అగ్ని మహా పురాణము

349 - అథ కౌమార వ్యాకరణమ్

స్కంద ఉవాచః-

వ్యక్ష్యే వ్యాకరణం సారం సిద్దశబ్ద స్వరూపకమ్

కాత్యాయననిబోధాయ బాలానాం బోధనాయచ.

ప్రత్యాహారాదికాః సంజ్ఞా శాస్త్రసంవ్యవహారగాః

ఆ ఇ ఉణ్ ఋక్ ఏఓజ్ ఐఔచ్ హయవరట్

లణ్ ఇమజణనమ్ ఝభయ్ ఘడధష్

జబుగడశ్ ఖ ఫ ఛ ఠ థ చ ట తవ్ కపయ్

శషసర్ హల్ ఇతి ప్రత్యాహారః

 ఉపదేశ ఇద్వలన్తం భవేద జనునాసికః.

ఆదివర్ణో గృహ్యమాణోఽప్య న్తేనేతా స హైవతు

తయోర్మధ్య గతానాం స్యాద్గ్రాహకః స్వస్యతద్యథా.

అణ్ ఏజ్ ఆట్ యజ్ భవ్ ఝాష్ భష్ ఆక్ ఇక్ అణ్ ఇణ్ యణ్ పరేణ ణకా రేణ

ఆమ్ యమ్ జమ్ ఆచ్ ఇచ్ ఐ ఆయ్ మయ్ రయ్ జవ్ ఝావ్ ఖవ్ కవ్ ఆ హగ్ వర్క్ థశ్ ఆల్ హల్ బల్ రల్ ఝుల్ జవ్ ఇతి ప్రత్యాహారాః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే కౌమార వ్యాకరణ శాస్త్రేసంజ్ఞా ప్రకరణంనా మైకోన

పంచాశ దధిక త్రిశతతమోఽధ్యాయః.

స్కందుడు చెప్పెను. కాత్యాయనాః బాలకుల జ్ఞానము కొరకై వ్యాకరణ సార మగు సిద్ధ శబ్ద స్వరూపము చేప్పెదను. శాస్త్ర వ్యవహారములకు ఉపయుక్తములగు ప్రత్యాహారాది సంజ్ఞలు చెప్పెదను. “ఆ, ఇ ఉణ్” మొదలు, “హల్” వరకు మూలో క్తము ప్రత్యాహారము. ఉపదేశము నందు అంత్య మగు హల్లు, అనునాసిక మగు అచ్చు ఇత్సం జ్ఞకములు. అంతిమ ఇత్సంజ్ఞక వర్ణముతో కలిపి చెప్పబడిన ఆది వర్ణము తనకును మధ్యనున్న వర్ణములకును గ్రాహకము. వీటికి ప్రత్యాహారములని పేరు. “అణ్ మొదలు ఊగల్” వరకు మూలో క్తములగునవి ప్రత్యాహార ములు. ఆ, ఇణ్, యణ్ వీటిలో పరవకారముతో ప్రత్యాహారము.

అగ్ని మహా పురాణమున కౌమార వ్యాకరణ శాస్త్రమున సంజ్ఞాప్రకరణ మనుమూడు వందల నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.