అగ్ని మహా పురాణము

257 - అథ సీమా వివాదాది నిర్ణయః

అగ్నిరు వాచః

సీమ్నో వివాదే క్షేత్రస్య సామన్ తాః స్థవిరాగణాః

గోపాః సీమా కృషాణాయే సర్వేచవన గోచరాః.

నయేయురేతే సీమానం స్థలాంగార తుష ద్రుమైః

సేతువల్మీక నిమ్నాస్థి చైత్యాద్యైరుప లక్షితామ్.

సామన్ తావా సమం గ్రామాచ్చత్వారోఽష్టాదశాపి వా

రక్తస్రగ్వసనాః సీమాం నయేయుః క్షితిధారిణః.

అనృతేతు పృథగ్ధండ్యా రాజ్ఞామధ్యమ సాహసమ్

ఆభావే జ్ఞాతృ చిహ్నానాం రాజా సీమ్నః ప్రవర్తకః.

ఆరామాయతన గ్రామ నిపానోద్యాన వేశ్మసు

ఏష ఏవ విధిర్జ్ఞేయో వర్షాంబు ప్రవ హేషుచ.

 మర్యాదాయాః ప్రభేదేషు క్షేత్రస్యహరణే తథా

నిర్మర్యాదాశ్చ దండ్యాః స్యురధమోత్తమ మధ్యమాః.

 ననిషేధ్యోఽల్ప బాదస్తు సేతుః కల్యాణ కారకః

పరభూమిం హరన్కూపు స్వల్ప క్షేత్రో బహూదకః. 

స్వామినే యోఽనివేద్యైవ క్షేత్రే సేతుం ప్రకల్పయేత్

ఉత్పన్నే స్వామినో భోగ స్తదభావే మహీపతేః.

 ఫలాహతమపి క్షేత్రం యోన కుర్యాన్న కారయేత్

నప్రదాప్యః కృష్టఫలం క్షేత్రమన్యేన కారయేత్.

అగ్ని దేవుడు పలికెను: క్షేత్రము విషయమున సీమా వివాదము (సరిహద్దు) ఏర్పడినపుడు సామంతులు వృద్ధులు మొదలగువారు గోపాలకులు ఆ సరిహద్దులలో వుండు కర్షకులు వనములో నివసించువారు. వీరందరును ఎత్తైన ప్రదేశము బొగ్గులు ఊక (పొల్లు) వృక్షములు వంతెనలు, పుట్టలు పల్లములు, చైత్యములు మొదలైన వాటి సహాయముతో ఆ సరిహద్దును గుర్తించవలెను. సామంతులు గాని, గ్రామములోని నలుగురుని గాని, ఎనమండుగురు గాని, పదిమందిగాని. ఎర్రని పుష్పమాలలను, వస్త్రములను, ధరించి, తల పై మట్టిపెట్టుకొని సీమా నిర్ణయము చేయవలెను. ఈ సామంలాదులు అసత్యము చెప్పినచో రాజు వారికి వేరువేరుగా మధ్యమ సాహసదండము ఇవ్వవలెను. సీమను నిర్ణయించు చిహ్నములులేని పక్షమున రాజే సీమా నిర్ణయము చేయు వాడు. తోటలు గృహములు, గ్రామములు తటాకాదులు ఉద్యానములు దేవాలయములు, వర్షాజలములు ప్రవహించు కాలువలు మొదలగు వాటి విషయము గూడ సీమా నిర్ణయము ఇట్లే చేయపలెను. సరిహద్దులు తొల గించిన వారికిని క్షేత్రము హరించిన వారికిని సరిహద్దు దాటిన వారికిని రాజు క్రమముగా, అధమ ఉత్తమ మధ్యమ, దండములు ఇవ్వవలెను. చాలమందికి ఉపయోగించినది కొంచెము మాత్రమే బాధ కలిగించునది యగు సేతువు- పరుల భూమిలోనికి పోవు అత్యధికమగు జలముగలది . అల్ప క్షేత్రమును ఆక్రమించునది యగు కూపము-వీటిని అడ్డు పెట్టరాదు. క్షేత్రాధిపతికి తెలుపకుండ గనే క్షేత్రమునందు సేతువును నిర్మించినచో దానిని క్షేత్రాధిపతియే అనుభవించవలెను. అతడు లేనిచో ఆదిరాజునకు చెందును. దున్ను వాడు తానుదున్నిన భూమి పై పంటపండింపకున్నను, ఇతరులను పుడింపకుండ అడ్డుకున్నను దున్నిన భూమి పై వచ్చు టకు అవకాశమున్న పొలమును ఆతనికి ఇప్పించి ఆ పొలమును మరియొకనిచే చేయించవలెను.

