ఆగ్ని రువాచః
త్వరితాంగాన్సమాఖ్యా స్యే భుక్తిముక్తి ప్రదాయకాన్ ।
ఓం ఆధారశక్త్యైనమః ।
ఓం హ్రీం (ప్రోం) పురుపురు మహాపింహాయ నమః ।
ఓం పద్మాయ నమః ।
ఓం హ్రీం హ్రూం ఖేచ ఛేక్షః ।
స్త్రీం ఓం హ్రూం క్షైం హ్రూం ఫట్ త్వరితాయై నమః ।
ఖేచ హృదయాయనమః ।
చచే శిరసే నమః ।
ఛేక్షః శిఖాయై నమః ।
క్షస్త్రీం కవచాయ నమః ।
స్త్రీం హ్రూం నేత్రాయ నమః ।
హూంఖే అస్త్రాయఫట్ నమః ।
ఓం త్వరితా విద్యాం విద్మహే తూర్ణ విద్యాచ ధీమహి ।
తన్నో దేవీ ప్రచోదయాత్ ।
శ్రీ ప్రణీతాయై నమః ।
హ్రూం కారాయై నమః ।
ఓం కారాయై నమః ।
ఓం ఖేచ హృదయాయ నమః ।
ఖేచర్యై నమః ।
ఓం చండాయై నమః ।
క్ష స్త్రీం కవచాయ నమః ।
ఛేదన్యై నమః ।
క్షేపణ్యైనమః ।
స్త్రీయై హూంకార్యైనమః ।
క్షేమం కర్యై జయాయై విజయాయై కింకరాయరక్ష ।
ఓం త్వరితాజ్ఞయా స్థిరోభవ వషట్ ।
తోతలాత్వరితా తూర్ణేత్యేవం విద్యేయ మీరితా.
శిరోభ్రూమస్తకే కంఠే హృదినాభౌచ గుహ్యకే ।
ఊర్వోశ్చ జానుజంఘోరుద్వయే చరణయోః క్రమాత్.
న్యస్తాంగో న్యస్తమంత్రస్తు సమస్తం వ్యాపకం న్యసేత్ ।
పార్వతీ శబరీ చేశా వరదా భయ హస్తికా.
మయూరవలయా పిచ్చమౌలి: కిసలయాంశుకా ।
సింహాసనస్థా మయూర బర్హ చ్ఛత్ర సమన్వితా..
త్రినేత్రాశ్యామలాదేవీ వనమాలా విభూషణా ।
విప్రాహి కర్ణాభరణా క్షత్ర కేయూర భూషణా.
వైశ్యనాగ కటీబంధా వృషలాహి కృతనూపురా ।
ఏవం రూపాత్మికా భూత్వాతన్మంత్రం నియుతంజ పేత్.
ఈశః కిరాతరూపోఽభూత్పురా గౌరీ చతాదృశీ ।
జ పేద్ధ్యాయే త్పూజయేత్తాం సర్వసిద్ధ్యే విషాదిహృత్,
అష్ట సింహాసనే పూజ్యాదలే పూర్వాది కే క్రమాత్ ।
అంగగాయత్రి ప్రణీతా హూంకారాద్యా దలాగ్ర కే.
వట్ కారీ చాగ్రతోదేవ్యాః శ్రీ బీజే నార్చయేదిమాః ।
లో కేశాయుధ వర్ణిస్తాః ఫట్ కారీతు ధనుర్ధరా.
జయాచవిజయా ద్వాః స్థే పూజ్యే సౌవర్ణయష్టి కే ।
కింకరా బర్బరీముండీ లగుడీ చ తయోర్బహిః.
ఇష్ట్యైవ సిద్ధయే ద్రవ్యైః కుండేయోన్యాకృతౌ హునేత్ ।
హేమలాభోఽర్జునేర్ధానైర్గోధూమైః పుష్టిసంపదః.
యవైర్ధాన్యైస్తిలైః సర్వసిద్ధిరీతి వినాశనమ్ ।
ఆ క్షైరున్మత్తతాశత్రోః శాల్మలిభిశ్చ మారణమ్.
జంబూభిర్ధన ధాన్యాప్తిస్తుష్టిర్నీ లోత్పలై రపి ।
రక్తాత్పలై ర్మహాపుష్టిః కుంద పుష్పైర్మహోదయః.
మల్లికాభిః పురక్షోభః కుము దై ర్జన వల్లభః ।
అశోకైః పుత్రలాభః స్యాత్పాటలాభిః శుభాంగనా.
అమ్రై రాయు స్తిలైర్లక్ష్మీర్భిల్వైః శ్రీశ్చమ కైర్ధనమ్ ।
ఇష్టం మధుక పుష్పైశ్చ బిల్వైః సర్వజ్ఞలాం లభేత్.
త్రిలక్ష జప్యా త్సర్వా ప్తిర్హోమాద్ద్యా నాత్తథేజ్యయా ।
మండఽలేభ్యర్చ్య గాయత్ర్యాఆహుతిః పంచవింశతిమ్.
దద్యాచ్ఛతత్రయం మూలాత్పల్ల వైర్ధీ క్షితోభవేత్ ।
పంచగవ్యం పురాపీత్వా చరుకం ప్రాశయేత్సదా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే త్వరితా పూజావిధి వర్ణనరనామ నవాధిక త్రిశతతమోఽధ్యాయః.
