ఈశ్వర ఉవాచః
వక్ష్యామ్యృక్షాత్మకం పిణ్డం శుభాశుభవివృద్ధయే ।
యస్మినృక్షే భవేత్సూర్య స్తదాదౌ త్రీణి మూర్ధని.
ఏకం ముఖే ద్వయం నేత్రే హస్తపాదౌ చతుష్టయమ్ ।
హృదిపఞ్చ సుతే జానౌ ఆయుర్వృద్ధిం విచిన్తయేత్.
శిరఃస్థే తు భవేద్రాజ్యం పిణ్డతోవక్త్రయోగతః ।
నేత్రయోః కాన్తిసౌభాగ్యం హృదయే ద్రవ్యసంగ్రహః.
హస్తే ధృతం తస్కరత్వం గతాసురర్వగః పదే ।
కుమ్భాష్టకే భాని లిఖ్య సూర్యకుమ్భస్తు రిక్తకః.
అశుభః సూర్యకుమ్భః స్యాచ్ఛుభః పూర్వాదిసంస్థితః ।
ఫణిరాహుం ప్రవక్ష్యామి జయజయ వివేకగమ్.
అష్టావింశాన్ లిఖేద్బిన్దూన్పునర్భాఙ్యాస్త్రిభిస్త్రిభిః ।
ఆథ ఋక్షాణి చత్వారి రేఖాస్తత్త్రెవ దాపయేత్.
యస్మిన్ ఋక్షే స్థితో రాహుస్తదృక్షం ఫణిమూర్ధని ।
తదాది విన్యసేద్భాని సప్తవింశక్రమేణ తు.
వక్త్రేసప్తగతే ఋక్షే మియతే సర్వ ఆహవే ।
స్కన్దే భఙ్గం విజానీయాత్సప్తబేషు చ మధ్యతః.
ఉదరస్థేన పూజాం చ జయశ్చైవాత్మనస్తథా ।
కటిదేశే స్థితే యోధ ఆహవే హరతే పరాన్.
పుచ్చస్థితేన కీర్తిః స్యాద్రాహుదృష్టే చ భే మృతిః ।
పునరన్యం ప్రవక్ష్యామి రవి రాహుబలం తవ.
రవిః శుక్రో బుధశ్చైవ సోమః సౌరిర్గురుస్తథా ।
లోహితః సైంహికశ్చైవ హ్యేతే యామార్ధభాగినః.
సౌరిం రవిం చ రాహుం చ కృత్వా యత్నేన పృష్ఠతః ।
స జయేత్సైన్యసంఘాతం ద్యూతమధ్వానమహవమ్.
పర మేశ్వరుడు పలికెను. ప్రాణుల శుభాశుభఫలజ్ఞానము కొరకు నాక్షత్రిక పిండమును గూర్చి చెప్పెదను. ఎవరి శుభాశుభఫలములను తెలిసికొనవలెనో ఆ మనుష్యుని బొమ్మ గీసి సూర్యు డున్న నక్షత్రము మొదలు మూడు నక్షత్ర మాలు వాని శిరస్సు పైనను, ఒకటి ముఖము పైనను, రెండు నేత్రములందును, నాలుగు చేతులు కాళ్ళమీదను, ఐదు హృదయము నందును, ఐదు మోకాళ్ళ మీదను వ్రాసి ఆయుర్వృద్ధివిచారము చేయవలెను. శిరస్సు పైనున్న నక్షత్రమున యుద్ధము చేసినచో రాజ్యము లభించును. ముఖమునందలి నక్షత్రమున సుఖము, నేత్రమునందలి నక్షత్రమున సుందర సౌభాగ్యము, హృదయ మునందలి నక్షత్రమున ద్రవ్యసంగ్రహము, హస్తమునందలి నక్షత్రమున చౌర్యము, పాదమునందలి నక్షత్రములందు మార్గమందే మృత్యువు. ఈ విధముగ ఫలితములు తెలియవలెను. ఎనిమిది కుంభములను పర్వాదిదిక్కులందు ఎనిమిదింటి యందును ఉంచవలేను. ఒక్కొక్క కుంభమునందు మూడేసి చొప్పున ఎనిమిది కుంభములందును ఇరువది నాలుగు వృక్షత్ర మల నుంచగా నక్షత్రములు మిగిలిపోవును. వీటికి ‘సూర్యకుంభములు’ అని పేరు. సూర్యకాంభము ఆశుభము. పూర్వాది దిక్కులం దున్న కుంభముల మీది నక్షత్రములు శుభములు. ఇపుడు యుద్ధమునందు జయపరాజయముల