మాసానష్టౌతు మహిషి సస్యఘాతస్య కారిణీ

దండనీయా తదర్ధంతు గౌ స్తదర్ధ మజావికమ్.

 భక్షయిత్వోపవిష్టానాం యథో క్తాద్ద్విగుణోదమః

సమ మేషాం వివీతేఽపి ఖరోష్ట్రం మహిషీ సమమ్.

యావత్సస్యం వినష్టంతు తావత్క్షేత్రీ ఫలం లభేత్

పాలస్తాడ్యోఽథ గోస్వామీ పూర్వో క్తం దండమర్హతి.

 పథిగ్రామ వివీతాంతే క్షేత్రే దోషోన విద్యతే

అకామతః కామచారే చోరవద్దండ మర్హతి.

మహోక్షోత్సృష్ట పశవః సూతికా గత్తుకాచగౌః

పాలోయేషాంతు తేమోచ్యాదై వరాజ పరిప్లుతాః.

యథార్పితానశూనోపః సాయం ప్రత్యర్పయేత్తథా

ప్రమాదమృతనష్టాంశ్చ ప్రదాప్యః కృత వేతనః.

 పాలదోష వినాశేతు పాలే దండో విధీయతే

 అర్ధత్రయో దశపణః స్వామినో ద్రవ్యమేవచ.

 గ్రామేచ్ఛయా గోప్రచారో భూమిరాజవ శేనవా

 ద్విజస్తృణైధః పుప్పాణి సర్వతః స్వవదాహరేత్.

 ధనుః శతం పరీణాహో గ్రామ క్షేత్రాంతరం భవేత్

ద్వేశతే ఖర్వటస్యసాన్న గరస్య చతుః శతమ్.

గేదె సస్యమునకు కల్గించినపుడు ఎనిమిది మాషములు గోవు నష్టము కల్గించినచో నాలుగు మాషములు, మేకలు గొఱ్ఱెలు, కలిగించినచో దండము విధించవలేను, గేదెలు మొదలగునవి సస్యమును భక్షించి అక్కడ కూర్చున్నచో పైన చెప్పినదానికి రెట్టింపు దండమును విధించవలెను. వినీత క్షేత్రము నందు కూడ పైన చెప్పినట్లే దండమును విధించవలేను. గాడిదలకు ఒంటెలను కుండ గేదేతో సమానముగా దండము. ఎంత సస్యము నష్టమేనదో అంత క్షేత్రస్వామికి ఆ పశువుల స్వామి చేత ఇప్పించవలెను. పశువుల కాపరికి లాడనమే దండము. గోస్వామికి ఆతడు స్వయముగా మేపినచో పైన చెప్పిన దండము విధించవలెను. ఆ క్షేత్రము మార్గమునందును గ్రామము యొక్క వివీతము చివరను వున్నపుడు తెలియక పశువులు మేసినచో దండములేదు. తెలిసి మేపినచో చోరుని వలె దండించవలెను. ఆటోలు, దేవతలనుద్దేశించి విడిచిన పశువులు క్రొత్తగా ఈనిన ఆవుచెదరి వచ్చిన ఆవు ఇవి మేసినచో దండములేదు. వాటిని విడిచి పెట్టవలెను. దైవోపహతములు, రాజోపహతములగు పశువులను కూడ విడిచి పెట్టవలెను. గోపాలకుడు ప్రాతః కాలమున పశువులను లానెట్లు తీసుకొనిపోవునో సాయంకాలమున అట్లే తిరిగి స్వామికి అప్ప చెప్పవలెను. జీతము తీసుకొను గోపాలుని ప్రమాదముచే పశువులు మరణించి నను, నష్టమైనను ఆతనిచే వాటి స్వామికి ఇప్పించవలెను. గోపాలుని పొరపాటు చే పశువు నశించినచో పదమూడున్నర పణముల దండము విధించి పశు మూల్యమునకు సమానమైన ధనమును పశుస్వామికి ఇప్పించవలెను. గ్రామస్థుల ఇష్టము ప్రకారము గాని, రాజాజ్ఞచేతగాని, గోవుల మేత కె కొంత భూమిని విడువవలెను బ్రాహ్మణుడు అన్ని క్షేత్రములనుండియు సీమా వివాదాడి నిర్ణయః తృణమును కట్టెలను, పుష్పములను, తన సొంత వస్తువువలె గ్రహించవచ్చును. గ్రామమును పొలమునకును మధ్యవంద ధనుస్సుల దూర ముండవలెను. ఖర్వటము (పెద్ద గ్రామము) నకు క్షేత్రమునకు మధ్య రెండువందల ధనుస్సుల ఆంతరము నగరమునకు క్షేత్రములకు మధ్య నాలుగు వందల ధనుస్సుల ఆంతరము వుండవలెను.

