ధన్వన్తరి రువాచః
ఆయురారోగ్య కర్తార ఓంకారాద్యాశ్చ నాక దాః ।
ఓంకారః పరమోమంత్ర న్తం జప్త్వా చామరో భవేత్.
గాయత్రీ పరమోమంత్ర స్తం జప్త్వా భుక్తి ముక్తిభాక్ ।
ఓం నమో నారాయణాయ మంత్రః సర్వార్థసాధకః.
ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వదః ।
ఓం హ్రూం నమో విష్ణవే మంత్రోయం చౌషధం పరమ్.
అనేన దేవా హ్యసురాః సశ్రియో నీరుజోఽభవన్ ।
భూతానా ముపకారశ్చ తథాధర్మో మహౌషధమ్.
ధర్మ సద్ధర్మకృద్దర్మీ ఏతైర్థర్మశ్చ నిర్మలః ।
శ్రీదః శిశః శ్రీనివాసః శ్రీధరః శ్రీని కేతనః.
శ్రియపతిః శ్రీ పరమ ఏతైః శ్రియమ వాప్నుయాత్ ।
కామీ కామప్రదః కామః కామపాల స్తథాహరి.
ఆనందో మాదవశ్చైవ నామ కామాయ వై హరేః ।
రామః పరశురామశ్చ నృసింహో విష్ణురేవచ.
త్రివిక్రమశ్చ నామాని జప్తవ్యాని జిగీషుభిః ।
విద్యామ భ్యస్యతాం నిత్యం జప్తవ్యః పురుషోత్తమః.
దామోదరో బంధహరః పుష్కరాక్షోఽక్షి రోగనుత్ ।
హృషీ కేశోభయహరో జపేదౌషధ కర్మణి.
అచ్యుతం చామృతం మంత్రం సంగ్రామే చాపరాజితః ।
జలతారే నరసింహం పూర్వాదౌ క్షేమ కామవాన్.
చక్రిణం గదినం చైవ శార్జ్గిణం ఖడ్గినం స్మరేత్ ।
నారాయణం నర్వకాలే నృసింహోఽఖిల భీతినుత్.
గరుడ ధ్వజశ్చ విషహృద్వాసుదేవం నదాజ పేత్ ।
ధాన్యాది స్థాపనం స్వప్నే దాహాదౌ జలశాయినామ్.
నారాయణం చ దుఃస్వప్నే దాహాదౌ జలశాయినామ్ ।
హయగ్రీవం చ విద్యార్దీ జగత్సూతిం సుతాప్తయే ।
బలభద్రం శౌర్వకార్యే ఏకం నామార్థ సాధకమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మంత్ర రూపౌషధకథనం నామ చతురశీత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
ధన్వంతరి పలికెను. ఓంకారాది మంత్రములు, ఆయురారోగ్య ప్రదములు, స్వర్గము ఇచ్సునవి కూడ, ఓం కారము ఆత్యుత్తమమైన మంత్రము, దానిని జపించిన వాడు, అమృత్యుడగును. గాయత్రి పరమ మంత్రము దానిని జపించినవాడు భుక్తి ముక్తులను పొందును. “ఓం నమోనారాయణాయ” అను మంత్రము సర్వార్థ సాధకము “ఓంనమోభగ వతే వాసుదేవాయ” యను మంత్రము సర్వ ఫలప్రదము. “ఓం హ్రూం నమోవిష్ణవే” యను మంత్రము పరమౌషధము దీనిచే దేవతలు అసురులును, లక్ష్మీవంతులై రోగముక్తులైరి. దీనివలన లోకోపకారము ధర్మము కలుగును. ఇది మహౌషధము “ధర్మః సద్ధర్మ కృద్దర్మీ” యను ధర్మసంబంధి నామములను జపించువాడు నిర్మలు డగును. శ్రీదః శ్రీశః, శ్రీనివాసః శ్రీధరః శ్రీనికేతసః, శ్రియః పతిః శ్రీపరమః" అను పదములను జపించువాడు ఐశ్వర్యమును పొందును. కామీకామ ప్రదః కామ కామపాల స్తథాహరిః; ఆనందోమాధవశ్చైవ" యను హరినామములు కామ ప్రదములు "రామః పరశురామశ్చ నృసింహో విష్ణురేవచ, త్రివిక్రమః" యను నామములు జయేచ్చక లవారు జపించ వలేను. విద్యాభ్యాసము చేయువారు నిత్యము పురుషోత్తమ నామము జపించవలెను. “దామోదరః" యను నామము బంధ హరము పుష్కరాక, యను నామము నేత్రరోగములను తొలగించును. "హృషీ కేశః యను నామము థయహరము. ఔషధకర్మ యందు అచ్యుతయను అమృత మంత్రమును జపించవలెను. "అపరాజితః" యను నామమును యుద్ధము నందును, జలము దాటునపుడు శ్రీనృసింహ నామమును స్మరించవలెను. పూర్వాదిదిక్కులందు క్షేమము కోరువాడు చక్రీ, గదీ, శార్జ్గీ, ఖడ్గీ, యను నామములు స్మరించవలెను, నారాయణ స్మరణము సదాచేయవలయును. నృసింహ స్మరణము సకల భీతినివారకము గరుడధ్వజస్మరణము విషహరము, వాసుదేవనామము సర్వదా జపించవలెను. ధాన్యా దులను ఇంటిలో వుంచునపుడును శయన సమయము నందును, అనంతాచ్యుత నామములు స్మరించవలెను. దుఃస్వప్న మున నారాయణుని, అగ్ని దాహాదులందు జలశాయిని స్మరించవలెను. విద్యార్థి హయగ్రీవుని పుత్రప్రాప్తి కాముడు జగ త్యూతిని శౌర్యకాముడు బలభద్రుని స్మరించవలెను. వీటిలో ఒక్కొక్క నామము యనేక ఫలముల నిచ్చును.
ఆగ్నిమహాపురాణమున మంత్ర రూపౌషధ కథనమను రెండువందల యెనుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 284 of the Agni Purāṇa is as follows:
The names of Bhagavān Viṣṇu are presented as medicines for specific ailments. Oṃkāra, Gāyatrī, "Oṃ namo Nārāyaṇāya," "Oṃ namo Bhagavate Vāsudevāya," and "Oṃ hrūṃ namo Viṣṇave" are the primary healing mantras. Specific names are assigned to specific conditions: Puṣkarākṣa cures eye diseases, Hṛṣīkeśa removes fear, Acyuta serves as an amṛta-mantra in battle, Narasiṃha enables safe water crossings, Hayagrīva bestows knowledge, Jagatsūti grants progeny, and Baladeva inspires valor. The chapter is a unique synthesis of mantra-śāstra and Āyurveda.