వివేకము నిచ్చు సర్పాకారరాహుచక్రముల గూర్చి చెప్పెదను. ముందుగా ఇరువది ఎనిమిది చుక్కలు పెట్టవలెను. వాటిని మూడు మూడుగా విభజించగా ఎనిమిది విభాగములు వచ్చును. వాటిపై ఇరువదినాలుగు నక్షత్రములు గుర్తించగా నాలుగు నక్షత్రములు మిగిలిపోవును. వాటి పై రేఖ గీయవలెను. సర్పాకారచక్రమేర్పడును. రాహు వున్న నక్షత్రమును పడగపై వ్రాయవలెను. ఆ నక్షత్రముతోడనే ప్రారంభించి క్రమముగా ఇరువదియేడు నక్షత్రములు వ్రాయవలెను. ముఖమునం దున్న ఏడు నక్షత్ర ములలో యుద్ధము చేసినచో యుద్ధమునందు మరణము కల్గును. స్కంధమునందలి ఏడు నక్షత్రములందు యుద్ధము చేసి నచో పరాజయము వచ్చును. పొట్టమీద నున్న ఏడు నక్షత్రములలో సమ్మానము. విజయములభించును. కటి యందలి నక్షత్రము లందు శత్రువుల హరణము జరుగును. పుచ్ఛము నందలి నక్షత్రములందు యుద్ధము చేయగా కీర్తి కలుగును. రాహుదృష్ట నక్షత్రమునందు మృత్యువు కలుగును. ఇపుడు సూర్యుడు మొధలు రాహువు వరమును గ్రహముల బలము వర్ణించెదను. రవివారమునందు మొదటిది మొదలు ఎనిమిదవ ఆర్ధప్రహరమలకు వరుసగ సూర్య-శుక్ర-బుధ-సోమ-శని-గురు-కుజ-రాహువులు ఆధిపతులు. శని సూర్య-రాహువులను యత్నపూర్వకముగ పృష్టగతు లగు వట్లు చేసికొని యుద్ధము చేయువాడు సైన్య సముదాయముపై విజయము సాధించును. ద్యూత-మార్గ-యుద్ధములందు జయము పొందును.
రోహిణీచేతరాస్తిస్రో మృగః పఞ్చస్థిరాణి హి ।
అశ్వినీ రేవతీ స్వాతీ ధనిష్టా శతతారకా.
క్షిప్రాణి పఞ్చ భాన్యేవ యాత్రార్థీచైవ యోజయేత్ ।
అనురాధా హస్తమూలం మృగః పుష్యం పునర్వసుః.
సర్వకార్యేషు చైతాని జ్యేష్ఠా చిత్రావిశాఖయా ।
పూర్వాస్తిస్రోఽగ్నిభరణీ మమార్ద్రాశ్లేషా దారుణాః.
స్థావరేషు స్థిరం హ్యృక్షం యాత్రాయాం క్షిప్రముత్తమమ్ ।
సౌభాగ్యార్థే మృదూన్యేవ ఉగ్రేషూగ్రం తు కారయేత్.
దారుణే దారుణం కుర్యాద్వక్ష్యే చాధోముఖాధికమ్ ।
కృత్తికా భరణ్యాశ్లేషా విశిఖా పితృనైరృతమ్.
పూర్వాత్రయమధోవక్త్రం కర్మ చాధోముఖం చరేత్ ।
ఏషు కూపతడాగాది విద్యాకర్మ భిషక్క్రియా.
స్థాపనం నౌకా భూపాది విధానం ఖననం తథా ।
రేవతీ చాశ్వినీ చిత్రా హస్తః స్వాతీ పునర్వసుః.
అనురాధా మృగో జ్యేష్ఠా నవ వై పార్శ్వతోముఖాః ।
ఏమ రాజ్యాభిషేకం చ పట్టబన్దం గజాక్వయోః.
ఆరామగృహప్రాసాదం ప్రాకారం క్షేత్రతోరణమ్ ।
ధ్వజచిహ్నపతాకాశ్చ సర్వానేతాంశ్చ కారయేత్.
ద్వాదశి సూర్యదగ్ధా తు చన్ద్రేణైకాదశీ తథా ।
భౌమేన దశమీ దగ్దా తృతీయా వై బుధేన చ.
షష్టి చ గురుణా దర్గా ద్వితీయా భృగుణా తథా ।
సప్తమీ సూర్యపుత్రేణ త్రిపుష్కరమథో వదే.