స్వం లభేతాన్య విక్రీతే క్రేతుర్ధోషోఽ ప్రకాశితే

హీనాగ్రహో హీనమూల్యే వేలా హీనేచ తస్కరః.

 నష్టాపహృతమాసాద్య హర్తారం గ్రామాయేన్నరమ్

దేశ కాలాతీ పత్తౌవా గృహీత్వా స్వయమర్పయేత్.

 విక్రేతుర్దర్శనాచ్ఛుద్ధిః స్వామీ ద్రవ్యం నృపోదయమ్

 క్రేతామూల్యం సమాప్నోతి తస్మాద్య స్తత్ర విక్రయీ.

ఆగ మేనోపభోగేన నష్టం భావ్యమతోఽన్యథా

 పంచబంధో దమ స్తస్య రాజ్ఞేతేనాప్య భావితే.

హృతం ప్రనష్టం యోద్రవ్యం పరహస్తా దవాప్నుయాత్

అనివేద్యనృపే దండ్యః సతుషష్ణవతింపణాన్.

 శౌల్కికైః స్థానపాలైర్వా నష్టాప హృతమా హృతమ్

అర్వాకంవత్సరాత్స్వామీ లభతే పరతో నృపః.

 పణానేకశఫే దద్యాచ్చతురః పంచమానుషే

మహిషో ష్ట్రగవాం ద్వౌద్వౌపాదం పాదమజావికే.

