూర్వం దమం మధ్యమమేవవా ।
ద్రవ్యమాదాయ వణిజామన ర్ఘేణావరుంధతామ్.
రాజాపృథక్పృథక్ కుర్యాద్దండముత్తమసాహసమ్ ।
ద్రవ్యాణాం దూషకోయశ్చ ప్రతిచ్ఛన్దక విక్రయీ.
మధ్యమం ప్రాప్నుయాద్దండం కూటకర్తా తథోత్తమమ్ ।
కలహాపకృతం దేయం దండశ్చ ద్విగుణ స్తతః.
అతక్ష్యభక్ష్యే విప్రేవా శూద్రేవా కృష్ణలోదమః ।
తులాశాసనకర్తాచ కూట కృన్నాశకస్య చ.
ఏభిశ్చ వ్యవహర్తాయః సదాప్యో దమముత్తమమ్ ।
విషాగ్నిదాం ప్రతిగురు విప్రపత్య ప్రమాపిణీమ్.
వికర్ణకరనాసౌష్టిం కృత్వా గోభిః ప్రవాసయేత్ ।
క్షేత్ర వేశ్మగ్రామవనవిదారశా స్తథా నరాః.
రాజపత్న్యభిగామీ తలనర్ధ్యస్తు కటాగ్నినా ।
ఊనం వాప్యధిక వాపి లిఖేద్యోరాజశాసనమ్.
పార జాయిక చౌరౌ చ ముఞ్చతో దండ ఉత్తమః ।
రాజయానాసనారోఢుర్దండ ఉత్తమ సాహసః.
యో మన్యేతాజితోఽ స్మీతిన్యాయేనాపి పరాజితః ।
తమాయాన్తం పరాజిత్య దండయేద్ద్విగుణం దమమ్ .
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే దండప్రణయనం నామ సప్తవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
రక్షాకార్యనియుక్తుడై ప్రజలసొమ్ము దోచుకొను వాని సర్వస్వము లాగికొని రాజ్యము నుండి వెడల గొట్టవలెను. ఎవరిచేతనైన ఒక పని చేయుటకై నియుక్తుడై ఆకార్యము పాడు చేసిన క్రూరుని సర్వస్వమును లాగివేయవలెను. మంత్రి గాని, న్యాయాధీశుడు గాని, స్వకర్తవ్యమునకు భిన్నముగ చేసినచో వాని సర్వస్వమును లాగికొని రాజ్యము నుండి, ఎడల గొట్టవలెను. గురుపత్నీ గమనము చేసిన వాని శరీరము మీద భగచిహ్నము వేయవలెను. సురాపానము చేసిన మహా పాపాత్ముని శరీరము మీద కల్లు దుకాణం జండా గుర్తు వేయవలెను. దొంగతనము చేసిన వాని శరీరము పై కుక్క గోళ్ళ గుర్తు వేయవలెను. బ్రహ్మహత్య చేసినవాని లలాటము మీద కపాలచిహ్నము వేయవలెను. రాజు పాపాత్ములను వధించి వేయవలెను. బ్రాహ్మణులైనచో దేశము నుండి వెడలగొట్టవలెను. మహాపాతకుల ధనమును వరుణునకు సమర్పించవలెను. (నీటిలో పారవేయవలెను). గ్రామానిలో చోరులకు భోజనము పెట్టి, దొంగిలించిన సొమ్ము దాచుకొనుటకు ఇల్లు ఇచ్చిన వారి నందరిని వధించవలెను. తన రాజ్యమునందు ఏదైన అధికారమునందు నియుక్తులై న సామంతరాజులు పాపము చేసినచో, రాజు వారిని అధికారము నుడి తొలగించవలెను. కన్నము త్రవ్వి దొంగతనము చేయువాని చేతులు నరికి, తీక్షమగు శూలముపై ఎక్కించవలెను. సరస్సులు, దేవ మందిరములు పాడు చేసిన వారికి గూడ ఇడ్ల మరణదండము ఇవ్వవలెను. ఆపత్సమయము కాక పోయినను, మార్గమునందు మలమూత్రాద్యపవిత్ర వస్తువులను పోయువానికి కార్షాపణ దండము విధించి, వాని చేతనే ఆ మల మూత్రాదులు ఎత్తించి శుభ్రము చేయించ వలెను. ప్రతిమలను, మెట్లను