రోహిణి, ఉత్తరాత్రయము, మృగ శిర-స్థిర నక్షత్రములు. ఆశ్విని, రేవతి, స్వాతి, ధనిష్ఠ, శతభిష క్షి ప్రనక్షత్ర ములు. యాత్రార్థి ఈ నక్షత్రములందు యాత్ర చేయవలెను. అనూరాధ, హస్త, మూల, మృగశిర, పుష్య, పునర్వసునక్ష త్రములు అన్ని కార్యములకు మంచిది. జ్యేష్ఠ, చిత్త, విశాఖ, పూర్వాత్రయము, కృత్తిక, భరణి, మఖ, ఆర్ద్ర, ఆశ్లేష‘దారుణ’ నక్షత్రములు. స్థిర కార్యములు స్థిరనక్షత్రములందు చేయవలెను. డిప్రనక్షత్రములందు యాత్ర చేయవలెను. సౌభాగ్య కర్మలను మృదునక్షత్రములందును, ఉగ్రకార్యములను ఉగ్రనక్షత్రములందును చేయవలెను. దారుణ నక్షత్రములు భయంకర కార్యములకు ఉపయోగించును. కృత్తిక, భరణి, ఆశ్లేష, విశాఖ, మఘ, మూల, పూర్వాత్రయము ఆధోముఖ నక్ష త్రములు, వీటిలో అధోముఖ కర్మ చేయవలెను. కూపము, తటాకము, విద్యాకర్మ, చికిత్స, స్థాపనము, నౌకానిర్మాణము, కూపవిధానము, గొయ్యి తవ్వుట, మొదలగు పనులు ఈ అధోముఖనక్షత్రములందు చేయవలెను. రేవతి, అశ్విని, చిత్త, హస్త, స్వాతి, పునర్వసు, అనూరాధ, మృగశిర, జ్యేష్ఠ తిర్యజ్ము బవక్షత్రములు. వీటియందు రాజ్యాభి షేకము, గజాశ్వము లకు పట్టబంధనము, తోటవేయుట, గృహ-ప్రాసాదనిర్మాణము, ప్రాకారనిర్మాణము, క్షేత్రము, తోరణ-ధ్వజ-పతాకాదీ స్థాపనము చేయవలెను. రవివారమున ద్వాదశి, సోమవారమున ఏకాదశి, మంగళవారమున దశమి, బుధవారమున తృతీయ, గురువారమునందు షష్టి, శుక్రవారమునందు ద్వితీయ, శనివార మన సస్తమి దగ్గ యోగములు. ఇపుడు త్రిపుష్కరములు చేప్పెదను.
ద్వితీయా ద్వాదశి చైవ సప్తమీ వై తృతీయకా ।
రవిర్భౌమస్తథా సౌరిః షడేతాస్తుత్రిపుష్కరాః.
విశాఖా కృత్తికా చైవ హ్యుత్తరే ద్వే పునర్వసుః ।
పూర్వభాద్రపదా చైవ షడేతే తు త్రిపుష్కరాః.
లాభో హానిర్జయో వృద్ధిః పుత్రజన్మ తథైవ చ ।
నష్టం భ్రష్టం వినష్టం వా తత్సర్వం త్రిగుణం భవేత్.
ఆశ్వినీ భరణే చైవ హ్యాశ్లేషా పుష్యమేవ చ ।
స్వాతిశ్చైవ విశాఖా చ శ్రవణం సప్తమం పునః.
ఏతాని దృడచక్షుంషి పశ్యన్తి చ దిశో దశ ।
యాత్రాసు దూరగస్యాపి హ్యాగమః పుణ్యగోచరే.
ఆషాఢే రేవతి చిత్రాకేడరాణి పునర్వసుః ।
ఏషు పఞ్చసు ఋక్షేషు నిర్గతస్వాగమో భవేత్.
కృత్తికా రోహిణి సౌమ్యం ఫల్గునీ చ మమా తథా ।
మూలం జ్యేష్ఠానురాధా చ ధనిష్ఠా శతతారకా.
పూర్వభాద్రపదా చైవ చిపిటాని చ తాని హి ।
అధ్వానం వ్రజమానస్య పునరేవాగమోభవేత్.
హ స్తఉత్తరభాద్రశ్చ ఆర్ద్రాషాడా తథైవ చ ।
నష్టార్థాశ్చైవ దృశ్యన్తే సంగ్రామే నైవ విద్యతే.