అగ్ని దేవుడు పలికెను. త్వరితవిద్య యొక్క ఆంగములు భుక్తి ముక్తి ప్రదాయకములు వాటిని చేప్పెదను. ఓం ఆధారశ క్ర్యైనమః" మొదలు "ఆస్త్రాయ ఫట్ నమః" వరకును చెప్పినవి అంగన్యాస మంత్రములు. “ఓంత్వరితా విద్యాం" మొదలు "ప్రచోదయాత్" వరకు త్వరితాగాయత్రి, పిదప పీఠమునందలి కమల కర్ణికయొక్క కేసరమునందు ఈ క్రింది ఆంగదేవతలను పూజించవలెను. - ప్రణీతాయైనమః" మొదలు “క్షేమంకర్యైనమః" వరకు మంత్రములతో ఆయా అంగ దేవతలను పూజించవలెను. త్వరితా విద్యకు తోతలా, త్వరితా తూర్ణాయని మూడు పేర్లు. దీని ఆక్షరము లను శిరోభ్రూలలాట కంఠ హృదయ, నాలి, గుహ్య ఊరు, జాను. జంఘా, చరణములపై న్యాసము చేసి సమస్త విద్యతో వ్యాపకన్యాసము చేయవలెను. ఈమెను పార్వతి శబరి ఈశ , వరదా భయహస్తికా, మయూరవలయా పిచ్చ మౌళి, కిసల యాంతుక, సింహాసనస్థ మయూరబరచ్చ తసమన్విత, త్రినేత శ్యామల, దేవి, వనమూలావిభూషణ, విప్రా కర్ణాభరణ, క్షత్రకేయూరరూషణ, వైశ్యవాగ కటిబంధ, వృషలాహికృత నూపుర యను రూపమున ధ్యానించి పదివేలు జపము చేయవలెను. ఈశ్వరుడు కిరాత రూపుడైనపుడు గౌరి ఆరూపమును ధరించినది. ఈదేవిని జపించి ధ్యానముచేసి పూజించినచో సర్వసిద్ధులు లభించును. విషాదులు తొలగిపోవును. పూర్వా దళములలోపల కర్ణికయందు ఎనిమిది సింహాసనముల పై ఈ దేవతలను క్రమముగా పూజించవలెను. హృదయాది ఆంగషట్కముతో కూడిన గాయత్రి ప్రణీతలను పూజించవలెను. పూర్వాది దళిములందు హుంకారాదులను పూజించవలెను. దశాగ్రభాగ మున దేవీ సమ్ముఖ మున ఫటారిని పూజించవలెను. శ్రీ బీజముతో పూజించవలెను. హుంకారి మొదలగు వారి ఆయుధ వర్ణాదులు ఆయా దిక్కుల దిక్పాలకుల ఆయుధ వర్ణాదులతో సమానములు. ఫటా మాత్రము ధనుర్బాణమును ధరించి యుండును. మండ ద్వారమున జయా విజయలను పూజించవలెను. వారు సువర్ణయష్టి ధరించి యుందురు. వారికి బయట బర్బరి; యను. కింకరిని పూజించవలెను. ఆమె ముడితమస్తక యై కర్ర ధరించి యుండును. పిదప హోమద్రవ్యము తో యోన్యాకృతి యగు కుండ మన హోమము చేయవలయును. తెల్లని ధాన్యమును హోమము చేసినచో సువర్ణము గోధూమం చేత పుష్టి సంప. దలు. యవ ధాన్య తిలల చే సర్వసిద్ది ఈ తినాశనములు కల్గును. అ.క్షములతో హోమము చేసినచో శత్రువుకు ఉప్మాదము త్వరితామంత్రాది శాల్మలీ బీజములచే మారణము, జంబూ ఫలములచే ధనధాన్య ప్రాప్తి, నీలోత్పలముంచే తుష్టి "రక్తాత్పలములచే మహాపుష్టి, కందములచే అభ్యుదయము కలుగును, మల్లికా పుష్పములు హోమము చేసినచో నగరమున క్షోభ కలుగును. కుముదము లచే జనప్రియత్వము లభించును. అశోక కుసుమములచే పుత్రప్రాప్తి, పాటలా పుష్పములచే ఉత్తమాంగనా ప్రాప్తి , ఆమ్ర ఫలములచే, ఆయుర్దాయము, తిలలచే లక్ష్మి, బిల్వలచే ఐశ్వర్యము, చంపకములచే ధనము, కలుగును. మధుక పుష్ప బిల్వ ఫలములు కలిపి హోమము చేసినచో సర్వజ్ఞత్వము లభించును. త్వరితా మంత్రము మూడు లక్షలజపము, హోమ ధ్యాన పూజలు చేసినచో ఆభిలషిత ఫలము లభించును. మండలములపై త్వరితా దేవిని అర్చించి త్వరితా గాయత్రితో ఏబది హోమములు ఇవ్వవలెను. పిదప మూలమంత్రమతో పల్లవములు మూడు వందలు హోమములు చేసి దీశాగ్రహణము చేయ వలయును. దీక్షకు పూర్వము పంచగవ్య ప్రాశన చేయవలెను. దీక్షా సమయమున చెరువు మాత్రమే భుజించవలయును.
ఆగ్ని మహాపురాణమున త్వరిత పూజా విధివర్ణనమను మూడు వందల తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 309 of the Agni Purāṇa is as follows:
The two surgical branches — śalya (general surgery) and śālākya (diseases of the head and sense organs) — are surveyed. The eight types of śalya (foreign bodies lodged in the body) and the instruments (yantra, śastra) for their extraction are listed. Śālākya covers diseases of the eye (timira, kaṇḍū, abhiṣyanda, liṅganāśa), ear (karṇanāda, badhirya), nose (nāsānāha, śoṣa), and mouth (mukhapāka, dantaśūla). The eight great operations (mahākriyā) are named, and the qualities of the ideal surgeon — steadiness of hand, sharpness of instrument, boldness, and compassion — are praised.