తన వస్తువును అపహరించి ఎవరైన ఇతరులకు ఆమ్మి వేసినపుడు అది కనబడినచో దానిని స్వామి తీసుకొన వచ్చును. దానిని బయటకనబడకుండ చేసినచో అది కొన్న వాని దోషము ఒక నీచుని నుండి తక్కువ మూల్యము ఇచ్చి సమయము కాని సమయమునందు రహస్యముగా ఒక వస్తువును కొన్నవాడు చోరుడే. నష్టమేనను ఆపహృతమైనను ఒక వస్తువు కనబడినచో అది ఎవని వద్దనుండునో వానిని రాజపురుషులచే పట్టించవలెను. ఆదేశమునందు ఆసమయమునందు పట్టించుటకుదరక పోయినను, తాను స్వయముగా పట్టి ఇవ్వవలెను. అపహృత వస్తువును కొన్న వాడు అమ్మినవానిని చూపించి వచో వాడు శుద్దుడగును. రాజు ఆ ద్రవ్యమును స్వామికి ఇప్పించి అమ్మినవానిని శిక్షించి కొన్న వానికి వానిచే మూల్యమును తిరిగి 8ప్పించవలెను. నష్టమైన వస్తువును దాని స్వామి తనకు ఎట్లువచ్చినదో తాను ఎట్లు అనుభవించెనో చెప్పి ఆది తనదని నిరూపించుకొనవలెను. అట్లుచేయజాలనిచో రాజు దానిలో పంచమాంశమును దండముగ విధించవలేను. హృతమైన లేదా నష్టమైన తన వస్తువునుగూర్చి రాజుకు నివేదించకి ఇతరుల ద్వారాదానిని పొందినవానికి రాజు తొంబది యాఱు పణములు విధించవలెను. శుల్కా ధికారులు కాని, స్థానపాలకులు గాని, తీసుకొనివచ్చి రాజువద్దవుంచిన నష్టఅపహృత ధనమును దాని స్వామి ఒక సంవత్సరములోపుగ తనదని నిరూపించి మరల పొందవచ్చును. సంవత్సరము దాటినచో అది రాజుకుచెందును. ఏకశఫములు (గుఱ్ఱములు మొదలగునవి) పోయి మరల లభించినచో వారికి స్వామి రాజునకు నాలుగు పణములు ఇవ్వవలెను. మనుష్యజాతికి సంబంధించిన ద్రవ్యములభించికచో ఐదుపణములు, మహిషము, ఉన్షము, గోవు తిరిగి లభించినపుడు రెండేసి పణములు, మేకలకు గొఱ్ఱెలకు పణములో నాలుగవవంతు ఇవ్వవలెను

స్వకుటుంబా విరోధేన దేయం దార సుతాహృతే

నాన్వయేసతి సర్వస్వం దేయం యచ్చాన్య సంశ్రుతమ్.

 ప్రతిగ్రహ ప్రకాశః స్యాత్థ్సావరస్య విశేషతః

దేయం ప్రతి శ్రుతం చైవ దత్త్వానాపహరేత్పునః.

 దశై కపంచ సప్తాహ మాసత్య్రహార్ధమాసికమ్

బీజాయోవాహ్యరత్న స్త్రీదోహ్యపుంసాం పరీక్షణమ్.

 అగ్నౌ సువర్ణమక్షీణం ద్విపలం రజతేశ తే

 అష్టౌత్రపుణి సీ సే చ తామ్రే పంచదశాయసి.

శతే దశ పలావృద్ధిరౌర్ణే కార్పాసి కే తథా

మధ్యే పంచపలాజ్ఞేయా సూ క్ష్మేతు త్రిపలామతా.

కార్మి కే రోమబద్దేచ త్రింశద్భాగః క్షయోమతః

 నశయోనచ వృద్దిస్తు కౌశేయే వల్కలేషుచ.

దేశం కాలం చ భోగం చ జ్ఞాత్వానష్టే బలాబలమ్

 ద్రవ్యాణాం కుశిలా బ్రూయుర్యత్తద్దాప్యమసంశయమ్.

తనకుబుంబమునకు నష్టముకాని విధమున తన వస్తుపులను దానము చేయవచ్చును. భార్యాపుత్రాదులను ఎన్నడును దానము చేయకూడదు. తన సర్వస్వమును తన వంశము వున్నపుడు ఇతరుల ఎవ్వరికిని ఇవ్వకూడదు. ఒకరికి ఇచ్చిన దానిని మరొకరికి ఇవ్వకూడదు. ప్రతిగ్రహము అందరి యెదుటను చేయవలెను. ఇచ్చెదనని చెప్పినవస్తువును తప్పక ఇవ్వవలెను. ఇచ్చిమరల తీసుకొనగూడదు. బీజములు ఇనుము, వాహనములు, రత్నములు, దాసి, పాలిచ్చు పశువులు దాసులు వీరిని రక్షించుటకు వరుసగ పది, ఒకటి, ఐదు, ఏడు దినములు మాసము, మూడుదినమరణులు, ఆర్గమాసము తీసుకొన వచ్చును. బంగారము ఆగ్నిలో వేసినను తరగదు. వెండి నూటికి రెండుపలములు తగ్గును. తగర ము సీసము నూటికి ఎనిమిదిపలములు తగ్గును, రాగికి ఐదు పలములు ఇనుమకు పది పలములు తరుగువచ్చును. ఉన్ని నూలు వీటితో నేసిన బట్టలకు నూటికి పది పలవలు పెరుగును. మధ్యప్రమాణముగల దారమైనచో ఐదుపలములు సూక్ష్మ మయినచో మూడు పలములు హెచ్చును. ఆద్దకము బట్టలందును, రోమములు గుచ్చిన బట్టలందును నూటికి ముప్పైవంతులు తరుగవచ్చును. పట్టుబట్టలందు, నారచీరలందు, శయముగాని వృద్ధికానిఉండదు. కుశలుగు వారు దేశ వంను కాలమును భోగమును దృష్టిలో వుంచుకొని వష్టమైన వస్తువుల విషయమున బలాబలములను ఏ విధముగా నిర్ణయింతురో ఆ నష్టమును రాజు తప్పక ఇప్పించవలెను.

