ఆగ్ని రువాచః
ఛందోఽత్ర సిద్ధం గాథాస్వాత్పాదే సర్వగురౌతథా ।
ప్రస్తార ఆద్యగాథోనః పరతుల్యౌఽథ పూర్వగః.
నష్టమధ్యే సమేంఽ కేనః సమోఽర్ధవిషమే గురుః ।
ప్రతిలోమగుణం నాద్యం ద్విరుద్దిష్టక ఏకనుత్.
సంఖ్యాద్విరర్దేరూ పేతు శూన్యం శూన్య ద్విరీరితమ్ ।
తావదర్ధే తద్గుణితం ద్విద్య్వూనంచ తదన్తతః.
పరే పూర్ణం పరే పూర్ణం మేరు ప్రస్తారతో భవేత్ ।
నగసంఖ్యా వృత్తసంఖ్యాచార్వాంగులమథాఽర్థతః .
సంఖ్యైవ ద్విగుణే కోనోఛందః సారోఽయమీరితః.
ఇత్వాది మహాపురాణే ఆగ్నేయే ప్రస్తార నిరూపణం నామ పంచత్రింశ దధిక త్రిశతతమోఽధ్యాయః.
ఆగ్ని దేవుడు పలికెను. పేరు చెప్పని ఛందస్సులన్నియు గాథా ఛందస్సులో ఆంతర్గతములు. ఇపుడు ప్రస్తారము చెప్పబడుచున్నది. అన్ని అక్షరములును గురువు లైన పాదములో ఆది గ రువుకు క్రింద లఘువు వ్రాయవలెను. దాని పిమ్మట అదే క్రమమున వర్ణములను కూర్చవలెను. నష్ట సంఖ్యను సగ ము చేయగా ఒక లఘువు ప్రాయవలెను. సగము చేసినవుడు ఆది విషమమైనచో దానికి ఒకటి చేర్చి సమము చేసి మరల దానిని సగ ము చేయవలెను. ఇప్పుడు ఒక గుర్వక్ష రము లభించును. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క భేదము తెలియవలెనో అన్ని అక్షరములు పూర్తి యగు వరకు గురు లఘువులను వ్రాయుచు పోవలెను. ఉద్దిష్ట సంఖ్యను చెప్పుటకు గురు, లఘు వర్ణములను క్రమముగ , ఒక పంక్తిలో వ్రాసి వాటి పైన క్రమముగ ఒకటి నుండి రెట్టించుచు, అంకములు వుంచవలెను. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క తెలియవలెనో దాని అర్ధ భాగము తీసివేయబడును. అప్పుడు రెండు లభించును. దానిని వేరుగా వుంచవలెను. విషమ సంఖ్య నుండి ఒకటి తగ్గించగ, శూన్యము లభించును. దానిని రెండుకు క్రింద వ్రాయవలెను. శూన్య స్థానమున రెట్టింపు చేయవలెను. అట్లు చేయవచ్చిన అంకమున పైనున్న ఆర్థస్థానము నందుంచి దానిచే గుణంచవలెను. మేరు ప్రస్తార ముచే ఒక ఛందస్సులో ఎన్ని లఘువులు ఎన్ని గురుపులు వుండునో, ఎన్ని వృత్తములు ఏర్పడునో తెలియును. మేరు ప్రస్తారమున క్రింది నుండి పైకి, ఆర్ధాం గుళము చొప్పున విస్తారము తగ్గుచుండును, ఛందసంఖ్యను రెట్టించి, ఒక్కొక్కటి తగ్గించినచో అన్ని అంగుళముల ప్రస్తార దేశము ఏర్పడును. ఈ విధముగా ఛందస్సారము చెప్పబడినది.
అగ్ని మహాపురాణమున ప్రస్తార నిరూపణమను మూడువందల ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 336 of the Agni Purāṇa is as follows:
The science of phonetics and correct Vedic recitation (śikṣā) is expounded, with the full inventory of Sanskrit phonemes enumerated as sixty-three or sixty-four sounds depending on the inclusion of the pluta (prolonged) variants. Agni describes the eight articulation points (sthāna) — throat, palate, teeth, lips, nose, chest, and the junctions between them — and explains how each phoneme is produced by the coordinated action of articulator and position. The three Vedic accents — udātta (raised), anudātta (lowered), and svarita (combination) — are defined in terms of the position of the resonating cavity, and their role in preserving the semantic integrity of the mantra is explained. Correct recitation is said to be the vehicle through which the mantra's śakti reaches its full power.