అగ్ని మహా పురాణము

154 - అథ వివాహః

పుష్కర ఉవాచః-

విపశ్చతస్రా విందేత భార్యా స్త్రీ సస్తు భూమిపః

 ద్వే చ వైశ్యా యథాకామం భార్యైకామపి చాన్యజః.

ధర్మకార్యాణి సర్వాణి న కార్యాణ్యసవర్ణయా

పాణిర్గాహ్యః సవర్ణాసు గృహ్ణియార్ క్షత్రియా శరమ్,

వైశ్యా ప్రచోదమాదద్యాద్ధం వై చాన్యజా తథా

సకృత్కన్యా ప్రదాతవ్యా హరంస్తాం దౌరదణ్ణభాక్ .

అపత్యవిక్రియాసకే నిష్కృతిర్న విధీయతే.

కన్యాదానం శచీయాగో వివాహోథ చతుర్థికా.

వివాహమేతత్ కథితం నామకర్మ చతుష్టయమ్

నష్టే మృతే ప్రవ్రజితే క్లీబే చ పతితే పతే.

పజ్చసాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే

మృతే తు దేవరే దేయా తదభావే యథేచ్చయా.

 పూర్వాత్రితయమాగ్నేయం వాయవ్యం చోత్త రాత్రతయమ్

రోహిణీ చేతి చరణే భగణః శస్యతే సదా.

నైక గోత్రాం తు వరయేన్నైకార్షేయాం చ భార్గవ

పితృతః సప్త మాదూర్ధ్వం మాతృతః పఞ్చమాత్త థా.

పుష్కరుడు చెప్పెను : పరశురామా! బ్రాహ్మణుడు తన ఇచ్చానుసారముగా నాలుగు వర్ణముల కన్యలను వివాహ మాడవచ్చును, క్షత్రియుడు మూడు వర్ణములవారిని, వైశ్యుడు రెండు వర్ణముల వారిని వివాహ మాడవచ్చును. శూద్రుడు స్వవర్ణము కన్యను వివాహమాడవలేను. అసమానవర్ణ యగు భార్యతో ధార్మికకర్మ లేవియు చేయరాదు. సమావవర్ణ కన్యను వివాహము చేసికొనినపుడు భర్త ఆమె హస్తము గ్రహించవలెను. బ్రాహ్మణునితో క్షత్రియ కన్యకు వివాహ మగునపుడు ఆమె అతని చేతిలో నున్న బాణమును పట్టుకొనవలెను. వైశ్యకన్య బ్రాహ్మణ క్షత్రియులతో వివాహము చేయునపుడు ఆమె వారి చేతిలో మంచిన కొరడా పట్టుకొనవలెను. శూద్రకన్య వస్తాగ్రమును పట్టుకొనవలెను. కన్యాదాన మనునది ఒక్క పర్యాయమే జరుగును. ఇచ్చిన కస్యను అపహరించిన వారిని బోరుని దండించి నట్లు దండించవలెను. సంతానము అమ్మవానికి పాపవిముక్తి కలుగదు. కన్యాదానము శచీపూజ, వివాహము, చతుర్థికర్మ ఈ నాల్గచిటికిని వివాహము అని పేరు. పతి జాడ తెలియకుండ పోయినను. మరణించినను సందాసి యైనను, నపుంసకుడై నను. పతితు డైనను ఈ ఆపదలం దును భార్య మరి యొక భర్త ను బడయ వచ్చును. పతి మరణించిన కన్యను మరిదికి ఇవ్వవలెను. మరిది లేని పక్షమున ఇష్టమువచ్చినవారికి ఇవ్వవచ్చును. వర వధూవరణములకు మూడు ఉత్తరా నక్షత్రములు, కృత్తిక, స్వాతి, మూడు, పర్వానక్షత్రములును మంచివి, పరశురామాః సమాన గోత్రప్రవరలు గల కన్యను వివాహ మాడరాదు. తండ్రి తరవాత ఏడు పురుషములు, తల్లితరువాత ఐదు పురుషములు దాటిన వారిని వివాహము చేసికొనవచ్చును.

అహూయ దానం బ్రాహ్మః స్యాతులశీలయతాయ తు

పురుషాంస్తారయేత్రజో నిత్యం కన్యాప్రదానతః.

తథా గోమిథునాదానాద్వివాహస్వార్ష ఉచ్యతే

ప్రార్థితా దీయతే యస్య ప్రాజాపత్యః స ధర్మకృత్.

శులేన చాసుర మర్గో గానర్వో వరణాన్మిథః

రాక్షసో యుద్దహరణాతైశాచః కన్యకాచ్ఛలాత్.

వైవాహి కేహ్ని కుర్వీత కుమ్బకారమృదా శచీమ్

జలాశయే తు లాం పూజ్య వాద్యాద్యైః శ్రీం గృహం నయేత్.