బలాద్దానీకృతశ్చౌరై ర్విక్రితశ్చాపి ముచ్యతే

స్వామీ ప్రాణప్రదో భక్తత్యాగా త్తన్నిష్క్రయాదపి.

ప్రవ్రజ్యావసితోరాజ్ఞోదాస ఆమరణాంతికః

వర్ణానామానులోమ్యేన దాస్యం నప్రతిలోమతః.

కృతశిల్పోఽపి నివసేత్కృత కాలం గురోర్గృహే

 అంతేవాసీ గురుప్రాప్త భోజన స్తత్ఫలప్రదః.

రాజాకృత్వాపురేస్థానం బ్రాహ్మణాన్న్యస్యతత్రతు

త్రై విద్యం వృత్తిమద్బ్రూయాత్స్వ ధర్మఃపాల్యతామితి.

నిజధర్మావిరోధేన యస్తు సామయికో భవేత్

 సోఽపి యత్నేన నంరక్ష్యోధర్మోరాజకృతశ్చయః .

 గణ ద్రవ్యం హరేద్యస్తు సంవిదం లంఘయేచ్చయః

సర్వస్వ హరణం కృత్వాతం రాష్ట్రాద్వివ్రవాసయేత్ .

కర్తవ్యం వచనం సర్వైః సమూహహిత వాదిభిః

య స్తత్ర విపరీతః స్యాత్స దాప్యః ప్రథమం దమమ్.

నమూహర్యప్రహితో యల్లభే త్తత్త దర్పయేత్

 ఏకాదశ గుణం దాప్యో యద్యసౌ నార్పయేత్స్వయమ్.

 వేదజ్ఞాః శుచయోఽలుద్దా భవేయుః కార్యచింతకాః

కర్తవ్యం వచనం తేషాం సమూహహిత వాదినామ్.

 శ్రేణినైగమపాషండి గణానా మవ్యయం విధిః

బేదం చైషాం నృపో రక్షేత్పూర్వవృత్తిం చపాలయేత్ .