విరగగొట్టిన వానికి ఐదు వందల కర్షముల దండము. తనతో సమముగా ప్రవర్తించు వారి విషయమున విషమముగా ప్రవర్తించు వానికిని, వస్తువుల మూల్యమును చాల ఎక్కువగా పెంచివేయువానికి మధ్యమ సాహస దండమణ. వర్త కుని నుండి బహుమూల్యములగు వస్తువుల తీసికొని మూల్యమును చెల్లించని వారికి అందరికిని ఒక్కొక్కరికి ఉత్తమ సాహసదండము. మంచి వస్తువులలో చెడ్డవస్తువులు కలిపి ఇష్టము వచ్చిన ధరకు అమ్ము వర్తకునకు మధ్యమ సాహసదండము. మోసము చేయువానికి ఉత్తమసాహస దండము. కలహపూర్వకముగ అపకారము చేయు వానికి దానికి రెట్టింపు దండము. ఆభక్ష్యభుక్షణము చేయు బ్రాహ్మణునకును, శూద్రునకును ఒక కృష్ణలము దండము. తప్పుడు తూకము తూచు వానికిని, మోసగానికిని, గ్రాహకులకు నష్టము కలిగించు వానికిని, అట్టి వారితో వ్యవహారము చేయు వానికిని ఉత్తమసాహస దండము. విషము పెట్టు వానిని, ఇంటికి నిప్పు అంటించు వానిని, పతి - గురు - బ్రాహ్మణ - సంతానముల హత్య చేసిన దానిని చేతులు, ముక్కు, చెవులు, పెదవులు ఖండించి, ఎద్దు పై కూర్చుండ బెట్టి రాజ్యమునుండి వెడలగొట్టవలెను. పొలము ఇల్లు, గ్రామము, ఆడవి - వీటిని నశింపచేసిన వారిని, గడ్డితుక్కు నిప్పులో పడ వేయవలెను. రాజాజ్ఞను పెంచిగాని తగ్గించిగాని వ్రాయువానికిని, పరస్త్రీ గమనము చేసినవారిని, చోరులను శిక్షించక విడుచువానికిని ఉత్తమ సాహస దండము. రాజవాహనము పైనను, రాజాసనము పైనను కూర్చున్న హానికి గూడి ఉత్తమ సాహనదండవు. పరాజితుడైనను. ఆపరాజితుడనని చెప్పుకొనువాడు ఎదుటకు వచ్చినపుడు వానిని మరల జయించి, రెట్టింపు దండము విధించవలెను. ఆమంత్రితుడు కాని వానిని పిలచుకొనివచ్చు వాడు వధ్యుడు. దండించు పురుషుని నుండి తప్పించుకొని పారిపోవు అపరాధి పురుషార్థ విహీనుడు. ఆట్టి పిరికి వారికి శారీరకదండమునకు బదులు తన దండమును విధించవలెను.
ఆగ్ని మహాపురాణమునందు దండప్రణయన కథనమను రెండువందల ఇరువదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 227 of the Agni Purāṇa is as follows:
The Soma sacrifice, considered the king of all yajñas, is described in its essential features. Agni traces the mythological source of Soma from the moon and explains Soma's role as the ambrosia sustaining gods, ancestors, and all life. The Jyotiṣṭoma, the foundational Soma yāga, and its five modifications — Agniṣṭoma, Atyagniṣṭoma, Uktha, Ṣoḍaśī, and Atirātra — are outlined. The chapter declares that the performer of Soma yāga transcends the three worlds and attains Svarga.