పునర్వక్ష్యామి గణ్డాన్తమృక్షమధ్యే యథాస్తితమ్ ।
రేవతన్తే చతుర్నాడీ ఆశిన్యాదిచతుష్టయమ్.
ఉభయోర్యామమాత్రం తు వర్జయేత్తత్ప్రయత్నతః ।
ఆశ్లేషాన్తే మఘాదౌ తు మటికానాం చతుష్టయమ్.
ద్వితీయం గణ్డమాఖ్యాతం తృతీయం భైరవిశృణు ।
జ్యేష్ఠామూలభయోర్మధ్యే ఉగ్రరూపం తు యామకమ్.
న కుర్యాచ్చుభకర్మాణి యదీచ్చేదాత్మ జీవితమ్ ।
దారకే జాతకాలే చ మ్రియేతే పితృమాతరౌ.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే నక్షత్రనిర్ణయో నామ షడ్వింశత్యధికశతతమోఽధ్యాయః .
ద్వితీయ, ద్వాదశి, సప్తములు, రవి మంగళ శనివారములు ఇవి త్రిపుష్కరములు, విశాఖ-కృత్తికా-ఉత్తర ద్వయ-పునర్వసు-పూర్వభాద్రలు కూడ త్రిపుష్కరములు. అనగా పైన చెప్పిన వారములు, తిథులు, నక్షత్రములు కలిపినచో త్రిపుష్కరయోగము. ఈ యోగము నందు లాభము, హాని, విజయము, వృద్ధి, పుత్రజన్మ, వస్తునాళము-ఇవి త్రిగుణము లగును. అశ్విని, భరణి, ఆశ్లేష, పుష్యమి, స్వాతి, విశాఖ, శ్రవణము, పునర్వసు, దృఢవేత్రములు. ఇవి దిక్కులను చూడగలవు. వీటిలో పోయిన వస్తువు, యాత్రకు వెళ్ళిన మనుష్యుడు విశేషపుణ్యోదయముచేతనే తిరిగి వచ్చును. రెండు ఆషాఢలు, రేవతి, చిత్త, పునర్వసు ‘కేకర’ నక్షత్రములు. వీటిలో పోయిన వస్తువు ఆలస్యముగా దొరకును. కృత్తిక, మృగశిర, పూర్వాఫల్గుని, మఘ, మూం, జ్యేష్ట, అనూరాధ, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర చివీ టాక్షములు. వీటిలో పోయిన వస్తువు, యాత్రకై వెళ్ళిన వ్యక్తి కొలది ఆలస్యముగ తిరిగి వచ్చును. హస్త, ఉత్తరాభాద్ర, ఆర్ద్ర, పూర్వాషాఢ, ఆస్థానములు. వీటిలో పోయిన వస్తువు శీఘ్రముగ నే లభించును. యుద్ధ మేమియు చేయనవసర ముండదు. ఇపుడు నక్షత్రముల గండాంతమును చెప్పెదను. రేవతి చివరి నాలుగు దండములుగండములు, అశ్విని ప్రారంభము నందలి నాలుగు దండములు గండాంతర ములు. ఈ నక్షత్రముం ఒక జాము సమయమును శుభకార్యములందు ప్రయత్న పూర్వకముగ త్యజించవలెను. అశ్లేష చివర మఘ ప్రారంభమున నాలుగేసి దండములు రెండవ గండాంతము. భైరవీ ! ఇపుడు తృతీయ గండాంతమును వినుము. జ్యేష్టా-మూలల మధ్య నున్న ఒక జాము చాల భయంకర మైనది. జీవించ నిచ్చ గలవాడు ఈ సమయమునందు ఏ శుభ కార్యము చేయరాదు. ఈ సమయమున శిశువు పుట్టినచో తలిదండ్రులు మరణింతురు.
అగ్ని మహాపురాణమునంచు నక్షత్రనిర్ణయ మను నూట ఇరువదియారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 126 of the Agni Purāṇa is as follows:
The ten principal avatāras of Viṣṇu are described in synopsis. Agni narrates the Matsya, Kūrma, Varāha, Narasiṃha, Vāmana, Paraśurāma, Rāma, Kṛṣṇa, Buddha, and Kalki avatāras in sequence, each with its cosmic purpose—preservation of the Vedas, churning of the ocean, slaying of Hiraṇyakaśipu, subduing of Mahābali, and so forth. The ten forms are identified as Viṣṇu's deliberate descent (avatāraṇa) for the restoration of dharma (dharma-saṃsthāpana) in each successive age. The chapter emphasizes meditation on all ten forms as a sovereign pāpa-nāśana practice.