బలాత్కారముగా, దాసుడుగా చేయబడిన వానిని చోరులచే అమ్మబడిన వానిని తన స్వామిని ప్రాణ సంకటవ నుండి రక్షించిన వానిని, తవరై స్వామి ఎంత వ్యయము చేసెనో అంతధనము తిరిగి ఇచ్చివేసిన వానిని దాసత్వమునుండి విడిపించవలెను. ప్రవ్రజావసితుడు (సన్యాసమును స్వీకరించి భ్రష్టుడైన వాడు) ఆమరణాంతము రాజుకు దాసుడుగా వుండవలెను. వర్ణములలో దాస్యము ఆనులోమ్యముచే (క్రిందవర్ణము వారుపై వర్ణము వారికి) దాస్యముండును. ప్రతి లోమ క్రమమకాదు. శిల్పము నేర్చుకొన్న శిష్యుడు నిశ్చితమగు కొంతకాలము పాటు గురుగృహమునందే నివసించుచు, గురువు వంట భోజనము చేయుచు, శిల్పముల వలన సంపాదించిన డనమును గురువువకు ఇవ్వవలెను. రాజు తన నగరమున స్థానము కల్పించి అచట బ్రాహ్మణులకు నివాసమేర్పరచి వేదవిదులగు వారికి వృత్తి కల్పించి “మీరు ఇచట స్వధర్మానుష్టానము చేయడు” అని ప్రార్థించవలెను. స్వధర్మమునకు ఆవిరుద్ధమగు ఆయాసమయములందు ఏర్పరచ బడిన రాజనిర్ణీత ధర్మమును కూడ ఆ బ్రాహ్మణులు పాలింపవలెను. ఎవడు జనగణము యొక్క ద్రవ్యమును హరించునో, మర్యాదనులంఘించునో ఆతని సర్వస్వమును తీసుకొని రాష్ట్రమునుండి వెడలగొట్టవలెను. సమాజహితమును కోరువారు చెప్పిన విషయమును అందరును ఆచరించవలెను. తద్విపరీతముగా ప్రవర్తించు వానిని ప్రథమ సాహస దండముచే శిక్షించ వలెను. సమాజ కార్యము పై పంపబడినవాడు తనకు లభించిన దంతయు సమాజమునకు సమర్పించ వలయును. వాడు ఆట్లు ఆర్పించకున్నచో వానిచే పదకొండు రెట్లు ఇప్పించవలెను. వేదజ్ఞులు, పవిత్రులు, లోభము లేనివారు, కార్యచింతకులు కావలెను. సమాజ హితమును చెప్పువాతి వచనమును అందరును ఆచరించవలెను. శ్రేణులు, నైగములు, పాషండులు, గజముల వీరికి కూడ ఇది వర్తించును. రాజు వీరి ధర్మ భేధములను, పూర్వవృత్తిని పాలించవలెను.

గృహీత వేతనః కర్మత్యజన్ద్వి గుణమావహేత్

ఆగృహీతే సమం దాప్యో భృత్యై రక్ష్య ఉపస్కరః.

 దాప్యస్తు దశమం భాగం వాణిజ్య పశుసస్యతః

అనిశ్చిత్య భృతిం యస్తుకారయేత్స మహీక్షితా.

 దేశం కాలంచ యోఽతీయాత్కర్మ కుర్యాచ్చయోఽన్యథా

తత్రతు స్వామినశ్చందోఽధికం దేయంకృతేఽధికే.

యోయ వత్కురుతే కర్మతావ త్తన్న తు వేతనమ్

ఉభయోరప్య సాద్యం చేత్సాధ్యే కుర్యాద్యథాశ్రుతమ్.

అరాజ దైవికం నష్టం భాండం దాప్యస్తు వాహకః

ప్రస్థాన విఘ్న కృచ్చైవ ప్రదాప్యో ద్విగుణాం భృతిమ్.

ప్రక్రాన్తే సప్తమం భాగం చతుర్థంపథి సంత్యజన్

భృతిమఠపథే సర్వాం ప్రదాప్యస్త్యాజకోఽపి చ.

 గ్ల హే శతికవృద్దేస్తు సభికః పంచకం శతమ్

గృహ్ణీయాద్ధూర్త కితవాదితరాద్దశకం శతమ్.

ససమ్యక్పాలితో దద్యాద్రాజ్ఞే భాగం యథాకృతమ్

జితముద్గ్రాహ యేజ్జేత్రే దద్యాత్సత్యం వచఃక్షమీ.

 ప్రాప్తేనృపతినాభాగే ప్రసిద్దేధూర్తమండలే

జీతం సనభికేస్థానే దాపయే ధన్వథానతు.

 ద్రష్టారోవ్యవహారాణాం సాక్షిణశ్ఛత ఏవహి

రాజ్ఞా సచిహ్నా నిర్వాస్యాః కూటాక్షోపధి దేవినః

ద్యూతమేక ముఖం కార్యం తస్కరజ్ఞానకారణాత్

 ఏష ఏవ విధిర్జ్ఞేయః ప్రాణీద్యూతే సమాహ్వయే.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సీమా వివాద ద్యూతాది నిర్ణయోనామ సప్తపంచాశదధిక ద్విశతతమోఽధ్యాయః.

