అగ్ని మహా పురాణము

111 - అథ ప్రయాగమాహాత్మ్యమ్

అగ్ని రువాచః-

వక్ష్యే ప్రయాగమాహాత్మ్యం భుక్తిముక్తిప్రదం పరమ్

 ప్రయాగే బ్రహ్మ విష్ణ్వాద్యా దేవా మునివరాః స్థితాః.

సరితః సాగరాః సిద్దా గగ్గర్వాప్సరస స్తథా

తత్ర త్రీణ్యగ్ని కుని తేషాం మధ్యే తు జాహ్నవీ.

వేగేన సమరికాస్తా సర్వతీర్థపురస్కృతా

తపనస్య సుతా తత్ర త్రిష లోకేషు విశ్రుతా.

గజ్జాయమునయోర్మధ్యం పృథివ్యా జఘనం స్మృతమ్

ప్రయాగం జఘనస్యానరుపస్థమృషయోవిదు.

ప్రయాగం సప్రతిష్టానం కమ్బలాశ్వతరావుభౌ

తీర్థం భోగవతీ చైవ వేదప్రోక్తా ప్రజాపతే.

తత్ర వేదాశ్చ యజ్ఞాశ్చ మూర్తిమత్తః ప్రయాగ కే

స్తవనాదస్య తీర్థస్య నామసంకీర్తనాదపి.

మృత్తికాలమ్బనాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే

ప్రయాగేసంగమే దానం శ్రాద్ధం జవ్యాది చాక్షయమ్.

న వేదవచనాద్విప్ర న లోకవచనాదపి

మతిరుత్ర్కమణీయా నే ప్రయాగే మరణం ప్రతి.

దశ తీర్థసహస్రాణి షష్టికోట స్తథాపరాః

తేషాం సాన్నిధ్యమతైవ ప్రయాగం పరమం తతః.

వాసు కేర్భోగవత్యత్ర హంసప్రపతనం పరమ్

గవాం కోటిప్రదా నాద్యత్యహం స్నానస్య తత్ఫలమ్.

ప్రయాగే మాఘమాసే తు ఏవమాహుర్మనీషిణః

సర్వత్ర సులభా గడ్గా త్రిష స్థానేషు దుర్లభా.

గజ్జద్వారే ప్రయాగే చ గడ్డాసాగరసంగమే

అత్ర దానాద్దివం యాతిరాజేనో జాయత్కేత్ర చ.

వటమూలే సంగమాదౌ మృతో విష్ణుపురం వ్రజేత్

ఊర్వశీపులినం రమ్యం తీర్థం సన్త్యావట స్తథా.

కోటితీర్థం చాశ్వమేధం గజ్గాయమున ముత్తమమ్

మానసం రజసా హీనం తీర్థం వాసరకం పరమ్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ప్రయాగమాహాత్మ్యం  నామ ఏకాదశాధిక శతతమోధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను. వసిష్ఠా ఇపుడు ప్రయాగ మాహాత్మ్యమును గూర్చి చేప్పెదను. ఇది భుక్తిముక్తిప్రదమైవది. అత్యుత్తమము. బ్రహ్మ విశ్వాది దేవతలును, గొప్ప మనీశ్వరులను ప్రయాగలో నివసిదతనిధులు, సముద్రము, సిద్దులు, గంధర్వులు, అప్సరసలు కూడ ఈ తీర్థమునందు నివసింతురు. ప్రయాగలో మూడు అగ్నికుండములున్నవి. గంగ సకలతీర్థములను వెంట గైకొని ఈ కుండముల మధ్యనుండి మహావేగముతో ప్రవహించుచున్నది, త్రిభువన విఖ్యాతము, సూర్యపుత్రియు అగు యమున కూడ అచట నున్నది. గంగాయమునల మధ్య భాగము పృథివీజఘన మనియు, ప్రయాగ జఘనమధ్యభాగమునందలి ఉపస్థ యనియు ఋషులు చెప్పుదురు.. ప్రతిష్ఠానసహిత మగు ప్రయాగ, కంబలము, అశ్వతరము, నాగము, భోగవతీతీర్థము– ఇది బ్రహ్మయజ్ఞవేది యని చెప్పబడుచున్నది. వేదములును, యజ్ఞములును. ప్రయాగలో మూర్తి ధరించి నివసించును. ఆ తీర్థమును స్తుతించుట చేతను, నామ సంకీర్తనము చేయుట చేతను, ఆచటి మట్టిని స్పృశించినంత మాత్రముచేతను మనుష్యుడు సకల పాపవిముక్తుడగును. ప్రయాగలో గంగాయమునాసంగమమునందు చేసిన దావ-శ్రాద్ద- జపాదులు ఆశయము లగును. వసిష్ఠా! వేదము చెప్పినను, లోకము చెప్పినను గూడ అంతమునందు ప్రయాగములో ప్రా ములు విడువవలే ననెడు ఆలోచనను విడువరాదు. ఆరువది కోట్ల పదివేల తీర్థములు ప్రయాగలో ఉండను. అందుచే -అది అన్నింటికంటెను శ్రేష్ట మైనది. వాసుకి స్థాన మైన భోగవతీతీర్థము, హంసప్రపతనము ఉత్తమతీర్ధములు. వీటియందు మూడు దినములు స్నానము చేయుటచే కోటి గోదానములు చేసిన ఫలము లభించును. “గంగ అనేక స్థానములందు లభించ వచ్చును. కాని మామమాసమునందు, గంగాద్వారమునందును, ప్రయాగయందును, గంగాసాగరసంగమమునందును గంగ లభించుట చాల కష్టము” అని పండితులందురు. ప్రయాగలో దానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళి తిరిగి రూలోకమునకు వచ్చిన పిదప రాజాధిరాజగును. అక్షయవటమూలసమీపమునను, నంగమాదులందును మరణించినవాడు విష్ణులోకమును పొందును. ప్రయాగలో అతి సుందర మగు ఊర్వశీపులినము, సంధ్యావలమ, కోటితీర్థము, దశాశ్వమేధఘట్టమ, గంగా యమునా సంగమము, రజోహీన మగు మానసతీర్థము, వాసరకతీరము-ఇవి చాల ఉత్తమ మైనవి.

ఆగ్ని మహాపురాణమునందు ప్రయాగ మాహాత్మ్యవర్ణన మను నూటపదకొండవ అధ్యాయము సమాప్తము.