ప్రసు పై కేక వే నైవ వివాహ కార్య ఏవ హి

పౌషే చైత్రి కుజదినే రిక్షావిష్టితిగౌ న చ.

న శుక్రజీవే స్తోమితే న శజ్కే గ్రహార్దితే

ఆర్కార్కిభౌమయు కే కే వ్యతీపాతహతే న హి.

సౌమ్యాం పిత్ర్యం చ వాయవ్యం సావిత్రం రోహిణి తథా

ఉత్తరాత్రితయం మూలం మైత్రం పౌష్టం వివాహథమ్.

మానుషాఖ్య స్తథా లగ్నో మానుషాఖ్యాంశకః శుభః

తృతీయేచ తథా షషే దశ మైకాద శేష్టమే.

ఆర్కార్కిచౄతనయా ప్రశస్తి న కుజోఅష్టమః

సప్తాస్త్ర్యాష్టమవధేషు శేషా శస్తా గ్రహో త్తమాః.

తేషామపి తథామధ్యాతష్ఠః శుక్రో న శస్యతే

వై వాహి కే బే కర్తవ్యా తథైవ చ చతుర్థికా.

న దాతవ్యా గ్రహా సత్ర చతురాద్యా స్తథై కగాః

పర్వవర్ణం స్త్రియం గచ్ఛేత్సత్యా దత్తా తదా రతి.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే వివాహోనామ చతుష్పఞ్చాశ  దధిక శతతమోఽధ్యాయః.

ఉత్త మవంశమునందు పుట్టిన, సదాచారవంతుడైన వరుని ఇంటికి పిలిచి కన్యాదానము చేయుట “బ్రాహ్మ వివాహము” ఈ వివాహప్రభావముచే, ఈ దంపతుల పుత్రుడు వెనుకటితరములవారిని ఉద్దరించును. వరునినుండి ఒక ఆవును, ఒక ఎద్దును తీసికొని కన్యాదానము చేసినచో ఆది “ఆర వివాహము” అడిగినవానికి కన్యాదానము చేసినచో ఆది ప్రాజాపత్య' వివాహము. దీనివలన ధర్మసిద్ధి కలుగును. శుల్కము తీసికొని కన్యాదానము చేసినచో ఓ ఆసుర వివాహము” ఇదినీచకృత్యము; వధూవరులు తాము ఇష్టపడి చేసికొనిన వివాహము ‘గాంధర్వము.' యుద్దము చేసి కన్యను హరించి చేసికొన్నది “రాక్షస వివాహము మోసగించి కన్యను అపహరించినచో ఈ పైశాచవివాహము” వివాహదివసమున కుమ్మరి మట్టితో శచిప్రతిమ తయారు చేసి, జలాశయ సమీపమున దానికి మంగళ వాద్యాయులతో పూజ చేయించి, కన్యను ఇంటికి తీసికొనివెళ్ళవలెను. ఆషాఢ శుద్ధేకాదశినుండి కార్తికశుద్ధేకాదశి వరకు శ్రీమహావిష్ణువు శయనించి యున్న పుడు వివాహము చేయరాదు. పౌష చైత్రమాసములందు మంగళవారమునందు రిక్షాభద్రాతిథులందును గురుశుక్రులు ఆస్తంగతు లేనపుడును, చంద్రగ్రహణము పట్టబోవు నపుడును, లగ్నమునందు రవి - శని . కుజు లున్న పుడును, వ్యతీపాతదోష మున్నపుడును వివాహము నిషిద్ధము. మృగశిర, మఘ, స్వాతి, హస్త, రోహిణి, ఉత్త రాత్రయము - మూల, ఆనురాధ, రేవతి - ఇవి వివాహనక్షత్రములు. పురుషవాచక మగు లగ్నము, దాని నవమాంశము మంచిది. లగ్నమునుండి తృతీయ - షష్ణ - దశమ - ఏకాదశ - ద్వాదశ స్థానములందు రవి - శని - బుధు లున్న శుభము - అష్టమమున కుజుడున్న ఆశుభము. మిగిలిన గ్రహములు సప్తమ - ద్వాదశ - అష్టమస్థానములం దున్నచో శుభము. షష్టశుక్రుడు అశుభుడు చతుర్దేకర్మ కూడ వై వాహకనక్షత్రమునందే చేయవలెను. లగ్న - చతుర్థాదిస్థానములందు గ్రహములు లేకుండుట మంచిది. పర్వదినములను విడచి ఇతర దివసముందే శ్రీసమాగమము చేయవలెను. దీనివలన సతీదేవి ఆశీర్వాదముచే సర్వదా సుఖము కలుగును.

ఆగ్ని మహాపురాణమునందు వివాహ మను నూటఏబది నాల్గవ అధ్యాయము సమాప్తము.