వేతనము తీసుకొని పనిమానివేసినవాడు వేతనమునకు రెట్టింపు ధనమును స్వామికి ఇవ్వవలెను. అతడు వేతనము తీసుకొనకుండ పనిమాని వేసినచో వేతన ధనమును స్వామికి ఇప్పించవలెను. భృత్యుడు ఉపకరణములను రక్షించుచుండవలెను. వేతనము నిశ్చయించకుండగ ఎవరైనా భృత్యునిచే పని చేయించుకున్నచో రాజు వానిచే ఆ భృత్యునికి వాణిజ్యము పదవులు సస్యము వీటిలో పదవవంతు ఇప్పించ వలెను. దేశ కాలములను దాట బెట్టుటచే పనిని చెడ గొట్టిన భృత్యునకు స్వామి తన ఇష్టము వచ్చినంత వేతనమనే ఇవ్వవలెను. ఆనుకొనిన దానికంటే అధికము. సమకూర్చినచో అధిక వేతనము ఇవ్వవలెను. ఎవడు ఎంత పని చేయునో అతనికి అంతయే వేతనము ఇద్దరికి అసాధ్య మైన పనిని ఒకడు ఎంత చేయునో ఆంతయే వేతనము సాధ్యమైనచో చెప్పినంత వేతము ఈయవలెను. భారమును మోయు భృత్యుడు, రాజునకు కాని దైవమువకు కాని, సంబంధించిన వస్తువును మోయుచు దానిని నష్టపరచినచో ఆవాహకునిచే అంత ధనము స్వామికి ఇప్పించ వలెను యాత్రలో విఘ్నము కలిగించు భృత్యునిచే వేతనమునకు రెట్టింపు ధనమును ఇప్పించ వలెను. యాత్రా ప్రారంభమున పనిమానివేసిన వానిచే వేతనములోని సప్తమ భాగమును మార్గమునందు మానివేసిన వానిచే చతుర్థ భాగమును, మార్గమధ్యమునందు మానివేసినవానిచే మొత్తము వేతనమును ఇప్పించ వలెను. జూదములో పందెము నందు, నూరుగాని, అంతకంటే అధికము గాని ఎక్కువ సంపాదించిన జూదరి నుండి సభికుడు రాజునకు సభికుడు (ద్యూతగృహాధ్యక్షుడు) నూటిలో పదవ వంతు తీసికొనవలెను. మరల అంత లాభము వచ్చినప్పుడు నూటికి పదవ వంతు తీసుకొనవలెను. రాజుచే బాగుగ పరిపాలింపబడిన సభికుడు రాజునకు నిర్ణీ తథాగమును ఇవ్వవలేను. జయించిన ధనమును జయించిన వానికే యిచ్చి క్షమాపరాయణుడై సత్యమునే పలుకవలెను. ప్రసిద్దులగు జూదరుల సముదాయము సభికులతో సహ రాజువద్దకు వెళ్ళి ఆతని భాగమును చెల్లించిననే రాజు జయించనివానికి జయించిన సొమ్ము నే ఇప్పించ వలెను. ద్యూతమును సంబంధించిన వ్యవహారములను పరిశీలించుటకును, సాక్ష్యము చెప్పుటకును, జూదరులనే నియమించవలెను. తప్పుడు పాచికలతో ఆడించువారి వారి శరీరముపై కొన్ని గుర్తులుచేసి దేశ మునుండి వెడలగొట్టవలెను. జూదములో దొంగలను తెలుసుకొనుటకు ఒక వ్యక్తినే ప్రధానునిగా నియమించవలెను. ప్రాణి ద్యూతమునందు కూడ ఇదియే నియమము.

అగ్ని మహాపురాణమునందు సీమా వివాద ద్యూతాది నిర్ణయమను రెండువందల యేబది ఏడవ అధ్యాయము సమాప్తము.